చికిత్సా నిపుణుల వివరాలు 11567...India
ప్రాక్టీషనర్ 11567...భారత దేశం వీరు అత్యంత అంకిత భావం కల SVP మరియు చికిత్సేతర విభాగమైనట్టి ఫార్మకాలజీ లో MD డిగ్రీ కలిగనట్టి అర్హతగల అల్లోపతీ డాక్టరు. ప్రస్తుతం వీరు ఒక ప్రఖ్యాత మెడికల్ కాలేజిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. తాము నేర్చుకున్న విషయాలను, తమ నైపుణ్యములను నిస్వార్ధ సేవకే ఉపయోగించాలనే తపనతో స్థానికసాయి సెంటర్ లలో నిర్వహించే మెడికల్ క్యాంపులలో పాల్గొనేవారే కానీ ఎన్నడూ ప్రైవేటు ప్రాక్టీస్ చేద్దామనే తలంపు కూడా వీరికి లేదు. ఐనప్పటికీ ప్రతీరోజు పేషంట్లకు సేవ అందించలేకపోతున్నాననే బాధ ఏదో తెలియని శూన్యం మనసులో గూడు కట్టుకొని స్థిమితం లేకుండా చేస్తూ ఉండడంతో స్వామినే మార్గనిర్దేశ్యం చేయమని ఈ వెలితిని పూడ్చమని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. ఆర్తితో ప్రార్ధించే వారి ప్రార్ధన వృధా కాదు అనడానికి నిదర్శనంగా స్వామి వీరికి కలలో కనిపించారు. తన అదృష్టానికి ఉప్పొంగిపోతూ తన ప్రార్ధన మన్నించమని స్వామిని కోరగా స్వామి సూటిగా వీరి కళ్ళ వైపు చూసి అదృశ్య మయ్యారు. కొద్ది రోజుల్లోనే ఒక సాయి సోదరుని ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొనడం, దీని తాలూకు వెబ్సైట్ చూడడం, డాక్టర్ అగర్వాల్ గారి సౌల్ జర్న్స్ ఇంటర్వ్యూ లు చూడడంతో స్వామి తన ప్రార్ధన ఆలకించారు అనే ఒక స్పురణ వీరికి కలిగింది. వెంటనే వైబ్రియానిక్స్ శిక్షణకు దరఖాస్తు చేయడంతో ప్రక్రియ మొదలై 2015 మార్చి లో వీరు AVP గా ఉత్తీర్ణు లైనారు . అంతేగాక రెండు సంవత్సరాల లోపే వీరు VP గానూ అనంతరం SVP గానూ ఉత్తీర్ణత సాధించారు.
వీరు 2015 మే నుండి స్థానిక సాయి సెంటర్లలో వైబ్రియోనిక్స్ క్యాంపులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరు పార్శ్వపు నొప్పి, మోకాళ్ళ నొప్పి, సోరియాసిస్, అజీర్ణం, జలుబు, వైరల్ ఫీవర్లు, ఆందోళన, మదుమేహం, తలత్రిప్పడం, సైనుసైటిస్, స్త్రీల ఋతు సంబంధమైన సమస్యలు, మానసిక వ్యాధులు, భయాలు, అలెర్జీ లు, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు వంటి అనేక వ్యాధులకు చికిత్సనందించారు. వ్యాదులన్నింటికీ మూలకారణం మనసే కనుక వివిధరకాల వ్యాధులకు సంబంధించి నంతవరకు CC15.1 Mental & Emotional tonic ను కలపడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని వీరు తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అలాగే పిల్లలలో వచ్చే వైరస్ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో CC9.2 Infections acute + CC12.2 Child tonic అద్భుతంగా పనిచేస్తాయని తమ అనుభవం ద్వారా తెలుసుకొని ఇతరులకే కాక తమ పిల్లలకు కూడా ఇవే ఇచ్చేవారు. ఈ రెమిడి, వైరస్ వ్యాధులతో భాద పడుతున్న పిల్లలలో, రోగులలో వచ్చే బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ లను రాకుండా నివారించి తద్వారా యాంటిబయాటిక్ ల వాడవల్సిన అవసరం తప్పించి ఇటు పేషంట్లకు, వారి తల్లి దండ్రులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. పార్శ్వపు నొప్పి వలన కలిగే అతి తీవ్రమైన తల నొప్పులను కూడా CC11.3 Headaches + CC11.4 Migraines ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొని అద్భుతమైన ఫలితాలు పొందినట్లు వీరు తెలుపుతున్నారు. ఇంతేగాక స్టెరైల్ వాటర్ లో CC7.3 Eye infections ను కలిపి చుక్కల మందును తయారు చేసి పేషంటుకు ఇచ్చినట్లయితే అది కళ్ళకలకలు, కళ్ళవాపు, కళ్ళమంటలు, గులాబీ కన్ను వంటి ఇన్ఫెక్షన్ వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని కూడా వీరు స్వీయ అనుభవం ద్వారా తెలుసు కున్నారు.
వీరు తమ పేషంట్లకు చికిత్స చేసేటప్పుడు తరుచుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సూక్తులను ముఖ్యంగా ఆరోగ్య కరమైన జీవనవిధానము గురించి స్వామి చెప్పిన వాటిని ఉటంకిస్తూ ఉంటారు. అలాగే తమ పేషంట్లకు వీరు స్వయంగా తయారు చేసిన ‘’సాయిబాటలో జీవనవిధానము ‘’ అనే ఆడియో క్లిప్పింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది మన ఆలోచనల యొక్క ప్రభావము మన ఆరోగ్యం పైన, మరియు సమాజంలో మన అనుభవాల పైనా, ఎలా ఉంటుందనేది వివరిస్తుంది. సంపూర్ణమైన నివారణా విధానము లో వీరికున్న అపార జ్ఞానము ద్వారా ‘’వయొలెట్ ఫ్లేమ్’’ ధ్యాన విధానము ఆచరించడం ద్వారా మన చెడు ఆలోచనలను మంచి ఆలోచనలుగా మార్చుకొనేందుకు అవకాశం ఉందని వీరు తెలియజేస్తున్నారు. పేషంట్లకు చికిత్స చేయడం తో పాటు వారి అర్హతలను బట్టి ఈ దివ్యమైన వైద్య విధానము లోనికి ప్రాక్టీషనర్లుగా రావలసిందిగా వారిని ప్రోత్సహించడం వీరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రాక్టీషనర్ లో ఉన్న ఉన్నతమైన ఆదర్శం, ఎందరో పేషంట్లు తమ జీవన విధానము మార్చుకొని మానవత్వము నుండి దివ్యత్వము వైపు మరలడానికి దోహదపడింది.
ప్రాక్టీషనర్ తన అనుభవం లోనికి వచ్చిన కొన్ని కేసులలో ఒక 40-సంవత్సరాల స్త్రీ గత 16 సంవత్సరాలుగా పార్శ్వపు నొప్పి, హార్మోన్ అసమతౌల్యం కారణంగా తలపోటు, నీరసం, గుండెదడ వంటి వాటితో బాధపడుతున్న కేసు గురించి మనతో సమాచారం పంచుకుంటున్నారు. ఈమె ఎన్నో రకాల చికిత్సలు చేయించుకున్నారు కానీ ఫలితం కనబడలేదు. పై లక్షణాలకు తోడు ఈమెకు కడుపులో మంట నిద్రలేమి కూడా కలగసాగాయి. ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది. CC3.7 Circulation + CC4.10 Indigestion + CC6.2 Hypothyroidism + CC8.6 Menopause + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.4 Eating disorder. అంతేకాక ఆరోగ్యవంతమైన జీవన విధానము కూడా అలవరచుకోవలసిందిగానూ వ్యాయామం ద్వారా దేహానికి కొంత శ్రమను కూడా కల్పించవలసిందిగానూ సూచింపబడింది. రెమిడి తీసుకున్న రెండు వారాలలోనే తనకు 100% తగ్గిపోయిందని ఆమె చెప్పారు. దీనితో ఎంతో స్పూర్తిని పొందిన ఈమె ప్రాక్టీ షనర్ కు వారం వారం జరిగే మెడికల్ క్యాంపులలో సహకారాన్ని అందిస్తున్నారు.
మరొక కేసులో 51-సంవత్సరాల మహిళ గత 3½ సంవత్సరాలుగా కీళ్ళవాతం, కీళ్ళనొప్పులతో బాధ పడుతున్నారు. విపరీతమైన నొప్పి వలన తన దినచర్యలను కూడా చేసుకోలేక పోతున్నారు. ఆమె అలోపతి మందులు వాడుతూనే ఉన్నప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది. CC12.4 Autoimmune diseases + CC20.3 Arthritis. నాలుగు వారాలలోనే ఆమెకు 90% మెరుగుదల కన్పించింది. మూడు నెలలు వాడే సరికి ఆమెకు వ్యాధి లక్షణాలే లేకుండా పూర్తిగా తగ్గిపోయింది. ఈ అద్భుత నివారణ వీరి కుటుంబము పైన కూడా ప్రభావము చూపడంతో స్వామి పట్ల వారి నమ్మకము భక్తీ పెరిగాయి. అంతేగాక వీరి కుమార్తె వృత్తీ రీత్యా అలోపతి డాక్టర్ ఐనప్పటికీ వైబ్రియానిక్స్ శిక్షణ తీసుకొని 2017 నవంబర్ లో AVP11590 అయ్యారు.
ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్టాలకు కోఆర్డినేటర్ గా ఉంటున్నారు. వీరు వార్తాలేఖలను తెలుగు లోనికి అనువదించే కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నారు. ఇటీవల వైబ్రియోనిక్స్ లో వస్తున్న మార్పులు దీని ద్వారా లబ్ది పొందుతున్నరోగుల సంఖ్యలో పెరుగుదల, అదేవిధంగా ఎంతోమంది ఔత్సాహికులు శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రాక్టీషనర్ ‘’ వైబ్రియానిక్స్ మానవాళికి సేవలందించడానికి సిద్దంగా ఉంది కానీ మానవాళి ఆ సేవలందుకొనడానికి సంసిద్దంగా లేదు’’ అన్ననానుడిని సవరిస్తూ ‘’మానవాళి కూడా అందుకు సంసిద్దమై ఉంది’’ ఆని ధైర్యంగా ప్రకటిస్తున్నారు.