డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 7 సంచిక 5
September/October 2016
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
కేరళ చికిత్సా నిపుణులు చేపట్టిన శ్రేష్టమైన మొదటియత్నం మరియు గొప్ప సేవ యొక్క నివేదికను గొప్ప ఆనందం మరియు ప్రశంసతో మీకు అందిస్తున్నాను. ఈ నెల ఓనం పండుగ జరుపుకుంటున్న సందర్భంలో కేరళ చికిత్సా నిపుణులు పై ప్రత్యేక కేంద్రీకరణం చేయబడుతున్నది. ప్రతి సంవత్సరం ఈ రోజున మహాబలి చక్రవర్తి పాతాళ లోకం నుండి భూలోకానికి వచ్చి ప్రజల సంక్షేమాన్ని సరి చూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కేరళ భక్తులు ఎల్లప్పుడూ ఓనం సమయంలో అతిసుందరమైన మరియు ఆడంబరమైన వేడుకలను స్వామి దివ్య చరణాల వద్దకు తీసుకువచ్చేవారు. కేరళ రాష్ట్రం లో అర్పణా భావనగల అనేక చికిత్సా నిపుణులు ఉన్నారని ఎంతో ఆనందంతో తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా సంపూర్ణ అంకిత భావంతో సేవను అందిస్తున్న ముగ్గురు చికిత్సా నిపుణుల వ్యక్తిగత వివరాలను మరియు వారు చికిత్సను అందచేసి అద్భుతమైన ఫలితాలను పొందిన అనేక రోగ చరిత్రలను ఈ సంచికలో పాలుపంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. కేరళలో మొత్తం 106 చికిత్సా నిపుణులు ఉన్నారు. కేరళకు చెందిన అనేక చికిత్సా నిపుణులు వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలు మరియు పేదరికం వ్యాపించియున్న ఇతర ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తున్నారు. తమ ఇళ్లల్లో రోగులను చూడడమే కాకుండా ఆరోగ్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా గత ఏడు సంవత్సరాలలో ఐదు లక్షల రోగులకు వైబ్రో చికిత్సను అందజేశారు. వారి సేవ ఎంతో ప్రశంసనీయమైనది. అంతేకాకుండా, కేరళ చికిత్సా నిపుణులు 108CC పెట్టెలను సేకరించడమే కాకుండా వాటిని సమీకరించటం కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇది కంటికి కనిపించే దానికి కంటే ఎక్కువ పని. ప్రతి యొక్క సీసా ఐదు వివిధ భాగములను జాగ్రత్తగా సమకూర్చి తయారుచేయబడింది. ఇంత అద్భుతమైన సేవను అందచేసినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతను మరియు ప్రశంసలను తెలుపుకుంటున్నాము.
వైబ్రియానిక్స్ చికిత్స పై మేము ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ యొక్క నాణ్యతను పెంచేందుకు ఇటీవల ఒక కొత్త విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కొత్త పద్ధతిలో ప్రతియొక్క శిక్షణార్థి, ఒక అనుభవం గల చికిత్సా నిపుణులుని పర్యవేక్షణలో ఉంచబడుతారు. ఈ పద్ధతి శిక్షణార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. AVP లకు (సహాయక చికిత్సా నిపుణులు) తగిన శిక్షణ లభించేంత వరకు మరియు VP స్థాయికి చేరేంత వరకు మరియు వైబ్రియానిక్స్ లో పూర్తిగా స్థిరపడేంత వరకు ఈ కొత్త ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. "లవ్ ఆల్ సర్వ్ ఆల్" అన్న స్వామీ యొక్క సందేశం తరఫున పయణించేందుకు చేసే ప్రయత్నంలో ఇది ఒక్క చిన్న అడుగు.
చివరిగా మే/జూన్ వార్తాలేఖలో సూచించబడిన విధముగా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ సక్రమముగా నిర్వహించబడుతున్నది. 'అదనంగా' విభాగంలో మరి కొన్ని వివరాలను మీరు తెలుసుకోవచ్చు.
మునుపటి వార్తాలేఖల్లో చెప్పిన విధంగా ప్రభావాత్మక రీతిలో ఈ చికిత్సా విధానం పురోగతిని సాధిస్తోందని నేను వినయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. సాటి వారి యొక్క సంక్షేమాన్ని ఆశిస్తూ ఆనందంతో తమ సమయాన్ని మరియు శక్తిని అందిస్తున్న చికిత్సా నిపుణులందరికి నా హృదయపూర్వక అభినందనములను మరియు ప్రశంసలను అందజేస్తున్నాను.
ప్రేమపూర్వకంగా సాయి సేవలో
డా.జే.కే.అగర్వాల్