దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 8 సంచిక 2
March/April 2017
“చెడు ఆలోచనలు మరియు చెడు భావాలు మనసులోనే ఆవిర్భవిస్తాయి. అదే సమయంలో మనసులో మంచి ఆలోచనలు మరియు భావాలు కూడను కలుగుతాయి. మనసు నుండి చెడు ఆలోచనలు మరియు భావాలను తీసి వేసినప్పుడు మాత్రమే మానవునికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనేక వ్యాధులకు మూల కారణం మనసులో నిండియున్న ఆలోచనలే. చెడు ఆలోచనలు అజీర్ణం, గుండె సమస్యలు, రక్తపోటు సమస్యలు వంటి వ్యాధులను కలుగజేస్తాయి. మనో వ్యాధులకు ఆందోళన మరియు చింతలే మూల కారణములు. చక్కెర వ్యాధి మరియు పల్మనరీ వ్యాధులకు మూల కారణం మనసులో కలిగే ఆలోచనలే."
-సత్యసాయి బాబా, "దివ్యనామము యొక్క శక్తి" దివ్యోపన్యాసము, నవంబెర్ 25, 1998
http://www.sssbpt.info/ssspeaks/volume31/sss31-05.pdf
“దురదృష్టముచేత ఈ నాడు మన దేశములో సమాజ సేవను గురించి అనేక విధములుగా చర్చించడం జరుగుతున్నది. ఇటువంటి సేవలను 'సమాజ సేవ' అనటం కంటే 'పటాటోప సేవ' అని అనవచ్చు. అనేక రాజకీయ నేతలు సమాజ సేవ చేయాలని అంటూ ఉంటారు. ఒక చీపురు కట్టను తీసుకొని వీధులను శుభ్రపరుస్తున్నట్లుగా ఒక ఫోటోగ్రాఫర్ ను పిలిపించి ఫోటోలు తీయించుకొని వార్తాపత్రికల్లో ప్రచురింప చేసుకోవటంలో మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చేసుకోరాదు. ఇటువంటి అహంకారాన్ని పెంచుకోరాదు. సేవ అన్నది మనసు నుండి ఆవిర్భవించాలి.”
-సత్యేసాయి బాబా, "మానవ సేవయే మాధవ సేవ" సమ్మర్ షావెర్స్ ఇన్ బృందావన్,1973
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf