Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 6 సంచిక 2
March/April 2015


లీసెస్టర్ క్యాంపు పైన నివేదిక,  1st ఫిబ్రవరి  2015 02897...యుకె

యుకె లో ఉన్న ప్రాక్టీ షనర్ ల కోసం లీసెస్టర్ లో ఏర్పాటు చేసిన మొదటి క్యాంపు ఇదే. మరొకటి పైప్ లైన్ లో ఈ  సంవత్సరంలో ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము.  ఈ రోజు బాగా చలిగా ఉండడంతో 1.30 కి ప్రారంభము కావలసి ఉండగా 1 గంట నుండి  సభికులు రావడం ప్రారంభించారు. స్థానిక సాయి సెంటర్ నుండి వారి కోఆర్డినేటర్ సూచన మేరకు ఎందరో వాలంటీర్లు కూడా సేవ చేసే ఉద్దేశ్యంతో ముందే రావడం జరిగింది.  మేము మొత్తం ఆరుగురు ప్రాక్టీ షనర్లo కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు 108 కొమ్బో పుస్తకంలో ఉన్న ప్రార్ధన చేసి స్వామిని మా ప్రతీ అడుగులోనూ సహాయం అందించమని ప్రార్ధిస్తూ కార్యక్రమం ప్రారంభించాము.

కార్యక్రమము ప్రారంభించడంలో 20 నిముషాలు ఆలశ్యం ఐనప్పటికీ కార్యక్రమ పరిచయానికి చెందిన వీడియో మొదలు కాగానే ప్రేక్షకుల దృష్టంతా దానిపైన లగ్నమయ్యింది. వీడియో ప్రదర్శన పూర్తి కాగానే అలోపతిక్ డాక్టర్ మరియు వైబ్రో చికిత్సా నిపుణురాలు  02802...యుకె వైబ్రియోనిక్స్ ఎలా పనిచేస్తుంది, చెడు ఆలోచనలు ఆరోగ్యము పైన ఎలా ప్రభావము చూపుతాయి అనే విషయాల పైన అద్భుతమైన ప్రసంగం చేసారు. అనంతరం వీరు ప్రేక్షకులనుండి ఒకరి సహాయం తీసుకోని కినిసియలాజీ (శరీర చలనమునకు చెందిన శాస్త్రము) టెక్నిక్ యొక్క ఉపయోగముల గురించి తెలియ జేసారు. అనంతరం వైబ్రియోనిక్స్ శరీరము పైన పాజిటివ్ ఫలితాలు కలిగించేలా ఎలా పని చేస్తుంది అనేది కూడా వివరించారు. అనంతరం ఇద్దరు ప్రాక్టీ షనర్ లు వైబ్రియోనిక్స్ పైన తమ అనుభవాలను క్రోడీకరిస్తూ ప్రసంగించారు.  ఒక ప్రాక్టీ షనర్ తను అత్యంత క్లిష్టమైన మోకాలి నొప్పి నుండి వైబ్రో రెమిడి ద్వారా ఎలా కోలుకోవడం జరిగిందో వివరించారు..  మరొక ప్రాక్టీ షనర్ తన  పేషంటు జాయింట్ పెయిన్స్ నుండి వైబ్రో రెమిడి తో అతి తక్కువ కాలంలో 5 రోజుల్లోనే ఎలా నయం చేయబడిందో వివరించారు.  ఇప్పుడు తన పేషంటు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉన్నారని ప్రాక్టీషనర్ వివరించారు.

T

అనంతరం ప్రశ్నలకు అవకాశం ఇవ్వడంతో సభికులు అడిగిన అనేక  ప్రశ్నలకు ప్రాక్టీషనర్  02802...యుకె మరియు ఇతర ప్రాక్టీ షనర్ లు సమాధానము చెప్పారు.  పేషంట్లు రెమిడిలను ఎలా తీసుకోవాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపడం జరిగింది. దీని వలన ప్రాక్టీ షనర్ లకు కన్సల్టేషన్ విషయంలో ఎంతో సమయం ఆదా అయ్యింది.

పరిచయ కార్యక్రమం పూర్తికాగానే కన్సల్టేషన్  ప్రారంభమవడంతో పేషంట్లు క్రమేణా పెరగసాగారు. కన్సల్టేషన్ విభాగము మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడం వలన గ్రౌండ్ ఫ్లోర్ లో పేషంట్లు వేచి ఉండడానికి, మరియు వారి రిఫ్రెష్మెంట్ కోసం ఏర్పాట్లు చేయబడినాయి. ఇలా చేయడం వలన కార్యక్రమ నిర్వహణమంతటా  నిశబ్ద వాతావరణం నెలకొంది. ప్రాక్టీషనర్ లు మధుమేహము, కీళ్ళనొప్పులు, జలుబు, ఫ్లూ, వంటి సాధారణ వ్యాదులనుండి క్లిష్టమైన గుండెజబ్బులు, వంటి వరకూ వ్యాధులకు రెమిడి లు ఇచ్చారు. BP అనేది రోగులలో సాధారణమై పోయింది. మా బృందమంతా పేషంట్ లకు నాలుగవ వారం తిరిగి కలుసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా సూచించాము. అంతేకాక ఏవైనా రెమిడి లు మార్చవలసి వస్తే మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని భావించాము.  అంతేకాక వీరిలో ఎవరివద్ద నుండైనా ఫోన్ గానీ ప్రత్యుత్తరం గానీ రాకపోయినా వారిని ఫాలో అప్ చేయాలనీ కూడా నిర్ణయించుకున్నాము.

మేము మొత్తంగా 75 మంది పేషంట్లను చూసాము. ఈ సంఖ్య మాకు చాలా తృప్తి నిచ్చింది ఎందుకంటే మేము ఉన్నది ఆరు గురం ప్రాక్టీషనర్ లము కనుక ఇది మాకు ప్రోత్సాహదాయకమే. మాలో ప్రతీ ఒక్కరమూ కార్యక్రమము జరిగిన తీరు పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే పేషంట్ల నుండి, వారిని తీసుకువచ్చిన వారినుండి, సహాయకులనుండి, కావలసినంత ఫీడ్బ్యాక్ లభించింది.  మా చివరి కన్సల్టేషన్  సాయంత్రం 6 గంటలకు పూర్తికావడంతో క్యాంపు ముగించి స్వామికి కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి మరలినాము.