ప్రాక్టీషనర్ వివరాలు 01163...क्रोएशिया
ప్రాక్టీషనర్ 01163...క్రొయేషియా నిష్ణాతురాలైన ఈ చికిత్సా వైద్యురాలు కుటుంబ వైద్య రంగంలో 37 సంవత్సరాలు పనిచేశారు. ఎక్కువ సమయాన్ని అనారోగ్యం రాకుండా ముందస్తు జాగ్రతగా ఇచ్చే నివారణలు కోసం అంకితం చేశారు. ఈ అద్భుత అనుభవం వీరికి మధుమేహం, మధ్యం సేవించడం, ఊబకాయం, కండరాల వ్యాధితో బాధపడుతున్న రోగులు, పిల్లలు మరియు యువకులలో సామాజిక ఆమోదయోగ్యంకాని ప్రవర్తన వంటి వాటిపై పనిచేయడానికి, సదస్సులు నిర్వహించడానికి ఉపయోగపడింది. కార్డియాలజీ మరియు గ్యాస్ట్రోఎంటరాలజీతో సహా వివిధరకాల విషయాలపై తనకున్న జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం, విధినిర్వహణ సమయంలో నిరంతరం వృత్తిపరమైన శిక్షణ తీసుకొనేవారు. ఐతే ప్రత్యేకంగా మధుమేహముపై మాస్టర్స్ డిగ్రీ చేసారు.
వీరు ఒక మెడిసిన్ పాఠశాలలో సబ్జెక్టులు బోధించారు, ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ వ్రాసారు, మరియు అనేక సమావేశాలు, సదస్సులలో ముఖ్యపాత్ర నిర్వహించారు. అంతేకాకుండా, వీరు వైద్య కేంద్రంలో భాధ్యతకలిగిన వ్యక్తిగా మరియు బోర్డు మెంబరుగా ఉన్నారు.
1992 లో వీరు స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. క్రమంతప్పకుండా కొన్ని సంవత్సరాలపాటు పుట్టపర్తి సందర్శించారు, ఆసమయంలో సేవ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు చాలా ఇంటర్వ్యూలలో స్వామి చేత అనుగ్రహింప బడినారు. 1996 లో యుద్దానంతర వాతావరణములో ఆమె తన దేశంలో రోగి సంరక్షణకు బదులు పాలీఫార్మసీ(బహుళ ఔషదాలు ఉపయోగించడం) మరియు పరిపాలనపై దృష్టి పెట్టడంతో ఆరోగ్య విధానము పై భ్రమలు తొలగి తన ఉద్యోగం మార్చుకోవలసిన అవసరం ఉందని భావించారు. అందువల్ల ప్రత్యామ్నాయ వైద్యవిధానముపై దృష్టి సారించి హోమియోపతిలో డిప్లొమా సంపాదించారు. ఉద్యోగం చేస్తూనే కొంతకాలం హోమోయోపతి ప్రాక్టీస్ చేస్తూ అద్భుత ఫలితాలు పొందారు. 1997లో స్వామి తనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరిముందు ఈ ప్రాక్టీషనర్ తను చేసే వైధ్యంతో సంతృప్తి చెండంలేదని కనుక వైద్య విధానము మార్చుకోవాలను కుంటున్నారని ఆమె దేశానికి తిరిగి వెళ్ళిన తరువాత వీలైనంత త్వరగా మార్చుకోవాలని చెప్పారు. మరచిపోలేని ఈ పర్యటన తరువాత, సాధ్యమైనంతవరకూ బాగానే కృషిచేశారు కానీ జాబ్ మారలేక పోయారు. అందుచేత వాస్తవానికి స్వామి ఆమె చేస్తున్న చికిత్సా విధానంలో మార్పులు చేసుకోమని అన్నారేమో అని అర్దం చేసుకొని అప్పటినుండి ఆమె రోగులపై దృష్టిపెట్టి వారిపై మరింత ప్రేమను చూపిస్తూ అదే వృత్తిని కొనసాగించారు.
ప్రాక్టీషనర్ తనకున్న మధురమైన అనుభవాన్నిఈ విధంగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఒక పిల్లిపిల్ల తోక వైకల్యం కారణంగా తల్లి చేత వదిలేయబడి అభ్యాసకురాలి ఇంటిలో ఆశ్రయం పొందింది. పిల్లిపిల్ల ఎప్పుడు బయటకి వెళ్ళినా ఇతర పిల్లులు కరవడం వల్ల తిరిగి వచ్చేసరికి చర్మం చీరుకుపోయి ముఖ్యంగా తోకపై అనేక గాయాలతో ఇంటికి వచ్చేది. ఒక సందర్భంలో మెడమీద జుట్టే లేదు. ప్రాక్టీషనర్ అయింట్మెంట్ రాయడానికి ప్రయత్నించారు కానీ పిల్లి ఆమెని తాకనీయలేదు. ఒకరోజు అది కుర్చీలో నిద్రపోతున్నప్పుడు మెడచుట్టూ చేతులువేసి పిల్లిని గట్టిగా పట్టుకొని మెడ నిండా విబూధి రాశారు. అది వెంటనే దాగుకొనటానికి పారిపోయి నప్పటికీ, మరుసటిరోజు అంతుబట్టని విధంగా మెడమీద వెంట్రుకలు మామూలుగా ఉన్నాయి మరియు దాని గాయాలు కనిప్పించకుండా పోయాయి! ఈ సంఘటనతో ఆమెకు స్వామిపై నమ్మకం మరింత ధృడపడింది. 1996లో పుట్టపర్తి సందర్శించినప్పుడు ఆమె వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు కానీ కోర్సులో చేరలేదు. 1999లో నిబద్దతతో పాల్గొనేవారికోసం క్రొయేషియాలో ఒక బోధనా సదస్సు నిర్వహించమని స్వామి డాక్టర్ అగ్గర్వాల్ గారిని ఆదేశించారు. ఈ వర్క్ షాప్ లో ఆమె ప్రాక్టీషనర్ అయ్యారు కానీ, చాలా సంవత్సరాలపాటు ఆమె తక్కువ మంది పేషెంటులకు మాత్రమే చికిత్స చేయగలిగారు. 2013 సంవత్సరంలో వీరు వైద్య వృత్తిపరంగా పదవీవిరమణ పొందిన తరువాత, ఇంటివద్ద నుండే ఎక్కువమంది పేషెంట్లకు వైబ్రియనిక్స్ చికిత్స చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ పేషెంట్ల బాగోగులు చూస్తూ ఫాలోఅప్ చేస్తూ ఇప్పటివరకు 500 మందికి పైగా రోగులకు అతిసారం, ఎక్కిళ్ళు, కంటిలో మంట, ఋతుస్రావం, జలుబు, ఫ్లూ, మూత్రపిండాలలో రాళ్ళు, గాయాలు మరియు పగుళ్లు వంటి వివిధరకాల వ్యాధులకు విజయవంతంగా చికిత్స చేశారు. అంతేకాకుండా ఆమె పెంపుడు జంతువులు మరియు మొక్కలకు కూడా చికిత్స చేశారు. క్రొయేషియాలో ప్రజలకు వైబ్రేషన్ చికిత్సాపద్దతిపై సరియైన అవగాహన లేకపోవడంవల్ల తనకు ఎక్కువమంది పేషెంటులు లేరు అని భావించారు. పరిస్థితి ఇప్పుడే కాస్త మెరుగుపడుతూ ఉండడంతో దీనిపై అవగాహన పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వైబ్రియానిక్స్ ద్వారా రోగులకు చికిత్స చేస్తున్న సందర్భంలో హృదయాన్ని కదిలించే అనుభవాలు ఈ ప్రాక్టీషనర్ కి ఎన్నో ఉన్నాయి, వాటిలో కొన్ని మనతో పంచుకుంటున్నారు:
NM6 Calming + NM85 Headache-Blood Pressure + SM41 Uplift. ఈ కాంబో ద్వారా తలనొప్పి త్వరగా తగ్గడం అభ్యాసకురాలు గమనించారు. 80 సంవత్సరాల మహిళ రెండు సంవత్సరాలగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ స్పెషలిస్టుల చేత సూచించబడిన మందులు ఏమాత్రం ఉపశమనం ఇవ్వని పరిస్థితిలో అభ్యాసకురాలు సూచించిన రెమిడీలతో కొన్ని రోజులలోనే తలనొప్పి నుండి విముక్తి పొందారు.
హెర్పెస్ జోస్టర్(నాడీ సర్పి)కి చికిత్స చేస్తున్నప్పుడు, NM36 War + NM59 Pain + NM60 Herpes + SM26 Immunity ఈ కాంబోని ఉపయోగించి మూడువారాలలోనే ఆమె అధ్బుతమైన ఫలితాన్ని పొందారు. ఒక పేషెంటుకు ఈ వ్యాధి కేవలం 24గంటలలో అదృశ్యమయ్యింది.
సర్వైకల్ కాన్సర్ కోసం ఖీమోథెరఫీ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రాక్టీషనర్ తీవ్రమైన హెర్పస్ జోస్టర్ కు గురైన సందర్భంలో ఇదే రెమెడీ మరియు విబూదితో నొప్పి మరియు మచ్చలు మాయమై పూర్తిగా నయం చేసాయి. ఈ విధంగా 10 సంవత్సరాలలో అభ్యాసకురాలు 10 మంది హెర్ప్స్ పేషెంటులకు విజయవంతంగా చికిత్స చేసారు.
పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్(PCOD) తో బాధపడుతున్న36 సంవత్సరాల మహిళ OM24 FemaleGenital + BR16 Female కాంబో వాడటంవల్ల మూడునెలలలో సమస్యనుండి బయటపడ్డారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు పేషెంటులు వైబ్రియనిక్స్ రెమెడీ తీసుకోవడంవల్ల ఖీమోథెరఫీ మరియు రేడియేషన్ వలన వచ్చే దుష్ప్రభావాలనుండి ఉపశమనం పొందారు:
మొదటి వ్యక్తి- 70సంవత్సరాల మహిళ, కేన్సర్ నిమిత్తం ఖీమోథెరఫీ మరియు అనేకసార్లు రేడియేషన్ చేయించుకున్న తరువాత 2016లో శస్త్రచికిత్స ద్వారా ఎడమవైపు స్తనమును తొలగించుకున్నారు. ఆమె ఇప్పుడు కాన్సర్ నుండి బయటపడి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ కొన్ని అల్లోపతీ మందులుతోపాటు వైబ్రియనిక్స్ రెమెడీలను కొనసాగిస్తున్నారు.
రెండవ వ్యక్తి 61 సంవత్సరాల మహిళ, ధూమపానానికి భానిసవడం వలన 2014 సెప్టెంబర్లో ప్లూరల్ మెసోథెలియోమా(ఆజ్బెస్టాస్ పీల్చడం కారణంగా ఊపిరితిత్తుల రక్షణ కవచంలో వచ్చే అరుదైన మరియు తీవ్రమైన కాన్సర్) సోకినట్లు గుర్తించారు. ఆమె ఖీమోథెరఫీ తరువాత శస్త్రచికిత్స చేయించుకున్నా అది విఫలం కావడంతో డాక్టరు ఆమె రెండు సంవత్సరాలకు మించి జీవించదని చెప్పారు. వైబ్రియానిక్స్ రెమెడీ కొనసాగిస్తూ ఖీమో మరియు పరీక్షచేయించుకోవడం కోసం వెళ్ళడం కూడా మానేసారు. ఇప్పుడు ఆమె మూడు సంవత్సరాల క్రితం జన్మించిన మనుమరాలిని చూడటం కోసం జీవించి ఉండడమే కాక ఆమె తన సమయాన్ని కుటుంబసభ్యులు మరియు మనుమరాలితో ఆస్వాదిస్తూ ఈ పొడిగింపబడిన జీవితాన్ని వైబ్రియానిక్స్ కే ఆపాదిస్తున్నారు.
క్రొయేషియాలో స్ప్లిట్ లోని ”ప్రేమవాహిని” అనే సాయి సెంటర్లో వివిధరకాల సేవ ప్రాజెక్టులలో ప్రాక్టీషనర్ చురుకుగా పాల్గొంటారు. ఇందులో పేదలకు సహాయం చేయడం, శరణార్ధులకు సహాయపడడం, పరిసరాలను శుభ్రపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించుట లాంటివి ఉన్నాయి. ఆమె ఇతర ప్రాక్టీషనర్లతో కలిసి కొత్త సంవత్సర వేడుకుల సందర్భంగా నిర్దిష్టమైన ప్రణాళికతో వైబ్రియానిక్స్ పై బహిరంగ ఉపన్యాసం ఏర్పాటు చేసి వేడుకల అనంతరం పాల్గొన్నవారికి వైబ్రియనిక్స్ చికిత్స కూడా అందించారు. ఇటువంటి ప్రయత్నం ద్వారా ప్రజలలో వైబ్రియనిక్స్ యొక్క శక్తిసామర్ధ్యాలు గురించి అవగాహన తీసుకురావచ్చు అని వీరు నమ్మకంగా ఉన్నారు.
పేదలకు మరియు సహాయం అవసరమైన వారికి సేవలను విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రాక్టీషనర్ ఎల్లప్పుడు భావిస్తారు. వైబ్రియనిక్స్ ద్వారా ఈ మార్గానికి తీసుకొచ్చినందుకు ఆమె స్వామికి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం వైద్యసేవ మరియు ఆ తరువాత వైబ్రియనిక్స్ సేవ అభ్యాసకురాలికి రోగుల పట్ల సాధుస్వభావంతో ప్రేమగా ఉండడం నేర్పింది. ఒక చిన్న ప్రార్ధన వ్యాధులను విజయవంతంగా నయంచేయడానికి మరియు పేషెంట్స్ లో సంతృప్తిని తీసుకురావడానికి సహాయపడుతుంది. పర్వతారోహణ, జిమ్నాస్టిక్స్, అలాగే కళ మరియు మట్టిపాత్రల తయారీ వంటి అభిరుచులతో వత్తిడి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా సందేహం లేదా సమస్యలు ఎదురైనప్పుడు అంతరాత్మతో కనెక్ట్ అవడం మరియు స్వామి అనుగ్రహం ద్వారా ఉత్తమమైన మార్గదర్శకత్వం మరియు స్పష్టత పొంది సమస్యల నుండి బయటపడతారు. అభ్యాసకురాలు తన జీవిత లక్ష్యం నెరవేరిందని తన హృదయం ఆనందంతో నిండి అందరిపట్ల ప్రేమను కురిపిస్తోందని తెలియజేస్తున్నారు.
పంచుకున్న కేసులు :