వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 8 సంచిక 1
January/February 2017
“మన వల్ల ఎవరికైనా బాధ గానీ,హాని గానీ కలిగిన చో వారికి ఏదో ఒక విధంగా సేవ చేసే ప్రయత్నం చేయాలి.ఎదో ఒకపని చేయడం మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఇది మాత్రమే సేవ అనే భావంతో ఉండవద్దు.ఒక మంచి మాట మాట్లాడడం కూడా సేవే.నీ నుండి వచ్చే అనునయ వాక్యాలు అవతలి వ్యక్తీ హృదయ భారాన్ని తొలగిస్తాయి.నీవు చేసే సేవ వారి మనసులను తేలిక పరుస్తు౦ది.కనుక మంచి మాటలు మాట్లాడడం ద్వారా,మంచి పనులు చేయడం ద్వారా ఇతరులను ఆనంద పరచ గలగాలి,ఇదే ఉత్తమ సేవ.”
…సత్యసాయిబాబా , “జన సేవయే జనార్ధనుని సేవ ” Summer Showers in Brindavan1973
“మనం పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేక పోవడంలో కోపానిదే ప్రధాన భూమిక..ఇది మన రక్తం లోకి హానికరమైన విషపదార్ధాలను చొప్పించి మన ప్రవర్తన లో చాలా మార్పు తీసుకుని వస్తుంది.. అనారోగ్యానికి మరో కారణం చెడు తలంపులు మరియు చెడు ప్రవర్తన. .లోకులంతా -చెడ్డవాడు అనారోగ్య కరంగా ఉండవలసిన అవసరం లేదు కదా అనుకొంటారు,కానీ మన అనారోగ్యానికి మూలము చెడు ఆలోచనలు దాని ద్వారా కలిగే మానసిక అనారోగ్యము . డాక్టర్లు కూడా తమ పేషంట్లతో మృదువుగా ప్రేమగా మాట్లాడాలి.తమ వృత్తిని ఇతరులకు సేవ చేసే టందుకు భగవంతుడు అనుగ్రహించిన వరం గా భావించాలి.కనుక మంచి ఆలోచనలు కలిగి ఉండడం,ఇతరులకు సేవ చేయడం ద్వారా మాన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేగాక ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.కొబ్బరిచెక్క ,కొబ్బరి నీరు మొలకెత్తే విత్తనాలు,పక్వం కానీ లేదా అర్ధ భాగం పక్వ మైన కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి".
…సత్యసాయిబాబా, “మంచి తనము మంచి ఆరోగ్యము ” Discourse, 30 September 1981