సాధకురాలి వివరములు 11594...India
ప్రాక్టీషనర్ 11594…ఇండియా మైక్రో బయాలజీలో పోస్ట్ డాక్టరేట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత వైద్య కళాశాలలో అధ్యాపకులు రాలిగా మరియు పరిశోధకురాలిగా ఉన్న వీరు 34 పరిశోధనా ప్రచురణలకు కారణభూతురాలు. ఈమె 12 జాతీయ మరియు అంతర్జాతీయ శాస్త్రీయ మరియు వైద్య పరిశోధనా పత్రికల సంపాదక మండలి సభ్యులుగా మరియు ప్రచురించిన వ్యాసాల సమీక్షకురాలిగా కూడా ఉన్నారు.
సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఈ అభ్యాసకురాలు చిన్నతనం నుండి సాయి సంస్థ యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2017 లో వీరి సహచరులు11567&11590 నుండి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని తన దీర్ఘకాలిక వ్యాధులకు నివారణ తీసుకోవడం ప్రారంభించారు. వారిచే ప్రేరణ పొంది ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకొని ఫిబ్రవరి 2018 లో ఎ.వి.పి. గా అర్హత సాధించి సెప్టెంబర్ 2018 లో వి.పి. అయ్యారు.
ఆమెకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రోగులకు చికిత్స చేయడానికి ఆమె ఆదివారాలలో స్థానిక సాయి కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఆమె పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్రతి సాయంత్రం ఇంట్లో కూడా రోగులకు సేవ చేస్తున్నారు. గత 15 నెలలుగా 590 మంది రోగులకు చికిత్స చేశారు. వీరు చికిత్స చేసిన వ్యాధులలో క్రోన్స్ వ్యాధి, పి.సి.ఒ.డి., జుట్టురాలడం, దీర్ఘకాలిక కండరాల ఎముకల వ్యాధులు, శ్రద్ధ లోపించడం, సోరియాటిక్ రుమటాయిడ్ ఆర్ధ్రైటిస్, ఊపిరితిత్తులలో నిమ్ము, సోరియాసిస్ మరియు చర్మ వ్యాధులలో అద్భుతమైన ఫలితం పొందారు. క్యాన్సర్, డయాబెటిస్, మూత్రపిండాల వైఫల్యం మరియుశారీరక ఎరితేమోటోసిస్ తో బాధపడుతున్న రోగులు గణనీయంగా మెరుగు పడ్డారు. డెంగ్యూరోగులు త్వరగా కోలుకున్నారు. పాత రోగుల చేత సూచింపబడిన చాలామంది సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం సంప్రదించగా నివారణలు పోస్టు ద్వారా పంపుతుంటారు.
ఈ చికిత్సానిపుణురాలు తన రోగులకు తగినంత సమయం ఇస్తూ శ్రద్ధగా వారు చెప్పే విషయాలను విని అవగాహన చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇది వారిని నిస్పృహ నుండి అనారోగ్య స్థితి నుండి బయటకు తీసుకు రావడానికి మరియు నివారణను వేగవంతం చేయడానికి సహాయ పడిందని ఆమె తెలుపుతున్నారు. ఈమె రోగులలో నిరాశ్రయులు మరియు వృద్ధులు కూడా ఉన్నారు. ఒంటరిగా ఉంటూ నిరాశకు గురైన వారికి CC15.2 Psychiatric disorders ఇస్తారు. దీనివలన వారు త్వరగా కోలుకొని తమ మనసులో ఉన్న భావాలను సమస్యలను ఒక కుటుంబ సభ్యురాలి వలనే భావించి అభ్యాసకురాలికి తెలుపుతారు. నివారణ ఇచ్చేముందు బాటిల్ ను దేవుడిగదిలో స్వామి యొక్క మండపంలో లేదా వారి ఫోటో ముందు ఉంచి సాయి గాయత్రి మరియు మృత్యుంజయ మంత్రాన్ని మూడుసార్లు జపించి ఇస్తారు. ఒకవేళ రోగి బాధ ఎక్కువగా ఉంటే నయం చేసే ఊదా రంగు కాంతిలో రోగి ఉన్నట్టుగానూ ఆ రోగికి పూర్తిగా నయం అయినట్టుగా భావిస్తూ స్వామిని ధ్యానిస్తూ ఉంటారు.
వైబ్రియానిక్స్ అనేది విజ్ఞాన శాస్త్రాన్ని, అధ్యాత్మికతనూ కలిపే ఒక చికిత్సా విధానము అని వీరి భావన. ఇది పరిశోధనకు ఒక ఉత్తేజకరమైన విషయంగా భావించి తదనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. పరిశోధన నిమిత్తం రోగుల నుండి వేరు చేయబడిన కొన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పానాసోనిక్ సూక్ష్మ జీవుల జాతులపై ఎంచుకున్న వైబ్రియానిక్స్ నివారణలు యొక్క యాంటీ మైక్రోబయల్ చర్య లేదా ప్రభావాన్ని పరీక్షించడానికి ఆమె అధ్యయనం ప్రారంభించారు. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు సాధారణంగా ఉపయోగించే యాంటీ బయాటిక్స్ కు స్పందించవు. ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఖచ్చితమైన ఫలితాలు వచ్చేవరకు పరిశోధన కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు.
అభ్యసకురాలు వైబ్రియానిక్స్ తో తన ప్రయాణం మనోహరంగా ఉత్తేజకరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. తన జీవితంలో ఇతరులకు సహాయం చేయాలనే తీరని వాంఛను తీరుస్తూ జీవితంలో ఏర్పడిన లోటును భర్తీ చేసిందని పేర్కొంటున్నారు. రోగికి ప్రేమతో దయతో స్వాంతన చేకూర్చే మాటలతో నివారణ ఇవ్వడం అద్భుతమైన ఫలితాలను నిజమైన సంతృప్తిని ఇస్తుందని వీరి భావన. రోగులను వారి బాధలనుంచి విముక్తి చేస్తూ వారి నిరాశ, ఆందోళన దూరం చేస్తూ వారి మానసిక స్థితిని పెంపొందిస్తూ ఆనందకరంగా జీవించేలా చేసే స్వామి యొక్క ఉన్నతమైన పనిముట్టుగా ఉండాలనేదే వీరి యొక్క ఆశయం.
పంచుకున్న కేసులు: