Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 11590...India


 ప్రాక్టీషనర్  11590...ఇండియా బయో కెమిస్ట్రీ లో పట్టభద్రురాలు ఐనట్టి ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసరు గా పనిచేయుచున్నారు. వీరు 2014 లో స్వామి భక్తులుగా మారిన ఒక డాక్టర్ల కుటుంబ నేపధ్యం నుంచి వచ్చారు.  స్థానిక సత్యసాయి కేంద్రాలలోనూ మరియు ప్రశాంతి నిలయము లోనూ వీరి తండ్రి చేసే వైద్య సేవలు చూసి స్పూర్తి పొంది తనకు ఎంతో ఇష్టమైన బోధనా వృత్తితో పాటు వైద్య సేవలు కూడా చేయాలనే అభిలాష వీరిలో మొలకెత్తింది. 2017 లో వీరి బంధువైన ఒక వైబ్రో ప్రాక్టీషనర్ ద్వారా వీరి తల్లికి ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న అత్యంత బాధాకరమైన రుమటాయిడ్ అర్తెరైటీస్ కీళ్ళనొప్పుల సమస్య, వైబ్రో రెమిడి ల ద్వారా 6 నెలల లో తగ్గిపోవడం చూసి తన అభిలాష తీరే మార్గం సుగమం అయ్యింది. వైబ్రో రెమిడి ల ప్రభావం చూసాక  పేషంట్లకు సేవ చేయాలనే తపనతో వైబ్రో శిక్షణకు పేరు నమోదు చేయించుకొని 2017 లో AVP గా శిక్షణ పూర్తి చేసుకొని 2018 ఏప్రిల్ లో అవసరమైన మెంటర్ షిప్ ద్వారా VP  గా కూడా సర్టిఫికేట్ పొందారు. 

వీరు శిక్షణ పొందిన వెంటనే వైబ్రో రెమిడిల ప్రభావం ఏమిటో తన స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోగలిగారు. శిక్షణ పూర్తి చేసుకున్న 10 రోజులకు తన కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలు చేస్తూ ఉండగా ఎక్కువ టెంపరేచర్ తో జ్వరం ప్రారంభమయ్యింది.   3 రోజుల తర్వాత రక్త పరీక్ష చేయించుకోగా డెంగ్యు ఫీవర్ గా నిర్ధారణ అయ్యింది. కానీ ప్లేట్లేట్ కౌంట్ మాత్రం 150,000 ఉంది. ఐతే ఆ సమయంలో తనంతట తాను గానీ తన మెంటర్ ద్వారా గానీ వైబ్రో రెమిడి లు వేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లోనే సెలైన్ లు అలోపతి మందుల ద్వారా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. నాల్గవ రోజు వీరి ప్లేట్లేట్ కౌంటు 7000 కు పడిపోవడంతో అట్టి క్లిష్టమైన స్థితిలో వెంటనే హాస్పిటల్ లో చేర్చారు. వీరి చర్మపు రంగు కూడా నల్లగా మారిపోయింది. డాక్టర్లు ఆమెను దగ్గకుండా ఉండాలని ఎందుకంటే దానివలన రక్తస్రావము ప్రారంభమయ్యే ప్రమాదమే కాక ఆమె ప్లేట్లెట్లు కూడా మరింతగా పడిపోయే ప్రమాదము ఉందని తెలిపారు. వీరిని హాస్పిటల్ లో చేర్చిన రోజే వీరి మెంటరు హాస్పిటల్ కి వచ్చి స్వామిని ప్రార్ధిస్తూ క్రింది రెమిడిని ఇచ్చారు: NM2 Blood + NM12 Combination-12 + NM91 Paramedic Rescue + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM27 Infection + SM41 Uplift…ఈ విధంగా మొదటి రోజు ప్రతీ పది నిమిషాలకు ఒకసారి, రెండవ రోజు ప్రతీ గంటకు ఒకసారి, మూడవ రోజునుండి రోజుకు 6 సార్లు రెమిడి తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. ఈ మందుల వలన అద్భుతంగా కోలుకోగా ( వైబ్రో రెమిడిల కారణంగానే ఇది సాధ్యం అని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు) మూడవ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలోపతి మందులు తీసుకోవడం మానివేసి వైబ్రో రెమిడి లను కొనసాగిస్తూ మూడు వారాల వ్యవధిలో క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. అనంతరం CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ని వ్యాధి నిరోధక శక్తి పెంపుదల కోసం తీసుకోవడం ప్రారంభించారు. మరో వారం గడిచే సరికి వీరి ప్లేట్లెట్ కౌంటు 190,000 కి చేరుకొంది. ఈ విధంగా తనకు మరో జన్మ ప్రసాదించి నందుకు స్వామికి వైబ్రియోనిక్స్ కు వీరు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.   

మరొక ఆశ్చర్యకరమైన సంఘటనలో కటిభాగములో డిస్కుజారిపోవడం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న 22 ఏళ్ల మహిళ, ఈ ప్రాక్టీషనర్ ను సంప్రదించడం జరిగింది. డాక్టర్లు విశ్రాంతి కోసం సూచించిన రెండు నెలల విరామం పూర్తికాకముందే ఈమెకు వివాహం జరిగింది. అంతేకాకుండా కనీసం సంవత్సరం వరకూ గర్భం దాల్చవద్దని చేసిన సూచన కూడా పెడచెవిన పెట్టి ఈ పేషంటు గర్భవతి అయ్యారు. ఇటువంటి పరిస్థితిలో ప్రాక్టీషనర్ ఆమె వెన్ను నొప్పి కోసం CC10.1 Emergencies + CC20.5 Spine రెమిడిని మరియు ఆరోగ్యవంతమైన సంతానం కోసం CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic రెమిడిని ఇచ్చారు. రెండు వారాల తరవాత పేషంటు యొక్క పరిస్థితిని ఆధారం చేసుకొని CC8.9 Morning sickness ను కూడా కలపడం జరిగింది. మరుసటి నెలలో చెకప్ కోసం ఈ పేషంటు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ సూచన ప్రకారము ఈమెకు గర్భాశయ సమస్య (సర్విక్క్స్ సరిగా మూత బడకుండా ఉండటం cervical incompetence) కారణంగా 14 వారాల గర్భధారణ సమయం పూర్తయిన తరువాత గర్భాశయ సమస్యను సరి చేయడానికి శస్త్రచికిత్సకు తేదీ నిర్ణయింపబడింది. అప్పటి వరకూ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవలసిందిగా సూచించబడినది. ఈ కొత్తగా ఏర్పడిన సమస్య నిమిత్తం ప్రాక్టీషనర్ CC8.5 Vagina & Cervix ను కూడా కలిపి ఇవ్వడం ప్రారంభించారు. తదుపరి నెలలో గైనకాలజిస్ట్ ను కలిసినపుడు ఈమె గర్భాశయాన్ని పరీక్షించి ఈమె సర్విక్స్ మూసి ఉండబడటం చూసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు! ఈ సంఘటనతో పేషంటు కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించి స్వామి భక్తులయ్యారు. పేషంటు రెమిడిలను కొనసాగిస్తూ ఆగస్టులో డెలివరీ కోసం రెట్టించిన విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ పేషంటు యొక్క అనుభవం నుండి ప్రాక్టీషనర్  ఏం నేర్చుకున్నారంటే ‘’ కొంబో విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటే ఫలితం అంత  త్వరగానూ  ఉత్తమం గాను ఉంటుంది ‘’ అని తెలుసుకున్నారు. ఐతే మెడికల్ క్యాంపు నిర్వహించే సందర్భంలో సమయం తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది పేషంట్ లు కీళ్ళనొప్పులతో వస్తూ ఉంటారు కనుక వీరందిరికీ  లబ్ది చేకూర్చడానికి  CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures ఇస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు.  108 CC పుస్తకంలో ఉన్న మూవ్ వెల్ రెమిడి ని కొద్దిగా మార్పు చేసి దీనికి మూవ్ వెల్ 2 అని పేరు పెట్టారు.  తరుచుగా దీనిని ఉపయోగిస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు. అలాగే ప్రతీ వ్యాధికీ మనసే ప్రధాన కారణం కనుక CC15.1 Mental & Emotional tonic ను ఇవ్వడం ద్వారా వ్యాధి త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుందని వీరు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అంతేకాక మొక్కల విషయంలో కూడా CC1.2 Plant tonic ఒక్కటి మాత్రమే ఇచ్చేకన్నా పైన పేర్కొన్న రెమిడితో కలిపి ఇవ్వడం వలన ఫలితం అద్భుతంగా ఉంటుందని వీరు తెలుసుకున్నారు.

ఈ ప్రాక్టీషనర్ జలుబు, జ్వరము, సైనుసైటిస్, మలబద్దకము, దీర్ఘకాలిక వంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సోరియాసిస్, లిచెన్ ప్లానస్, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, టినిటస్ (చెవిలోహోరు), దీర్ఘకాలిక కుంగుబాటు, కాళ్ళ వాపులు, డయాబెటిస్, ఎడిహెచ్ డి(ADHD), స్వాధీనములో లేని మూత్రవిసర్జన, సెర్వికల్ స్పాన్డి లైటిస్, అమియో ట్రోపిక్ లేటరల్ స్లీరోసిస్ (ALS), మొదలగు వ్యాధులను విజయవంతంగా నయం చేశారు. మెంటరింగ్ విధానము కొత్త చికిత్సా నిపుణులకు ఒక గొప్ప వరమని మెంటరింగ్ విధానము ద్వారా తనకు లభించిన సహాయము అమూల్యమైనదని దీని ద్వారా పేషంట్ లతో ప్రవిర్తించే తీరు, సరియైన రెమిడిని ఎంపిక చేసే విధానము తెలుసుకున్నానని భావిస్తున్నారు. పవిత్రమైన ఆలోచనలు, హృదయ పూర్వక ప్రార్ధనలు చేయడం ద్వారా త్వరగా స్వస్తత కలుగుతుందని వీరు రోగులకు సలహా ఇస్తున్నారు. రెమిడిలను నీటితో తీసుకుంటేనే బాగా పనిచేస్తున్నప్పటికీ కొందరకి తాము పనిచేస్తున్న కార్యాలయాలకు తీసుకువెళ్ళడం, ప్రయాణాల్లో తీసుకు వెళ్ళడం అసౌకర్యముగా ఉండడంతో అటువంటి వారిని డోస్ మిస్ కాకుండా ఉండుటకు పిల్స్ రూపంలోనే రెమెడీ వేసుకోమని ప్రోత్సహిస్తున్నారు.

తన ఇంట్లో పేషంట్లకు చికిత్స చేయడంతో పాటు తన మెంటర్ తో కలసి స్థానిక సాయి సెంటర్ లలో మెడికల్ క్యాంపులలో కూడా వీరు పాల్గొంటున్నారు. వీరి ఉద్దేశంలో ఇతర ప్రాక్టీషనర్ లతో చికిత్సా అనుభవాలను పంచుకోవడం వృత్తిలో మరింత ఎదగడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న మరొక ప్రాక్టీషనర్ వీరితో కలవడంతో ఈ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించు కోవడంతో పాటు చికిత్సా వివరాలు, వార్తాలేఖల వివరాలు చర్చించుకుంటూ చక్కని అవగాహనతో ముందుకు సాగుతున్నారు.   

ఈ ప్రాక్టీషనర్ వైబ్రియో రెమిడి ని స్వీయ ప్రక్షాళణ నిమిత్తము అలాగే తన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతీరోజు ఉపయోగిస్తారు. వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణురాలిగా ఉండడం స్వీయ పరివర్తనకు దారి తీసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన అని ఇదే భావo తన పేషంట్ల మీద కూడా ప్రభావం చూపుతోoదని వీరి అభిప్రాయము. ఇంతకు ముందుకంటే ఇప్పుడు మరింత సమతుల్యతతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెపుతూ వీరు ఇలా అంటున్నారు. ‘’ ఇతరులపై నా అవగాహన మరియు నా గురించి ఇతరులకున్న అవగాహన లో ఎంతో మంచి మార్పు వచ్చింది. ‘’  ఇంతటి మహత్తర అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి  ప్రేమ విశ్వాసాలతో వీరు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

పంచుకున్న కేసులు: