Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 12051...India


ప్రాక్టీషనర్ 12051...  చిన్ననాటి నుండి ఔషధములు మరియు పరిశోధన పట్ల ఆసక్తిని కలిగి ఉన్న కారణంగా ఈ ప్రాక్టీషనర్, అణు బయో టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అమెరికా లో పరిశోధనా శాస్త్రవేత్తగా పది సంవత్సరాలు పనిచేసారు. అంతేకాకుండా, 2001 నుండి సాయి సంస్థ యొక్క వివిధ సేవా కార్యక్రమాలలో వీరు చురుకైన భాగస్వామిగా ఉన్నారు.  స్వామి యొక్క బోధనల ద్వారా స్ఫూర్తి పొంది సేవ ద్వారానే పరివర్తన సంభవిస్తుంది అని వీరు గాడముగా విశ్వశిస్తారు. స్వామి యొక్క సందేశాన్ని కలలు ద్వారా పొంది వీరు  2008 అమెరికా నుండి భారతదేశంలోని పూనేకు చేరుకొని అదే స్పూర్తితో సేవలను కొనసాగించారు. అదే సమయంలో మొబైల్ వైద్య సేవలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా సాయి వైబ్రియోనిక్స్ కు పరిచయం చేయబడినారు. తన స్నేహితుడయిన ఒక ప్రాక్టీషనర్ ద్వారా ప్రేరణ పొందిన ఆమె త్వరలోనే సాయివైబ్రియానిక్స్ కోర్సులో చేరి 2012 లో AVP గానూ  మరియు 2013 లో VP గానూ  మారారు. 

వీరు AVP గా ఉన్నప్పుడే ఒక స్పష్టమైన కల ద్వారా రెండవసారి స్వామి చేత మార్గనిర్దేశం చేయబడి కుటుంబంతో సహా   బెంగుళూరుకు చేరుకొని తన నివాసమునకు సమీపంలో సాయి సెంటర్లో నడుస్తున్న ఒక వైబ్రియానిక్స్ క్లినిక్ ను పునరుద్ధరించడం ద్వారా వీరు సేవలలో పాల్గొనడం ప్రారంభించారు.

ఆమె తన 108 CC బాక్స్ గత మూడు సంవత్సరాలలో అనేక సార్లు స్వామి వారి దివ్య విభూతితో అనుగ్రహింపబడిన (ఫోటోగ్రాఫ్స్ చూడండి) విషయం మనతో  పంచుకుంటున్నందుకు  చాలా ఆనందిస్తున్నారు.

వీరు తాత్కాలిక వ్యాధులకు సంబంధించిన తీవ్రమైన శ్వాస మరియు జీర్ణసంబంధ మైన  అనారోగ్యాలు, ప్రయాణకాలంలో సంభవించే  అనారోగ్యం మరియు జెట్ లాగ్, చెవి ఇన్ఫెక్షన్, ఫ్లూ, మొదలైనవి మరియు దీర్ఘకాలికమైన వ్యాదులలో మధుమేహం, ఉబ్బసం, అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజం, హెర్నియా, టిన్నిటస్, చర్మ వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు, చిత్తవైకల్యం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, దంత సమస్యలు, స్త్రీల సమస్యలు వంటివి ఎన్నింటినో నయంచేసారు 

దాదాపు అన్ని దీర్ఘకాలిక కేసుల్లో గణనీయమైన మెరుగుదల సాధించడం పై ఆనందంతో స్వామికి  కృతజ్ఞత తెలుపుకుంటున్నారు.   1000 మంది రోగులు వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకుని, చికిత్స కోసం ఆమెను సంప్రదించడం అనేది కేవలం భగవంతుని యొక్క సంకల్పంతోనే సాధ్యమని వినమ్రంగా తెలియజేసుకుంటున్నారు.  ఒక సందర్భంలో, ఒక రోగి యొక్క దేవుడి గదిలో స్వామిపటం ముందు రెమిడి మాత్రలు సృష్టింపబడి ఉన్నాయి. అదేరోజు ఆమె తన స్నేహితుడయిన వైబ్రో అభ్యాసకుని  కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలో ఆ పేషంటు వైబ్రో చికిత్స కోసం అభ్యాసకుడిని చేరుకోవటానికి ఈ సంఘటన దారితీసిందనే విషయం వీరు తెలుసుకో గలిగారు. మరొక సందర్భంలో, ఒక పేషంటు తను వైబ్రియోనిక్స్ చికిత్స   తీసుకోవాలా వద్దా అని స్వామికి రాసిన ఉత్తరానికి సమాధానంగా ఆ కవరులో విభూతి సృష్టింపబడి వుoడటo  నిజంగా ఒక గొప్ప విశేషం.   

వీరు తమ అనుభవంలో పేషంటుకు ఇచ్చే రెమిడి లకు అదనంగా CC10.1 Emergencies కలపడం వలన చికిత్స వేగవంతం అవుతుందని తెలుసుకున్నారు. అలాగే  CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis సోరియాసిస్ వ్యాధిని పూర్తిగా దూరం చేసిందని తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రాక్టీషనర్ కు స్వయంగా కలిగిన కల్కేనియల్ స్పర్ (మడమ వెనుక ఎముక పెరుగుదల) మరియు ప్లాంటార్ ఫాసిటిస్ (అరికాలిలో చర్మం ముందుకు పొడుచుకు రావడం) CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic తో  పూర్తిగా మూడునెలలలో నయం అయ్యాయి. ప్రస్తుతం వీరికి నడకలో ఏమాత్రం నొప్పిగానీ, అసౌకర్యం గానీ లేదు. 

 17-సంవత్సరాల అమ్మాయికి ఏర్పడిన దీర్ఘకాలికమైన పార్శ్వపు నొప్పి ఆమె దినచర్యను అలాగే ఆమె చదువును ప్రభావితంచేసింది. కనీసం తల ఎత్తి బ్లాక్ బోర్డ్ ను చూడడం కూడా కష్టంగా ఉండేది. ఐతే ఆమెకు ఇవ్వబడిన రెమిడి  CC10.1 Emergencies + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic తో నెల రోజుల లోపే ఆమెకు పూర్తిగా నయమయ్యింది. ఆ అమ్మాయి మరియు ఆమె తల్లి కూడా ఈ అద్బుత చికిత్సకు ఎంతో ఆనందించారు

మరొక కేసు విషయంలో అల్జీమర్స్ మరియు చిత్తవైకల్యంతో బాధపడుతున్న ఒక 81 ఏళ్ల వ్యక్తి కి CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.2 Alzheimer’s disease ఇవ్వడం వలన తన ప్రవర్తన పరంగా 18 నెలల్లో గణనీయమైన స్థాయిలో (80%) పెరుగుదల కనిపించింది. తన అదుపులేని ప్రవర్తనతో బాధపడుతున్న అతని కుటుంబ సభ్యులు ఈ విధంగా ఉపశమనం కలిగించినందుకు స్వామికి  మరియు వైబ్రియోనిక్స్ కు  కృతజ్ఞతను తెలియజేస్తూ రెమెడీలను కొనసాగిస్తున్నారు.

సాయి విబ్రియోనిక్స్ వైద్యం అత్యంత ప్రభావవంతమైన చికిత్సా వ్యవస్థ అని ఈ అభ్యాసకురాలికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. తన అనుభవాల ఆధారంగా ముఖ్యంగా పిల్లలలో యాంటీబయాటిక్స్ అవసరాన్ని ఈ చికిత్సా విధానము గణనీయంగా తగ్గించి వేయగలదని వీరు తెలుసుకోగలిగారు.  శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ఫీల్డ్, బెంగుళూరులో ఏప్రిల్ 2017 నుండి 'వెల్నెస్ క్లినిక్'లో ఆమెకు సేవచేయడానికి అవకాశము కలిగినందుకు వీరు స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గ్రామ సేవలో భాగంగా నిర్వహిస్తున్న  సాయి విబ్రియోనిక్స్  వైద్య  బృందంలో  చురుకైన సభ్యురాలిగా కూడా వీరు సేవలందిస్తున్నారు. తన పరిశోధనా నేపధ్యం కారణంగా వీరు సంస్థ నిర్వహిస్తున్న పరిశోధనలలో కూడా  హృదయ పూర్వక భాగస్వామ్యం వహిస్తున్నారు.

మన్నించే తత్వము, సవాళ్ళను స్వీకరించడం, మరియు చేస్తున్న పనికి పూర్తిగా న్యాయం చేయడం ద్వారా జీవితం ఆనంద మయంగా శాంతియుతంగా ఉంటుందని వీరి విశ్వాసము. ‘’ఎట్టి ఆహారమో అట్టి ఆలోచనలు, ఎట్టి ఆలోచనలో అట్టి జీవితం‘’ అంటారు స్వామి. కనుక ఆరోగ్యవంతమైన ఆహారము తీసుకుంటూ సంబంధ బాంధవ్యాలలో సమతుల్యం పాటిస్తూ పవిత్రమైన భావాలు కలిగి ఉండాలి అని వీరి అభిప్రాయము. దీనికి నిరంతర సాధన అవసరం. మన సాయి వైబ్రియానిక్స్ అట్టి అవకాశాన్ని అందించే ఉత్తమ సాధనం అని వీరి విశ్వాసము!