Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 3 సంచిక 1
January 2012


జ్వరాలను ప్రేమించాలి, వాటికి భయపడరాదు

నేటి ఆరోగ్య సంరక్షణలో జ్వరాల యొక్క పాత్రపై అతిపెద్ద దురభిప్రాయం ఉంది. చాలా మంది తల్లితండ్రులు జ్వరాన్ని అపార్ధం చేసుకున్న కారణంగా, జ్వరాన్ని చూసి భయపడుతున్నారు. నిజానికి, జ్వరాన్ని గౌరవించాలి. జ్వరమనేది శరీరంలో జరిగే ఒక అత్యంత అసాధారణమైన మరియు జటిలమైన వైద్య ప్రక్రియల్లో ఒకటని చెప్పవచ్చు. జ్వరం అనేది రోగనిరోధక ప్రతిస్పందనను ఉద్దీపనచేసి, శరీరాన్ని ఆక్రమించిన కిరుములను నాశనం చేయడం ద్వారా ఆరోగ్య పునరుద్ధరణ చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఆరోగ్యకరమైన బిడ్డకు జ్వరం వస్తే ముప్పులేదని, తల్లితండ్రులు అర్ధంచేసుకోవాలని 2011లో జరపబడిన ఒక అధ్యయనంలో అమెరికాకు చెందిన పీడియాట్రిక్స్ సంస్థ నిర్ధారించింది. నిజానికి జ్వరం ప్రయోజకరమైన ఒక ప్రక్రియని మరియు చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కంటే, బిడ్డకు సౌకర్యాన్ని మెరుగుపర్చడమేనని తెలుసుకోవాలి.

పూర్వకాలంలో జ్వరాలను అర్ధంచేసుకుని గౌరవించేవారు. తీరాన్ని చేరుకొనే కెరటం వలె, జ్వరం పైకెక్కుతూ క్రిందకి దిగుతూ ఉంటుందని పూర్వంలో అందరికి తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు జ్వరం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోకుండా చాలా మంది దాన్ని వివిధ మందులతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. జ్వరాన్ని తగ్గించే ఇటువంటి పదార్థాలను "ఫీవర్ రెడ్యూసర్" అని అంటారు. ఈ మందులు జ్వరాన్ని వేగంగా తగ్గిస్తాయి. కానీ ఇలా చేయడం ద్వారా, శరీరంలో రోగనిరోధక వ్యవస్థ క్షీణించి, కిరుముల పెరుగుదలకు దారి తీస్తుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.

 జ్వరం తగ్గించే మందులు తరచుగా దుర్వినియోగం చేయబడుతున్నాయి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం కూడా జరుగుతోంది. తల్లిదండ్రులలో యాభై శాతం మంది, 100.4°F లేదా తక్కువ ఉష్ణోగ్రతను జ్వరమని తలచి నిజానికి జ్వరం స్థితికి చేరుకొనే ముందుగానే జ్వరం తగ్గించే మందును బిడ్డలకు వేస్తున్నారు. అంతేకాకుండా 85 శాతం తల్లితండ్రులు నిద్రిస్తున్న బిడ్డలను మేల్కొల్పి మందులను వేయడం జరుగుతోంది. 80 శాతం వైద్యులు ఈ అలవాడును ఆక్షేపిస్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో వ్యాధి గుణమయ్యే అవకాశం చాలా ఎక్కువ.

ఆధునిక వైద్యం మనలోనున్న సహజ రోగ నివారణ శక్తిని ఉపయోగించుకొనే అవకాశాన్ని మన శరీరాలకి ఇవ్వడం లేదు. రోగ లక్షణాలు లక్ష్యంగా పెట్టుకొని చేసే చికిత్సల కారణంగా రోగులు, తక్షణ ఫలితాలు లభిస్తాయని ఆశించడం నేర్చుకున్నారు. తమ పిల్లల ఆరోగ్యం వేగంగా మెరుగుపడాలన్న ఆందోళన కలిగియున్న తల్లితండ్రులు, తక్షణ ఫలితాలను అందిస్తున్న చికిత్సలపై ఆధారపడడం మరింతగా చూస్తున్నాము. వ్యాధి యొక్క మూలకారణానికి చికిత్సను ఇవ్వకుండా, కేవలం వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్సను ఇవ్వటం, ఒక ఇల్లు కాలిపోతుండగా అగ్నిప్రమాద సూచననిచ్చే అలారం నుండి బ్యాటరీలను తీసివేయడం వంటిది. తల్లితండ్రులకు మరియు పిల్లలకు తమ శరీరాల నుండి వ్యాధి లక్షణాలను కేవలం తొలగించుకోవడమే కాకుండా, ఆ సంకేతాలను గమనించి, వాటిని అర్ధం చేసుకోవడాన్ని నేర్పడం ఎంతో అవసరం.

మౌఖిక ఉష్ణోగ్రత 100.4° F ని మించియుంటే జ్వరమని అనబడుతుంది. సాధారణంగా జ్వరం స్వయం-పరిమితమైనది మరియు తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. జ్వరం కారణంగా రోగం యొక్క గతి హీనస్థితికి మారిందని కానీ దీర్ఘకాల నరాల సంబంధిత సమస్యలు కలిగాయని కానీ ఆధారం లేదు. జ్వరం అనేది ఒక వ్యాధి కాదని అంతర్లీనంగా ఉన్న వ్యాధి యొక్క లక్షణం మాత్రమేనని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రతియొక్క మానవుడు సజీవంగా ఉండాలని కోరుకుంటాడు. మానసికంగా, శారీరికంగా, శరీరధర్మ మరియు జీవశాస్త్రపరంగా మానవుడు జీవనాభివృద్ధి కోసం పనిచేస్తాడు. ఇది అర్ధం చేసుకున్నప్పుడు, జ్వరం అనేది, శరీరం క్రిములతో పోరాడడానికి నిర్వహించే ఒక శరీరధర్మ ప్రక్రియయని మరియు ఈ ప్రక్రియ జీవనాభివృద్ధికి సహాయపడుతుందని సులభంగా గ్రహించవచ్చు. బాక్తీరియా, వైరస్లు వంటి సూక్ష్మ విషక్రిములు మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, హైపోథలామస్ (అధఃపర్యంకం) యొక్క "సెట్ పాయింట్" ను పెంచమని మెదడుకు సంకేతాలు పంపబడతాయి. దీనికారణంగా క్రిములను తొలగించే వరకు తాపక్రమనిర్ధారకము (థెర్మోస్టాట్) యొక్క క్రియాశీలత పెంచబడుతుంది. క్రిములలో ఉండే విషపదార్థాలు ద్వారా లేక క్రిములకు శరీరం యొక్క ప్రతిస్పందన అంటే సైటోకైన్లు, మైక్రోఫెజులు మరియు ఆంటీబాడీల ఉత్పత్తి ద్వారా ఈ సంకేతాలు అందుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తివంతమవుతుంది. వాపు ద్వారా ప్రభావిత ప్రాంతం రక్షింపబడి, ఇన్ఫెక్షన్ యొక్క వ్యాప్తి నిరోధించబడడమే కాకుండా, వైద్య ప్రక్రియ ప్రారంభించబడుతుంది.

జ్వరం 102°F ను మించినప్పుడు లేదా మూడు రోజులకు పైగా జ్వరం ఉన్నప్పుడు వైద్యుడుని సంప్రదించాలి. చల్లని గుడ్డతో శరీరాన్ని తుడవడం లేదా మంచుగడ్డ కట్టు వంటివి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. జ్వరం ద్వారా తీవ్ర అసౌకర్యం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, మన్యస్తంభము, మూర్ఛ వంటి లక్షణాలున్నప్పుడు వైద్యుడను సంప్రదించడం మంచిది. జ్వరం వచ్చిన సమయంలో శరీరానికి సరియైన ఆర్ద్రీకరణ (హైడ్రేషన్) మరియు ఉప్పు పునరుద్దరణ అవసరం http://www.naturalnews.com.      

 (జ్వరానికి తగిన మందుల కొరకు మీ రెమెడీలు (మందులు) పుస్తకాన్ని చూడండి)

వినికిడి లోపం

వినికిడి లోపం గలవారు కుటుంభ సభ్యులు మరియు స్నేహితులతో జరిగే సంభాషణను విని ఆనందించలేరు. దీని కారణంగా వారు ఎంతో నిరాశ చెందుతారు. వినికిడి లోపం కారణంగా వినటం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అసాధ్యం కాదు. ఈ లోపం ఉన్నవారికి సులభంగా సహాయపడవచ్చు. చెవిటి వారికి ఏ విధమైన ధ్వనిని వినటానికి సాధ్యం కాదు.

వినికిడి లోపానికి కారణాలు ఏమిటి? కొన్ని కారణాలు:

  • వంశపారంపర్యంగా వచ్చినవి
  • చెవిశోథ లేదా నాడీమండల పటలశోథ
  • ఆఘాతం
  • కొన్ని రకాల మందులు
  • దీర్ఘకాలంగా బిగ్గరధ్వని విన్నప్పుడు
  • వృద్ధాప్యం

వినికిడి లోపంతో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. శ్రవణనాడి చెడిపోయినప్పుడు, ఒక రకమైన వినికిడి లోపం కలుగుతుంది. ఈ లోపం శాశ్వతమైనది. మరొక రకమైన లోపం మీ చెవి అంతర్భాగం వరకు ధ్వని చేరకుండా ఉన్నప్పుడు కలుగుతుంది.  చెవిలో గులిమి అధికంగా చేరిపోవడం, ద్రవం లేక చిల్లుపడిన చెవిగూట వంటి కారణాల వల్ల ఇది కలగవచ్చు. చికిత్స తీసుకోకపోతే, వినికిడి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. మీకు వినికిడి లోపమున్నట్లయితే, మీరు సహాయం పొందవచ్చు. సాధ్యమైన చికిత్సలు: వినికిడి పరికరాలు, చెవిలో కర్ణావృత్తి (కాక్లియా) యొక్క దూర్పు, ప్రత్యేక శిక్షణ, కొన్ని రకాల మందులు మరియు శస్త్రచికిత్స.

...NIH: వినికిడి లోపం మరియు ఇతర కంమ్యూనికేషన్ సమస్యల యొక్క రాష్ట్రీయ సంస్థ

(108 మిశ్రమాల పుస్తకంలో 5 వ విభాగం 'చెవులు' క్రింద చూడగలరు లేదా వైబ్రియానిక్స్ 2004 పుస్తకంలో – SRHVP 3.5 చూడగలరు ) 

 

ప్రోస్టేట్ వ్యాధులు

ప్రోస్టేట్ (శుక్రాశయపిండము) ఒక గ్రంధి. ఇది వీర్యము లేదా శుక్లము ద్రవ్య తయారీకి సహాయపడుతుంది. ప్రోస్టేట్ గ్రంధి మూత్రాశయం నుండి మూత్రాన్ని తీసుకువెళ్లే గొట్టాన్ని చుట్టుముడుతుంది. ఒక యువకుడిలో, ప్రోస్టేట్ వాల్నట్ యొక్క పరిమాణంలో ఉంటుంది. ఇది వయస్సుతో పాటు క్రమంగా పెరుగుతుంది. దీని పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సమస్యులకు కారణమవుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్యను సాధారణంగా చూడవచ్చు. వయస్సు పెరిగిన కొద్ది ప్రోస్ట్రేట్ సమస్య సంభవించే అవకాశం అధికమవుతుంది.

కొన్ని సాధారణ సమస్యలు:

ప్రోస్ట్రేట్ యొక్క శోధము - సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా కలిగే ఒక వ్యాధి 

బినైన్ (నిరపాయమైన) ప్రోస్ట్రేట్ పెరుగుదల లేదా BPH - ముఖ్యంగా రాత్రివేళ తరచుగా మూత్రవిసర్జన సమస్య కలిగించే మరియు పరిమాణం పెరిగిన ప్రోస్ట్రేట్.

ప్రోస్ట్రేట్ క్యాన్సర్ - ప్రారంభ దిశలో కనుగొనబడినప్పుడు చికిత్సకు స్పందించే ఒక సాధారణ క్యాన్సర్.      

… మధుమేహ, జీర్ణక్రియ మరియు మూత్రపిండం సంబంధించిన వ్యాధుల యొక్క రాష్ట్రీయ సంస్థ

(108 కామెన్ కాంబోల(మిశ్రమాల) పుస్తకంలో విభాగం-14 'మొగ అవయవములు' లేదా వైబ్రియానిక్స్ 2004 పుస్తకంలో -SRHVP 3.14 చూడగలరు

  • Om Sai Ram