ప్రశ్న జవాబులు
Vol 2 సంచిక 3
May 2011
1. ప్రశ్న: వైబ్రో మందు కలపబడిన చక్కర గోలీలు కొన్నిటిని ఆల్కహాల్ లో కలిపి, కరిగించడం ద్వారా తయారు చేయబడిన మిశ్రమం, ఆల్కహాల్ మాధ్యమంలో నేరుగా తయారు చేయబడిన అసలైన మిశ్రమానికి సమానంగా ఉపయోగపడుతుందా? నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏమిటంటే, పారీస్ కి దూరంగా నివసిస్తున్న, నా వద్ద చికిత్స పొందుతున్న ఒక రోగికి అనేక నెలలు వైబ్రో మందులను తీసుకొనే అవసరముంది. ఒక వేళ ఇది సరైన పద్ధతి అయ్యుంటే కనుక, భవిష్యత్తులో, ఈ రోగి, ఆమెకివ్వబడిన గోలీలు పూర్తయ్యే లోపు, ఒక సీసాలో, ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవడం సులభంగా ఉంటుంది.… చికిత్సా నిపుణుడు 2809
జవాబు: ఈ విధానం సరైనదే కాని, ఈ విధంగా తయారు చేయబడిన మిశ్రమం అసలైన మిశ్రమమంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. పైగా, ఇది రోగి వైబ్రో గోలీలను ఎంత సురక్షితంగా ఉంచారన్న విషయంపై ఆధార పడియుంటుంది.
2. ప్రశ్న: 108CC బాక్సులో ఉన్న ఆల్కహాల్ సీసాలలో ఉన్న వైబ్రేషన్లు ఎంత కాలం వరకు నిలచియుంటాయి?…చికిత్సానిపుణుడు2494
జవాబు: ఆల్కహాల్ లో ఉన్న వైబ్రేషన్లు రెండు సంవత్సరాలు నిలచియుంటాయి. అయితే రెండేళ్ళు పూర్తయ్యే లోపు, మీరు ప్రతియొక్క సీసాను తొమ్మిది సార్లు కదిలించినట్లయితే, మరో రెండేళ్ళు వైబ్రేషన్లు నిలచియుంటాయి. ఈ విధంగా చేస్తూ ఉంటే, వైబ్రేషన్లు శాశ్వతంగా ఆల్కహాల్ లో నిలచియుంటాయి.
3. ప్రశ్న: గోలీలలో వైబ్రేషన్లు ఎంత కాలం వరకు నిలచియుంటాయి. వైబ్రో గొలీల తయారి విధానాన్ని బట్టి, గొలీల యొక్క ఎక్స్పైరి తేది ఆధార పడి ఉంటుందా?… చికిత్సా నిపుణుడు 0512
జవాబు: గొలీల సీసాను వికిరణం నుండి సురక్షితంగా ఉంచినట్లయితే, గోలీలలో వైబ్రేషన్లు రెండు నుండి ఆరు నెలల వరకు నిలచియుంటాయి. కాని గొలీల సీసా మీతో పాటు ప్రయాణిస్తుంటే కనుక, ఫోన్లు నుండి వచ్చే వికిరణం కారణంగా వైబ్రేషన్ల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇటువంటి సందర్భాలలో, వైబ్రేషన్లు రెండు నెలలు మాత్రమే నిలచియుంటాయని గుర్తుంచుకోవాలి. సీసాలను అల్యుమినియుం కాగితంలో చుట్టబెట్టి ఉంచడం ద్వారా వికిరణాల దుష్ప్రభావం నుండి కొంత వరకు గోలీలను రక్షించవచ్చు.
4. ప్రశ్న: వైబ్రో మందులను నీటిలో తయారు చేయడానికి, ఒక లీటరు నీటిలో 25 ఆల్కహాల్ చుక్కలు వేసి కలపాలని చదివి తెలుసుకున్నాము. అయితే, ఇప్పుడు మొక్కలికి, జంతువులకి పది చుక్కలు చాలని చెబుతున్నారు. సరైన పద్ధతి ఏదో తెలుపవలసిందిగా కోరుతున్నాము. … చికిత్సా నిపుణుడు2494
జవాబు: అన్ని సందర్భాలలోనూ, ఒక లీటరు నీటిలో, 5 నుండి 10 ఆల్కహాల్ చుక్కలు కలపితే చాలని ఇటీవల కనుగొనబడింది.
5. ప్రశ్న: జంతువులకు వైబ్రో మందులను ఏ విధంగా ఇవ్వాలి? … చికిత్సా నిపుణుడు 2715
జవాబు: జంతువులకు మందులను నీటిలో కలిపివ్వడం శ్రేష్టం. అయితే, జంతువుల మరియు పిల్లల విషయంలో, వైబ్రో నీటిని నాలుక క్రింద, ఒక నిమిషం వరకు ఉంచే అవసరం లేదని గుర్తుంచుకోవాలి. వైబ్రో నీటిని తయారు చేసే విధానం: 5 ఆల్కహాల్ (వైబ్రో మిశ్రమం) చుక్కలను ఒక లీటరు నీటిలో వేసి, వంద సార్లు భాగా కలపాలి. ఈ విధంగా తయారు చేయబడిన వైబ్రో నీటిని నేరుగా జంతువుకు ఇవ్వవచ్చు లేదా జంతువు త్రాగే నీటిలో కలపవచ్చు.
మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను ఈ కింద ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి: [email protected]