Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 3 సంచిక 5
September/October 2012


ప్రియమైన అభ్యాసకులకు,

భారతదేశం అంతటా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్న మన సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకులు ఇద్దరు ఇటీవల హిమాలయాలలో ఈ వేసవిలో నిర్వహించిన శిబిరమునకు సంబంధించిన అద్భుతమైన నివేదికలను పంపారు. ఇద్దరు విదేశీయులు ఉచిత ఔషధం ఇస్తున్నారన్న వార్తలు హిమాచల్ ప్రదేశ్ లోని లోయలలో మారుమ్రోగే సరికి అనేకమంది రోగులు ఐదారు గంటలు బస్సులో ప్రయాణించి ఆపై మరో రెండు గంటలు నడిచి ఈ అద్భుతాలనుచేసే ఔషధం పొందడం కోసం క్యాంపుకు చేరుకోవడం జరిగింది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వారి యొక్క కండరాల నొప్పులు, ఆర్థరైటిస్, గ్యాస్ సమస్యలు లేదా కడుపులో పుండ్లు, పంటి నొప్పి మొదలగునవి ఈ మందులతో అనేక సందర్భాలలో ఒక్క రాత్రికే నయమవుతున్నాయని విని ఎంతో సంతోషం పొందారు. వారు ఈ వార్తలను వారి బంధువులు మరియు స్నేహితులకు పంపగా ఎటువంటి ప్రకటనలు లేకుండానే మణికరన్, బర్షిని, కాల్గా, కీర్ గంగ మరియు పురానా కాంగ్రా అనే ప్రాంతాల్లో అభ్యాసకులు నిర్వహించిన మెడికల్ క్యాంపులకు ఈ ప్రాంతాల చుట్టుపక్కల వారే కాకుండా ఇంకా ఎంతో దూరంగా ఉన్నటువంటి మనాలి, మండి, బుంతర్ మరియు కులు ప్రాంతాల నుండి కూడా అనేకమంది ఈ దివ్య ఔషధాలు కోసం వచ్చారు.

స్వామి దయతో అభ్యాసకులు 412 మంది రోగులకు చికిత్స చేశారు, మరియు అనేక అద్భుత నివారణ లీలలు కూడా చూశారు. తీవ్రమైన ఒంటి నొప్పులు (బోలు ఎముకల వ్యాధి) జ్వరము, కాలేయలోపం, రక్తహీనత వ్యాధులతో పాటు భర్త మరణం కారణంగా ఎంతో దుఃఖిస్తూ ఒక వృద్ధ మహిళ మంచం పట్టింది. ఆమెకు చికిత్స  ప్రారంభించిన మూడు రోజుల తర్వాత 70% మెరుగయ్యి తన ఇంటి చుట్టూ స్వయంగా నడవ కలగడమే కాక జ్వరం కూడా తగ్గిపోవడంతో ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు అంతా ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీరోజు అధిక భారాన్ని మోసే అనేకమంది పోర్టర్లు వారి శరీర నొప్పులు ఒక్క రాత్రిలోనే మాయమయ్యే సరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అభ్యాసకులు స్వామి యొక్క అపారమైన ప్రేమ మరియు కరుణకు విస్మయమవుతూ తమకు ఈఅద్భుతమైన అవకాశం కల్పించినందుకు స్వామి దివ్య లీలలకు సాక్ష్యంగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మేము ఈ సెప్టెంబరులో ఇటలీలోని వెనిస్ లో సీనియర్ VP ల కోసం వర్క్ షాప్ నిర్వహించాము. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన ఈ  చక్కని బృందము కష్టపడి పనిచేసారు. వర్క్ షాప్ కు రావడానికి ముందుగానే SVP కోర్సు మొత్తం క్షుణ్ణంగా చదివారు. వీరి యొక్క అంకితభావం వలననే ఈ శిక్షణా శిబిరం మూడు రోజుల్లోనే పూర్తి చేయడం సాధ్యమైంది. అభ్యర్థులంతా వారికోసం పెట్టినటువంటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం సాయిరాం పోటెన్ టైజర్ తీసుకున్నారు. ఈ వర్క్ షాప్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన మా ఇటాలియన్ కోఆర్డినేటర్ 2494 కు ఈ ఘనత  దక్కుతుంది. ఇటలీలో వీరు అభ్యర్థుల కోసం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సమావేశాలు అభ్యాసకులు తమ జ్ఞానాన్ని అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు తమ అభిరుచిని సజీవంగా ఉంచుకునేందుకు ఇవి ఎంతో దోహద పడుతున్నాయి!

అటువంటి సమావేశాలను, పునశ్చరణ తరగతులను ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని, కోఆర్డినేటర్లు మరియు క్రియాశీల అభ్యాసకులను గట్టిగా కోరుతున్నాను. ఇవి అభ్యాసకులకు మరింత ఉత్తేజాన్ని కలిగించి మనం ఎంచుకున్న సేవా మార్గాన్ని ఉత్సాహంతో ప్రేమతో చేయడం ద్వారా మన ప్రభువు బాబా వారికి దగ్గరవడానికి ప్రేరేపిస్తాయి.

ప్రేమ పూర్వక సాయి సేవలో మీ

జిత్ కె అగర్వాల్

మనందరికీ తెలిసిన విధంగా అనారోగ్యానికి చికిత్స చేయడంలోనూ, ఆరోగ్యాన్ని కలిగించడంలో ఆహారం యొక్క పాత్ర కీలకమైనది. నేను ఇటీవల 3 ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన వెబ్సైట్లను చూశాను అవి:

1. http://www.acidalkalinediet.com/Alkaline-Foods-Chart.htm#.UC31BjICCdM.gmail

ఆమ్ల మరియు ఆల్కలీన్ ఆహారాల మధ్య తేడాను గుర్తించడానికి ఈ సైట్ ప్రత్యేకించి అద్భుతమైనది.

2. http://www.thefutureofhealthnow.com/defeating-ms-with-the-paleo-diet-drug-free  లేదా

   http://articles.mercola.com/sites/articles/archive/2011/12/23/overcoming-multiple-sclerosis-through-diet.aspx 

చైతన్యాన్ని, జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞ నైపుణ్యాలను కబళించిన మల్టిపుల్ స్కెలోరోసిస్ ను ఓడించిన వైద్యురాలి నమ్మశక్యం కాని వీడియో ఇది. జీవించడం లేక మరణించడం అనే దశలో తనపై తాను ప్రయోగాలు నిర్వహిస్తూ ఆహారాన్ని నాటకీయంగా మార్చడం ద్వారా ఆమె విజయం సాధించగలిగింది. ఈ వీడియో చూడటం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందవచ్చు అని నేను నమ్ముతున్నాను ఇది నిజంగా జీవితాన్ని మార్చే కథ.

3.http://www.bottomlinepublications.com/content/article/health-a-healing/how-a-harvard-brain-specialist-keeps-her-own-brain-healthy-simple-steps-anyone-can-take?utm_campaign=_%20BQR0UVWB8to60A

జ్ఞాపకశక్తి మరియు ఇతర మానసిక సామర్థ్యాలు వయసు పెరిగే కొద్దీ అనివార్యంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇక దీనిని నమ్మవలసిన అవసరం లేదు. మెదడుకు కొత్త న్యూరాన్లు ఏర్పరచు కోవడానికి మరియు జీవితమంతా కొత్త న్యూరోమార్గాలను సృష్టించగల సామర్థ్యం ఉందని ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఈ వ్యాసంలో అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన మెదడు మరియు జ్ఞాపకశక్తి నిపుణురాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఆమె ఏం చేస్తున్నారు అనే సమాచారం అందించబడింది. ఆసక్తికరమైన ఇటువంటి విషయాలను మీరంతా చదవడం ప్రయోజనకరం.