వైబ్రో అభ్యాసకుల వివరాలు 03527...France
ప్రాక్టీ షనర్ 03527…ఫ్రాన్స్ వీరికి భగవాన్ బాబావారితో మొదటి సమాగమము 1995 లో కలిగింది . ఆ సందర్భంలో వీరు రెండు వారాలు ప్రశాంతి నిలయంలోనే గడిపారు. అదొక అద్భుతమైన అనుభవంగా వీరికి మనః ఫలకము మీద ఉండిపోయింది. దశాబ్దాల తరబడి అనేక ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల అభిరుచి పెంచుకున్నారు కానీ దేనిని పాటించాలనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోన లేకపోయారు. వీరికి అంతకు ముందే .మనవ దేహంలోని చక్రాలు,మెరిడియన్ ల విషయంలో అవగాహన ఉండడం తో ఈ ప్రత్యామ్నాయ చికిత్సా విధానంలో శిక్షణ తీసుకున్నారు. అంతేకాక అలోపతి మందుల యొక్కహానికరమైన దుష్పలితాలు, మరియు మూలానికి చికిత్స చేయకుండా రోగానికి చికిత్స చేసే ఈ లోపభూయిష్ట మైన విధానము పట్ల పూర్తి ఆగాహన ఉంది. ఎప్పుడయితే ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620 వైబ్రియోనిక్స్ గురించి చెప్పారో వెంటనే ఈ విశ్వవ్యాప్త సార్వజనీనమైన విధానము పట్ల వీరు ఆకర్షితులయ్యారు. వైబ్రియోనిక్స్ వెబ్సైట్ ద్వారా ఈ విధానము పట్ల అవగాహన పెంచుకున్నారు. అనంతరం తన కు వచ్చిన దీర్ఘకాలిక కటి భాగంలో వెన్నుముక నొప్పికి రెమిడి తీసుకోవడం తో పాటు వైబ్రియోనిక్స్ శిక్షణకు కూడా నమోదు చేయించుకున్నారు. తనలో నిగూఢముగా ఉన్న సేవచేయాలనే తపన ,కోరిక స్వామికి తెలుసు కనుక ఈ విధంగా సానుకులమయ్యే పరిస్థితి కల్పించారని వీరి భావన. తను ప్రశాంతి నిలయం దర్శించుకున్న సమయం నుండే స్వామి తన హృదయ క్షేత్రాన్ని ప్రేమ బీజాలు మొలకెత్తడానికి ఇన్ని సంవత్సరాలుగా అనుకూలం చేస్తూ వచ్చారని అది ఇప్పుడు ఈ విధంగా ఒక అద్భుతమైన వైద్యవిధానము లో ప్రవేశించి సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించి తన కలను సాకారం చేసిందని భావిస్తున్నారు.
వీరు తన వెన్ను సమస్య ఎలా పరిష్కారమయ్యిందో ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 2014 జూన్ లో తీసిన స్కానింగ్ రిపోర్టు ప్రకారము వీరికి క్షీణిస్తున్న కీళ్ళు మరియు L4-L5 ప్రాంతంలో జారిన వెన్ను పూసలు ఉన్నట్లు తెలిసింది.న్యూరో సర్జన్ ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్పారు. కానీ 2015 మే నెలలో వీరు ప్రాక్టీషనర్ 01620 ఆధ్వర్యంలో వైబ్రో చికిత్స తీసుకోవాలని భావించారు. అదే సమయంలో AVP కోర్సు కు నమోదు చేయించుకొని 2015 జూన్ లో శిక్షణ పూర్తి చేసుకొని తనకు తానే మొదటి పేషంటు గా క్రింది రెమిడి తీసుకున్నారు :
CC18.5 Neuralgia + CC.20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS నీటితో
రెండు సంవత్సరాల తర్వాత తీసిన స్కానింగ్ ప్రకారము అతని వెన్నుముక క్షీణత పూర్తిగా పోయిందని నిర్ధారణ అయ్యింది. తనలో స్వస్థత చేకూరే క్రమం లోలోపల జరుగుతూనే ఉందని పూర్తి విశ్వాసంతో దీర్ఘకాలంగా వాడిన వైబ్రియోనిక్స్ మరియు స్వామి ప్రేమే తనను శస్త్ర చికిత్స చేయించుకోకుండా కాపాడాయని వీరికి నమ్మకం ఏర్పడింది.
వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం తో ఉండాలని పేషంట్లను చూసే సమయంలో కూడా అట్టి విశ్వాసం వ్యక్తపరచాలని అప్పుడే పేషంట్లలో ఒక చక్కని వైద్యుని దగ్గరికి వచ్చామనే నమ్మకం కలుగుతుందని వీరి ఉద్దేశ్యం. అట్టి విశ్వాసం ఏర్పడినప్పుడే పేషంటు యొక్క మనసు మరియు హృదయం లోనూ సమన్వయం ఏర్పడి త్వరగా వ్యాధి నయమవ్వడానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగం అనేది మానసిక భావోద్వేగ స్థాయిలోనే మొదలవుతుందని స్వామి చెప్పిన విషయాన్ని వీరు గట్టిగా సమర్ధిస్తారు. మన భూ గ్రహం యొక్క కంపించే స్థాయిలలో మార్పుల వల్లే ఎక్కువ శాతం ప్రజలు రోజు రోజు కు అస్థిరంగానూ, అవిశ్రాంతంగానూ, డిప్రెషన్ తోనూ.నిద్రలేమి తనం తోనూ బాధ పడడంతో పాటు వారి దుర్భావాలకు కూడా లోనవుతున్నారని వీరి భావన. దీని నిమిత్తం వీరు పేషంట్లకు తాము వేసుకునే మందులతో పాటు అదనంగా క్రింది రెమిడి లు సూచిస్తున్నారు :
మానసిక ప్రశాంతత కోసం :
CC15.1 Mental & Emotional tonic లేక CC15.2 Psychiatric disorders, పేషంటు యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున ఒకటి లేదా రెండు గంటలు పేషంటు పరిస్థితి మెరుగయ్యే వరకూ
గాఢమైన నిద్రకోసం :
CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders
ఇంటర్నెట్ లో నేచురల్ రెమిడి ఫోరం ద్వారా తెలుసుకొని దీర్ఘకాలిక వెన్ను నొప్పి నిమిత్తం తన వద్దకు వచ్చిన 28 సంవత్సరాల మహిళ యొక్క రోగ చరిత్రను వీరు మనతో పంచుకొంటున్నారు. ఈమె ప్రాక్టీ షనర్ తో చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె యొక్క తల్లితో ఉన్న ఇబ్బంది కరమైన బాంధవ్యం వలన 6 నుండి 7 సంవత్సరాలు మానసిక వైద్యాలయమునకు పంపబడింది.అక్కడినుండి రాగానే దురదృష్ట వశాత్తూ ఈమెను తల్లి ఇంట్లోనుండి బయటకు నెట్టివేసింది. హృదయ విదారక మైన ఆమె గాధ విన్న తర్వాత ప్రాక్టీ షనర్ పైన పేర్కొన్న రెండు రెమిడి లు ఇచ్చారు. 9 నెలల చికిత్స అనంతరం ఆమె ప్రాక్టీషనర్ తో ‘’నేను ఇంత మంచి స్థితిలో ఉంటానని కలలో కూడా ఉహించలేదని చెప్పింది.”
ఈ ప్రాక్టీ షనర్ ఉద్దేశ్యంలో మనదగ్గరికి వచ్చిన పేషంట్లు ప్రాక్టీషనర్ చెప్పిన విషయాలు జాగ్రత్తగా విని అనుసరించగలిగితే అవి వారికి నయం చేసే మంత్రం వలె పనిచేసి పేషంటు లో నిరంతరాయంగా వస్తున్న చెడు ఆలోచనల స్థానంలో మంచి ఆలోచనలు ప్రవేశపెట్టి వ్యాధి విముక్తి కలిగిస్తాయి.అటువంటి పాజిటివ్ అఫిర్మేషణ్ ఒకటి క్రింద ఇవ్వబడింది . ‘’ నా శరీరము, మనసు,నా ఆలోచనలు నన్ను ప్రక్కదారి పట్టించి నప్పటికీ నేను ఆనందంగానూ,పూర్తి ఆరోగ్యంగానూ ఉన్నాను.ఆధ్యాత్మిక పథంలో నేను తిరిగి పరిపూర్ణత పొందేవరకు ఏ శక్తి నన్ను ఆపలేదు’’. పేషంటు యొక్క మతమేదయినా,నమ్మి కొలిచే దైవము ఎవరయినా,వారికి తమ ఆధ్యాత్మిక బాటలో ముందుకు సాగటానికి వారికి త్వరగా స్వస్థత చేకురడానికి, ఆధ్యాత్మిక సాధన అత్యవసరం అనే రీతిలో తగిన సూచనలు ఇవ్వడం అత్యంత ప్రధానము.అని వీరి భావన.
ఈ క్రింది నొప్పి నివారిణి ని వీరు ఎంతో ప్రయోజనవంతంగా ఉపయోగించారు : NM59 Pain + SR348 Cortisone + nosode of Doliprane (paracetamol)…తరుచుగా నీటితో ...అవసరం మేరకు లేదా నొప్పి తగ్గేవరకు. ప్రాక్టీ షనర్లు దీనిని అత్యవసర బాధానివారిణి గా ఎప్పుడూ తమ వెంట ఉంచుకోవడం మంచిది.మొక్కలు,జంతువులతో పాటు ఈ ప్రాక్టీ షనర్ ప్రయాణములో రుగ్మత,చాతి,మరియు నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లు,మధుమేహము, వేరికోస్ అల్సర్,కేన్సర్ కణుతులు, రొమ్ముకు సంబంధించిన రుగ్మతలు,నరాల పీడన వల్ల రక్త స్రావము,మలబద్ధకం,మూత్ర పిండాల వ్యాధులు,అతిమూత్రం,రక్తప్రసరణ వ్యవస్థ,మూత్ర సంబధిత వ్యాధులు ఇలా అనేక రకరకాల వ్యాధులకు చికిత్స చేయడంలో అనుభవం గడించారు.
అలాగే మరొక కేసు గురించిన సమాచారాన్ని ప్రాక్టీషనర్ మనతో ఇలా పంచుకుంటున్నారు. 63 సంవత్సరాల వ్యక్తి గత 6 సంవత్సరాలుగా మధుంహం తోనూ,మరియు అతని 18 వ సంవత్సరం నుండి ఎక్జిమా తోనూ బాధపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతని ఎడమ కాలి క్రింది భాగంలో పుండు కూడా ఉంది కానీ అలోపతి మందుల వల్ల అది నయం కాలేదు. 17 నెలల వైద్యం అనంతరం కూడా డాక్టరు రోజు విడిచి రోజు ఈ గాయానికి కట్టు కట్టడానికి ఒక నర్సు ను నియమించడం జరిగింది. ఈ పేషంటు 2015 అక్టోబర్ 8 న తన వద్దకు వచ్చే నాటికి రోజూ గాయం నుండి చీము కారుతూ ఉండడం ప్రాక్టీ షనర్ గమనించారు. ఇతనికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.11 Wounds and Abrasions...TDS నీటితో .
గాయాన్ని వారం రోజులపాటు ప్రతీరోజూ కొల్లాయిడల్ సిల్వర్ నీటితో శుభ్రం చేయడం జరిగింది. అనంతరం: CC21.11 Wounds and Abrasions నీటితో కలిపి ఇవ్వబడింది.
అక్టోబర్ 24నుండి చీము కారడం ఆగిపోయింది.నవంబర్ 1న విజిటింగ్ నర్సు 50% వరకూ మెరుగయ్యిందని నిర్ధరణ చేసింది, (ఫోటో చూడండి). 50% వరకూ మెరుగయ్యిందని నిర్ధరణ చేసింది. , (ఫోటో చూడండి).
నవంబర్ 12వ తేదీన ప్రాక్టీ షనర్ పేషంటు కు మధుమేహానికి రెమిడి ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికి పేషంటు నోవోనార్మ్ అలోపతిక్ ట్యాబ్లెట్ లను వాడుతున్నారు . CC6.3 Diabetes పైన పేర్కొన్న రెమిడి లకు కలిపి రెండు నెలల తర్వాత CC10.1 Emergencies ను విరమించడం జరిగింది. గత 6 నెలలు గా ఇతనికి రక్తంలో చెక్కర శాతం క్రమేణా తగ్గుతూ వస్తోంది. అందువల్ల డాక్టర్ పేషంటు వేసుకునే నోవోనార్మ్ డోసేజ్ 2016 మే నాటికి పూర్తిగా ఆపివేశారు. బహుశా వీరి బ్లడ్ షుగర్ ఇప్పటికీ నార్మల్ గానే ఉండవచ్చు కానీ పేషంటు ఇంకా రెమిడి TDSగా తీసుకుంటూనే ఉన్నారు.
కాలి మీద గాయము (వెరికోజ్ అల్సర్ 2017 ఫిబ్రవరి నాటికి పూర్తిగా తగ్గిపోయింది (ఫోటో చూడండి),
ఐతే 2017 మే వరకూ కాలి రంగు ఎర్రగానే ఉన్నప్పటికీ గాయాలు మాత్రం పూర్తిగా మానిపోయి మచ్చలు ఏర్పడ్డాయి.(ఫోటో చూడండి ) .
కాలి మీద రాయడానికి నువ్వుల నూనె తో CC3.7 Circulation + CC21.3 Skin allergies కలిపి ఇవ్వడం జరిగింది. 2016 ఆగస్టు లో తీసిన ఫోటో కాలు పూర్తిగా నయమయ్యినట్లు తెలుపుతోంది.
2016 ఏప్రిల్ నుండి VP కొనసాగుతున్న వీరు SVP శిక్షణ తీసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.కారణం ఏమిటంటే పోటెం టైజర్ మిషన్ పొందడం ద్వారా రకరకాల వ్యాధులకు రెమిడి ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేసిన వీరు ఫ్రెంచ్ భాషా అనువాదకునిగా సేవచేసుకునే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నారు. వార్తాలేఖలను అనువదించడమే కాక ఆ దేశపు కోఆర్డినేటర్ కు ఇతర అనువాద కార్యక్రమాలలోనూ వర్క్ షాప్ నిర్వహించే విషయం లోనూ ఎంతో సహకారం అందిస్తున్నారు. వీరికి ఇవ్వబడిన (పెంద్యులం) లోలకం స్వామికి సంపూర్ణ శరణాగతి చేసిన సందర్భంలో పేషంట్లకు వ్యాధి నిర్ధారణ చేయడానికి ,మరియు సరియయిన రెమిడి నిర్ధారణ చేయడానికి ఎంతో ప్రయోజన కారిగా ఉంటో0దని వీరి అభిప్రాయము.
మనందరికోసం వీరు తమ మస్తిష్కపు జ్ఞాన భాండాగారము నుండి క్రింది పలుకులు అందిస్తున్నారు. ‘’ఈ అనంత విశ్వంలో మనం చిన్న రేణువు వంటి వారము .అందరూ ఒకరికొకరం అనుసంధానింప బడిన వారమే. ఈచిన్న రేణువు వ్యాధిగ్రస్థ మైతే దాని ప్రభావము విశ్వమంతటి పైనా పడుతుంది.కనుక ఎవరికీ వారే తమ స్థితిని సమతౌల్యం లో ఉంచుకొనడానికి ప్రయత్నించాలి అప్పుడు విశ్వమంతటా ఈ అన్యోన్య శాంతి సౌరభం పరిడవిల్లుతుంది.సమస్తలోకా సుఖినో భవంతు”.