అభ్యాసకుల వివరాలు 11577...India
అభ్యాసకులు 11577 & 11578… భారత దేశం 2016 మార్చ్ నుంచి పుట్టపర్తి మరియు పరిసర ప్రాంతాలలో విబ్రియోనిక్స్ సేవ చేస్తున్నారు. భర్త రసాయన శాస్త్రంలో పిహెచ్ది చేయగా, భార్య మానవ అభివృద్ధి మరియు కుటుంబ వ్యవహారాల్లో ఎమ్మెస్సీ చేసారు మరియు టెక్నికల్ కమ్యూనికేషన్ లో కూడా ఎమ్మెస్సీ చేసారు.
మొదటగా 2015లో భార్య ఒక కుటుంబ మిత్రుని ద్వారా విబ్రియోనిక్స్ గురించి తెలుసుకొన్నారు. వెంటనే ఆమెలో దీని మీద విపరీతమైన ఆసక్తి మొదలైంది. తాను ఒక చక్కని ప్రియమైన బాల వికాస్ ఉపాధ్యాయురాలు కావడంతో పుట్టపర్తి మరియు పరిసర ప్రాంత పల్లెలోని పిల్లలు తరగతిలో తమ ఆరోగ్య సమస్యలను ఆమెతో చెప్పేవారు. ఈ విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి విబ్రియోనిక్స్ ఒక దివ్యమైన సాధనంగా ఆమె భావించి దానిని అభ్యసించి సేవ చేయాలని గట్టిగా సంకల్పించారు. ఈమె భర్త విబ్రియోనిక్స్ గురించి 9 ఏళ్ల మునుపే విన్నప్పటికి ఈమె కోర్సు కోసం చదవడం ప్రారంభించిన తరువాతే ఆసక్తి కనపర్చారు. వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో విబ్రియోనిక్స్ రెమెడీలు అత్యంత సమర్ధవంతమైనవని మరియు వాటిలో ఎటువంటి రసాయనాలు లేకపోవడం వలన అవి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేక పూర్తిగా సురక్షితమైనవని గ్రహించి వీరు మంత్ర ముగ్దులయ్యారు.
ఇద్దరూ ఈ-కోర్సు తీసుకొని 4 రోజుల ప్రాక్టికల్ శిక్షణ వర్క్ షాప్ లో పాల్గొని అసోసియేట్ ప్రాక్టీషనర్లు అయ్యారు. కేవలం అయిదు నెలల తరువాత అన్ని అర్హతలు పొందిన తరువాత ఆగష్టు 2016లో వీరు పూర్తి స్థాయి విబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు గా పదోన్నతి పొందారు.
భగవంతుని దీవెనలతో వీరు ఏప్రిల్ 2016 నుంచి సమీప గ్రామమైన ఎనుముల పల్లెలో విబ్రియోనిక్స్ వైద్య శిబిరాలు వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వీరు చక్కటి ఫలితాలతో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, వడ దెబ్బ (సన్ స్ట్రోక్) మరియు విరేచనాలు వంటి వివిధ తీక్షణ (అక్యూట్) రోగములతో బాధ పడుతున్న 500 మంది పైగా రోగులకు వైద్య సహాయం అందించారు. అంతే కాకుండా దీర్ఘ కాల రోగములైన మైగ్రైన్, వెన్ను నొప్పి, మూత్ర పిండాల ఇన్ఫెక్షన్, ఆస్తమా, కన్ను మరియు చెవికి ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పి, క్రమబద్దత లేని నెలసరి, చర్మ అలెర్జీలు, తిండి సంబంధిత వ్యాధులు మరియు ఆపుకోలేని మల లేదా మూత్ర విసర్జనకు కూడా వీరు చికిత్స అందించారు.
తమ ప్రాక్టీస్ యొక్క మొదటి దశలో వీరు మెంటర్లు మరియు సీనియర్ ప్రాక్టీషనర్ల సలహాలు సూచనలు తీసుకొన్నారు. ఇది వివిధ రోగములను అర్ధం చేసుకోవడానికి మరియు తగిన పరిష్కార రెమెడీలు ఇవ్వడానికి వీరికి ఎంతో ఉపయోగపడింది. వీరు రోగము యొక్క మూల కారణం కనుగొనడానికి రోగులను తగు రీతిగా విచారించడం వలన ముఖ్యంగా గతంలో లేదా ప్రస్తుతంలో భావోద్వేగ సమస్యలున్న రోగులను, క్రమక్రమంగా రోగులకు తమ మీద నమ్మకం , విశ్వాసం బాగా బలపడిందని గ్రహించారు.
ఈ దంపతులు విబ్రియోనిక్స్ రెమెడీల సామర్థ్యం స్వయానా తమ యొక్క ఆరోగ్యం ఎంతో మెరుగవడం, తద్వారా అల్లోపతి మందులు వాడే అవసరం రాకపోవడంతో గ్రహించారు. ఈ విషయమై వారు ఎంతో సంతోషపడతారు. భర్త తనకు గత్ మూడున్నర ఏళ్లుగా గల నట్ అలెర్జీని వదిలించుకున్నారు. కేవలం 2 నెలలు పాటు విబ్రియో రెమెడీలు తీసుకోగానే తనకు నట్ ఎలర్జీ పోవడం, తనకు ఇష్టమైన అన్ని రకాల నట్స్ను సంతోషంగా తినగల్గడంతో ఈయన ఎంతో విస్మయం చెందారు. అంతకు మునుపు ఈ సమస్య కొరకు ఆయుర్వేదిక్ మందులు 6 నెలల పాటు, హోమియోపతిక్ మందులు ఒక సంవత్సరం పాటు వాడారు. కానీ మెరుగైన ఫలితం కనబడలేదు. వీరి భార్య కూడా తనకు ఏదైనా తీక్షణ సమస్య వస్తే విబ్రియో మందులనే వాడతారు.
తమకు ఎంతో సంతృప్తిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తున్న ఈ విబ్రియోనిక్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నందుకు తాము భగవంతునిచే దీవించబడ్డామని వీరు భావిస్తారు. అంతేకాకుండా తమ రోగుల యొక్క ఆరోగ్యం మెరుగుపడి వారు స్వస్థత పొందడం చూసినప్పుడు తమకు లభించే మానసిక సంతృప్తి ఆనందానికి వీరు ఎంతో విలువనిస్తారు. వీరు సీనియర్ విబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ అవుటకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దానివలన తాము ఇంకా ఎక్కువ సేవ చేయ గల్గుతారు మరియు దివ్యమైన లక్ష్యంతో పనిచేస్తూ భగవంతునిచే దీవించబడిన సాయి విబ్రియోనిక్స్ ను ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లగలరు.
ప్రస్తుతం వీరిరువురు విబ్రియో పరిపాలనా పనులలో కూడా పాల్గొంటున్నారు. భార్య వార్తా లేఖనాలు సవరించే టీం తో కలసి పనిచేస్తున్నారు. భర్త ప్రాక్టీషనర్లు ను కదిలించి సమన్వయ పరచి పుట్టపర్తి మరియు విట్ ఫీల్డ్ ప్రాంతాలలో ఉన్న సత్య సాయి హాస్పిటల్స్ లో సాయి విబ్రియోనిక్స్ సేవను ప్రారంభించే పనులను చూసుకుంటున్నారు.
ఎంతో తియ్యగా పాజిటివ్ గా సాగుతోన్న ఈ శక్తివంతమైన యువ దంపతుల విబ్రియోనిక్స్ యాత్ర ఇతర యువ ప్రాక్టీషనర్లకు ఒక ఉత్తేజకరమైన ఉదాహరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పంచుకుంటున్న రోగ చరితలు:
- అతి శరీర ఉష్ణోగ్రత
- రొమ్ము గాయం