Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 11583...India


ప్రాక్టీషనర్ 11583...ఇండియా వీరు వైద్యుల కుటుంబ నేపధ్యం కలిగిన వారు. ఐతే బోధనా వృత్తిపై వీరికి ఉన్న అభిరుచి వలన రసాయన శాస్త్రం లో డాక్టరేట్ తీసుకోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో అసోసిఏట్ ప్రొఫెసర్ గా ఇటీవల కాలం వరకూ పనిచేసారు. వీరు స్వామి ఫోల్డ్ లోనికి 1995 లో వచ్చారు. 1998 నుండి ప్రతీ సంవత్సరం పుట్టపర్తిని దర్శిస్తూ బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే మెడికల్  క్యాంప్ లో స్త్రీ వైద్య నిపుణురాలైన వీరి తల్లికి సహాయకురాలిగా సేవలందించేవారు. ఎప్పుడయితే వైబ్రో చికిత్సా నిపుణులుగా పనిచేస్తున్న వీరి సోదరుడు సాయి వైబ్రియోనిక్స్ గురించి చెప్పారో వైద్యురాలిగా సేవ చేయాలనే వీరి కోరికలకు రెక్కలు వచ్చాయి. వైబ్రియోనిక్స్ వెబ్సైట్ ద్వారానూ మరియు వార్తాలేఖల ద్వారానూ ఈ వైద్య విధానము గురించి తెలుసుకొని ఇది స్వామితో  తన బంధాన్ని దృఢపరుస్తుందనే నమ్మకముతో  వెంటనే కోర్సులో పేరు నమోదు చేసుకొని  2016 నవంబర్ లో AVP గా శిక్షణ పూర్తి చేసుకున్నారు.

వీరు శిక్షణ పొందిన సంవత్సరమే మెంటరింగ్ విధానము రావడం తన అదృష్టం గా భావిస్తున్నారు. మెంటర్ 10375 ద్వారా తను పొందిన సహాయ సహకారాలు వారి మార్గదర్శకత్వం తాను వైబ్రో ప్రాక్టీషనర్ గా ఎదగడానికి ఎంతో దోహద పడ్డాయని తన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. వీరి మాటల్లోనే చెప్పాలంటే ‘’ కొన్ని నెలలపాటు ప్రతీదినము మెంటర్  యొక్క  మార్గదర్శకత్వములో ముందుకు సాగడం నిజంగా ఒక వరము ‘’. త్వరలోనే అనగా 2017 జూలై లో VP గా ప్రొమోషన్ పొందడం తో పాటు నవంబర్  2017 నుండి ఒక క్రొత్త AVP కి మెంటర్ గా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకూ వీరు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధులయిన జలుబు, ఫ్లూ, సైనుసైటిస్, చర్మవ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు, సోరియాసిస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న 300 మంది పేషంట్లకు చికిత్స నందించారు.  

వీరు CC7.3 Eye infections యొక్క ప్రభావాన్ని తన అనుభవం ద్వారా వివరిస్తున్నారు. సంవత్సర కాలంగా బాధిస్తున్న కంటిరెప్ప కురుపు ఈ రెమిడి తో వారం రోజుల్లోనే పునరావృతం కాకుండా తగ్గిపోయిన వైనాన్ని ఇలా వివరిస్తున్నారు. 7-సంవత్సరాల బాబుకి ఆడుకునేటప్పుడు దెబ్బతగలడం వలన కంటిగ్రుడ్డు పైన రక్తం గడ్డకట్టి ఇన్ఫెక్షన్ వలన నొప్పి మంట కలగసాగాయి. ఈ రెమిడి ప్రారంభించగానే నొప్పి వాపు మూడు రోజుల లోనే తగ్గిపోయాయి. వారం రోజులలోనే ఎర్రని మచ్చ కూడా తగ్గిపోయింది.

మరొక ఆసక్తి కలిగించే కేసు విషయంలో 32 సంవత్సరాల వ్యక్తి నిద్రలో శ్వాస తాత్కాలికముగా నిలిచిపోవడం, విపరీతమైన అలసట, నిద్రలో బిగ్గరగా గురక పెట్టడం వంటి లక్షణాలతో గత 6 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. వీరికి  పగటిపూట CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental &Emotional tonic + CC19.3 Chest infections chronic రెమిడిని అలాగే  రాత్రి పడుకునేముందు  CC15.1 Mental &Emotional tonic + CC15.6 Sleepdisorders ను సూచించడం జరిగింది. ఈ పేషంటు వైబ్రో రెమిడిలు తీసుకునే సమయంలో మరే ఇతర మందులు తీసుకొనలేదు. నెల రోజుల్లోనే పేషంటుకు 50% మెరుగుదల రెండు నెలలలో 90% మెరుగుదల కనిపించింది. 5 నెలల తర్వాత పేషంటు జర్మనీ వెళ్ళడానికి ముందు మందులు తీసుకోవడంలో అలసత్వం వలన రోగలక్షణాలు మరలా బయటపడ్డాయి. ఈ సారి క్రమం తప్పకుండా వాడాలని నిశ్చయించుకొని రెమిడి ప్రారంభించారు. పేషంటు కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారము రెండు నెలలలో 90% ఉపశమనం కలిగిందని తను ఉంటున్న జర్మనీలో రీఫిల్ తీసుకుంటూ ఉన్నారని చెప్పారు.

CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies రెమిడిలను డిస్టీల్డ్ నీరు లేదా స్టెరైల్ నీటిలో వేసి నాసిక లో చుక్కలుగా ఉపయోగించినప్పుడు ముక్కులో ఏర్పడే సమస్యలకు సత్వర ఉపశమనం కలుగుతున్నట్లు ప్రాక్టీషనర్ తెలుసుకున్నారు. అలాగే మన ఇళ్ళలో గానీ పనిచేసే స్థలాలలో గానీ  CC15.2 Psychiatricdisorders + CC17.2 Cleansing చల్లుకోవడం వలన దుష్ప్రభావాలు లేదా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాక ప్రవేశించకుండా ఉంటాయని వీరు తెలుసుకున్నారు. అంతేకాక CC17.2 Cleansing పోలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (PCOD) మరియు థైరాయిడ్ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుందని తెలుసుకున్నారు.

ఈ ప్రాక్టీషనర్ తన వెల్ నెస్ కిట్ లో మాములుగా తీసుకువెళ్ళే 9 తో పాటు అదనంగా  CC12.1 Adult tonic + CC15.1 Mental &Emotional tonic + CC17.3 Brain & Memory tonic  ను తీసుకు వెళతారు. ఇది విద్యార్ధులకు పరీక్షల సమయంలో వత్తిడి భయాల నుండి దూరం చేయడానికి ఎంతో సహాయకారిగా ఉంటోంది. వీరు వ్యక్తిగతంగా కెమిస్ట్రీ ల్యాబ్ లో రసాయనాల ప్రభావానికి లోనుకాకుండా ఉండడానికి CC17.2 Cleansing…TDS గా ఉపయోగిస్తారు. తన ప్రయోగ శాలలో విద్యార్ధులకు యాసిడ్ పడడం వలన కలిగిన గాయాల నుండి సత్వర ఉపశమనం కోసం CC10.1 Emergencies ను నీటితో కలిపి ఇవ్వడం వలన త్వరగా నయం కావడమే కాక కనీసం చర్మం పైన మచ్చలు కూడా లేకుండా త్వరగా మానిపోవడం వీరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

వీరు హైదరాబాద్ లో స్వామి నిలయమైన ‘’శివం’’ లో వైబ్రియోనిక్స్ వైద్య బృందంలో చేరి సేవలు ప్రారంభించారు. 2017 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా మూడునెలల వ్యవధిలో ౩౦౦ మందికి వైద్య సహాయం అందించడం జరిగింది. సీనియర్ వైద్య నిపుణులతో కలసి పనిచేయడం తన జ్ఞానాన్ని విస్తృత పరిచిందని వీరు తెలుపుతున్నారు. ఈ ప్రాక్టీషనర్ తన కుటుంబ అవసరాల నిమిత్తము మరియు వైబ్రో సేవల నిర్వహణ నిమిత్తమూ తాత్కాలికంగా ఉద్యోగ బాధ్యతల నుండి విశ్రాంతి పొందారు. వీరు వైబ్రియోనిక్స్ డేటాబేస్ అప్డేటింగ్ టీం లో సభ్యురాలుగా సేవలు కొనసాగిస్తూనే SVP లెవెల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.

ఈ ప్రాక్టీషనర్ వైబ్రో సేవల ద్వారా సంతృప్తి మాత్రమే కాక అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ సేవలు వీరిలో ‘’భగవంతుడే అసలైన వైద్యుడు మరియు రోగ నివృత్తి కారకుడు ‘’ అనే విశ్వాసాన్ని పెంచి ప్రశాంతంగా తన సేవలు కొనసాగించే శక్తినందించాయి. ఈ ప్రాక్టీషనర్ తనకు దొరికిన అద్భుతమైన వైబ్రియోనిక్స్ పెన్నిధి ద్వారా తనలో ఎంతో పరివర్తన కలిగిందని అలాగే తన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా చెడు నుండి మంచి వైపుకు మరలేలా ప్రభావితం చేయగలుగుతున్నానని అంటున్నారు. వీరు ఎంతో ఉదాత్తంగా స్వామికి తన ప్రార్ధనను ఈ విధంగా తెలుపు తున్నారు.“ వైబ్రియోనిక్స్ సేవలు విస్తరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన వారందరికీ  ఈ సేవలు అందాలి. ప్రజలంతా  ఈ స్వీయ పరివర్తనా వైద్య విధానము వైపు మరలి తమ జీవన విధానము మార్చుకోవాలి”. 

పంచుకున్న కేసులు :