ప్రశ్నలు జవాబులు
Vol 9 సంచిక 1
January/February 2018
1 ప్రశ్న: నేను CC7.3 Eye tonic ను ఒక చుక్క 30 మీ.లీ.శుద్ధి చేసిన నీటిలో వేసి కంటిలో చుక్కల మందులాగా వేయడానికి డ్రాపర్ బాటిల్ లో పోసాను.ఈ మందు వేయగానే పేషంటు కంటిలో మంటగా ఉందని చెప్పారు, దయచేసి ఇలా చుక్కల మందు తయారుచేసే సరయిన విధానము తెలుపగలరా ?
జవాబు : ఈ మంట రెమిడి లో ఉన్న ఆల్కహాల్ వలన కలిగింది. ఇలా మంట రాకుండా ఉండాలంటే 100మి.లీ.నీటిలో ఒక చుక్క కంటే ఎక్కువ రెమిడి వేయరాదు. ఒకవేళ మీరు మూడు వేరువేరు రకాల రెమిడి లు వేయాలనుకుంటే 300మి.లీ.నీటిని తీసుకోవాలి. ఆ తరువాతే ఈ నీటిని 30మి.లీ.డ్రాపర్ బాటిల్ లోనికి తీసుకోవాలి. మిగిలిన రెమిడి నీటిని మొక్కలకి వినియోగించాలి. ఇలా తయారు చేసిన రెమిడి 15 రోజుల వరకూ ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారుచేయడానికి కావలసిన నీటిని మందుల షాపులో దొరికే స్టెరైల్ నీటితో గానీ లేదా ఇంట్లోనే నల్లా నీటిని 20 నిముషాలు మరిగించి చల్లార్చడం అవశేషాలు ఏమయినా ఉంటే అవి పాత్రలోనే ఉండేలా వడకట్టడం ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు.
________________________________________
2 ప్రశ్న: వైబ్రో రెమిడి లు నీటిలోనే ఎందుకు బాగా పనిచేస్తాయి.?నీటి యొక్క లక్షణము బట్టి అనగా స్వేదన క్రియ డిఅయోనైజ్ చేసినవి స్ట్రక్చర్చేయబడిన నీళ్ళు ఇలాంటి మార్పుల వలన రెమిడి యొక్క శక్తి మారుతుందా ?
జవాబు: నీటికి ఉన్న అధిక శక్తి నిలుపదల చేసే స్వభావము వలన నీటితో కలిపిన రెమిడిలు బాగా పనిచేస్తాయి. అనేక వృత్తులకు చెందిన చికిత్సా నిపుణులు చెప్పిన దాని ప్రకారం నీటికి ఉన్న అద్వితీయ గుణం వలన నయం చేసే వైబ్రేషణ్ స్వీకరించి దాచుకొని తిరిగి శరీరానికి చెందిన భౌతిక,మనో వ్యాధులను నయం చేస్తుంది. రెమిడి యొక్క శక్తి నీటి యొక్క రకాన్ని బట్టి మారదు. ఒకవేళ రెమిడి నేరుగా నోటికి తీసుకున్నట్లయితే వెంటనే కొన్ని నీళ్ళు కూడా తీసుకొనడం మంచిది. నీవు తీసుకొనే నీటి పట్ల సరియయిన నిర్ధారణకు రాలేక పొతే అప్పుడు బజారులో దొరికే డిస్టిల్ వాటర్ ను ఉపయోగించుకొనవచ్చు. 1వ ప్రశ్న కు జవాబు చూడండి.
________________________________________
3 ప్రశ్న: AVP మాన్యువల్ లో చెప్పిన ప్రకారం రెమిడి లు ఉపయోగించుటకు లోహపు చెంచాలను వాడకూడదు.ఐతే నేను రాగితో చార్జింగ్ ఐన నీటిని ఉపయోగిస్తూ దీనిలో అద్భుత ఫలితాలు ఉన్నట్లు గ్రహించాను. కనుక రాగితో చేసిన పాత్ర గానీ చెంచా గానీ ఉపయోగించుట సమ్మతమేనా తెలుపగలరు ?
జవాబు: ప్రస్తుతం లభిస్తున్న సమాచారము ప్రకారము వైబ్రియానిక్స్ రెమిడి లు వెండి మరియు రాగి తో సమన్వయం చెందుతాయి. ( కానీ ఇవి మలిన రహితంగా ఉండాలి) ఐతే ఇనుము అల్యూమినియం ఇత్తడి మాత్రం పనికిరావు.
________________________________________
4 ప్రశ్న: పేషంటు వాడకుండా తిరిగి ఇచ్చిన రెమిడి లను ఏమిచేయాలి. వీటిని వదిలివేసిన SRHVP తో న్యూట్రల్ చేసి తిరిగి ఉపయోగించవచ్చా?
జవాబు: దీని పైన మరికొంత దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. SRHVP రెమిడి లను న్యూట్రల్ చేసినప్పటికీ గోళీలు స్వీకరించిన కొన్ని హానికరమైన కలుషితాలను నిర్వీర్యం చేయలేదు. ఉదాహరణకు ఒక పేషంటు గోళీని మూత లోనికి తీసుకోని నోటిలో వేసుకున్నాడనుకొందాము. ఒక్కొక్కసారి తెలియకుండానే మూత నోటికి తగులుతూ ఉంటుంది. దీనివలన మన శ్వాస నుండి కొన్ని సూక్ష్మ క్రిములు మూతలో చేరే అవకాశం ఉంది. అందుచేత రెమిడి గోళీలు కలుషితం కాలేదని నిర్ధారణకు వస్తే తప్ప వాటిని తిరిగి ఉపయోగించలేము. అలా కానీ పక్షంలో ఈ మిగిలిన గోళీలను తోటలోనో పెరటిలోనో ఉన్న మొక్కలకి నీటిలో కలిపి పోసేయాలి. బాటిల్ ను బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత దానిని తిరిగి ఉపయోగించవచ్చు.
________________________________________
5 ప్రశ్న: వార్తాలేఖ లలో ప్రచురితమయ్యే కేసులలో ఎక్కువ శాతము 108CC బాక్సు కు సంబంధించినవే ఉంటున్నాయి ఈ రెమిడి లు SRHVP తో తయారుచేసిన వాటికన్నా బాగా పనిచేస్తాయనే కారణం ఏ మైనా ఉందా?
జవాబు: 108CCబాక్సు మరియు SRHVP రెండింటికి మన వైబ్రియానిక్స్ లో సముచిత స్థానం ఉంది. పెరుగుతున్న రోగుల అవసరాలు,మెడికల్ క్యాంపులలో త్వరగా పేషంట్లను చూసి పంపడానికి వీలయిన చక్కటి యంత్రాంగమును దృష్టిలో పెట్టుకొని 2007లో 108CC బాక్సురూపొందించడం జరిగింది. మొదట ప్రాక్టీషనర్ లు పేషంట్ల అవసరాల దృష్ట్యా కొన్ని బాగా అవసరమైన ఎక్కువగా ఉపయోగింపబడుతున్న రెమిడి లను ముందే తయారుచేసి పెట్టుకొని వాటిని మెడికల్ క్యాంపులలో ఉపయోగించేవారు. ఇలా వీటి ద్వారా వస్తున్న ఫలితాలను చూసి స్పూర్తిని పొంది,స్వామి ఆశీస్సులు కూడా పొంది 108CC బాక్సు తయారుచేయడం జరిగింది.
108CCబాక్సు కు ఉన్న బలాలేమిటంటే దీనితో వేగంగా పేషంట్లకు రెమిడి లు ఇవ్వవచ్చు. రెండవది స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఆశిర్వదించిన మాస్టర్ రెమిడి బాక్సు తో ఇచ్చే రెమిడి ల ప్రభావం అద్భుతంగా ఉంటున్నది. ఈ కొమ్బోలు ఒక్కొక్కటీ అనేక వ్యాధులను నయం చేయగల శక్తిగలవి. మనందరికీ తెలిసిన విషయమే 108CCబాక్సు లోని రెమిడిలు స్వామి చేత అద్బుతంగా ఆశీర్వదింప బడిన SRHVPనుండి తయారు చేసినవే . సాధారణంగా SRHVP నుండి తయారు కాబడే రెమిడి లు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం లేదా ఒక ప్రత్యేకమైన రుగ్మత ను నిర్మూలించడానికి ఉద్దేశించనది గా ఉంటుంది.ముఖ్యంగా 108CC బాక్సు తో ఆశించిన ఫలితం రానప్పుడు ఈ రెమిడి ఉపయోగిస్తాము. సుశిక్షుతులైన ప్రాక్టీషనర్లు ఈ రెండింటినీ ఉపయోగించి ప్రయోజనం పొందుతున్నారు. 108CC బాక్సు తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇంకా అదనంగా ప్రయోజనం పొందడానికి SRHVP బాక్సు ఉండాలి. ఐతే దీనికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం.