డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 2 సంచిక 3
May 2011
ప్రియమైన చికిత్సా నిపుణులకు
“నాపైన నమ్మకం ఉంచండి. నేను ఎప్పుడూ తప్పు చేయను. నా అనిశ్చితతను ప్రేమించండి. అదే నా సంకల్పం. నా ఆదేశం ఉంటే తప్ప ఏమీ జరగదని గుర్తుంచుకోండి. మనసును స్థిరంగా ఉంచుకోండి. మీకు నాకు మధ్య సంబంధం పురాతన మరియు శాశ్వతమైనది. ఈ సంభంధం ప్రాపంచిక సంబంధాలు వంటిది కాదు. నేను మీ అందరిని సముద్రం నుంచి పైకి లేచే అలలు వలె చూస్తాను. నేను మీ ఆనందకరమైన రూపాన్ని చూస్తాను. మీరు ఆనంద స్వరూపులు కనుక ప్రేమ ద్వారా శాశ్వత ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు. ఇదే ఆనందానికి పునాది. కేవలం నన్ను ప్రేమించడం ద్వారా సంతృప్తి పడవద్దు. నేను మిమ్మల్ని ప్రేమించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి."...సత్య సాయి బాబా SSS సంచిక 3
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, తమ భౌతిక రూపాన్ని వీడి ఒక నెల పైన కావొస్తోంది. ప్రశాంతి నిలయంలో మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ శోకం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నారు.
“నా అనిశ్చితతను ప్రేమించండి." తమ భౌతిక శరీరాన్ని వదలడంతో సహా, స్వామి ప్రతీది, భక్తులపై తమకున్న స్వచ్చమైన ప్రేమ కారణంగానే చేస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. స్వామీ యొక్క ప్రతిచర్య అర్ధవంతంగాను, మంచి ఉద్దేశ్యంతోను మరియు మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠాలతోను నిండి ఉంటుంది. మనమందరము కూడాను స్వామీ భౌతిక శరీరం యొక్క ఆఖరి కొద్ది నెలల పై ధ్యానం చేసి, అందులో మనం మన జీవన విధానం గురించి మరియు సమయం వచ్చినప్పుడు శరీరాన్ని ఎలా వీడాలో కూడా నేర్చుకోవాలి.
ఉదాహరణకు శారీరిక సవాళ్లు ఎదురైనప్పడికి, తమ విధిని నిర్విరామంగా నిర్వర్తించడం. శ్వాస మరియు గుండె సంభందించిన సమస్యలతో తమ శరీరం క్షీణిస్తున్నప్పడికి, స్వామీ వేలాది భక్తులకు దర్శనమిస్తు వాళ్ళందరికీ దీవెనలతో పాటు గొప్ప ఆనందాన్ని అందిస్తూనే ఉన్నారు. "నేను ఈ దేహాన్ని కాదు. నేను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాను." అని స్వామీ పదే పదే చెప్పేవారు. అయితే, స్వామికి శారీరిక నొప్పి లేదని అర్ధం కాదు. తనను నొప్పితో గుర్తించుకోకుండా, శారీరిక నొప్పికి అతీతంగా, ఆనంధంగా ఉండాలని ఆర్థం.
స్వామీ యొక్క దివ్య సౌందర్యాన్ని కనులారా చూసే భాగ్యాన్ని కోల్పోయామని నిరాశ పడరాదు. మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలోను, సత్యం, ప్రేమ,శాంతి ,ధర్మం మరియు అహింస వంటి స్వామీ భోధించిన మానవతా విలువలు కూడియుండడం చాలా అవసరం. అహంకారాన్ని తొలగించుకొని, స్వామీ చేతిలో ఒక బోలు వేణువు వలె మారాలి. ఈ విధంగా మనం మారినప్పుడు, స్వామీ యొక్క దివ్య కీర్తి మన ద్వారా ప్రకాశిస్తుంది. మనము స్వామీ యొక్క పరిపూర్ణమైన సాధనములుగా మారుతాము.
వేలాది మందికి వైద్య సదుపాయం మరియు ఆశ అందించడానికి ఒక ఉత్తమ సాధనంగా వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని స్వామీ ఆశీర్వదించారు. ఈ సేవను అందించే, స్వామీ యొక్క సాధనములైన మనము ఎంతో అధ్రుష్టవంతులము. మనమందరము కలిసి, ఈ సేవను మరింత శ్రద్ధతోను మరియు ప్రేమతోను చేయాలని ద్రిడంగా నిశ్చయించు కోవాలి. స్వామీ ప్రసాదించిన ప్రేమను పంచుకోవడం ద్వారా ప్రేమ మరింత పెరుగుతుంది.
ప్రేమపుర్వకంగా సాయి సేవలో
జిత్ కే అగ్గర్వాల్