డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 6 సంచిక 4
July/August 2015
ప్రియమైన అభ్యాసకులకు
గురు పూర్ణిమ
గురు పూర్ణిమ రావడంతో మనకు ఎంతో ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్య సాయి బాబాగారి అపారమైన దివ్య ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పవిత్రమైన రోజున 2008 నుండి 2010 వరకు ప్రతి ఏడాది స్వామి సాయి వైబ్రియోనిక్స్ టీం సమర్పించిన కేక్ని కట్ చేసి వారి అపారమైన ప్రేమను కురిపించారు.స్వామి మన సమర్పణా భావనను అంగీకరించి మనకు నిస్వార్థ సేవ చేయడానికి ప్రేరేపించారు. నేను ఈ గురుపూర్ణిమ సందర్భముగా స్వామిని మేము చేసే ఈ సేవా కార్యక్రమము భక్తి శ్రద్ధలతో కొనసాగించేలా ఆశీర్వదించమని మనసారా ప్రాద్ధిస్తునాను.
స్వామిలో విలీనమైన ఒక ధన్యాత్మురాలు
సోదరి ఐవోన 01213..పోలాండ్ సాయి వైబ్రియోనిక్స్ సేవలో కీలక పాత్ర వహించారు. ఆమె ఈ నెల స్వామిలో విలీనం అయ్యారని అతి దు:ఖంతో తో తెలుపుకుంటున్నాను. తన ఆఖరి క్షణం వరకు రోగులకు తన నిస్వార్థ సేవను అందిస్తూనే వున్నారు. ఎల్లప్పుడూ మా గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు.
సాయి వైబ్రియోనిక్స్ ఒక అధ్యాయం
మేము సాంకేతిక విజ్ఞానం ద్వారా అన్ని ప్రాంతాలలో ఉన్నఅబ్యాసకులను మరి ఇంత దెగ్గర చెయ్యాలని నిర్ణయించుకున్నాము. వారి అభిప్రాయాలను,అనుభవాలను వాటి వల్ల వారు పొందిన జ్ఞ్యానాన్ని,సాంకేతిక విజ్ఞ్యానం ద్వారా ఒక చోట చేరుస్తే అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది.దీని వలన మనం చేస్తున్న ఈ వైబ్రియోనిక్స్ సేవ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇది చేయడం మూలంగా స్వామీ ఆశించిన విధంగా వైద్య సదుపాయాలు అందుపాటులో లేని వారికి మరియు అవసరమున్న వారికి అందేవిధంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న కేసు వివరాలు, అభ్యాసకుల అభిప్రాయాలు మరియు ఉత్తమ సలహాలు ఈ కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి గల మూల కారణాలు.
అభ్యాసకులకు ఆహ్వానం
ఆన్లైన్లో అసాధారణ కేసు వివరాలుతో పాటు సాధారణ కేసు వివరాలు కూడా నమోదు చేస్తే భాగుంటుంది అని కొందరు అభ్యాసకుల అభిప్రాయం. దీని వలన అబ్యాసకులుకి, రోగులకి మరియు వై బ్రిఒనిక్స్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను.
ఈ యోచనలో అభ్యాసకులoదరు సులభముగా పాల్గొనవచ్చు. మీలో ఒక్కొక్కరిని మీ పేషెంట్ రికార్డు పుస్తకాలలో ఉన్న కేసులన్నీ పంపించడానికి నేను ఆధికారికంగా ఆహ్వానిస్తున్నాను. మీరు పపించిన కేసులన్నీ అందరికి ఉపయోగ పడేలా వార్తాలేఖ డేటాబేస్లో పొందుపరుస్స్తము. మీరు గతంలో మాకు పంపిన అసాధారణ కేసులు ఏమైనా వార్తాలేఖలో ప్రచురింపబడకపోయుంటే వాటిలో లుప్త వివరాల్ని చేర్చి ఈ కింద ఇవ్వబడిన ఈమెయిలుకు పంపవలెను [email protected].
సేవకు కృతజ్ఞ్యతలు
నిర్వహణ, ప్రచురణ, ఎడిటింగ్ మరియు సాంకేతిక విభాగములలో సేవ అందించడానికి ముందుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ప్రతిస్పందన చూసి నాకు చాలా ఆనందముగా ఉంది. అదే విధంగా ఇంకా ఎక్కువగా అభ్యాసకులు మరియు సహాయకులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను.
ఈ విశేష ప్రచురణలో గ్రూప్ వివరాలు అందించిన మా జపనీస్ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్టున్నాము.
మీకు మరియు మీ కుటుంభ సభ్యులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంట్టున్నాము.
సాయి సేవలో
జిత్ కే అగ్గర్వాల్