చికిత్సా నిపుణుల వివరాలు 10608...India
ప్రాక్టీషనర్ 10608…ఇండియా కార్పోరేట్ నిర్వహణ మరియు ఇంజనీరింగ్ విభాగాలలో 45 సంవత్సరాల సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత 2009 నుండి ఈ ప్రాక్టీషనర్ తమ జీవితాన్ని సాయి వైబ్రియానిక్స్ కే అంకితం చేసారు. వీరు సాయి వైబ్రియోనిక్స్ కు ఆకర్షిత మవడానికి కారణముగానూ తన జీవితంలో ఒక మలుపువంటిదిగా చెప్పబడే సంఘటన 2004 లో తన భార్యకు ఏర్పడిన రుమటోయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి. దాదాపుగా పక్షవాతానికి గురయ్యే పరిస్థితికి దారితీయడంతో మంచం మీద పడి ఉన్న పరిస్థితిలో ఇతరుల సహాయం లేకుండా కనీసం ఒక చిన్ననీళ్ళ గ్లాసును ఎత్తడం గానీ, మంచంలో మరొక వైపుకు తిరగడం గానీ చేయలేని పరిస్థితి ఈమెది. అన్ని రకాల చికిత్సలు మరియు నొప్పి నివారణలు ప్రయత్నించిన తరువాత ఫలితం లేకపోయే సరికి ఆమె జీవితం మీద ఆసక్తిని కోల్పోయారు. 2007లో, స్నేహితులతో కలసి ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లో లిఫ్ట్ సౌకర్యం లేకుండా భవనం పై అంతస్తులో నివసిస్తున్న ఒక ప్రాక్టీషనర్ గురించి తెలిసి ఈ ప్రాక్టీషనర్ భార్య అతికష్టంతో ఈ మెట్లన్నిటినీ ఎక్కి చికిత్సా నిపుణుడిని కలిసారు. ప్రతిరోజూ ఎనిమిది అల్లోపతి ఔషధాలను తీసుకుంటే తప్ప జీవితం గడప లేని ఆ దశలో ఈమె రెమిడి తీసుకోవడం ప్రారంభించారు. ఒక వారం తరువాత, నొప్పి తగ్గడం తో నొప్పి రెమెడీలను తీసుకునే అవసరం కూడా తగ్గింది. 15 రోజులు గడిచిన తరువాత, ఆమె ముందుగా తీసుకున్న దానికి సగం సమయంలోనే మెట్ల పైకి ఎక్కగలిగే స్థితి కలిగింది. 10 నెలల కాలంలో ఆమె పూర్తిగా కోలుకొని సాధారణ మరియు ఆరోగ్యకరమైన జీవితం ప్రారంభించారు. ఈ అద్భుత వైద్యం తన శ్రీమతి తో పాటు వీరు 2009 లో వైబ్రియోనిక్స్ కోర్సులో చేరి AVP గా మారడానికి అభ్యాసకుడికి ప్రేరణ ఇచ్చింది. తర్వాత వీరు 2011 లో పుట్టపర్తి లో SVP కోర్సుకూడా పూర్తి చేసారు. ఈ సమయంలో వీరు అనుభవించిన అనేక అద్భుతాలు వైబ్రియోనిక్స్ పట్ల వీరి విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. మహా సమాధికి ముందు స్వామి యొక్క చివరి దర్శనాన్ని పొందగలగడం తన అదృష్టంగా వీరు భావిస్తున్నారు. అంతేకాక వైబ్రియోనిక్స్ ద్వారా సేవచేయగలగడం వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందే అద్భుతమైన స్వామి మార్గము అని వీరి విశ్వాసము. 2011 లో వీరు వైబ్రియోనిక్స్ టీచర్ గా సర్టిఫికేట్ పొంది అప్పటి నుండి AVP లు మరియు VPల శిక్షణకు సంబంధించిన వర్క్ షాపులు మరియు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నారు
ఇప్పటివరకు వీరు తన శ్రీమతి తో కలసి 10,000 పైగా పేషంట్లకు చికిత్స చేసి హృదయము మార్దవమయ్యే ఫలితాలు పొందారు. వీరు తన అనుభవం ప్రకారము పేషంట్లు ప్రాక్టీషనర్ చెప్పిన సూచనల ప్రకారము రెమిడిలు తీసుకుంటే చాలా త్వరగా ఫలితం కలుగుతుందని తెలుసుకున్నారు. తన ఇంటిని సందర్శించే పేషంట్లను చూడడంతో పాటుగా నెలకు రెండుసార్లు ముంబాయిలోని స్వామి ఆశ్రమం ధర్మక్షేత్రం లో కూడా పేషంట్లకు చికిత్స చేస్తారు. వీరు చికిత్స చేసిన కొన్ని కేసుల వివరాలు
52-సంవత్సరముల వయసు గల వ్యక్తికి శరీరమంతటా కీళ్ళ నొప్పులతో పాటు అసిడిటీ, చాతి నొప్పి, నీరు చేరుకోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు. D విటమిన్ లోపము, ఆకలి లేకపోవడం, శరీర మంతటా దురదలు ఉండడం తో వీరికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
#1. CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.1 Digestive tonic + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue; #2. CC21.2 Skin infections; #3. CC15. 6 Sleep disorders.
రెండు రోజుల తర్వాత పేషంటుకు నీరు నిలవడంతో సహా సమస్యలన్నింటి నుండీ 40% ఉపశమనం లభించింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల తర్వాత నిద్ర కూడా గాఢంగా కలగసాగింది. నెల రోజులలోనే అన్ని లక్షణాల నుండి 80% ఉపశమనం లభించింది. ఈ సమయంలోనే ఆహారము మరియు జీవనవిధానము నకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పేషంటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నారు.
మరొక కేసు విషయంలో 48-సంవత్సరాల మహిళకు ఛాతీ క్రింది భాగంలో నొప్పి, భోజనం చేసాక, ఊపిరి అందక పోవడం, పొట్ట బరువుగా ఉండడం, గ్యాస్ మరియు అసిడిటీ, రుతుకాలంలో నొప్పులు మరియు జ్వరం వచ్చినట్లు ఉండడం, కీళ్ళ నొప్పులు మరియు పట్టేసినట్లు ఉండడం, ఛాతీ లో ఎడమ రొమ్ములో గడ్డ వీటన్నింటి నిమిత్తము:
CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC8.3 Breast disorders + CC8.7 Menses frequent + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue.
ఇవ్వడం జరిగింది. రెండు వారాల తర్వాత ఆమెకు ఊపిరి బిగబట్టినట్లు ఉండడం పూర్తిగా తగ్గిపోవడమే కాక మిగతా వ్యాధి లక్షణాల విషయంలో కూడా తగినంత మెరుగుదల కనిపించింది. మూడునెలల తర్వాత ఎడమవైపు రొమ్ములో గడ్డ కరిగిపోవడమే కాక మిగతా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు అన్నీ మటుమాయమయ్యాయి.
ఈ ప్రాక్టీ షనర్ బ్లడ్ నోసోడ్ మరియు పోటెన్ టైజ్ చేసిన యాంటిబయోటిక్ తో అద్భుత ఫలితాలు పొందారు. గోళీ రూపంలోనూ కంటి చుక్కలు* రూపంలోనూ ఇచ్చిన కొంబోలు గ్లుకోమా, కంటి కురుపులు, నీరుకారడం, ఇంకా ఇతర కంటి వ్యాధులకు అద్భుతంగా పనిచేశాయి. SRHVP ఉపయోగించి దూరముగా ఉన్నవారికి సైతం బ్రాడ్ కాస్టింగ్ ద్వారా చికిత్స చేయడం స్వామి అందించిన వరప్రసాదం అని వీరి భావన. ఈ విధంగా దాదాపు 100 పైగా పేషంట్ లకు సైనుసైటిస్, కీళ్ళనొప్పులు, పోలిసైటిక్ ఒవేరియన్ డిసీజ్ (PCOD) మరియు లైపోమా వంటి వ్యాధులను నయంచేయడము జరిగింది. అద్భుతం ఏమిటంటే పేషంటు యొక్క ఫోటో లేదా బ్లడ్ నోసోడ్ తీసుకొని బ్రాడ్ కాస్ట్ చేసిన 5-10 నిమిషాలలోనే స్వస్థత ప్రారంభ మయ్యేది.
పేషంట్లు తమ వ్యాధి నయం కాగానే ప్రాక్టీషనర్ చెప్పిన సూచనలను ముఖ్యంగా మోతాదు తగ్గించడం వంటివి పాటించరని అలాగే తమ జీవనవిధానము కూడా మార్చుకొనడానికి కూడా అంగీకరించరనీ దీనివలన వారికి వ్యాధి నయం కాబడినప్పటికీ మరలా వచ్చే అవకాశం ఉంటోందని ఈ ప్రాక్టీషనర్ వాపోతున్నారు.
* కంటిలో వేసుకునే చుక్కల తయారీకి సంపుటము 9 సంచిక 1 జనవరి-ఫిబ్రవరి 2018 వార్తాలేఖ ను చూడండి
పంచుకున్న కేసుల వివరాలు :