వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 5 సంచిక 5
September/October 2014
"శరీరము ఒక తాత్కాలిక నివాసం. ఇది అన్ని రకాల వ్యాధులు, గాయాలకు గురి అవుతూనే ఉంటుంది. అయితే ఈ శరీరము మనలను సంసారమనే సాగరాన్ని దాటించే ఒక చక్కని నావ వంటిది. ఈ నావను మంచి స్థితిలో మరియు ప్రయోజనకారిగా ఉంచాలి. మన శరీర సంరక్షణకు అవసరమైన దానికన్నా ఎక్కువగా మన దృష్టిని దేహం వైపు మరల్చ కూడదు. ఇది ఇతరుల భారాన్ని తగ్గించడానికి ఉపయోగించాలి కానీ మనకు మనం భారం కాకూడదు. ఈ దేహాన్ని ఇతరల సేవకు ఉపయోగించుకోవాలి కానీ వారి నుండి సేవలను పుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు ”.
…శ్రీ సత్యసాయిబాబా, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి, ఎల్లప్పుడు సహాయం చేయండి, ఎవ్వరిని బాధపెట్టకండి, సత్యసాయిబాబా 81 రోజు 2005 జ్ఞాపకార్థ పుస్తకం నుండి గ్రహింప బడింది.
“సమాజంలో మంచి పేరు సంపాదించండి. సేవేమీ ధ్యేయం కావాలి. సేవ చాలా ముఖ్యమైనది. ఇది వినయాన్ని ప్రోత్సహించడానికి మరియు మానవ జాతి యొక్క ఏకత్వాన్ని మరింత పెంపొందించడానికి సహాయపడుతుంది. ఏకత్వాన్ని ప్రోత్సహించడమే మీ జీవిత లక్ష్యం కావాలి”.
…శ్రీ సత్యసాయిబాబా… అందర్నీ ప్రేమించండి, అందరి కీ సేవ చేయండి, ఎల్లప్పుడూ సహాయం చేయండి, ఎవరినీ బాధించ కండి,.సత్య సాయి బాబా వారి 81 పుట్టిన రోజు జ్ఞాపకార్థం 2005 లో విడుదల చేసి న పుస్తకంనుండి.