ప్రశ్న జవాబులు
Vol 7 సంచిక 3
May/June 2016
1. ప్రశ్న: కొన్ని సందర్భాలలో పూర్తిగా నయమైన దీర్ఘకాలిక వ్యాధి కొంత కాలం తర్వాత తిరిగి వస్తోంది. దీనికి కారణం ఏమిటి?
జవాబు: మన జీవన శైలి లేదా జీవిత మార్గం పై అవగాహన కలగడానికి, ఒక వ్యాధి ఏ విధంగా ఒక గొప్ప అవకాశాన్ని మనకి అందచేస్తుందన్న పరంగా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. వ్యాధి అనేది, దాని ద్వారా కలిగిన నొప్పి లేదా అసౌకర్యం పై మన దృష్టిని మళ్ళించే ఆవశ్యకతను మరియు మన జీవనశైలిలో పరివర్తన తీసుకువచ్చే ఆవశ్యకతను చూపించే ఒక ముఖ్యమైన సూచకం. జీవనశైలియంటే మన వైఖిరి, దుర్గుణాలు, ఆహారపు అలవాట్లు, పంచేంద్రియాల ద్వారా తీసుకొనే ఆహరం, వ్యాయామం, ఆలోచించే విధానం మొదలైనవి.
వైబ్రేషన్ల ద్వారా మాత్రమే రోగులకు చికిత్సంధించడం దీర్ఘకాల /శాశ్వతమైన పరిష్కారం కాదు. వైబ్రియానిక్స్ ఒక పూర్ణరూపాత్మకమైన చికిత్సా విధానం కనుక, వ్యాధి యొక్క మూలకారణాన్ని కనుగొనే విధంగా, శరీరం, మనస్సు మరియు ఆత్మ స్థాయిలను దృష్టిలో పెట్టుకొని, చికిత్సా నిపుణులు రోగులకు ఉత్తమమైన యోచనలు/సలహాలు చెప్పటం/చికిత్సందచేయడం వివేకముగల పద్ధతి. శాశ్వతమైన స్వస్థతను సమకూర్చే ఆరోగ్యకరమైన జీవన శైలిను పాటించడానికి, రోగి తరఫు నుండి జాగరూకగల లేదా చేతనముగల ప్రయత్నం అవసరం. ఈ దృష్టికోణంలో చికిత్సా నిపుణులు రోగుల జీవన విధానాలలో మరియు రోజువారి అలవాట్లలో పరివర్తన తీసుకు వచ్చే ఆదర్శ వ్యక్తులుగా ఉండవచ్చు. వ్యాధిని, మనలో పరివర్తన తీసుకురావడానికి దైవం యొక్క అనుగ్రహంగా భావించాలి.
________________________________________
2. ప్రశ్న: చికిత్సా నిపుణులుగా మేము మా కోసం తయారు చేసుకొనే వైబ్రో మందులు ఎల్లప్పుడు ఎందుకు పనిచేయవు?
జవాబు: రోగులకు ఉపశమనాన్ని అందచేసిన మిశ్రమాలు అదే సమస్యకు ఉపయోగించినప్పుడు కొంత మంది చికిత్సా నిపుణుల పై ప్రభావం చూపక పోవడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో కొన్ని:
- వేగంగా కోలుకోవాలన్న ఆందోళన కారణంగా చికిత్సా నిపుణులకు ఫలితాల పై ఎక్కువ ఆశక్తి ఉండవచ్చు. దీని కారణంగా సంపూర్ణ అర్పనా భావం ఉండకపోవచ్చు.
- సంప్రదింపు సమయంలో, రోగికి మందును ఇవ్వడానికి ముందుగా, రోగి సంబంధిత సమాచారాలను చికిత్సా నిపుణులు నిష్పాక్షికంగా రాసుకోవడం జరుగుతుంది. అయితే, తన కోసం మందులను తీసుకొనే సమయంలో, తన రోగానికి సంభందించిన సమాచారాలను విపులముగా రాసుకోక పోవచ్చు. దీని కారణంగా తన రోగం యొక్క మూలకారణం తెలుసుకొనే అవకాశం ఉండదు.
- రోగులు చికిత్సా నిపుణులను తమ వైద్యులుగా భావించి, చికిత్సా నిపుణులు తమకిచ్చే సూచనలను నమ్మకముగా పాటిస్తారు. అయితే ఒక చికిత్సా నిపుణుడు తీసుకోవలసిన జాగ్రతలను పాటించకపోవచ్చు మరియు తగిన మోతాదులో మందును తీసుకోకపోవచ్చు.
- స్వస్థతను సమకూర్చడానికి కావలసిన నిజమైన మందు మొదటి ప్రశ్న యొక్క జవాబులో మీకు లభిస్తుంది.
________________________________________
3. ప్రశ్న: వైబ్రో చికిత్స పై విశ్వాసం లేని రోగికి మందును ఇవ్వవచ్చా?
జవాబు: వైబ్రియానిక్స్ చికిత్స పై విశ్వాసం లేని ఒక వ్యక్తి మీ వద్దకు మందు కొరకు వస్తే కనుక, ఆ వ్యక్తికి మీరు మందును ప్రేమతో ఇవ్వాలి. అయితే, మందును తీసుకోమని, ఆ రోగిని ఒప్పించే ప్రయత్నం లేదా బలవంత పెట్టడం చేయరాదు. ముఖ్యంగా, రోగికి వైబ్రో చికిత్సను స్వీకరించడానికి లేదా నిరాకరించడానికి స్వేచ్చనివ్వాలి. రోగికి, చికిత్సా నిపుణుడిగా మీ పై పూర్తి విశ్వాసం ఉన్నంతవరకు మీ రోగికి, మీరిచ్చే మందుకి మధ్యలో అడ్డంకులేవి ఉండవు.
________________________________________
4. ప్రశ్న: వైబ్రో మందులు నీటిలో మరింత ప్రభావ వంతంగా ఉంటాయని అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే, ప్రస్తుతమున్న రోగులు ఈ కొత్త మార్పుకు నిరోధకంగా ఉంటున్నారు. మేము ఏమి చేయాలి?
జవాబు: మందులను గోలీల రూపంలో తీసుకోవడానికి అలవాటు పడిన రోగులకు నీటిలో కలిపి తీసుకోమని చెప్పడం కంటే కొత్తగా వచ్చే రోగులకు చెప్పడం చాలా సులభం (ఇది ఖచ్చితంగా ప్రతియొక్క రోగి విషయంలోనూ చేయాలి). ప్రస్తుతపు రోగులకు నీటిలో తీసుకోవడం కారణంగా మందు యొక్క సామర్ధ్యత పెరుగుతుందని తెలియచేయాలి. అయితే నీటిలో తీసుకోవడానికి సిద్ధంగా లేన రోగులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేయరాదు. ఇది రోగిలో ప్రతికూలమైన భావన కలగడానికి దారితీస్తుంది.
________________________________________
5. ప్రశ్న: ప్రక్షాళన మందును (క్లీన్సింగ్ రెమెడీ) ప్రతిరోజు పది నిమిషాలకు ఒకటి చప్పున రెండు గంటలు తీసుకోవచ్చా?
జవాబు: తీసుకోరాదు. ఎందుకంటే ప్రక్షాళన మందు, తీవ్ర తీసివేత (పుల్ అవుట్) ప్రక్రియను కలిగించే అవకాశముంది. అందువల్ల, సూచించబడిన విధముగా TDS మోతాదులో తీసుకోవడం మంచిది.
________________________________________
6. ప్రశ్న: ఎప్పుడైనా SRHVP ద్వారా ప్రతికూలమైన వైబ్రేషన్లను ఉత్పత్తి చేయవచ్చా?
జవాబు: లేదు. SRHVP ఎప్పుడు ప్రతికూలమైన వైబ్రేషన్లను ఉత్పత్తి చేయదు. అయితే ఇదే నమూనాలో ఉన్న ఇతర పరికరాల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. స్వామీ ఒక ఇంటర్వ్యు లో SRHVP దివ్యమైన వైబ్రేషన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని ధ్రువీకరణ చేసి చేప్పారు.
________________________________________
7. ప్రశ్న: మనం ఎప్పుడైనా SRHVP డయల్ను లాక్ చేయాలా?
జవాబు: డయల్ ను ఎప్పుడు లాక్ చేయరాదు. ప్రయాణం చేసే సమయంలో కూడా లాక్ చేసే అవసరం లేదు.
________________________________________
8. ప్రశ్న: స్వస్థతను ఇచ్చే వైబ్రేషన్లను నిరంతరంగా ప్రసరణ (బ్రాడ్ కాస్టింగ్)చేసే సమయంలో SRHVP యంత్రమును ఒక బట్టతోనో లేక ఒక ప్లాస్టిక్ కాగితంతో కప్పవచ్చా?
జవాబు: అవును, కప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా యంత్రంలోనున్న వెల్స్ లో దుమ్ము చేరకుండా రక్షించవచ్చు.
________________________________________
9. ప్రశ్న: మీకు తెలియకుండానే మీరు మీ రోగి యొక్క సమస్యలను తీసుకొనే అవకాశం ఉందా?
జవాబు: అవును, అవకాశముంది. కొందఱు చికిత్సా నిపుణులు ఇటువంటి అనుభవాలను మాకు తెలియచేసారు. ఒక రోగికి చికిత్సనంధించే సమయంలో, కర్త మీరు కాదన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా రోగులకు చికిత్సనిచ్చేది మీరు కాదు. ప్రేమతో సేవ చేయాలని, దైవాన్ని లేదా మీ అంతరాత్మను ప్రార్థించండి. సంపూర్ణ శరణాగతి భావంతో మీరు సేవ చేసినప్పుడు, రోగుల సమస్యల యొక్క ప్రభావం మీపై పడదు. దైవ ప్రార్థన మరియు శరణాగతి కారణంగా మీరు పూర్తిగా రక్షించబడతారు.