Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ వివరాలు 01616...क्रोएशिया


ప్రాక్టీషనర్ 01616క్రొయేషియా ఫార్మసీ రంగంలో శిక్షణ మరియు అనుభవం కలిగిన ఈ అభ్యాసకురాలు ప్రస్తుతం కుటుంబ వ్యాపారంలో చీఫ్ ఎకౌంటెంటుగా ఉన్నారు. చిన్నప్పటి నుండి చుట్టుపక్కల ప్రజల అవసరాలకు అనుగుణంగా కరుణ మరియు బాధ్యతతో  ప్రతిస్పందించే వీరు 1992 లో స్వామి ఫోల్డ్ లోనికి   వచ్చారు.1999 లోతన మిత్రులలో ఒకరిని స్నేహపూర్వకంగా కలుసుకునేందుకు ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు వైబ్రియానిక్స్  విధానం గురించి తెలుసుకుని అప్పుడే ప్రారంభమయిన కోర్సులో వెంటనే చేరి అభ్యాసకురాలు అయ్యారు.   

కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత ఒకరోజు అత్యంత ఆశ్చర్యకరంగాతన వార్డురోబ్ లో తన SRHVP బాక్సులో ఉన్న కార్డులకు అదనంగా NM20 Injury, NM36 War, NM91 Paramedic Rescue, మరియు SR275 Belladonna అనే 4 కార్డులు కనిపించాయి. ఏదో ప్రత్యేక ప్రయోజనం నిమిత్తం స్వామి ఈ లీల చేసినట్లు భావించి  ఆమె అత్యవసర పరిస్థితిలో వీటిని ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతూ ఉన్నారు.  

గత 20 ఏళ్లలో వీరు 3 వేల మంది రోగులకు అధిక రక్తపోటు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అలర్జీ వంటి తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వ్యాధుల కోసం చికిత్స చేశారు. తన అనుభవంలో SRHVP మిషను మరియు సిమ్యులేటర్ కార్డులతో చేసిన నివారణలతో రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతున్నట్లు తెలుసుకున్నారు. యుక్తవయసు వచ్చిన దగ్గరనుండి ఋతుస్రావం లేని 27 సంవత్సరాల యువతికి OM24 FemaleGenital + SM39 Tension + SM41 Uplift.  ఇవ్వడం ద్వారా ఆరు నెలల వ్యవధిలో ఆమెకు ఋతుస్రావం ప్రారంభం కావడమే కాక క్రమం తప్పకుండా రావడం ప్రారంభమయ్యింది. అంతేకాక  ఐదు సంవత్సరాల వ్యవధిలో పేషంటు ఇద్దరు ఆరోగ్యకరమైన శిశువులకు జన్మ ఇచ్చింది.

ఈ అభ్యాసకురాలి అనుభవం ప్రకారము రోగులంతా, పరాన్న జీవులు మరియు నులిపురుగుల నుండి క్రమం తప్పకుండా దూరంగా ఉండడం చాలా ముఖ్యమనీ, ఆహారపు అలవాట్లను, అలాగే వేరే ప్రదేశాలలో నీటిని త్రాగవలసి వచ్చినప్పుడు నీటి నాణ్యత పరిగణనలోనికి తీసుకోవాలనీ భావిస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువులను కలిగి ఉన్న వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొంటున్నారు. పరాన్న జీవులు మన శరీరంలో పెరగకుండా ఉండడానికి అభ్యాసకురాలు క్రింది రెమిడీ సూచిస్తున్నారు:

 NM1 AmoebicDysentery + NM2 Blood + NM21 KBS + NM22 Liver + NM35 Worms + SR272 ArsenAlb...TDS గా ఆరు వారాల పాటు తీసుకోవాలి. నెల వ్యవధి తర్వాత శారీరక అవయవాలలో పరాన్న జీవుల మిగిలిపోయిన గుడ్లనుండి వీటి పెరుగుదలను నివారించడానికి నాలుగు వారాల పాటు దీనిని వాడాలి. ముందస్తు నివారణ చర్యగా  ప్రతీ సంవత్సరం ఒక నెల రోజులు  TDSగా దీనిని తీసుకోవాలి. వీరి యొక్క రోగులలో ఎంతోమందికి ఈ క్లెన్సింగ్ విధానము వలన ఆరోగ్యము చేకూరింది. అంతేగాక వారి వ్యాధులు తామంతట తామే అదృశ్యమయ్యాయి.108CC బాక్స్ నుండి CC4.6 Diarrhoea దీని సారూప్యతను కలిగి పైవిధమైన ప్రక్షాళనకు తోడ్పడుతుంది.  

శీఘ్రంగా మరియు దీర్ఘకాల ఉపశమనం కోసం రోగి యొక్క వ్యాధి నివారణకు చాలా తక్కువ రెమిడీ లనే సూచిస్తారు. కరిగించిన మోతాదును సూచిస్తారు. ఈ అభ్యాసకురాలు తమ రోగులకు రెమిడీ మాత్రలను కరిగించుకోవడానికి స్ప్రింగ్ వాటర్ లేదా కాచి చల్లార్చిన  నీటినే ఉపయోగించమని చెపుతారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో లేదా నగరాలలో నీరు భారలోహాలు, రసాయనాలు, క్లోరిన్ మరియు డ్రగ్ రెసిస్టెన్స్ వంటి అవాంఛనీయ మైన వాటిని  కలిగి ఉంటాయి. నాణ్యమైన త్రాగునీటిని పొందడంలో ఇబ్బంది ఉన్నచోట రెమిడీలు గొళీల రూపంలో ఉపయోగించమని వీరు తమ రోగులకు చెపుతారు.

వైబ్రియానిక్స్ తో రోగులకు చికిత్స చేయడం ప్రతిఫలం ఆశించకుండా సేవ చెయ్యడాన్ని నేర్పిందని ఎందుకంటే స్వామికి సర్వస్వం తెలుసని అభిప్రాయ పడుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో సౌకర్యవంతమైన జీవన ప్రమాణాన్ని మరియు ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఇచ్చి ఆనందింప చేసినందుకు కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన  జీవితంలో ప్రతిక్షణం స్వామిచేత ప్రత్యేకంగా ఆశీర్వదింప బడిన అనుభూతిని అనుభవిస్తున్నారు.   

అభ్యాసకులురాలిగా ఉండడం అనేది ఒక గొప్ప బాధ్యత మరియు గొప్ప గౌరవం” అని అభ్యాసకురాలు అంభిప్రాయ పడుతున్నారు.  సేవ వీరిని ప్రశాంతముగా ఉండడం, ఫలితాల గురించి ఆశించకుండా ఓపికగా ఉండడాన్నిఅలవరుచుకొనేటట్లు చేసింది. వీరి అభిప్రాయం ప్రకారం అభ్యాసకులు వ్యక్తిగతముగా మరియు ఆధ్యాత్మికముగా  అభివృద్ధి చెందడానికి సహనము, ప్రయత్నము, మరియు వినయము అలవరచు కోవాలని అంటున్నారు.   

 

పంచుకున్న కేసులు :