డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి
Vol 8 సంచిక 6
November/December 2017
ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా
భగవాన్ బాబావారి 92 వ జన్మదినోత్సవ సందర్భంగా మీతో ఇలా నా భావాలూ పంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.వారి దివ్యవాణి ఎంత అద్భుతమైన ఫలితం కలిగిస్తుందంటే కేవలం అది విన్నా చదివినా మనిషి యొక్క సంపూర్ణ మూర్తిమత్వములో సమూలమైన మార్పు వస్తుంది. మరి అటువంటి దివ్యమైన వైబ్రేషణ్ వైబ్రియోనిక్స్ రూపంలో వ్యాప్తి చేయడానికి స్వామి చేత ఎన్నుకోబడిన మనమెంత భాగ్యశాలురమో ఊహించండి.
ఇక ఈ సంచిక విషయానికొస్తే ఫ్రాన్సు దేశంలో వైబ్రియోనిక్స్ సేవలను విశేషంగా చూపుతూ ప్రస్తుత సంచిక లో ప్రేమ,సేవ భావాలతో అత్యంత ఉత్సాహంగా వినయంగా సేవలందిస్తున్న నలుగురు ప్రాక్టీషనర్ లపైన ప్రత్యేక కథనం ఇవ్వబడింది. ఇవి పాఠకులలో ఒక విధమైన ప్రేరణను కలిగించి జీవిత లక్ష్యం వైపు పురోగమింప చేస్తుందనడంలో అతిశయోక్తి ఏమీలేదు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రో ప్రాక్టీ షనర్లకు నా విన్నపం ఏమిటంటే మీరు కూడా ఈ వార్తాలేఖ చదివి ప్రేరణ పొంది మీ ప్రొఫైల్ లను కూడా మీమీ ప్రాంతీయ లేక మీదేశపు కోఆర్డినేటర్లకు పంపవలసిందిగా సూచన.
అలాగే ఒక బాధాకరమైన విషయాన్నికూడా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మన ప్రియమైన సాయి సోదరి అన్నా 02554…ఇటలీ ఈ నెలలోనే స్వర్గస్తులయ్యారు. ఆమె తనకు వచ్చిన వ్యాధితో చాలా ధైర్యంగా ఎదుర్కోవడమే కాక చివరి క్షణం వరకూ పేషంట్ ల సేవ అడ్మిన్ సేవ చేస్తూనే తుది శ్వాశ విడిచారు. వైబ్రియోనిక్స్ కు వీరు అందించిన సేవలు అత్యంత విశిష్ట మైనవి. చాలా సంవత్సరాలు వీరు తన భర్తతో కలసి ఇటలీ కి జాయింట్ కోఆర్డినేటర్ గా పని చేసారు. ఇటలీ లో అనేక వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడమే కాకుండా తమ మాతృ భాషలోనే వీటిని నిర్వహించడం ఒక విశేషం . వీరి అనుభవంలో విజయ వంతమైన అనేక అద్బుతమైన కేసులు ఉన్నాయి. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె ఆత్మ స్వామిలో లీనం కావాలని మనసారా స్వామిని ప్రార్ధిస్తున్నాను.
ఇక సంస్థాపరమైన విషయాలు చూసినట్లయితే మనమంతా కలసి పనిచేస్తూ సమన్వయంతో ముందుకు వెళుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉండి. రక్షణ విషయంలోనూ గోప్యత విషయంలోనూ మన రెండు వెబ్సైట్లు http://vibrionics.org మరియు https://practitioners.vibrionics.org. లలో కొన్ని మార్పులు తీసుకు వచ్చాము. ఈ మార్పులు వెంటనే అమలులోనికి వస్తాయి మీ పాత పాస్ వర్డ్ లు పనిచేయవు ( మీరు గత నెల లోనే పాస్ వర్డ్ సృష్టించు కొని వుంటే తప్ప)కనుక మీరు క్రొత్త వాటిని తయారుచేసుకోనవలసి ఉంటుంది. దీనికోసం ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఎంచుకొని దానిని క్లిక్ చేయడం, తర్వాత తెర పైన కనిపించే సూచనలను పాటించడం ద్వారా కొత్తది సృష్టించుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రెండు సైట్ లకూ ఒకే పాస్ వర్డ్ తాయారు చేసుకోవలసినదిగా సూచన .
మనందరికీ తెలుసు కాలము ఎవరికోసము ఆగదు.అందువలననే ప్రతీ క్షణం సద్వినియోగం చేసుకుంటూ వర్తమానం లోనే జీవించడం నేర్చుకోవాలి . నేను ఇలా ఎందుకంటున్నానంటే ప్రపంచ జ్ఞానసంప్రదాయాల వివరణ ప్రకారం వర్తమాన కాలానికి మించి మరేది సాటి రాదు,కనుక ప్రస్తుత తరుణంలో విశ్వ శక్తులతో మనసును మమేకంచేసుకొని ఆ దివ్య శక్తులే మనద్వారా పనిచేసే లాగా చేసుకోగలగాలి.కనుక మనం చేసే సేవను సంపూర్ణ సమర్పణ భావంతో చేసినపుడు అట్టి దివ్య శక్తి మనలో ఇమిడీ కృతం అవుతుంది. అప్పుడుమనం ఈ కాలాతీత మైన శక్తిదాయకమైన ఆత్మశక్తి తో సంలీనమై మన ద్వారా చేయబడే ప్రతీ సేవ,ప్రతీ చర్యా నిర్మాణాత్మకము గానూ,పరిపూర్ణమైనది గానూ ఉంటుంది. ఇదే వైబ్రియోనిక్స్ లో కానివ్వండి మరే ఇతర నిస్వార్ధ సేవలోగాని ఉన్న రహస్యం. ఇదే జీవిత పరమార్ధం.కనుక ఈ జన్మదినోత్సవ సందర్భంగా స్వామిని మనస్పూర్తిగా ప్రార్థించేదేమిటంటే మానవాళి అంతా స్వామి ప్రవచించిన ‘’అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు ‘’ అనే సూత్రం ద్వారా ఒక్కటి కావాలని, అందరూ ఆనందంగా జీవించేలా అనుగ్రహించమని కోరుకుంటూ ,
ప్రేమతో సాయిసేవలో తరించే మీ
జిత్ కె. అగ్గర్వాల్