డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 8 సంచిక 2
March/April 2017
ప్రియమైన అభ్యాసకులకు,
మీరందరు మహత్తరమైన మహా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకొని, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీ నిజ జీవితంలో చక్కగా పొందుతున్నారని నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. ఒకానొక శివరాత్రి దివ్య ఉపన్యాసాలలో స్వామి చెప్పారు మీరు మీ యొక్క కష్టాలకు బాధలకు మూల కారణం కనుగొనలేక పోతున్నారు. అందువలన మంచి పనులను చేయండి. పవిత్రమైన భావాలను పెంపొందించుకోండి. మీ తోటి మానవులకు సేవ చేయండి. ఈ విధమైన మార్గంలో ప్రయాణించడం భక్తి తో సరి సమానం . పల్లెలోనూ మురికి వాడల్లోనూ సేవ చేస్తూ వారికి కావాల్సిన కనీస వసతులను కల్పించడం ద్వారా తమ అడుగు జాడల్లో నడవాలని స్వామి ఆకాంక్షిస్తున్నారు. ఇది స్వామి తన చిన్న వయసు నుంచే నిరూపిస్తూ వచ్చారు.…Sathya Sai Speaks Volume 32 part-1
స్వామియొక్క ఈ ఉపదేశాన్ని మనం మన జీవితం యొక్క ప్రధాన మార్గదర్శక సూత్రంగా తీసుకొందాం. మనందరం మన యొక్క హద్దులను చెరిపేసుకుని పరిశోధన కార్యక్రమాల్ని విస్తారం గావించడం ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టిద్దాం. ౨౦౧౭ వార్షిక ప్రణాళిక ప్రకారం, గత సంచికలో చెప్పిన విధంగా మేము నిర్దిష్టమైన పరిశోధనను, మొక్కలు మరియు జంతువుల చికిత్సా విధానాలపై చేస్తున్నాము. దీని కోసం మేము టెస్ట్ మరియు కంట్రోల్ గ్రూప్స్ ను ఎంచుకుని మా పరిశోధన కొనసాగిస్తాము. ఇందుకు అనుకూలమైన వాతావరణం మరియు అంకిత భావం గల పరిశోధకులు మాకు అవసరము. అందువలన ఈ బ్రహత్తరమైన కార్యక్రమంకోసం, మొక్కలు మరియు జంతువుల సంరక్షణపై ఆసక్తి మరియు అవగాహనా ఉన్న వారందరు ముందుకు వచ్చి అంగీకార సూచకంగా నాకొక ఈమెయిల్ పంపాలని నేను కోరుచున్నాను
23 ఫిబ్రవరి, 2017న, మహాశివరాత్రి పర్వదినాన, శ్రీ సత్య సాయి ఉన్నత వైద్య విధాన సంస్థ, వైట్ ఫీల్డ్, బెంగళూరు లో గల వెల్నెస్ క్యాంపులో విబ్రియోనిక్స్ ను అంతర్భాగంగా చేయడం ద్వారా స్వామి తమ అపార దయను, కృపను మనపై కురిపించారని నేను మీకు కృతజ్ఞతా భావంతో సవినయంగా తెలియచేయుచున్నాను. .
విబ్రియోనిక్స్ లో ప్రగతి మరియు ఆధాత్మిక పురోగతి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి - క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీవనసరళి లేకపోతె ఎవరైనా విబ్రియోనిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించలేరు. కేరళలోని షోరనూర్ లో గల సాయి ఆసుపత్రి నందు మన కేరళ అభ్యాసకులు నూతన సంవత్సరంలో మొట్టమొదటి సాధన క్యాంపు నిర్వహించారని తెలియ చేయుటకు నేను చాల సంతోషించుచున్నాను. ఇటువంటి ప్రేరణ కలిగించే సాధన క్యాంపులు క్రమం తప్పకుండా ప్రపంచమంతా జరుగుతూ ఆధ్యాత్మిక జీవన విధానం యొక్క ఆవశ్యకతను మన అభ్యాసకులకు బోధపడేటట్లు చెయ్యాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఈ అద్భుత ప్రయత్నాన్ని మేము మనసారా అభినందిస్తున్నాము
ఈ సంచిక లో మన చర్చాంశం “నీరు”. స్వామి అంటారు “నీరు మనిషి యొక్క జీవనాధారం”. మేము నీటియొక్క అత్యద్భుతమైన గుణాలను మరియు డీహైడ్రేషన్, దాని నివారణ మీద ఒక వ్యాసాన్ని పొందుపరుస్తున్నాము. మీరు దీనిని చాల ఉత్సుకతతో చదవగలరు. వేసవి కాలం సమీపంలో ఉన్నందున ఇది మీకు చాలా ఉపయోగకరం కూడా. అతి చిన్న వయసులోనే విబ్రియోనిక్స్ అబ్యాసకులుగా మారిన నలుగురు యువ అభ్యాసకులును మీకు పరిచయం చేస్తున్నాము. ఎంతో ఉత్సాహంతో మరియు ప్రేమతో వారు చేసే విబ్రియో సేవ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం
ఈ సంచికను శ్రద్దగా చదువుతున్నపుడు స్వామి యొక్క దివ్య సందేశాన్ని చూసినప్పుడు మనం ఎంతో ప్రేరణ మరియు ఉత్తేజాన్ని పొందుతాము. “ఉన్నత భావాలు, ఆశయాలు పెంపొందించుకోండి. మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి. జీవిత ప్రధాన గమ్యమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించండి”...మహా శివరాత్రి దివ్య సందేశం, బృందావన్, మార్చ్ 7, 1978. ప్రేమమయమైన దివ్యత్వం మనందరి జీవితాశయం మరియు విబ్రియోనిక్స్ సేవ ద్వారా మనం దానిని అందుకోవాలని ఆశిస్తున్నాను.
సదా ప్రేమమయమైన సాయి సేవలో,
జిత్ కే అగర్వాల్.