డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 8 సంచిక 3
May/June 2017
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
2017 ఏప్రిల్ 24 తేదీన స్వామి వారి 6వ ఆరాధనోత్సవాలు జరిగాయి. మనందరికీ తెలుసు ఇది స్వామి మహాసమాధి చెందిన రోజు. స్వామి భౌతికముగా మనందరికీ దూరమైనా మన హృదయం లోనే కొలువు తీరి ఉన్నారు. జీసస్ కూడా దేవుని సామ్రాజ్యం నీ హృదయం లోనే ఉన్నదని ప్రవచించారు. మరి మన లోనే ఉన్న ఆ దేవాదిదేవునితో నిరంతర సామీప్యత అనుభవిస్తూ ఆనందపు అంచులలో విహరించే మార్గం ఏది? దీనికి సమాధానం కూడా భగవంతుడే ప్రసాదించారు. ప్రేమ,సేవ అనే రెక్కలతో మానవాళి ఆ దివ్య పధాన్ని చేరుకోవచ్చు ...శ్రీసత్యసాయి ప్రవచనాలు 28.34: 21నవంబర్ 1995. కనుక మన హృదయ కవాటాలను తెరిచి లోనున్న ప్రేమ వాహినిని నిస్వార్ధ సేవ వైపు ప్రవహింప చేద్దాం. ఇదే ఆనందానికి రాచబాట.
స్వామి మనందరికీ అందించిన బాటలో నడుస్తూ వైబ్రియోనిక్స్ కు అద్బుతమైన సేవలందించే చికిత్సా నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ విషయానికొస్తే మన వార్తా లేఖలను ఇతర వైబ్రియోనిక్స్ సమాచారాన్ని ఇతర భాషలలోనికి అనువదించే వారి సేవలు ఎన్నదగినవి. వారి సేవలు మన సమాచారాన్ని ఆంగ్ల భాషా పరిగ్జ్ఞానం లేని వారికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమయంలో వారి సేవలను ప్రస్తుతిస్తూ ఇలా అనువాద రూపంలో సేవలందించే కొందరి అనుభవాలను ఈ వార్తా లేఖలో మీకు అందిస్తున్నాము.
మార్చ్ 24 -27 తేదీలలో పోలాండ్ దేశంలో వర్క్ షాప్ నిర్వహించేందుకు అవకాశం మనకు కలిగింది. ఈ దేశపు వారే కాక జర్మనీ, నార్వే, రొమేనియా, స్లోవేనియా నుండి ప్రాక్టీషనర్ లు పాల్గొన్నారు. వారి ద్వారా విన్న కొన్ని అరుదయిన, అద్భుతమైన కేసుల వివరాలు మీతో పంచుకోవాలనుకొంటున్నాను. ఎందుకంటే నిజంగా అ వివరాలు వింటుంటే కళ్ళవెంట ఆనందబాష్పాలు రాలక మానవు. ఇట్టి స్పూర్తి,నైపుణ్యము,అంకిత భావం తో పనిచేసే ప్రాక్టీషనర్లు ఎప్పటికప్పుడు వృత్యంతర శిక్షణ పొందుతూ యూరప్ లో వైబ్రియోనిక్స్ అంచెలంచెలుగా ఎదగడానికి దోహద పడడం ఎంతో ప్రోత్సాహకర పరిణామము. ఈ అనుభవాలను మరొక వార్తాలేఖ ద్వారా మీతో పంచుకోవాలనుకొంటున్నాను.
అమెరికా దేశపు మన వైబ్రియో ప్రాక్టీషనర్లు మొక్కలు, జంతువుల పైన మన అవగాహనను విస్తృత పరిచే దిశలో భాగంగా ఒక నూతన పరిశోధనా ప్రాజెక్ట్ ను ప్రారంభించారు, ఆ విధంగా మొక్కలూ, జంతువులలో వివిధరకాల రోగ సమస్యలను ఎదుర్కొనేందుకు సహకరించే నూతన పరిశోధనకు శ్రీకారం చుట్టారు.
స్వామి తమ అమూల్యమైన ఆశీస్సులు అందించిన ఈ వైబ్రియానిక్స్ తో సాధ్యమైనంత ఎక్కువ జీవితాలలోనికి ప్రవేశించాలానే లక్ష్యం తో ముందుకు పోవాలని వైబ్రియానిక్స్ సాధన పెంచుకునే దిశగా అందరూ ఒకటే అందరూ స్వామి ప్రతిరూపాలు అనే భావన విడనాడకుండా సేవ చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ప్రాక్టీషనర్లు అందరూ సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టిషనర్ ల అంతర్జాతీయ సంస్థ International Association of Sai Vibrionics Practitioners కు మన వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి మెంబెర్ షిప్ పొందవలసిందిగానూ దీని నిమిత్తం సమాచారం కావలసి వస్తే మీ రాష్ట్ర కోఆర్డినేటర్ను ఎట్టి సందేహము లేకుండా సంప్రదించవలసిందిగా సూచిస్తున్నాను. అలాగే సంస్థాగతంగా కానీ, పరిపాలనా పరంగా కానీ మీరేమైనా సహాయం అందించదలిచినచో ఇదే మా సాదర ఆహ్వానము. మీ సేవలు ప్రస్తుత తరుణంలో అత్యవసరమైనవిగా భావించండి. మీలో ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా ‘’అందరినీ ప్రేమించు,అందరినీ సేవించు’’ అనే సూత్రంతో మనందరినీ ఈ వైబ్రియోనిక్స్ ద్వారా దగ్గర చేర్చి సేవ చేసుకొనేందుకు అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ కే అగ్గర్వాల్.