Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 3 సంచిక 2
March 2012


ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ (వక్షోజ) క్యాన్సరు  IBC

 

అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ IBC  అనేది రొమ్ము క్యాన్సర్ యొక్క అసాధారణమైన రకమనీ దీనిలో రొమ్ము క్యాన్సర్ కణాలు రొమ్ము యొక్క చర్మం లోని శోషరస నాళాలను అడ్డుకుంటాయని పేర్కొన్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క ఒక రకమైన రొటీన్ క్యాన్సర్ స్క్రీనింగ్  పద్ధతుల ద్వారా ( ఉదాహరణ ఫీలింగ్ ఫర్ లంప్స్, మమ్మో గ్రామ్స్)  కొన్ని సార్లు తెలుసుకో లేము.

ఈ ప్రతిష్టంభన రొమ్ముయొక్క ఎరుపుదనం, వాపు మరియు వెచ్చ దనముగా మారడానికి కారణం కావచ్చు. రొమ్ము యొక్క చర్మం గులాబీ లేదా ఉదా లేదా గాయము ఏర్పడిన  మాదిరిగా కనిపించవచ్చు. మరియు ఈ చర్మము చీలికలు కలిగినట్లుగా లేదా నారింజ తొనవలే చర్మం (ప్రీ డి ఆరెంజ్ అని పిలుస్తారు) లాగా కనిపించవచ్చు. ఈ మార్పులు తరచూ వారాల వ్యవధిలోనే త్వరగా ఏర్పడతాయి. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్ యొక్క మరొక సంకేతం చేటి కింద కాలర్ బోన్ పైన లేదా రెండు ప్రదేశాల్లో శోషరస కణుపుల వాపు ఏర్పడుతుంది. తరచుగా కణితి ఉన్నట్టుగా కూడా తెలియని పరిస్థితి మరియు మమ్మోగ్రామ్ లో కూడా కనిపించకపోవచ్చు. ఇన్ఫ్లమేటరీ రొమ్ము కాన్సెర్ నిర్ధారణ బయాప్సి మరియు డాక్టరు యొక్క రోగనిర్ణయ తీర్పు ఫలితాల పై ఆధారపడి ఉంటుంది.

అమెరికాలోని మాయో క్లినిక్ ప్రకారం ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు :

* ఎరుపు ఉదా గులాబి లేదా గాయాల మాదిరిగా కనిపించే వక్షోజము   
* మృదువైన లేదా దృఢమైన మరియు విస్తరించిన వక్షోజము
* వక్షోజములలో వెచ్చని అనుభూతి
* వక్షోజము లో దురద
* నొప్పి
* నారింజ తొణ మాదిరిగా చీలిక లేదా మసకబారిన చర్మ నిర్మాణము   
* చర్మం మందంగా ఉన్న ప్రాంతాలు  

* భుజం కింద కాలర్ బోన్ పైన లేదా రెండింటి వద్ద విస్తరించిన శోషరస కణుపులు  

* చనుమొన చదునుగా కావడం లేదా లోపలికి కుంచించుకుపోవడం

* చనుమొనలపై వాపు లేదా కస్టర్డ్ చర్మం

* చనుమొన చుట్టూ చర్మం రంగులో మార్పు  

ఇటీవల కాలంలో ఈ IBC  వ్యాధి ఉదృతంగా విస్తరిస్తూ ఉండటం  చాలా ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది స్త్రీలకు వైద్య చికిత్స కోసం సమాయత్తం అయ్యేలోపే వ్యాధి లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయి. IBC గతంలో శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేసేవారు మరియు దాదాపు ప్రాణాంతకంగా భాబించేవారు, కానీ ఈ రోజుల్లో ఖీమోథెరపీ మరియు రేడియో థెరపీ వంటి చికిత్సలు IBC రోగులు మనుగడ సాధించే అవకాశాలు బాగా మెరుగుపరిచాయి....www.snopes.com

గమనిక: వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు ఈ రోగ నిర్ధారణ ఎదుర్కొంటున్న రోగికి సహాయపడటానికి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు భావోద్వేగ మద్దతు కోసం వైబ్రియో పుస్తకాలను చదవండి.

 

గృహము లోపల గాలిని శుభ్రపరిచే ఇంట్లో పెరిగే అందమైన మొక్కలు

గృహాలు మరియు కార్యాలయ భవనాలు శక్తిని ఆదా చేయడం కోసం మునుపెన్నడూ లేనంత కఠినంగా నిర్మాణం లేదా పునర్నిర్మాణము జరుగుతున్నాయి. కానీ ఇటువంటి వానిలో చెత్తను లేకుండా చేయడం అంటే క్రింద పరిచే కార్పెట్ మొదలు    ఫర్నిచర్ వరకు అనేక వస్తువుల ద్వారా విడుదలయ్యే బెంజీన్  మరియు ఫార్మాల్డిహైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు లేకుండా చేసుకోవాలి. ఇంట్లో మరియు  కార్యాలయాలలో ఉపయోగించే శుభ్రపరచడానికి ఉపయోగించే ఉత్పత్తులు అమ్మోనియా మరియు క్లోరినేటెడ్ ద్రావకాల వంటి రసాయనాలను విడుదల చేస్తాయని కూడా గమనించాలి.

ఇలాంటి రసాయనాల దీర్ఘకాలిక శ్వాస వల్ల తల నొప్పి, గొంతులో మంట, శ్వాసలో ఇబ్బంది అంతేకాక క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే 5 ఉత్పత్తులలో ఒకదానిగా ఈ గృహం లోపల గాలిని పేర్కొన్నారు.  శీతాకాలంలో ఈసమస్య మరింత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇళ్లలో మరియు కార్యాలయాల్లో ఎక్కువ సమయం తలుపులు మూసివేయబడి ఉండటం వలన ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

ఖరీదైన గాలి వడపోత వ్యవస్థ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. సాధారణ జాతీయ మొక్కలు  గృహం లోపల గాలిని ప్రమాదకరమైన రసాయనాలను ఫిల్టర్ చేయగలవని US నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కనుగొంది. మొక్కల ఆకులు కొన్ని సేంద్రియ సమ్మేళనాలను గ్రహిస్తాయి మరియు వాటిని నాశనం చేస్తాయి. అయితే మొక్కల మూలాల చుట్టూ నివసించే సూక్ష్మజీవులు రసాయనాలను తమకు మరియు తాము అంటిపెట్టుకొని ఉన్న మొక్కకూ ఆహారం మరియు శక్తి వనరుగా మారుస్తాయి.

కొన్ని ఇంట్లో పెరిగే మొక్కలు ఇతర రకాల మొక్కల కన్నా గాలి వడపోత విషయంలో ప్రభావవంతంగా ఉంటాయి. క్రింద ఇవ్వబడిన 10 మొక్కలు పెంచడానికి తేలిక మరియు గాలిని శుభ్రపరిచే గొప్ప వనరుగా ఉపయోగ పడుతున్నప్పటికీ  వాటిలో క్రింది నాలుగు మొక్కలు గాలిని శుభ్రపరచడంలో ప్రత్యేకించి ప్రభావవంతంగా ఉంటాయి:

1. అరెకాపామ్ (క్రైసలిడోకార్పస్ లుటీసెన్స్) దీనిని యెల్లో పామ్(పసుపు అరచెయ్యి) లేదా  బటర్ ఫ్లై  పామ్(సీతాకోకచిలుక అరచెయ్యి) అని కూడా అంటారు.  

2. లేడీ ఫామ్ (రాఫిస్ ఎక్సెల్సా) గృహం లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మొక్కలలో ఒకటి మరియు ఇది అనేక రకాల కీటకాలకు అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. 6 నుండి 12 అంగుళాల వెడల్పు గల రెమ్మలకు మెరిసే ఆకులతో కుడి ఉంటాయి.  

3. రబ్బరు మొక్క (ఫికస్ రోబస్టా) మందపాటి తోలు ముదురు ఆకుపచ్చ ఆకులు కలిగిన ఈ అందమైన మొక్క పరిమిత కాంతి మరియు చల్లని ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది మరియు గృహం లోపల గాలిలో నుండి విషరసాయనాలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ పరీక్షించిన వాటిలో ఫికస్ జాతికి చెందిన మొక్కలలో ఉత్తమమైనది.  

4. పీస్ (స్పాతి ఫైలమ్ sp)   అందమైన తెల్లని పువ్వులు ను ఉత్పత్తి చేస్తుంది. ఇంటి లోపల వికసించే అతి తక్కువ సంఖ్య గల మొక్కల్లో విశ్వసనీయమైనదిగా పరిగణింప బడుతుంది.  

క్రింది 6 మొక్కలు కూడా ఉపయోగపడతాయి:   

5. డ్రాసినాజానెట్ క్రెయిగ్ (డ్రాసినా డ్రెసిమెనిసిస్  “జానెట్ క్రెయిగ్ )  తెగులు నిరోధక ఆకులు కల ఈ మొక్క దశాబ్దాలుగా జీవించగలదు. పేలవమైన కాంతి గల ప్రాంతాలను ఇది తట్టుకుంటుంది కానీ    దాని పెరుగుదల మందగిస్తుంది. పొట్టి రకము లేదా కాంపాక్టాను ఇష్టపడేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇది  మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఐతే సాధారణ రకమైనట్లైతే    ఎక్కువ జాగ్రత్త అవసరం మరియు కత్తిరించకపోతే 10 అడుగుల వరకూ పెరుగుతుంది.   

6. ఇంగ్లీష్ వి (హైడెరా హెలిక్స్) దీనిని గ్రౌండ్ కవర్ అని పిలుస్తారు అయితే గృహంలో వేలాడుతున్న బుట్టలలో కూడా ఇది బాగా పెరుగుతుంది. ఇది విస్తృత శ్రేణి గృహ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది అయినప్పటికీ కొన్నిసార్లు  వసంతఋతువు వేసవిలో ఆరుబయట పెంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఐతే  ఇంగ్లీష్ ఐవి  అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు.

 హెచ్చరిక  :  ఇంగ్లీష్ ఐవి లో ఉండే రసాయనాలు    చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. లేదా తాకితే అనారోగ్యానికి కారణం అవుతాయి. వీటిని  పెంచేటప్పుడు చేతికి తొడుగులు ధరించండి మరియు పెంపుడు జంతువులు మరియు చిన్న పిల్లలకు దూరంగా ఉంచండి .

7.  గోల్డెన్ పోథోస్ (ఎపిప్రెమ్నమ్ ఆరెమ్) తక్కువ కాంతి లేదా కాంతి లేకపోవడాన్ని తట్టుకుంటుంది. కీటకాలకు చాలా నిరోధకతను కలిగి ఉంటుంది.  ఆకుపచ్చని గుండె ఆకారపు ఆకుల పైన బంగారు రంగు లేదా క్రీమ్ కలర్  చిలకరించినట్లుగా ఉండడాన్ని బట్టి గోల్డెన్ పోథోస్ అనే పేరు కలిగింది.  ఇది సాధారణంగా వేలాడుతూ ఉన్న బుట్టలో పెరుగుతుంది కానీ ఇది పాకుతూ కూడా పెరగగలదు.

8. కార్న్ ప్లాంట్ (డ్రాసీనా ఫ్రాగ్రెన్స్ “మస్సంగినా”)   దీనిని ఇలా ఎందుకు పిలుస్తారు అంటే దీని ఆకులు మొక్కజొన్న కాండాల మాదిరిగా కనిపిస్తాయి అంతేతప్ప ఇది మొక్కజొన్నను ఉత్పత్తి చేయదు.      ఇది ప్రకాశవంతమైన కాంతిని ఇష్టపడినప్పటికీ ఇది తక్కువ కాంతిని కూడా తట్టుకుంటుంది.   

9. సింగోనియమ్ (సింగోనియమ్ పోడో ఫైలమ్)    దృశ్యమానంగా బాణం ఆకారంలో ఉండే ఆకుపచ్చ- తెలుపు లేదా ఆకుపచ్చ-వెండి రంగు ఆకులను ఉత్పత్తి చేస్తుంది.

10. స్నేక్ ప్లాంట్ (సంసివీరియా ట్రిఫాసయటా)       ఈ జాబితాలోని ఇతర మొక్కల కంటే గృహం లోపల గాలిని శుభ్రపరచడంలో 50 శాతం తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కానీ ఇది చనిపోవడం చాలా కష్టం. కాబట్టి ఇతర ఇంట్లో పెరిగే మొక్కలను సజీవంగా ఉంచడానికి కష్టపడే వారికి ఇది ఒక చక్కని ఎంపిక. ఈ స్నేక్ ప్లాంట్ బల్లెము ఆకారంలో నిటారుగా నిలబడే ఆకులు కలిగి సాధారణంగా రెండు నుండి 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఆకుపచ్చ తెలుపు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.  

  ఎన్ని మొక్కలు ?

నియమము ప్రకారము 100 చదరపు అడుగుల అంతర్గత స్థలానికి పైన పేర్కొన్న జాబితా నుండి ఒకటి లేదా రెండు మంచి మొక్కలు సరిపోతాయి. ఇవి పెంచుకునే  కుండీలోని మట్టిలో బూజు అభివృద్ధి చెందనంతకాలం ఒకటి కంటే ఎక్కువ మొక్కలను కలిగి ఉన్నా ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.   

హైడ్రో కల్చర్ కలిగి ఉన్న వారికి సహాయ కరమైన చిట్కా: హైడ్రో కల్చర్ లో పెరుగుతున్న మొక్కలు గాలిని శుభ్రపరిచే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హైడ్రో కల్చర్లో మొక్కలు నీరు చేరని (వాటర్ టైట్) కంటైనర్లలో మరియు వీటి వ్రేళ్ళు మట్టిపోసిన సాధారణ కుండీలలో కాకుండా ప్రత్యేకంగా తోట దుకాణాల్లో ఈ ప్రయోజనం కోసమే అమ్మే ప్రత్యేకమైన విస్తరించినమట్టి, గులకరాళ్ళు మొదలగు వాటిలో పెంచుతూ ఉంటారు. 

పైన పేర్కొన్న అన్ని మొక్కలు ఈ కల్చర్ లో పెరుగుతాయి ముఖ్యంగా పీస్ లిల్లీ ఈ విధంగా పెరిగినప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది. హైడ్రో కల్చర్ మొక్కల పెంపకం మరియు నేల ద్వారా వచ్చే తెగుళ్ళు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. హైడ్రో కల్చర్ ద్వారా పెరిగే మొక్కలకు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న పూర్తి ఎరువులు అవసరం.

ఆధారము: ‘తాజాగాలిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ’  పెంగ్విన్ పేపర్బ్యాక్.రచయిత  B.C. వుల్వర్టన్ PhD వీరు US మిలిటరీ మరియు నాసాలో 30 సంవత్సరాలుగా శాస్త్రవేత్తగా పని చేసారు. విష రసాయనాలు మరియు వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి రక్షించడానికి వ్యవస్థలను అభివృద్ధి చేసారు.

 


ఓం సాయి రామ్