డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 6 సంచిక 2
March/April 2015
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
గత 21 సంవత్సరాలుగా సాయివైబ్రియోనిక్స్ అంచనాలకు మించి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఎంతోమంది తమ తమ మానసిక శారీరక ఆరోగ్య సమస్యల నిమిత్తం ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు మరలుతూ ఉండగా మన సాయివైబ్రియోనిక్స్ అందరకీ అందుబాటులోనికి వస్తోంది. గత సంవత్సరం ముఖ్యంగా మన ప్రాక్టీషనర్లు ఇచ్చిన సమాచారము వల్ల, అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మన వెబ్సైటులు, ఇంకా సాయివైబ్రియోనిక్స్ గురించి ప్రాధమిక సమాచారము అందించే వీడియో Vibrionics, Sai Ram Healing vibrations. What is it?, ఇంకా Souljourns interviews, Vibrionics website మరియు ఆన్లైన్ లో లభించే Newsletter. వలన సాయివైబ్రియోనిక్స్ గురించి వివరాలు తెలుసుకోవాలనే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కనుక సాయివైబ్రియోనిక్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు మీరు కూడా గమనించి ఉంటారు. ఐతే తరుచుగా మన మదిలో మెదిలే ఒక ప్రశ్న ఏమిటంటే అలోపతి థెరపీ కి సాయివైబ్రియోనిక్స్ థెరపీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనం ప్రతీసారి సాయివైబ్రియోనిక్స్ అలోపతి తో ఏకీభవిస్తుంది అని చెపుతూ వచ్చాం. సాయివైబ్రియోనిక్స్ రెమిడి తీసుకోవడం వలన అలోపతి మందులు ఆపాల్సిన అవసరం లేదని కూడా చెపుతూ వచ్చాం. ముఖ్యంగా మధుమేహము, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ప్రమాదకరమైన వ్యాధుల విషయంలో అలోపతి మందులు అసలు ఆపకూడదు. ఏ పేషంటైనా వైద్యుని పర్యవేక్షణలో ఉన్నప్పుడు తను తీసుకునే మందుల విషయంలో మార్పులు చేర్పులకు వారి సలహా తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయం ప్రాక్టీషనర్లందరూ అవగాహన చేసుకోవాలి.
ఇదే సమయంలో వైబ్రియోనిక్స్ చికిత్సా పరంగా ఎంతో ప్రయోజనకారి. ఒకవేళ పేషంటుకు మందులు అందుబాటులో లేకపోయినా లేక పేషంటు ప్రత్యమ్నాయ మార్గాన్ని ప్రయత్నిoచాలనుకున్నా నిరభ్యంతరంగా వైబ్రో విధానము ఎంతో ఫలవంతమైనది గా వారికీ సూచించవచ్చు. సాయి వైబ్రియోనిక్స్ పేషంటుకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించిన దివ్యమైన విధానమని, ఇతరత్రా వైద్య విధానాల వలె ఇది ఎంతమాత్రం హానికరమైనది కాదు అని కూడా మనం నమ్మకం కలిగించాలి.
ప్రస్తుతం మనం మన వైబ్రియోనిక్స్ థెరపీ వైద్య విధానానికి అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలిపేటందుకు కావలసిన సాక్ష్యాలు సేకరించే దిశలో ఉపక్రమిస్తున్నాము. దీని నిమిత్తం నేను ప్రాక్టీషనర్లను కోరేదేమిటంటే వైబ్రో రెమిడి లద్వారా పేషంటు లో మెరుగుదల కనిపిస్తోంది అని చెప్పడానికి పేషంటుకు చెందిన రిపోర్టులన్నీ అనగా ఎక్స్ రే, స్కానింగ్, రక్త పరీక్షలు ఇవన్నీ సేకరించవలసిందిగా సూచన. దీని ద్వారా పేషంటు లో వైబ్రో మందుల ద్వారా వారి జబ్బులు తగ్గుతున్నాయనే నమ్మకాన్ని పెంపొందించవచ్చు. పేషంటుల నుండి లేదా వారి డాక్టర్ల నుండి సేకరించిన ఆధారాలు కూడా ఈ సందర్భంలో ఎంతో ఉపకరిస్తాయి. ప్రస్తుతం మధుమేహం మరియు గుండె జబ్బుల విషయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాము. ముందు ముందు ఇతర వ్యాదుల విషయంలో కూడా దీనిని విస్తరిస్తాము. కనుక మధుమేహం మరియు గుండె జబ్బులకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా [email protected] కు పంపండి. ఇలా పంపిన ప్రతీ రిపోర్టును జాగ్రత్తగా పరిశీలించి మీకు సమాధానం పంపుతాను.
నాయొక్క మరో విన్నపం ఏమిటంటే ప్రాక్టీషనర్లు తమ తమ ప్రాంతాలలో వైబ్రోనిక్స్ గురించి సమాచారాన్ని విస్తృత పరచవలసిందిగా సూచన. ఐతే వైబ్రో గురించి మీరేమైనా ఉపన్యాసం ఇవ్వదలిచినా లేక కరపత్రం పంపిణి చేయదలిచినా మీ ప్రాంతపు కోఆర్డినేటర్ అనుమతి తీసుకోగలరు. ముఖ్యంగా ఈ థెరపీ గురించి అతిశయోక్తులు లేదా వక్రీకరించిన విషయాలు ప్రచారం చేయవద్దని మనవి. అంతేకాక AVP స్థాయిలో ఉన్నవారు ఇటువంటి ప్రయత్నమేమీ చేయవద్దని సూచన.
రాబోయే నెల ఏప్రిల్ 24 వ తేదిన స్వామివారి ఆరాధనోత్సవాలు జరపబడనున్నాయి. మనమంతా కూడా ఈ వేడుకలను మాములుగా జరుపుకునే దానికి విభిన్నంగా జరుపుకుందాం. ఈ సందర్భంగా మనమంతా ప్రేమ సేవద్వారా మన వైబ్రో వృత్తికి పునరంకితమవుదాము. వైబ్రో ప్రాక్టీషనర్ లుగా ఇదే మనం బాబాకు ఇవ్వగలిగే కృతజ్ఞతాభివందనము. మనం ఎంత పని వత్తిడిలో ఉన్నా మన వద్దకు వచ్చే పేషంట్లను ప్రేమతో ఆహ్వానిస్తూ మాటల్లో మృదుత్వాన్ని చూపుల్లో అనురాగాన్ని నింపుకొని ఆనందం అందించి పంపుదాం. మన ప్రేమ విశ్వాసాల పైన ఆధారపడే వైబ్రియోనిక్స్ శక్తివంతం ఔతుంది.
సాయి సేవలో మీ
జిత్ కె.అగ్గర్వాల్