అభ్యాసకుల వివరాలు 03039...Poland
ప్రాక్టీషనర్ లు 03040 & 03039 పోలాండ్ లో ఉంటూ ఇటివలే జర్మనీ వలస వెళ్ళిన ఈ కుటుంబం యావత్తు సాయి వైబ్రియోనిక్స్ కుటుంబము అని చెప్పవచ్చు.ఈ కుటుంబంలోని దంపతులతో పాటు వీరి ముగ్గురు పిల్లలు కూడా తమ పాఠశాలలో స్నేహితులకు రెమిడి లు ఇస్తూ ఉంటారు. వీరంతా వైబ్రియోనిక్స్ లో ఒక విలక్షణ విధానాన్ని పాటిస్తూ ఉంటారు.వీరు ఎవరయినా పేషంటు తమవద్దకు వస్తే ఆ పేషంటు రోగానికి కారణం మొత్తం కుటుంబం లోని సభ్యుల పైన ఉంటుందని భావిస్తూ కుటుంబం మొత్తానికి వీరు రెమిడి లు ఇస్తారు. వారు విన్నదేమిటంటే ‘‘బిడ్డకు అనారోగ్యము కలిగితే మొదట తల్లికి చికిత్స చెయ్యాలి’’.వారి అనుభవం కూడా దీనినే రుజువు చేస్తోంది.ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఈ చికిత్సా నిపుణులను సంప్రదించినపుడు మొదట తల్లిదండ్రులకు చికిత్స చేయాలని వీరు గుర్తించారు. పిల్లలకు వచ్చిన వ్యాధులకు సంబంధించినంతవరకు తల్లిదండ్రులకు మందులు ఇచ్చి నివారణ చేసి నట్లయితే పిల్లలకు సహజంగానే వ్యాధి నివారణ అవుతున్నట్లు వీరు గుర్తించారు. కుటుంబం యావత్తూ మందులు వాడినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటున్నాయని కుటుంబ పరంగా చేసినవిశ్లేషణలో వీరు తెలుసుకోగాలిగారు.
వీరి ఇంట్లో మెడికల్ కిట్ లో క్రింది రెమిడి లు ఉంటాయి:
CC10.1 Emergencies, వీరి ముగ్గురు పిల్లలు కేవలం దీనిని మాత్రమే తమతో తీసుకెళతారు.
NM35 Worms + NM66 Bilharzia + CC4.6 Diarrhoea
SR315 Staphysagria; దీనితో పాటుగా CC11.2 Hair problems కలిపి తమ పేలతో ఉన్న తమ అబ్బాయిలకు ఇచ్చారు, దీనివల్ల మరలా పేల సమస్య వీరికి కలుగలేదు.
SM1 Removal of Entities, దీనిని నెలకు ఒకసారి గానీ రెండు సార్లు గానీ ఇంట్లోని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఎవరయినా తమ ఇంట్లో సభ్యులకు అశాంతిగా,ఆనంద విహీనంగా ఉంటే దీనిని ఉపయోగించవలసిందిగా సూచిస్తున్నారు.
SM1 Removal of Entities + SM2 Divine Protection తమ అపార్ట్ మెంట్ లో గానీ ఇంట్లో గానీ కుటుంబ సభ్యులకు ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఆవేశ పడడం ఇలా వ్యతిరేక భావాలు ఉంటున్నట్లయైతే ఈ రెమిడి ని ఒక బాటిల్ లోని నీళ్ళలో కలుపుకొని తమ అపార్టుమెంటులో చల్లుకోవలసిందిగా సూచిస్తున్నారు. ఇలా తరుచుగా చేస్తూ ఉండడం వలన ఇంట్లో శాంతి ఆనందము నెలకొంటాయని వీరి అభిప్రాయము .
CC1.2 Plant tonic
CC9.2 Infections acute ఏదయినా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు ఇది ఉపయోగిస్తే రెండు రోజుల లోనే తగ్గిపోతుంది.
CC11.6 Tooth infections
ఏదయినా సెలవు రోజున బయటకు వెళ్ళవలసి వస్తే తమ ఆస్తి పాస్తులు రక్షింప బడడానికి మిషన్ లో SM2 Divine Protection కార్డును వదిలి వెళతారు .
ప్రాధమికంగా ఈ ప్రాక్టీ షనర్ లు వారి పేషంట్ల ఆరోగ్య స్థితిని (వీరి యొక్క బయో రెజోనేన్సు అధ్యయనం ఆధారంగా ) వివరించి వారు త్వరగా కోలుకోవ డానికి అనారోగ్యము యొక్క స్థితిని కూలంకషంగా వివరిస్తారు. దురదృష్టవశాత్తూ ఇది ఒక్కొక్కసారి, పేషంటు మానసిక స్థితికి మించినది గానూ, భయాందోళనలు రేకెత్తించేవి గానూ పేషంటు కు అర్ధం చేసుకోవడానికి కష్టమైన విషయంగా పరిణమించి గందరగోళమును సృష్టిస్తున్నాయి.అందుచేత వీరు తమ పంధా మార్చుకొని సున్నితమైన విషయాలను పేషంటు స్థాయికి తగ్గట్టుగా పాజిటివ్ గా అన్వయించుకొనే లా తర్ఫీదు నివ్వడం ప్రారంభించారు.దీనివల్ల పేషంటు తన సమత్వ స్థితిని తన సౌకర్యాన్ని పెంచుకోక పోయినా కనీసం ఆ స్థితిలో ఉండగలిగే విధంగా చేయగలుగుతున్నారు.
అప్పుడే వారు తగిన వైబ్రో రెమిడి లను , ప్రయోజనకారి ఐన ఆహారము,దేహ ప్రక్షాళనకు అనువయిన విధానాలు తెలియ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రక్షాళనకు సయోధ్య మరియు క్షమించే తత్వము తో కూడిన ప్రాచీన హవాయి దీవులకు చెందిన క్షాళన ప్రక్రియ హో ‘అపోనోపోనో ‘ను పేషంట్లకు సూచించ సాగారు. వీరి అనుభవం ప్రకారము ఈ రెండింటి అనగా రెమిడి లు క్షాళన ప్రక్రియ అద్భుత ఫలితాలను అందించింది. దీనితో పాటుగా వీరు అలోపతి కి చెందిన డిసీజ్ వంటి పదాలు పురాతనమైన పేర్లు,లేబుళ్ళు ఉపయోగించడాన్ని ప్రోత్సహించరు. వీరి ఉద్దేశ్యంలో ప్రతీ ఒక్క రుగ్మతకు ఒక ప్రత్యేక కారణమూ,ప్రయోజనమూ ఉంటుంది తప్ప మనలను చావమని చెప్పడానికి మాత్రం కాదు అని వీరి అభిప్రాయము.
ఈ ప్రాక్టీ షనర్లు మైధునం మరియు వయసు విషయంలో ప్రత్యేకమైన టానిక్ లను కనుగొన్నారు. వీరు విభిన్నవయసులకు చెందిన ఆడవారి దేహ మనో బుద్ధులు త్వరగా వికాసం చెందడానికి సాధారణంగా : CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS నెల వరకు తరువాత BD గా రెండు నెలలు రెమిడి లని అందిస్తారు. అలాగే మొగవారికోసం CC14.1 Male tonic ,యువతకు CC14.2 Prostate. ను,పిల్లలకు CC12.2 Child tonic ను అందిస్తారు.ఇవి వారిలో స్థిరత్వాన్ని,ఇంగిత జ్ఞానాన్ని కలిగిస్తాయని, ఇవి అమోఘమైనవిగా అభివర్ణించ లేమేమో కానీ చాలా వరకూ వ్యాధులకు ,కొన్ని సందర్భాలలో అత్యంత సంక్లిష్టమైన వ్యాధులు కూడా అదృశ్య మైన సంఘటనలకు వీరు ప్రత్యక్ష సాక్షి. అలాగే బలహీనంగా ఉండి వైబ్రో థెరపీ కొత్తగా ప్రారంభిస్తున్న వారికి ఇవి వరప్రదాయనులని వీరి అభిప్రాయము.
2013 లో వీరి స్నేహితుని యొక్క 15 సంవత్సరాల కుమారుని యొక్క పుట్టుకతో వచ్చిన హైపోక్జియా (కణజాలానికి ప్రాణవాయువు తక్కువగా అందే వ్యాధి),మూర్చ వ్యాధి, అస్పెర్జెర్ సిండ్రోమ్ (సమాజంలో ప్రవర్తించవలసిన రీతిలో స్వభావం ఉండక పోవడం కండరాల అనియంత్రత ),చికాకు, నాడీకణజాల శోధము (పదేపదే ముక్కును రుద్దుకోవడం),పొల్లక్యురియ ,దస్తూరి బాగాలేక పోవడం,క్లాస్ వర్క్ చేయలేకపోవడం ,లోపభూయిష్టమైన చూపు,పదే పదే వచ్చే ఎలర్జీ మరియు న్యుమోనియా,చీకటి అంటే భయం,స్వీట్ ల పైన మక్కువ ఇలా అనేక రుగ్మతలకు రెమిడి లు ఇవ్వడం జరిగింది. ప్రాధమికంగా CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC7.2 Partial Vision + CC15.5 ADD & Autism + CC17.2 Cleansing. ఇవ్వబడింది. నెల రోజు ల తర్వాత CC17.2 ను తొలగించి కొత్త రెమిడి CC18.2 Alzheimer’s disease + CC18.3 Epilepsy + CC18.5 Neuralgia పాత డానికి జోడించి ఇవ్వడం జరిగింది. మూడు నెలల తర్వాత వారు క్రింది రెమిడి కూడా జత చేయడం జరిగింది. CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders.ఇతని సమస్యలన్నీ అదృశ్యమవడంతో 2016 జనవరి లో చికిత్స పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ 19 సంవత్సరాల యువకుడు తన గ్రాడ్యుఏషణ్ పూర్తి చేసుకొని తదనంతర విద్య కొనసాగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. .
ఈ అబ్బాయికి చెందిన 72-సంవత్సరాల నాయనమ్మ పెద్దప్రేగు క్యాన్సర్ గురించి 2013 మే నెల నుండి ప్రతీ రెండు వారాలకు ఖిమోథెరపి తీసుకుంటున్నారు. వీరికి ఇంకా పార్కిన్సన్ వ్యాధి,మలబద్ధకం,హెర్నియా (గిలక) వ్యాధి కూడా ఉన్నాయి. 2013 సెప్టెంబర్లో క్రింది రెమిడి తో వీరి వైద్యం ప్రారంభమయ్యింది. SR350 Hydrastis + SR405 Ruta + SR559 Anti Chemotherapy + CC2.1 Cancers–all + CC2.3 Tumours & Growths + CC4.9 Hernia + CC17.2 Cleansing + CC18.6 Parkinson’s disease. అదనంగా త్వరగా జీర్ణము కావడానికి,సులభంగా మలవిసర్జన చేయడానికిగాను ఆహారము సూచించబడింది. ఒక నెల తర్వాత క్రింది రెమిడి CC17.2 ను తొలగించి NM13 Constipation + BR8 Constipation + BR12 Liver + CC4.4 Constipation ను కలపడం జరిగింది.ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఖిమోథెరపి వలె పనిచేసింది. పరీక్ష చేయిన్చుకున్న ప్రతిసారీ కణుతులు 2014 చివరినాటికి కేన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడామె 76-సంవత్సరాల పూర్తి ఆరోగ్యవంతురాలయిన మహిళ.
2014, ఫిబ్రవరి 8 వ తేదీన మానసిక రుగ్మతలతో బాధ పడుతూ ఉన్న 75 సంవత్సరాల మహిళకు వైద్యం చేసారు.ఈమెకు డ్రైవింగ్ ఛేసే టప్పుడు కళ్ళు తిరగడం, అలసట ఒక్కొక్కసారి స్పృహ కోల్పోవడం కూడా జరుగుతోంది. దీర్ఘకాలంగా ఈమె కండరాల తిమ్మిరులు, రక్తపోటు, గుండెజబ్బు,పాదాలకు ఫంగస్ వలన ఏర్పడే సమస్యలు,కంటి సమస్యలు,స్వీట్ అంటే బాగా ఇష్ట పడడం ,రుగ్మతలు, మొదలగు సమస్యలతో బాధ పడుతున్నారు. బయో రెసొనెన్స్ పద్ధతి ద్వారా ఈమెకు ట్రైపానోసోమియాసిస్ (trypanosomiasis)వ్యాధి ఉన్నట్లు కనుగొన్నారు.. ఆమె యొక్క జీవితము,కుటుంబపరిస్థితి, ఈమె నివసిస్తున్న వాతావరణము,వీటిగురించి సుదీర్ఘమైన సంభాషణ అనంతరం క్రింద పేర్కొన్న రెమిడి ఈమెకు ఇవ్వడం జరిగింది. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS మొదటి నెలకు అనంతరం BD గా రెండు నెలలకు. పేరసైట్స్ అనగా పరాన్నజీవులనిమిత్తం CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS గా నెలకు అనంతరం 14 రోజుల విరామం తర్వాత మరొక నెలవరకు ఇవ్వబడింది.ట్రైపానోసోమియాసిస్ (Trypanosomiasis)అతినిద్ర వ్యాధి నిమిత్తం ఆమెకు CC9.3 Tropical diseases + CC20.4 Muscles & Supportive tissue…TDS నెలవరకు 14 రోజుల విరామం తర్వాత మరొక నెలవరకు ఇవ్వబడింది.
నెల తర్వాత పేషంటు పేరాసైట్ కి చెందిన లక్షణాలు తగ్గిపోయినట్లు తెలియజేసారు . మధ్యమధ్య ఈ పేషంటు ఇతర వ్యాధి లక్షణాలకు కూడా రెమిడి లు ఇవ్వబడ్డాయి. రెండు సంవత్సరాలు రెమిడి లను క్రమం తప్పకుండా వాడిన తర్వాత పాదంలో మైకోసిస్ తప్ప మిగతా వ్యాధులన్నీ తగ్గిపోయాయి.
ఈ చికిత్స తో ప్రభావితం ఐన పేషంటు ఎందరో పేషంట్లను ప్రాక్టీషనర్ల వద్దకు పంపసాగారు.వారు ఈ పేషంటు యొక్క బంధువులు స్నేహితులతో పాటు ఈమె పెంపుడు పిల్లి, కుక్క, మొక్కలకు కూడా చికిత్స చేసారు. ప్రధానంగా ఈ పేషంటు యొక్క 84 సంవత్సరాల భర్త 10 సంవత్సరాల క్రితం గుండె పోటు రావడమూ,అలాగే గత సంవత్సర కాలంగా ఈ పేషంటుకు ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పడంతో బాగా నీరస పడిపోవడమే కాక మానసిక వత్తిడికి కూడా లోనయ్యారు. ఇతను క్యాన్సర్ కారక గ్రంధిని తొలగింప జేసుకొని కేతేటరైజేషన్ చేయించుకున్నారు. ఐతే తరుచుగా కోపపడడము,జ్ఞాపక శక్తి లోపించడం అనే సమస్యలు ఏర్పడాయి. వీరు ప్రోస్టేట్ క్యాన్సర్ కు కూడా చికిత్స తీసుకున్న ౩ నెలల తర్వాత వీరి PSA సూచి (ప్రోస్టేట్ క్యాన్సర్ సూచిక )సాధారణ స్థాయికి చేరుకుంది. వీరికి మూత్రపిండాలు మరియు మూత్రాశయము,నరాల వ్యవస్థ,శారీరక శక్తి కోసం,మానసిక సమతౌల్యత కోసం,పాదాలలోని ఫంగస్ నివారణకు,దంతాల నొప్పి ఇంకా అనేక వ్యాధుల కోసం రెమిడి లు ఇవ్వబడ్డాయి.సంవత్సరానికి ఒక్కసారి వీరికి ఇవ్వబడ్డ SM10 Spiritual Upliftment వీరి మూర్తిమత్వము లో అద్భుత ఫలితాలు కనబరిచింది. వీరు నివసించే గదిని దుష్ప్రభావనిర్మూలన కోసం SM1 Removal of Entities + SM2 Divine Protection తో స్ప్రే చేసే వారు.అలాగే 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రాక్టీషనర్ 00512 నుండి బ్రాడ్కాస్టింగ్ సహాయము కూడా పొందారు. ఈ విధమైన ప్రేమ పూరితమైన అన్ని రకాల చికిత్సల ఫలితంగా ప్రస్తుతం వీరు పాడగలగడం, పద్యాలు రాయగలగడమే కాక వీరు చనిపోవడానికి సంవత్సరం ముందు ఒక పుస్తకం కూడా వ్రాయడం జరిగింది. 87 సంవత్సరాల వయస్సులో తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా తనువు చాలించారు.
మన చుట్టూ ఉన్న పర్యావరణం మన విలువైన జీవ శక్తిని పెంచడంలో గానీ తగ్గించడంలో గానీ ప్రభావితం చేస్తుంది. పర్యావరణం అనడంలో వీరి ఉద్దేశ్యం మన వృత్తీ,గృహ కృత్యాలు,మన ఆహారము,ఇళ్ళు,మొక్కలు,జంతువులూ, మన జీవితాన్ని ప్రభావితం చేసే వివిధ వ్యక్తులూ ఇలా మన చుట్టు ఉన్న ప్రతీ ఒక్కటీ దీనిలోనికి వస్తుంది. అననుకూల పరిస్థితులలో జీవించడం హానికారక జీవుల (పోలిష్ భాషలో పరాన్న జీవుల కార్ఖానా)ఆవాస కేంద్రముగా ఉంటుందని వీరి అభిప్రాయము. దీని ఫలితముగా మన శరీరము హానికారక బ్యాక్టీరియ,ఫంగస్ ,వైరస్ లకు కేంద్రముగా మారుతుందని వీరి అభిప్రాయము.కనుక పేషంట్ల విషయంలో వీరు మొదట మనసుకు చికిత్స చేయడం పైన ఎక్కువ దృష్టి పెడతారు.
ఈ వైబ్రియో కుటుంబము ప్రాక్టీషనర్ 00512 అందించిన సహకారానికి,వాత్సల్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు.వీరంతా సాధ్యమయిన్నన్ని ఎక్కువ సార్లు కలుసుకొంటూ తమ జ్ఞానాన్ని విస్తరించుకొంటూ తద్వారా మరింత లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. సంక్లిష్టమైన కేసులు వచ్చినప్పుడు తగిన సూచనలు ఇవ్వడం, పెండ్యులం సహాయంతో ఎటువంటి రెమిడి లు ఇవ్వాలిఅనేది కూడా ఈ ప్రాక్టీషనర్ చెపుతూ ఉండేవారు. అవసరమైనప్పుడు రెమిడి లను బ్రాడ్కాస్టింగ్ చేసి కూడా ఇచ్చేవారు. ఈ వైబ్రోయో కుటుంబము ప్రాక్టీషనర్ 00512 తో ఉన్న సంబందము అద్బుతఫలితాలను అందించేది గానూ దానిని మాటల్లో వర్ణించలేనిది గానూ అభివర్ణిస్తున్నారు.పేషంట్లు కూడా ఖచ్చితమైన ఫలితాలు పొందుతుండడంతో వైబ్రియోనిక్స్ పట్ల వీరి నమ్మకం కూడా పెరిగింది. వైబ్రియోనిక్స్ కుటుంబంలో భాగమై నిస్వార్ద సేవద్వారా ప్రేమ మూర్తి మన స్వామి చేతిలో పనిముట్లుగా ఉన్నందుకు తామెంతో ధన్యుల మయ్యామని ఈ దంపతులు భావిస్తున్నారు. ఈ సేవ ద్వారా మానవులు,జంతువులూ,మొక్కలూ,ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణానికి సేవనందిస్తూ తామెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ఈ దంపతులు తెలియజేస్తున్నారు.