Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 6 సంచిక 4
July/August 2015


 

2015 జూలై 11న హార్ట్ఫోర్డ్,CT,USAలో 108CCబాక్సుల రీచార్జి చేయు సెషన్(

USA , కెనడా సమన్వయకర్త01339…USA ఈ విధంగా రిపోర్ట్ చేస్తున్నారు : అర్హత పొందిన వ్యక్తులకి JVPలుగా(జూనియర్ వైబ్రో అభ్యాసకులు) శిక్షణ ఇవ్వబడింది. మిశ్రమాల(కాంబోస్) శక్తీ నిర్ధారించడానికి ఈ అభ్యాసకుల బాక్సులు రీచార్జి చేయడం జరిగింది. జూలై 11న 9 బాక్సులు  రీచార్జి చేయబడినాయి. ఈ సెషన్లో అభ్యాసకుడు02867...USA.

వైబ్రియానిక్స్ ఉపయోగించి సాగుబడి చేసిన సేంద్రియ పొలం మీదొక ఒక ప్రధార్శననిచ్చారు.ఈ పొలంలో సాగుపడి చేయబడుత్తున్న కూరగాయిలు ఆరోగ్యకరంగాను మరియు బ్లాయిట్ సమస్య లేకుండా ఉంటున్నాయని తెలియచేసారు. మరొక అభ్యాసకుడు 02873...USA  ఆ సెషన్లో కూడియున్న వాళ్ళందరికీ తను 108CC బాక్సుని పెట్టడానికి వాడుతున్న అల్యూమినియం పెట్టిని చూపించారు.ఈ పెట్టిని వాడడం వలన మిశ్రమాలు ఆవిరైపోవడం తగ్గిందని చెప్పారు.

మరొక రీచార్జి సెషన్ ఇదే ఏడాదిలో ఏర్పాడు చేసే ప్లాన్ ఉందని ప్రకటించారు

[గమనిక: 108CC బాక్సులు ప్రతి రెండేళ్ళకి ఒకసారి రీచార్జి చేయడం మంచిది. మిశ్రమాల శక్తిని మరొక ఏడాది వరకు కొనసాగించడానికి ప్రతి సీసాని అరచేతిమీద 9 సార్లు తట్టాలి.]

____________________________________________________________________________________________

2015 ఏప్రల్ 19న ఇల్ల్ఫోర్డ్, ఎస్సెక్స్,UK లో జరిగిన వైబ్రియానిక్స్ అభ్యాసకుల రెఫ్రెశర్ సమావేశం

ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం UK సమన్వయకర్త02822...UK చే రిపోర్ట్ చేయబడి మరియు అభ్యాసకుడు03513...UK చే సంకలనం చేయబడినది: 2015 ఏప్రల్ 19వ తేదిన రెఫ్రెశర్ వర్క్ షాపు జరిగింది. డా.జిత్ అగ్గర్వాల్ ఆయిన శ్రీమతిగారు హేమ సహాయంతో ప్రదర్శించిన ఈ వర్క్ షాపులో  ముప్పై అభ్యాసకులు పాల్గొన్నారు. డా.అగ్గర్వాల్ ఆ వర్క్ షాపు వ్యవస్థాపకుడు మరియు UK సమన్వయకర్తయిన అభ్యాసకుడు02822...USA కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రాధాన్య విషయాల సారాంశం :

1.0 వైబ్రియానిక్స్ కి కొత్త గుర్తు చిహ్నం(లోగో)

సాయి వైబ్రియానిక్స్ కి ఇప్పుడొక కొత్త గుర్తు చిహ్నం ఉందని మరియు ఈ గుర్తు చిహ్నం ముద్రింపబడిన కరపత్రాలని త్వరలో అందరికి పంపబడుతాయని డా.అగ్గర్వాల్ ప్రకటించారు.

1.1 మాస్టర్ కాంబో(మిశ్రమాలు) కూడిక

మాకు కొత్త వివరాలు అందగానే వాటికి అనుగుణంగా మందుల్ని (రేమడీలు) మేము తాజా పరుస్తాము.ఉదాహరణకు 2015 ఏప్రల్ లో రెండు కొత్త రేమేడీలు మాస్టర్ బాక్సులో చేర్చపడ్డాయి. ప్రతి నెల క్రమముగా రిపోర్ట్ లు పంపించే అభ్యాసకులందరు ఈ కొత్త రేమేడీలుని మీ సమన్వయకర్తనుండి తీసుకోవడానికి అర్హులే.

1.2 108 కామన్ కంబో బాక్సు రీచార్జి

విధ్యుధయిస్కాంత వికిరణనం వలన మిశ్రమాల సాఫల్యం తగ్గుతుంది కాబట్టి ప్రతి రెండేళ్ళకి ఒకసారి అన్ని కంబో బాక్సుల్ని రీచార్జి  చేయాలి

1.3 రేమడీలుకు(మందులు) CC10.1 Emergencies చేర్చడం​

అభ్యాసకులంధిరిని వచ్చే మూడు నెలలకు రేమడీలకు CC10.1 Emergencies చేర్చమని సలహా ఇచ్చారు. కొంధరభ్యాసకులు ఈ మిశ్రమం చేర్చడం వలన చికిత్సలో సాఫల్యత పెరిగిందని రిపోర్ట్ చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చాము. మీ స్పందనాంశం మాకు పంపవలెను.మూడు నెలల తరవాత దీని మూల్యనిర్ధారణ చేయబడుతుంది.

1.4 పేషంట్ల రికార్డులు వ్రాయుట మరియు పంపుట

అభ్యాసకులందరు ప్రమాణం చేసినట్లుగా ప్రతి నెల ఒకటో తారీఖున రిపోర్ట్ లను పంపించాలి.ప్రతి నెల పేషంట్ల రికార్డు మరియు వేరే వివరాల సారాంశ పత్రము విడిగా పెట్టుకుంటే మంచిది. నెల సారాంశ పత్రంలో పాత పేషంట్లు, కొత్త పేషంట్లు,జంతువులు మరియు మొక్కలకి విడివిడిగా నిలివు వరుస విభజన చేసుకొని ఉంచాలి. సంభందించిన వరుసలో పేషంటు పేరు, సంప్రదించిన తేది వ్రాయవలెను.ఈ విధంగా చేసిన పేషంట్ల వివరాలు మరోసారి చూడడానికి మరియు రిపోర్ట్ లు పంపించడానికి మీకు సులభంగా ఉంటుంది. దీంతోపాటు ప్రతి పేషంటుకి ఒక చెక్ లిస్టు ఉపయోగించడం మంచిది. దీనివలన పేషంటు ముఖ్య వివరాలన్నీ తీసుకోవడానికి సులభంగా ఉంటుంది.

1.5 రేమేడీలకు సూచిక చీటీ వ్రాయుట

     ఒక చీటిలో మీ రికార్డు పుస్తకంలో వ్రాసియున్న పేషంటు సూచిక సంఖ్య వ్రాసి పేషంటుకు ఇచ్చే సీసా మీదఅతికించండి. ఆ చీటీ        మీద రోగ లక్షణాలు కాని లేదా సమస్య పేరుకాని వ్రాయవద్దు.చీటీ మీద  పేషంటు పేరుకూడా వ్రాయవచ్చును లేదా "హీలింగ్", "ఫీల్  బెటర్" వంటి మంచి పదాలు వ్రాయవచ్చును.”.

1.6 రేమడీలు తయారు చేయడం

నీటికున్న మధ్యస్దత గుణం వలన వైబ్రేషన్స్ మెమరీ  నీటికి అధికంగా ఉంటుంది. ఇందువలన రేమడీలుని నిరంతరం నీళ్ళలోనే తయారు చేయడం మంచిది. అదొకటే కాకుండా నీటిలో రేమడీలు తయారు చేయడంవలన పిల్స్ ఎక్కువ రోజులవరకు వస్తాయి. ప్రాణాంతకమైన రోగాలున్న పెశంట్లుకి మనశ్శాంతి కలుగ చేయడం చాలా ముఖ్యం. సాయి వై బ్రియానిక్స్ రేమడీలు పేషంటు మనస్సుపైన పని చేసి ప్రశాంతతును సౌఖర్యాన్ని ఇవ్వడంతో పాటు కొంతవరకు రోగుల జీవిత కాలాన్ని కూడా పెంచుతాయి. ఒకొక్కసారి రేమడీయొక్క ప్రభావం మనకి బాహ్యంగా కనపడకపోయినా అంతర్గతంగా చాలా మార్పులను తీసుకువస్తాయి.

1.7 రేమడీలను కలుపుట

పేషంటుకి హితము కలుగుతుందంటే అనేక మిశ్రమాలను ఒక సీసాలో కలపడం ప్రస్తుతం మనం పాటించే విధానం.కాని ధీర్గకాలిక రోగాలకు మూలకారణాన్ని తెలుసుకొని వాటికి తగిన రేమడీను కలపడం చాలా ముఖ్యం.ఉదాహరణకు వ్యాధి నరాలకు సంభందిన్చినధయితే ఛ్ఛ్18.5 Neuralgia వేయడం చాలా ఉపయోగకరం.

1.8 నోసోడ్స్ ఉపయోగించడం

 1.9 పొగచుట్ట(సిగరెట్) తాగడం మరియు ఇతర దుర్వ్యసనాల చికిత్స

మత్తుమందు, మధ్యసారం,పొగాకు మొదలైన ధుర్వ్యసనాలుగల పేషంట్లకు నోసోడ్ తయారు చేసివ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. సిగరెట్ వ్యసనానికి సిగరెట్ నుండి చేసిన నోసోడ్ మూడుసార్లు (TDS)  తీసుకోవాలి.దీనివలన లాలస తగ్గుతుంది. పెశంటును సిగరెట్ తాగడం ఆపమని చెప్పనక్కర్లేదు. ఒకవేళ పేషంటు భార్య తన భక్తకు ఈ వ్యసనాన్ని మాన్పించడానికి రేమడీ ఇవ్వమని అడిగితే మీరు ఇవ్వరాదు.పెశంటును స్వయముగా మిమ్మల్ని సంప్రదించమని చెప్పాలి.పేషంటు స్వయంగా వచ్చినప్పుడు అతనిని కౌన్సలింగ్ చేసి అతను సిగరెట్ వ్యసనం మానడానికి నిశ్చయంగా ఉన్నదా లేదాయని అడిగి తెలుసోకోవాలి.అతను నిశ్చయంగా ఉన్నట్లయితే ఒక పత్రం మీద ఈ క్రింద వ్రాసిన ప్రమాణాన్ని వ్రాయమని చెప్పండి"సిగరెట్ తాగడం నా ఆరోగ్యానికి హానికరమని నాకు తెలుసు. అందువలన ఈ వ్యసనాన్ని మానేస్తానని ప్రమాణం చేస్తున్నాను." పేషంటు ఈ పత్రాన్ని తన సిగరెట్ పాకెట్లో పెట్టుకోవాలి.ప్రతిసారి సిగరెట్ అందులోంచి తీసేముందు ఆ ప్రమాణాన్ని గట్టిగా చదవాలి.ఈ విధంగా చేసినప్పుడు సిగరెట్ తాగే వ్యసనం సులభముగా తొలగిపోతుంది.

2.0 డా.అగ్గర్వాల్ తో ప్రశ్న జవాబులు

2.1 ప్ర: ప్రతిసారి ఒక కొత్త పేషంటుకి మొదటి డోస్ దేవుడిని ప్రార్థిస్తూ నోటిలో వేయాలా?

జ: అవును.చికిత్స స్వామీ దీవెనలతోనే మొదలుపెట్టాలి. మొదటి డోస్ ను నీటిలోనో లేదా పిల్గానో అభ్యాసకుడు స్వయంగా పేషంటు నోటిలో వేయడం పద్ధతి.ప్రార్థన చేయడం వలన దైవంతో సంపర్కం ఏర్పడి దివ్యశక్తి పెశంట్లోకి అభ్యాసకుడు ద్వారా ప్రవహిస్తుంది.ఈ ప్రక్రియకి అభ్యాసకులు సాధనాలు మాత్రమే.అందరిని నయం చేసే  వైద్యుడు స్వామియే.

2.2  ప్ర:భారతంలో దాదాపు అన్ని నగరాలలో నీరు శుద్ధీకరిణిలు(వాటర్ ప్యురిఫయర్) ఉపయోగిస్తున్నారు.వీటిలో UV కిరణాలతో నీటి శుద్ధీకరణ జరుగుతోంది.లాంటి నీటిని వై బ్రియానిక్స్ రేమడీలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చా?

పరిశుబ్రము అయిన తరవాత నీటిలో UV కిరణాలు ఉండవు. అందువలన ఇటువంటి నీటిని వైబ్రియానిక్స్ రేమడీలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.  స్వచ్చమైన త్రాగునీటితో  వై బ్రియానిక్స్ రేమడీలు తయారు చేయవచ్చు. ఇత్తడి పాత్రలో ఉంచిన త్రాగునీరైన రేమడీల తయారీకి ఉపయోగించచ్చు.

2.3 ప్ర: వైబ్రేషన్స్ పిల్ల్స్ లో  ఎంత కాలం వరకు నిలచియుంటాయి. వైబ్రియానిక్స్ చేతి పుస్తకములో ఆరు నెలలు వరకు నిలచియుంటాయని ఉన్నదీ. కాని ఒక అభ్యాసకుడు వైబ్రేషన్స్ మూడు నెలలు మాత్రమే నిలచియుంటాయని చెప్పారు. విషయాన్ని వివరించమని కోరుతున్నాను?

జ: సాధారణంగా పిల్ల్స్ ని అనుకూలమైన శాంతమైన మరియు విద్యుత్ కిరణప్రసారం లేని పరిసరాలలో ఉంచినప్పుడు వైబ్రేషన్స్ పిల్ల్స్ లో ఆరు నెలల వరకు నిలచియుంటాయి.కాని పిల్ల్స్ ని వికిరణం ఉన్న ప్రాంతాలలో ఉంచినప్పుడు ఆ పిల్ల్స్ లో వైబ్రేషన్స్ రెండు లేదా మూడు నెలల వరకు మాత్రమే నిలచియుంటాయి.

2.4 ప్ర: ఒకవేళ ఒక పేషంటుకు ఆపుకోడానికి వీలుబడని మూత్రవిసర్జన సమస్య మరియు మలభాద్దకము ఉంటె రోగికి CC4.4 ఇవ్వడం వలన మూత్రం ఆపుకోలేమి సమస్య ఇంకా అధికమవుతుందా?

జ: మలబద్ధము మరియు మూత్రం ఆపుకోలేమి సమస్య ఉన్న పేషంటుకి CC4.4 ఇవ్వవచ్చు. పేగులు కదిలి కడుపు కాళీ అవడం వలన మూత్రాశయం పై ఒత్తిడి తగ్గుతుంది.

2.5 ప్ర:  నాకు ఒక అభ్యాసకురాలు తను మిశ్రమాల సీసాలను ఆల్కహాల్తో నింపుతుండగా 'ఓం శ్రీ సాయి రామ్'అని 108 సార్లు జపిస్తానని చెప్పింది. ఇలా చేయడంవలన మిశ్రమాలు రీచార్జి అయ్యి వాటి శక్తీ ఇంకొంచం పెరుగుతుందని ఆమె చెప్పింది.మీరు విషయాన్ని నిర్ధారించగలరా?

జ: మిశ్రమాల సీసాలని ఆల్కహాల్తో నింపేడప్పుడు 108 సార్లు నామజపం అవసరం లేదు. [సంపాదకుడి వ్యాఖ్యానం:అభ్యాసకులు నామజపం లేదా ఇతర సాధనలు వలన తమ సేవా కార్యక్రమాలని  కొనసాగించడం చాలా మంచి విషయం]

2.6 ప్రరేమడీని నీటిలో తీసుకున్నప్పుడు నీటిని మింగడానికి ముందు నోటిలో కొద్ది సేపటివరకు ఉంచాలా?

జ:అవును.వైబ్రో నీటిని మింగడానికి ముందు నోటిలో ఒక నిమిషం వరకు ఉంచాలి.

2.7 ప్రఅల్లర్జీలు మరియు వ్యసనములునుండి  నోసోడ్స్ తో త్వరగా ఉపశమనం కలుగుతుందని విన్నాము. AVP మరియు JVP నోసోడ్స్ తయారు చేయలేరు కాబట్టి 108మిశ్రమాల బాక్సుతో ఇదే స్పందన లభిస్తుందా?

జ:లేదు. కామన్ మిశ్రమాలతో నోసోడ్స్  వాడినప్పుడున్న స్పందన లభిస్తుందని మేము ఆశించట్లేదు.ఎందుకనగా నోసోడ్ చికిత్స ప్రత్యేకించి ఒక రోగ లక్షణాన్ని గురిగా చేసి పనిచేస్తుంది.అందువలన ఉపశమనం వేగంగా కలుగుతుంది.

2.8 ప్రసయాటికా సమస్యకి చికిత్స ఎలా చేయాలి?

జ:సయాటికా సమస్యకి CC18.5 Neuralgia ఒకటే సరిపోతుంది లేదా SR289 Drocera కూడను ఉపయోగించవచ్చు. మశీన్ని ఉపయోగించి 240  మరియు 242 కార్డ్స్ ని తయారు చేసి మూత్రపిండాల మరియు మూత్రాశ్రయ మరిదియన్ల సమీకరణ చేయడం సహాయపడుతుంది.

2.9 ప్రఒక పేషంటుకి రక్తపోటు మందు వేసుకోవడం వలన కాళ్ళ దురద సమస్య వచ్చింది. సమస్య వైబ్రో రేమడీతో కూడా నయం కావట్లేదు.కొద్ది సంవత్సరాల క్రితం వ్యక్తికి రక్తపోటు ఉండడం వలన పెరిందోప్రిల్ మందు ఇవ్వబడింది.దీని వలన కాళ్ళ దురద మొదలవడంతో మందును ఆపి రామిప్రిల్ మరియు ఫెలిదోపిన్ మందులు ఇవ్వబడినాయి.అయినా దురద తగ్గలేదు.దీనితోపాటు పేషంటుకి చెవిలో టినీటస్(చెవిలో ఏదో శబ్దం వినపడడం) సమస్య మొదలయింది. సమస్య కూడను వైబ్రో రేమడీతో నయంకావడం లేదు.దురద మరియు టినీటస్ రామిప్రిల్,ఫెలిదోపిన్ మరియు పెరిండోప్రిల్ మందులు వలన కలిగే దుష్పరిణామాలు. పేషంటుకు ఎలా చికిత్స చేయవచ్చు?

జ:మూడు రకాల రక్తపోటు మందుల నోసోడ్లు తయారు చేసివ్వడం దుష్పరినామాలని  తొలగించడానికి సహాయపడుతాయి.317 కార్డు దురద తగ్గడానికి ఇవ్వవచ్చు కాని ఈ కార్డు తీసుకోవడం వలన పుల్ అవుట వచ్చే సంభావ్యత ఉన్నందువలన  చాలా జాగర్త వహించాలి.

3.0 డా.అగ్గర్వాల్ యొక్క సందేశం  

డా.అగ్గర్వాల్ సాయి వైబ్రియానిక్స్ వైద్య సేవను సమాజానికి  పరిచితం చేయడానికి అభ్యాసకులను ఆహ్వానించారు:

సాయి వై బ్రియానిక్స్ ఉచిత వైద్య సేవను ఇంకా ఎక్కువమంది ఉపయోగించడానికి ఈ వైద్య విధానాన్ని గురించి సమాజానికి తెలియచేయాలి. ఆశక్తిగల  మీ కుటుంభ సభ్యులకి మీ స్నేహితులకి మరియు పేషంట్లకి వైబ్రియానిక్స్ వెబ్సైట్  www.vibrionics.org, "సాయి వైబ్రియానిక్స్ అంటే ఏమిటి?" అన్న వీడియో మరియు అంతర్జాతీయ సమావేశ పుస్తకం వంటి వైబ్రియానిక్స్ సంభందించిన సాధనములను సూచించి వాళ్ళందరికీ వైబ్రియానిక్స్ ని పరిచితం  చేసి మీ వంతు సేవని మీరు చేయండి. ఆశక్తిగలవారికి వైబ్రియానిక్స్ వార్తాలేఖను పంపించండి. మీరు స్వయంగా వ్రాసిన విషయాలేవైన ఉంటె ఎవరితోనూ పంచుకోవద్దు.

సాయి వైబ్రియానిక్స్ గురించి సమాచారం  తెలపమని మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే మీరు ఉపయోగించడానికి వీలుగా మా దెగ్గర తాజా సమాచారాలు చేర్చబడ్డ పవర్ పాయింట్ ప్రదర్శన పేకేజీలు లభిస్తాయి.మీ ప్రదర్సనకి ముందుగా మీరు స్వయంగా వైబ్రియానిక్స్ గురించి వ్రాసియున్న విషయాలేమైన ఉంటె నాకు సరిచూడడానికి పంపవలెను. ఉక్లో సాయి వైబ్రియానిక్స్ నిర్వాహణ కార్యక్రమంలో సహాయపడడానికి అనేక మంది వాలంటీర్లు ముందుకొచ్చారు.గుజరాతి మరియు ఫ్రెంచ్ భాషలలో విషయాల  తయారీ జరుగుతున్నది. ఆఖరిగా మీరందరు భగవంతుడుకి  చేసే ఈ సేవకి ధన్యవాదాలు.ఎప్పటిలాగానే రోగులని నయం చేసేది స్వామియే  మనము స్వామియొక్క సాధనములు  మాత్రమేయని గుర్తుంచుకోవాలి.వైబ్రేషన్స్ యొక్క శక్తీ మరింతగా పెరగడానికి అభ్యాసకుని ప్రేమ విశ్వాసాలు ప్రధానమైనవి. వైబ్రియానిక్స్ సంభందించిన సమాచారాలన్నీ మీరు ఎప్పడికప్పుడు తెలుసుకోవడం మంచిది. వైబ్రియానిక్స్ చేతి పుస్తకాన్ని క్రమముగా చదువుతూ ఉండండి. ప్రతినెల వార్తాలేఖలో ఇవ్వబడిన సమాచారాన్ని తెలుసుకోండి. రోగాన్ని  తొలగించడానికి తన మనస్సు మూల సాధనమని పేషంట్లకు గుర్తుచేస్తూ ఉండండి. సానుకూల నిర్ణయాలు తీసుకోవడం,అనుకూలమైన విషయాలను ఊహించుకోవడం (విజువలయిజేషణ్ టెక్నిక్లు) క్షమాగుణం,క్రుతజ్ఞ్యత పెంచుకోవడం వంటి మార్పులను చేయడం వలన వేగంగా స్వస్థతను పొందవచ్చు.

జై సాయి రామ్!