Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సాధకుని వివరములు


ప్రాక్టీషనర్ 02696...ఇండియా కంప్యూటర్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో పోస్ట్ డాక్టరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నోడల్ ఆఫీసరుగా వీరు పనిచేస్తున్నారు. అధ్యాత్మిక  కుటుంబ నేపధ్యము కలిగిన వీరికి చిన్నప్పటినుండి సేవ చేయాలనే ధృక్పధం ఉండేది.  వీరు స్వచ్ఛందంగా ప్రజల అవసరాల మేరకు ముఖ్యంగా వృద్ధులు, పిల్లల కోసం అనేక రకాల సహాయము అందించేవారు. 1999 లో వీరు ఒక దేవాలయమునకు వెళ్ళినపుడు అక్కడ సత్యసాయి సంస్థ లోని సేవాదళ్ వీరి చెప్పులను తీసుకొని భద్రపరచడం వీరి హృదయాన్ని కదిలించి ఆ ప్రేమలోని మాధుర్యం, గొప్పతనం వీరి కనులు తెరుచుకునేలా చేసింది. అదే సంవత్సరం వీరికి లభించిన భగవాన్ బాబా వారి దర్శనం వీరిని మంత్ర ముగ్ధులను చేసి వీరి ధృక్పధాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ తరువాత నుండి వీరు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. కొంతకాలం పాటు వీరి హృదయంలో ప్రజలతో మమేకం కావాలని వారికి సేవ చేయాలని తపన లోతుగా ఉండేది. కాలేజీ చదివే రోజులలో వీరియొక్క అన్నవాహికలోని పుండును హోమియోపతీ మందులు నయం చేయడం ఎంతగానో కదిలించింది. 2005 లో వీరు పాల్గొన్న సేవా కార్యక్రమంలో వైబ్రియానిక్స్ గురించి విని వైబ్రియానిక్స్ కు ఆకర్షితు లయ్యారు.

వీరు 2005 సంవత్సరంలోనే పేరు నమోదు చేసుకొని రెండువారాల శిక్షణ అనంతరం SRHVP మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజులలో 108CCబాక్సు ఇంకా రూపు దిద్దుకోలేదు. మొదట తన చుట్టాలకు, స్నేహితులకు మందులు ఇవ్వడం ద్వారా తన వైబ్రియానిక్స్ ప్రస్థానం ప్రారంభించారు. స్వామి యొక్క కృప వలన మెల్లగా పేషంట్లు పెరగ నారంభించారు. తన పైనా, వైబ్రియానిక్స్ పైనా స్వామి చూపించిన అనుగ్రహానికి కొలమానం వంటి ఒక లీలను ఈ సందర్భంగా వీరు గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి వైబ్రియానిక్స్ అంటే నమ్మకం లేని ఒక సాయి సభ్యునికి దీనిని గురించి వివరించారు. ఐతే అతడికి నమ్మకం బలపడలేదు. ఈ మందులు నిజంగా రోగాన్ని తగ్గిస్తాయా అనే అపనమ్మకంతోనే ఉన్నాడు. ఆరోజు రాత్రి స్వామి అతడికి కలలో కనబడి వైబ్రియానిక్స్ గురించి వివరించి ప్రాక్టీషనర్ కు సహాయ పడుతూ ఉండమని చెప్పారట. ఈ సంఘటన వీరిద్దరినీ ఎంతో కదిలించింది.

ఈ అభ్యాసకుడు అనేక  కేసులకు విజయవంతంగా చికిత్సలు అందించారు. అవి ఆస్తిగ్మాటిజం, దీర్ఘకాలిక కడుపు నొప్పి, మోకాలి నొప్పి, సైనసైటీస్, ఛాతీ ఇన్ఫెక్షన్, స్పాండిలైటిస్, చర్మ సమస్యలు, థైరాయిడ్, బి.పి. ఋతు సమస్యలు, వత్తిడి, నిద్ర రుగ్మతలు, మానసిక రుగ్మతలు మొదలగునవి.  మానసిక సమస్యలు,భావోద్వేగాల పరంగా బాధితులు, హైపర్ యాక్టివ్ పిల్లలు, మరియు ముసలి వారి సమస్యల విషయంలో వీరి అనుభవం అభిలషనీయమైనది.   ఇటువంటి కేసుల విషయంలో ఆలోపతి మందులు రోగాన్ని అణిచి వేస్తే వైబ్రో రెమెడీలు రోగాన్ని మూలంతో సహా నిర్మూలనం చేస్తాయని వీరి అభిప్రాయము.  వీరు ప్రాక్టీస్ మొదలు పెట్టిన తొలి నాళ్ళలో 2 సంవత్సరాల  హైపర్ యాక్టివ్ అమ్మాయిని వీరి వద్దకు తీసుకొని వచ్చారు. ఈమె అర్ధరాత్రి నిద్రలేచి టి.వి. ఆన్ చెయ్యమని చెప్పి కుటుంబసభ్యులందరినీ తనతో పాటు టి.వి. చూడమని చెప్పేది. ఆమె మాట వినక పోతే తలను గోడకు కొట్టుకునేది  NM6 Calming + SR422 Cherry Plum…OD అద్భుతాలు సృస్టించి వారం లోనే ఆమె అర్ధరాత్రి నిద్ర లేవడం మానేసింది!

వీరు బాచ్ ఫ్లవర్ నివారణలతో అద్భుత ఫలితాలను పొందారు.  ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉన్న ఒక 49 సంవత్సరాల వ్యక్తి ఆఫీసు నుండి రాగానే నిశ్శబ్దంగా తన గదిలోనికి వెళ్ళిపోతాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ వారితో కలిసి భోజనం చేయడం గానీ ఏమీ చేయడు. ఇలా 10 సంవత్సరాల నుండి కొనసాగుతోంది. ఇతడికి SR419 Beech + SR446 Vine. ఇవ్వబడింది. వారం తరువాత కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారము ఈ వ్యక్తి  పది సంవత్సరాల తరువాత  మొదటిసారి కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశాడని చెప్పి చాలా సంతోష పడ్డారు. 

11-సంవత్సరాల హైపర్ యాక్టివ్ పిల్లవాడు తన 5 వ ఏటనుండీ హింసాత్మక ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇతడి తల్లి అనేక రకములైన చికిత్సలు చేయించి ఫలితం లేక నిరాశగా ఉన్నారు. చివరికి ఆ బాలుడిని మానసిక వికలాంగుల పాఠశాలలో వేద్దామని కూడా నిర్ణయించుకుంది. వీరు స్వామిని ప్రార్ధించి ఈ బాలునికి  NM4 Brain-2 + NM5 Brain Tissue Salts (TS) + NM6 Calming ఇచ్చారు. రెండు వారాల లోనే ఈ బాలుడు తన తల్లిని కొట్టడం మానేసి కాస్త స్థిమితంగా ఉండడం ప్రారంభించాడు. నెల రోజుల తరువాత అబ్బాయి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం మందులు తీసుకోవడం కొనసాగిస్తున్నాడు. 

ప్రారంభంలో అభ్యాసకునికి మిషన్ తో మందులు తయారు చేయడం చాలా కాలయాపన గా ఉండేది. స్వామి దయతో 108CC బాక్సు వచ్చిన తరువాత మందులు ఇవ్వడం, మెడికల్ క్యాంపులకు వెళ్ళి రోగులను చూడడం సులభం అయ్యింది. 60 సంవత్సరాల వృద్దవనిత గత 15 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నది. ఆమె ఎన్నో రకాల చికిత్సా విధానాలు ప్రయత్నించి విసిగి పోయి ఉన్నారు. చికిత్సా నిపుణుడు ఇచ్చిన  CC4.3 Appendicitis + CC4.10 Indigestion. నివారణి  అద్బుతంగా పని చేయడంతో ఆమెకు ఈ చికిత్సా విధానము పట్ల విశ్వాసము పెరిగింది. ఆమె క్రమం తప్పకుండా రీఫిల్ కోసం రావడం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం మందులు వేసుకునే టప్పుడు ఆమె పెదవులపై నామస్మరణ సాగుతూ ఎంతో భక్తి విశ్వాసాలతో వాటిని స్వీయకరించడం చూసి వీరు '' స్వామీ మీరే ఆమెకు నయం చేస్తున్నా గుర్తింపు మాత్రం నాకు ఇస్తున్నారన్న మాట'' అని ప్రార్ధించేవారు.

వీరు పని వత్తిడి వలన ఆశించినంత సేవ చేయలేక పోయినా 2014 జనవరి 26 న పుట్టపర్తిలో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్ లో అంకిత భావంతో వాలంటీర్ గా పనిచేసే అవకాశం లభించింది.  ఆఫీసుకు సంబంధించిన పనివత్తిడి కొంత తగ్గగానే 2017 నుండీ వైబ్రియానిక్స్ కు మరింత సమయం కేటాయించడం వీరు ప్రారంభించారు. ప్రతీ ఆదివారము అనంతపురం సాయి మందిరం లో జరిగే సాయివైబ్రియానిక్స్ వైద్య శిబిరములో వీరు భాగం పంచుకోసాగారు.  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం వీరికి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అలాగే నెలకు ఒకసారి గ్రామంలో జరిగే క్యాంపులో కూడా ఇతర వాలంటీర్ లతో పాటు పాల్గొంటున్నారు. ఈ సేవల కారణంగా గత రెండు సంవత్సరాలుగా 1600 మంది పేషంట్లకు చికిత్స చేసే అవకాశం కలిగింది.   

ప్రతీ అభ్యాసకుడు ఆరోగ్య వంతమైన జీవన శైలిని అనుసరిస్తూ తన పేషంట్లకు ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయాన్ని వీరు నొక్కి వక్కాణిస్తున్నారు. తను ఆచరిస్తేనే ఇతరులకు  చెప్పగల అర్హత వస్తుంది. కేవలం రెమిడీలు ఇవ్వడంతోనే అభ్యాసకుని బాధ్యత పూర్తయినట్టు కాదు. పేషంటుకు ఆరోగ్యవంతమైన జీవన శైలి  స్వామి చెప్పిన ఆరోగ్య సూత్రాలు చెప్పి పంపించాలి. చికిత్సా నిపుణుడి వద్దనుండి బయటకు వచ్చిన రోగికి ఎంతో స్వాంతన చేకూరి అది పెదవుల పైన చిరునవ్వుగా వ్యక్తంకావాలి. ముఖ్యంగా వృద్ధులు తమను అంతా వదిలివేశారనే భావంతో ఉంటారు కనుక వారిని జాగ్రత్తగా చూసి పంపాలి.

ఈ చికిత్సా నిపుణుడి ఉద్దేశంలో వైబ్రియానిక్స్ ప్రత్యామ్నాయ చికిత్సా విధానము కాదు ప్రధాన చికిత్సా విధానము. ఎవరైనా సరే రోగం రాగానే డాక్టర్ వద్దకు పరిగెత్తే విధానము మార్చుకోవాలి. భగవంతుడు ప్రతీ ఒక్కరిలోనూ వ్యాధి నయం  చేసుకునే శక్తి ఇచ్చాడు. కనుకనే వీరు ‘’ఆలోపతి మందులతో ఏల నీకు చింత వైబ్రియానిక్స్ ఉండగా నీ చెంత’’ అని చెపుతూ ఈ రెమిడీ లతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుని రోగాలకు దూరంగా ఉందాం అని పిలుపు నిస్తున్నారు.  

పంచుకున్న కేసుల వివరాలు:

·       ఆనెలు పగుళ్లు

·       బహుళ సమస్యలు