వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 5 సంచిక 2
March/April 2014
‘క్యాన్సర్’ వచ్చుటకు ప్రధాన కారణం శుద్ధపరచిన చక్కెర, ఏమనగా చక్కెరను శుద్ధి చేసేటప్పుడు చాలా రసాయనాలు చేర్చెదరు. వానిలో బోన్ చార్(కాలిన బొగ్గువంటి ఎముక) కూడా వొకటి. మీరు తినేటప్పుడు, శరీరంలో యిది ఏ భాగంలోనైనా యిరుక్కోవచ్చు, సమస్యలను సృష్టించవచ్చు. చక్కెరవాడుక మానేస్తే, మీరు క్యాన్సర్ ను నిర్మూలించవచ్చు. చక్కెర కాల్షియం నష్టాలను పెంపొందించి, మూత్రమార్గంలో కాల్షియం ఆక్సాలెట్ (calcium oxalate) రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర బదులుగా బెల్లం వాడుట ఆరోగ్యరీత్యా మంచిది.
....సత్య సాయిబాబా ప్రసంగం, జనవరి 3, 1994
ప్రార్థన మతంయొక్క శ్వాస; ఏలనన మనిషిని, దైవానికి దగ్గరగా చేర్చి, ఒకరితో నొకరిని దగ్గరగా ఉంచుతుంది. ధ్యానం అనగా కృష్ణుని వేణువువంటి ఆధ్యాత్మికమైన గీతాన్ని, మానసికమైన చెవులతో విని, ఆ శ్రావ్యతను ఆస్వాదించేందుకు తోడ్పడే ప్రక్రియ. ప్రతిరోజు మీరు వ్యాయామం చేయుట, బలవర్ధకమైన టానిక్స్ తీసుకొనుట, ఆహారంలోని కేలరీలు, విటమిన్లు లెక్కించుట, ఆహారపు పోషక విలువను దృష్టిలో ఉంచుకొని భుజించుట ఎంత ముఖ్యమైనదో - మనస్సులో చెలరేగే భావాలను గమనించి, వ్యతిరేకభావాలను అనగా దురాశ, అసూయ, ద్వేషం, అహంకారం, గర్వం, మాలిన్యం వంటివి వెంటనే నిర్మూలించుట కూడా అంతే ముఖ్యం.
దైవిక ఆలోచనలతో, సేవకు సంబంధించిన మంచిపనులనే భోజనం చేస్తూ, ప్రేమరసం త్రాగాలి, తద్వారా మనసు ప్రక్షాళనమై, దైవస్వభావం బాగా జీర్ణం కావచ్చు. అప్పుడు, మీరు మానసిక ఆరోగ్యం, ఆనందం మరియు పరిపూర్ణతతో ప్రకాశిస్తారు.
… సత్య సాయిబాబా ప్రసంగం, అక్టోబర్ 6, 1970