చికిత్సా నిపుణుల వివరాలు 11271...India
ప్రాక్టీషనర్ 11271…ఇండియా వృత్తిరీత్యా ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉన్న ఈ ప్రాక్టీషనర్ ప్రధమ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన భార్య సాయి వైబ్రయోనిక్స్ ద్వారా పొందిన ఒక అద్భుత అనుభవం ద్వారా 2007 లో స్వామి పరిధిలోకి రావడం జరిగింది. ఈ సంఘటన మూలాల లోనికి వెళితే ...వీరి భార్యకు నిర్ధారిత ప్రసవపు తేదీ దాటిపోయినా కూడా నొప్పులు రావడం లేదు. డాక్టర్లు నొప్పులకోసం మందులు ఇచ్చినా పనిచేయలేదు. ఇక లాభం లేదు శస్త్రచికిత్స చేయవలసిందే అని డాక్టర్లు తేదీ నిర్ణయించారు. మరుసటి దినం 'సిజేరియన్' డెలివరీ జరగవలసి ఉండగా వైబ్రో ప్రాక్టీషనర్ 02090 గా ఉన్న ఆమె తండ్రి ఆమెకు వైబ్రియో రెమిడీని నిర్ణీతమైన వ్యవధిలో ఇవ్వడం ప్రారంభించాడు, దాని ఫలితంగా తరువాతి రోజు చాలా తక్కువ మోస్తరు నొప్పులతో సాధారణ డెలివరీ జరిగింది. ఈ అద్భుతానికి ఎంతో ఆనందించి స్వామికి తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి ఆయన తన కుటుంబంతో మొదటిసారి పుట్టపర్తి సందర్శించి స్వామిని మొదటిసారి దర్శించారు. ఈ సంఘటన అనంతరం ఈ ప్రాక్టీషనర్ తను ఉద్యోగం చేసే సీషేల్స్ అనే ద్వీప దేశానికి తిరిగి వెళ్లారు.
2008లో వీరి భార్య తిరిగి గర్భం ధరించారు. వీరు ఉంటున్న సీషేల్స్ ద్వీపంలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నందున తన భార్యను కేరళ లో వదిలిపెట్టి రావలసి వచ్చింది. ఈ సారి కూడా వైబ్రియానిక్స్ సహాయంతో 2009 లో వీరి శ్రీమతి సిజేరియన్ అవసరం లేకుండానే రెండవ బిడ్డకు జన్మ నిచ్చారు. వెంటనే రెండవసారి స్వామి దర్శనం చేసుకోవడానికి పుట్టపర్తి వచ్చారు. ఐతే మనసు ప్రశాంతంగా లేదు, కారణం ఏమిటంటే వీరికి ఇండియా లోనే ఉద్యోగం చెయ్యాలని ఉంది. తన విశ్వాసం బలపడడానికి స్వామి ఒక్కసారి ప్రసన్నంగా చూస్తే చాలు అని కోరుకున్నారు. అదృష్ట వశాత్తూ వీరికి మొదటి లైను లో కూర్చునే అవకాశం వచ్చింది. వీరి జీవితంలో అత్యంత ఆనందదాయక మైన మధురక్షణం రానే వచ్చింది. స్వామి దర్శనం ఇస్తూ వీరిదగ్గరకు వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం దానివెనుకనే అదృష్ట లక్ష్మి వీరిని వరించడం కూడా జరిగిపోయింది. వీరు ప్రశాంతి నిలయంలో ఉండగానే కేరళలో వీరి సొంతూరు లోనే ఒక పేరున్న టెలికం కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ లెటరు వచ్చింది. హృదయపు లోతులనుండి కృతజ్ఞతా భావం పొంగిపొరలగా స్వామిని సేవించాలనే బలమైన కోరిక వీరిలో ఉదయించింది. కేరళ లో మొదటి వైబ్రియానిక్స్ వర్క్ షాప్ జరిగినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని 2010 నవంబరులో AVP గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మే 2011లో VP గానూ, మే 2013 లో SVP గానూ, వెంటనే వైబ్రియోనిక్స్ టీచర్ గా కూడా పురోగతి సాధించారు.
వైబ్రో చికిత్స ప్రారంభించిన తొలిరోజులలో వీరు తన మామగారికి సహాయకునిగా ఉండేవారు. నెలకొకసారి నిర్వహించే వైబ్రో క్యాంపు నిమిత్తము వీరు తమ గ్రామము నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళివస్తూ ఉండేవారు. రోగులకు రెమిడిలు ఇచ్చే సందర్భంలో వీరు చాలా సందర్భాలలో 108 CC పుస్తకాన్ని చూసి రెమిడి లు ఇచ్చేవారు. ఒకసారి ఈ పుస్తకాన్ని తీసుకు వెళ్ళడం మరిచిపోయారు. కానీ స్వామిని ప్రార్ధించి ఆరోజు వచ్చిన 30 మంది పేషంట్లకు చికిత్సా నివారణులను ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత తన ఉత్సుకత కోసం పుస్తకాన్ని తీసి చూడగా పేషంట్ల వ్యాధులకు తను ఇచ్చిన రెమిడిలకు సంబంధమే లేదు. తిరిగి మరుసటి నెలలో క్యాంపుకు వెళ్ళినపుడు అత్యంత ఆశ్చర్యకరముగా 90 శాతం మందికి ఆ నెల రోజుల వ్యవధిలోనే వ్యాధి దాదాపుగా నయమవ్వడం చూసి ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి కేవలం స్వామి అనుగ్రహం తోనే వ్యాధి నయమవుతోందని మన జ్ఞానము, ప్రయత్నమూ వలన కాదని వీరు గ్రహించారు. అంతేకాక ఇకముందు అజాగ్రత్తగా ఉండకుండా 108 CC పుస్తకం, సోహం సిరిస్ లోని పుస్తకాలూ, మాన్యువల్, వార్తాలేఖలు చదువుతూ ఉండాలని గ్రహించారు. ఇప్పటికీ పూర్తి అంకితభావంతో మెడికల్ క్యాంపులలో పాల్గొంటున్నారు.
ఈ ప్రాక్టీషనర్ మైగ్రేన్/ పార్శ్వపు నొప్పి .విషయంలో CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia; అద్భుతంగా పనిచేస్తోందని తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అలాగే మెనియెర్స్ వ్యాధి మరియు లాబీరింతైటిస్ ( చెవి లోపల ఇన్ఫెక్షన్ ) వంటి సమస్యలకు మరియు తల తిరిగినట్టు ఉండటం (వెర్టిగో) కేసుల విషయంలో: CC3.1 Heart tonic + CC5.3 Meniere’s disease + CC18.7 Vertigo చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరు నిర్వహించిన మెడికల్ క్యాంపులలో కొందరు పేషంట్లు వ్యాధి నయమయ్యాక చెకప్ కి రాలేకపోయినా, వీరి దృష్టికి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన కేసుల గురించి వివరిస్తున్నారు.
65 సంవత్సరాల వయస్సు గల స్త్రీ అధిక బరువుతో పాటు వళ్ళంతా నొప్పులు కీళ్ళవాపు మరియు తిమ్మిరి వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలతో సతమత మవుతూ ప్రాక్టీషనర్ ను కలిసారు. గత 6 నెలలుగా ఈమె కడుపు నొప్పి మరియు రాత్రిపూట సుమారు 2 గంటల సమయంలో 2/3 సార్లు విరోచనానికి వెళ్ళవలసిన సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. ఇతర రకాల మందులు ప్రయత్నించారు కానీ ఫలితం కలగలేదు. ప్రాక్టీషనర్ ఈమెకు: CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion ఇవ్వడంతో నెల రోజుల లోనే కడుపు నొప్పి విరోచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే CC13.1 Kidney & Bladder tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine తీసుకున్న రెండు నెలలలోనే వొళ్ళు నొప్పులు కీళ్ళనొప్పులు తిమ్మిరులు తగ్గిపోయాయి. ఆ విధంగా రెమిడి మరో మూడు నెలలు కొనసాగించి మూడు కేజీలు బరువు కూడా తగ్గారు.
మరొక కేసు విషయంలో 27 సంవత్సరాల వయసు గల పేదకుటుంబానికి చెందిన కవల పిల్లలైన ఇద్దరు యువకులు అసమతౌల్యముగా ఉండే క్రియాటిన్ ఫాస్పోకినేజ్ -CPK స్థాయిల కారణంగా ఏర్పడిన కండరాల బలహీనత తో బాధ పడుతూ ఉన్నారు. 13 సంవత్సరాలుగా శరీరంలో పరిమితమైన కదలికలతో ఇబ్బంది పడుతూ వ్యాధి నయమవ్వడం కోసం అనేక చికిత్సా విధానాలు ప్రయత్నించారు కానీ ఏమాత్రం ప్రయోజనం కలుగలేదు. ఒక ప్రాణిక్ చికిత్సా నిపుణుని ద్వారా సాయి వైబ్రియోనిక్స్ గురించి ఈ యువకులు తెలుసుకున్నారు. ఐతే ప్రాక్టీషనర్ నుండి ఆ మందులు తీసుకోవాలంటే వారి శరీరము సహకరించని క్లిష్ట పరిస్థితిలో ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. వీరి ప్రయాణానికి కొద్ది రోజులు ముందు ఈ ఇద్దరు సోదరులలో ఒకరికి కల వచ్చింది. దీనిలో భగవాన్ బాబావారు ఒక హొమియోపతీ వంటి మందు గల సీసా అతని మీదకు విసిరివేసినట్లు కల వచ్చింది. ఆ తరువాత సరిగ్గా అలాంటిదే వారు ప్రాక్టీషనర్ నుండి తీసుకోవడం జరిగింది. ఇది ప్రాక్టీషనర్ తయారు చేసిన ఒక బ్లడ్ నోసోడ్. దీనిని వారు అత్యంత విశ్వాసంతో 6 నెలలు సేవించిన తరువాత ఈ యువకుల CPK క్రియాటిన్ ఫాస్పోకినేజ్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఇంతకుముందు కంటే మెరుగ్గా తమ శరీర భాగాలను కదిలించ గలుగుతున్నారు. ఈ సంఘటన తో వైద్య చికిత్సకు అసాధ్యమైన ఇటువంటి కేసులలో కూడా వైబ్రియానిక్స్ అద్భుతాలు చేస్తుందనే విశ్వాసం ప్రాక్టీషనర్ లో బలపడింది. ఐతే దురదృష్టవశాత్తూ ఆ యువకులు మెడికల్ క్యాంపుకు రావడం మానేయడంతో వీరి నుండి పూర్తి సమాచారం అందలేదు.
మరొక కేసు విషయంలో 43 సంవత్సరాల వయసు గల ఉపాధ్యాయుడు గత పది సంవత్సరాలుగా నరాల సంబంధమైన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వీరికి బ్లాక్ బోర్డు పైన రాయడం కష్టమవడంతో పాటు రాను రానూ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయడం కూడా అసాధ్యమైపోయింది. ఇది క్రమంగా ఈ ఉపాధ్యాయునిలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది. ప్రాక్టీషనర్ ఇచ్చిన రెమిడి CC15.2 Psychiatric disorders + CC18.4 Paralysis + CC20.5 Spine (చివరి కొంబో ప్రాక్టీషనర్ అంతర్ దృష్టితో ఇవ్వడం జరిగింది) 7 నెలలు తీసుకున్న తరువాత ఈ ఉపాధ్యాయునికి పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ముందు జాగ్రత్త కోసం వీరు దానిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.
చికిత్సా నిపుణుడిగా వివిధరకాల వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు వీరు వైబ్రియానిక్స్ కు సంబంధించిన అనేక రకాల పాలనా పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కేరళలో ప్రాక్టీషనర్ లనుండి మాస నివేదికలు సేకరించడంతో పాటు వీరు ప్రాక్టీషనర్ లకు అవగాహనా మరియు రిఫ్రెషర్ సదస్సులు నిర్వహిస్తూ కొత్త ప్రాక్టీషనర్లకు మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. వీరు చేసే మరొక అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు కష్టతరమైన సేవ 108 CC బాక్సులకు తుది రూపాన్ని ఇవ్వడం. ఇంకా IASVP మెంబెర్షిప్ కార్డుల ప్రింటింగ్ మరియు పోస్టింగ్ బాధ్యత కూడా వీరే వహిస్తున్నారు. 26 జనవరి 2014లో మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సు జరిగినప్పుడు వీరు ఎంతో అంకితభావంతో సేవ చేసారు.
మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాక్టీషనర్ కు వీరు ఉంటున్న నివాసస్థలం నుండి 3,000 కిలోమీటర్ల దురాన ఉన్న ఢిల్లీ కి బదిలీ అయ్యింది. స్వామిని హృదయపూర్వకంగా ప్రార్ధించడం తో ఆ ప్రార్ధన ఫలించి చెన్నై (కేవలం 700 కి.మీ. వీరికి ఒక రాత్రి ప్రయాణం) కి బదిలీ అయ్యింది. దీనితో వీరు తను చేస్తున్న సేవలు కొనసాగించడం, నెలవారీ సేవలు కొనసాగించడం తో పాటు ఇప్పుడు చెన్నై లో కూడా నెలవారీ వైబ్రో క్యాంపులలో పాల్గొనేందుకు అవకాశం లభించింది. వ్యాధులు నయం చేసే ధన్వంతరి భగవంతుడే ఐనప్పటికీ మన అంకితభావము, నిబద్ధతే భగవంతుని చేతిలో ఉన్నతమైన సాధనా పనిముట్లుగా మారడానికి అవకాశం కల్పిస్తాయి. అందుకే వీరు ఎల్లప్పుడూ వైబ్రియానిక్స్ మిషన్ లో మరిన్ని సేవా అవకాశాలు అందించి స్వామి దివ్య హస్తంలో ఉన్నతమైన సాధనా పనిముట్టుగా చేసుకోవలసిందిగా స్వామిని ప్రార్ధిస్తూ ఉంటారు.
పంచుకున్న కేసులు :
- తలపోటు, ప్రవర్తనా సమస్యలు
- గాయపడిన కాలు, హెపటైటిస్-B