వైబ్రో అభ్యాసకుల వివరాలు
ప్రాక్టీషనర్ 03556…ఫ్రాన్సు , వీరు బెల్జియం దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫ్రాన్సు ఉత్తర ప్రాంతమునకు చెందినవారు. 2017 జూన్ నెలలోనే వీరు AVP గా శిక్షణ తీసుకున్నారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలసిన తర్వాత వైబ్రియోనిక్స్ కుటుంబములో చేరవలసిన అవసరం వీరు గుర్తించారు. ఈ వ్యక్తే ప్రాక్టీషనర్ లో రోగులకు,బాధార్తులకు హృదయపూర్వకంగా సేవ చేయాలనే కోరికకు బీజం వేసారు.అంతేకాకుండా వీరు ప్రాక్టీ షనర్ ను,శిక్షణా నిపుణుడు , ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620, కు పరిచయం చేసారు. వీరి శిక్షణ లో ప్రాక్టీ షనర్ పేషంట్లను ప్రేమ,దయ లతో చికిత్స చేయాలని నేర్చుకున్నారు. ప్రాక్టీ షనర్ మాటల్లో చెప్పాలంటే ‘’ నాకు,నా కుటుంబానికి,నా చుట్టుప్రక్కల వారికీ వైద్యం చేయడానికి మెరుగైన,సరళమైన వైద్య విధానము నేర్చుకోవాలనే కోరిక వైబ్రియోనిక్స్ ద్వారా తీరింది.”
ప్రాక్టీషనర్ ఉంటున్న ప్రాంతంలో సూర్యరశ్మి చాలా తక్కువగానూ ,ఎప్పుడూ తేమగానూ,ఉండడంతో ఎక్కువ శాతము ప్రజలకు ఆత్మవిశ్వాసం తక్కువగాను,మానసిక మాంద్యం తోనూ ఉంటారు. అంతేకాక ఎక్కవ మంది విపరీతంగా అలోపతి మందులకు అలవాటు పడడంతో హానికరమైన దుష్పలితాలకు గురియయిన వారు కూడా ఎక్కువే. కొన్ని మందులు పనిచేయని పరిస్థితి కూడా ఏర్పడింది. కనుక తను సేవచేసుకునేందుకు చక్కని అవకాశము గా ప్రాక్టీషనర్ భావించారు. అవసరమైన వారికి తగు సహాయము అందించి వారిబాధలనుండి నివృత్తి చేయడమే నిజమైన సేవ అనీ అదే నిజమైన గౌరవ మనీ వీరు భావించారు. వీరి మాటల్లోనే చెప్పాలంటే ‘’ నేను వారిలో ఆశ అనే బీజాలను నాటి ప్రయోజనాత్మకమైన మార్గం వైపు మరలించాననే తృప్తిని పొందాను.”
కేవలం కొన్ని నెలలపాటు చేసిన సేవలో వీరు అనేక కేసులు ముఖ్యంగా జలుబు,విపరీతమైన అలసట,అలెర్జీ, బహువిధాలయిన స్స్కెలోరోసిస్ వ్యాధులు,కణుతులు,ముక్కులో గడ్డలు,పంటినొప్పులు,మెన్సెస్ నొప్పులు,వంటి కేసులకు అద్భుతంగా చికిత్స నందించారు.పెంద్యులం ఉపయోగించడంలో కూడా వీరు శిక్షణ పొంది యున్నారు కనుక ఏదయినా వ్యాధి కి సరియయిన కొమ్బో నిర్ధారణ నిమిత్తం వీరు పెండ్యులం ఉపయోగిస్తారు .అలాగే జంతువుల విషయంలో కొమ్బో త్వరగానూ అద్భుతంగానూ పనిచేస్తున్నట్లు వీరికి అనుభవమయ్యింది. వీరు శిక్షణ తీసుకున్న ప్రారంభంలో ఒక అలంకార ప్రాయంగా ఉండే కోడి పెట్ట కోడి పుంజుల చేత అనేక వారాలు చిన్నా భిన్నం చేయబడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదానిలాగా ఆహారం మానేసి కనులు మూసుకొని ఉండసాగింది.ప్రాక్టీషనర్ దీనికి CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic…BD నీటిలో కలిపి ఇచ్చారు.రెండు రోజుల లోనే ఇది ఆహారం తినడం ప్రారంభించింది.కొన్ని వారాలలోనే ఇతర కోడి పెట్టలతో కలసి తిరగ సాగింది. మరొక కేసు విషయంలో ఒక కోళ్ళ ఫారంలో 7 సంవత్సరాల వయసుగల కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టడం మానేసాయి. ప్రాక్టీ షనర్ వాటికి CC1.1 Animal tonic నీటితో కలిపి ఇవ్వడంతో ఆ కోళ్ళ ఫారం యజమాని రెమిడి ఇచ్చిన కోళ్ళు చక్కగా గుడ్లు పెడుతున్నాయని ప్రాక్టీషనర్ కు తెలిపారు.
7 సంవత్సరాల యార్క్ షైర్ జాతికి చెందిన ఆడకుక్కకు ఒకటవ సంవత్సరం నుండి ఆస్తమా మరియు గుండెలో సమస్యలు ఉన్నాయి.అంతేకాక కుక్క యజమాని దానిని ఇంట్లో వదిలి వేయడంతో ఒంటరితనం కూడా అనుభవిస్తోంది. ఎప్పుడయినా మరీ ఇబ్బంది ఏర్పడినపుడు యజమాని దానికి ఇన్హేలర్ సహాయంతో అలోపతి వైద్యం చేయించ సాగారు. 2017 మే నెలలో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.
CC1.1 Animal tonic + CC3.4 Heart emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections…BD నీటితో.
సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు దీనికి ఆస్తమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కానీ దీనికి విభిన్నంగా రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చినప్పటికీ ఆస్తమా పూర్తిగా మాయమయ్యింది. నెల తర్వాత సేకరించిన సమాచారము ప్రకారము దీనికి ఆస్తమా తిరిగి రాలేదని తెలిసింది.
ప్రాక్టీషనర్ తన పెరడులో ఉన్న కూరగాయల మొక్కల పైన కూడా వైబ్రో మందుల ద్వారా అద్భుత ఫలితాలు పొందారు. గత సంవత్సరం వీరికి ఒకే ఒక టమాటా దొరికింది ఎందుకంటే టమాటా మొక్కలన్నీ తెగులు వచ్చి కాయలేదు..కనుక వీరు ఈ సంవత్సరం కొన్ని వారాల పాటు CC1.2 Plant tonic…OD ఇవ్వడంతో వీరికి 15 కేజీల చక్కటి రసం తో నిండిన టమాటా పంట లభించింది !
వీరి మాటలలోనే చెప్పాలంటే “నేను హృదయంతో సేవ చేయగలగడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇలా చేస్తున్నప్పుడు వస్తున్న ఫలితాలు నా నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.స్వామి దివ్య హస్తాలలో పనిముట్టుగా మారడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.”