దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 3 సంచిక 1
January 2012
“నేడు ఒక వ్యక్తి దుఃఖము మరియు కష్టాలలో ఉన్నాడంటే దానికి కారణం అతని మనసు. ఆనందం, భాధ, ప్రేమ, అయిష్టతలు మరియు మానవుడు అనుభవించే ప్రాపంచిక సుఖాలు, మనిషి యొక్క మనసు నుండే ఉత్పన్నమవుతాయి. ద్వైత భావం కలిగియున్న కారణంగా మానవుడు ఇటువంటి బాధలను అనుభవిస్తున్నాడు. మనసుకు సృష్టి యొక్క ఏకత్వం పై శిక్షణనిచ్చినప్పుడు ఏ రకమైన చెరువు ఉండదు. మీ జీవితంలో ప్రతీ సమస్యను మీరు చిఱునవ్వుతో ఎదుర్కోవాలి. ఈ ద్వైత స్వభావమున్న ప్రపంచంలో లాభాలు మరియు నష్టాలు ఉండడం సహజమే. కష్టాలనేవి, అనంతమైన ఆనందాన్ని పొందడానికి మొదటి మెట్టు. వీటినుండి తప్పించుకోవడం వీలు కాదు. మీరు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నిరాశ చెందరాదు లేదా విజయాన్ని ఎదుర్కొన్నప్పుడు పొంగిపోరాదు.”
-సత్య సాయి బాబా, 'థాట్ ఫోర్ థి డే' ప్రశాంతి నిలయం
“మీ సేవను పొందే అర్హత ఇతరులకు ఉందా లేదాయని మీరు నిర్ణయించరాదు. వారు కష్టాలలో ఉన్నారా లేదాయని తెలుసుకొని వారికి తగిన సేవ చేయాలి. వారు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని మీరు పరిశీలించరాదు; వారిలో ప్రేమ ద్వారా ఖచ్చితంగా పరివర్తన తీసుకు రావచ్చు. సేవ అనేది పవిత్రమైన ఒక ప్రతిజ్ఞ, ఒక విధమైన సాధన, ఒక ఆధ్యాత్మిక మార్గం. సేవ మీ శ్వాస. మీ ఆఖరి శ్వాస వరకు సేవ మీతో ఉండాలి."
-సత్య సాయి బాబా , దివ్యోపన్యాసం , ఫెబ్ 19, 1970
“నేల తడిగా ఉండటం వర్షం యొక్క రుజువు. అదేవిధంగా, సాధకుడు పొందే మనస్శాంతి, నిజమైన భక్తికి రుజువు. ఇటువంటి మనస్శాంతి సాధకుడను వైఫల్యాలు దాడి నుండి రక్షిస్తుంది. మనస్శాంతి, నష్టాలు మరియు అవమానాలు జరిగిన సమయంలోను సాధకుడను ప్రశాంతంగా ఉంచుతుంది."
-సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటం 5, పు.308