Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అభ్యాసకుని వివరాలు 03535...USA


అభ్యాసకుడు 03535...USA  కెమికల్ ఇంజనీరింగ్ లో పి హెచ్డీ చేసిన వీరు వృత్తిరీత్యా శాస్త్రవేత్త. తన చిన్నతనంలోనే స్వామి సన్నిధి చేరిన వీరు సాయి సంస్థ చేపట్టిన ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసారు. తన సాయి సంస్థలో చేపట్టే 3 విభాగాల సేవా కార్యక్రమాలన్నిట్లోనూ వీరు పాల్గొంటారు మరియు ప్రత్యేకించి వీరికి SSE బోధించడమంటే చాలా ఇష్టం.

స్వామి బోధనలు, సిద్ధాంతాలచే ప్రభావితులైన వీరికి సేవా చేయాలనే కోరిక బలంగా ఉండేది. మొదట వీరు అమెరికాలో వైద్య భీమా లేని వారికి ఉచిత వైద్య స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు. అది అద్భుతంగా విజయవంతమైంది.  కానీ వీరు వైద్య సహాయం కోరే వారికి ఇంకా చవకైన మెరుగైన రెమెడీలను ఇవ్వాలని భావించారు. సాయి విబ్రియోనిక్స్ వీరి ఆకాంక్షకు సరిగ్గా సరిపోయింది! వీరు మొదటగా విబ్రియోనిక్స్ గురించి తన సెంటర్లో 2015 మొదట్లో తన సహ సభ్యుడి ద్వారా తెలుసుకొన్నారు. విబ్రియోనిక్స్ యొక్క సత్తా గ్రహించి వీరు వెంటనే ట్రైనింగ్ కొరకు దరఖాస్తు పెట్టుకొన్నారు మరియు ట్రైనింగ్ పొందటానికి అర్హత సాధించి అక్టోబర్ 2015 లో ఏవీపి అయ్యారు. వీరు చాలా త్వరగా మే 2016 లో పూర్తి స్థాయి ప్రాక్టీషనరుగా మారి అక్టోబర్ 2016 లో సీనియర్ ప్రాక్టీషనర్ ఎష్వపి SVP అయ్యారు. స్వామి తన ప్రార్థనలను విబ్రియో సేవా చేసే భాగ్యం కల్పించడం ద్వారా నెరవేర్చారని వీరు భావిస్తారు. 

ప్రాక్టీషనర్ అయిన వెంటనే వీరు ఒక సంవత్సర కాలంలో 91 రోగులకు వైద్యం చేసి స్వామి 91వ పుట్టిన రోజున సమర్పించాలని భావించారు. కానీ తాను అమెరికాలోని ఒక మారుమూల ప్రదేశంలో నివసిస్తుండడం వలన తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలనా అన్న చింత వీరికి మొదలైంది. అంతేకాకుండా అమెరికాలో ఇటువంటి వైద్య సహాయం కొరకు వచ్చే వారు మరియు తనకు తెలిసిన వారు చాలా తక్కువని వీరి భావించారు. కానీ హృదయపూర్వకమైన ప్రేమ మరియు దయతో వీరు ఇచ్చే వైద్యం చూసి అవసరం ఉన్న ఎంతో మంది రోగులు ఆకర్షితులయ్యారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారు కానీ తాను అనుకున్న లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది. తన యొక్క ప్రార్థనలతో వీరు తన జన్మ స్థలమైన భారత దేశంలో ఎక్కువ  మందికి వైద్య సేవా చేయడానికి వీరికి అవకాశం దొరికింది. సెప్టెంబర్ 2016లో తనకు దొరికిన రెండు వారముల సెలువు రోజులలో వీరు తన స్వస్థలంలో, స్థానిక సాయి సెంటర్ అధ్యక్షులకు మరియు చాలా మంది భక్తులకు విబ్రియోనిక్స్ వీడియోను మరియు సాయి విబ్రియోనిక్స్ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పుస్తకమును చూపించారు. దేని ఫలితంగా సుమారు 20 మంది వైద్యము కొరకు రాగలరని వీరు భావించగా, అమితాశ్చర్యంగా అధిక సంఖ్యలో రోగులు వీరు ఇంటి వద్దనే నిర్వహించిన చిన్న మెడికల్ క్యాంపులకు వచ్చారు. ఆ విధంగా వీరు ఈ భారత దేశ యాత్రలో 140 మందికి పైగా వైద్య సేవ అందించారు.

ఈ ప్రాక్టీషనర్ భగవంతుని ఆశీర్వాదం వల్ల వివిధ రోగములైన అసిడిటీ, విరేచనాలు, ఆందోళన, కీళ్ల నొప్పులు, ఆస్తమా, రక్త పోటు, మధుమేహం, మూర్ఛ వ్యాధి, ఫ్లూ, ఫ్రోజెన్ షోల్డర్, గౌట్, అజీర్తి, మూత్ర పిండాల సమస్యలు, మైగ్రైన్, ప్యానిక్ అటాక్స్, సోరియాసిస్, సయాటికా, స్ట్రోక్, వణుకు మరియు అలీసిరేటివ్ కొలైటిస్ను నయం చేసారు. పైన చెప్పిన రోగములలో చాలా వాటికి చెప్పుకోదగ్గ మెరుగుదల కన్పించింది. వైద్య విద్యలో ఏ విధమైన పరిచయం మరియు అనుభవం లేకపోవడం వలన తాను కనీసం ఒక వ్యక్తికైనా వైద్యం చేయగలనని వీరు కలలో కూడా ఊహించలేదు. ఎంతో మంది యొక్క బాధ, కష్టాలను తీర్చడం వలన  వీరు స్వామికి కృతజ్ఞతతో నిండిన ఆనందంతో పొంగిపోతున్నారు.  

వీరి విబ్రియో సేవలో స్వస్థత పొందిన కొంత మంది రోగుల వివరాలు క్రింద చుడండి :

1. ఒకసారి ఏళ్ల బాలిక తల్లి ప్రగాఢ కృతజ్ఞతాభావముతో ఈ ప్రాక్టీషనర్ దగ్గరకు వచ్చింది. ఆవిడ కుమార్తె చిన్నతనం నుంచే తీవ్రమైన ఆస్తమా విద్యాదితో బాధ పడుతూ స్వస్థత కొరకు ఇన్హేలర్ ఉపయోగించేది. కానీ విబ్రియోనిక్స్ వైద్యం ప్రారంభమైన కొన్ని నెలలకే ఆ అమ్మాయికి ఇన్హేలర్ అవసరం లేకుండా ఆస్తమా అదుపులోకి వచ్చింది. ఇంతకుమునుపు ఆ అమ్మయికి వ్యాయామానికి కానీ ఆటలకి కానీ  తగినంత శక్తి లేక నీరసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కరాటే సాధన చేస్తోంది.

2. 26 ఏళ్లగా అమీబిక్ డిసెంట్రీతో (రక్త విరేచనాలు) బాధ పడుతూ ఒక వ్యక్తి ఆ వ్యాధి వలన విపరీతమైన ఆహార నియంత్రణ పాటించవలసివస్తూ అనారోగ్యంగా ఉండేవారు. 3 నెలల విబ్రియోనిక్స్ వైద్యం తరువాత వారి వ్యాధి లక్షణాలన్నీ పోయి ఇప్పుడాయన ఏ ఇబ్బంది లేకుండా రెస్టారెంట్లో కూడా భోజనం చేయగలుగుతున్నారు.

3. చాల ఏళ్లగా ఒక మహిళా సంతాన లేమితో బాధ పడుతూ ఉండేవారు. అంతేకాక ఆమెకు  2013లో మరియు 2016లో గర్భస్రావం జరిగింది. రెండవ సారి గర్భస్రావం జరిగాక తీవ్రమైన బాధ మరియు నిరాశతో ఆమె ఇక తనకు సంతాన భాగ్యం కలగదని భావించారు. ప్రాక్టీషనర్ ఈ దంపతులకు పోస్టులో రేమేడీలను నవంబర్ 2016లో పంపించగా కేవలం రెండు నెలల తరువాత జనవరి 2017లో ఆమె గర్భం ధరించారు. ఆమె సంతోషానికి అవధులే లేవు.

4. మూడు సంవత్సరములపైగా సెరిబ్రల్ ఆటాక్సియాతో బాధ పడుతూ నడక మరియు మాటలో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఆరోగ్యం విబ్రియోనిక్స్ రెమెడీలు తీసుకొన్న రెండు నెలల తరువాత చెప్పుకోదగ్గ  విధంగా మెరుగు పడింది.

5. విబ్రియోనిక్స్ వైద్యం మొదలు పెట్టాక చాల మంది డియాబెటిక్ రోగులలో అద్భుత మెరుగుదల కన్పించింది. చాల మంది యొక్క షుగర్ శాతం సాధారణ స్థాయికి చేరగా మరికొందరికి ఇన్సులిన్ అవసరం రాకుండా పోయింది.

6. విబ్రియోనిక్స్ రెమెడీలు ఉపయోగించడం వలన ఈ ప్రాక్టీషనర్ మరియు అతని మొత్తం కుటుంబం తమ యొక్క రోగ నిరోధక శక్తీ అత్యద్భుతంగా మెరుగుపడటం గమనించారు. అంతకుముందయితే వారికీ తరచుగా జలుబు మరియు ఫ్లూ వస్తుండేది. అందువల్ల మళ్ళీ మళ్ళీ అల్లోపతే మందులు వాడవలసి వచ్చేది. ఇప్పుడయితే అటువంటి రోగ లక్షణాలు విబ్రియోనిక్స్ రెమెడీలు తీసుకొన్న ఒక రోజులో లేదా కొన్ని గంటల్లో మాయమవుతున్నాయి.

SRHVP ఉపయోగించి ప్రసారణ (బ్రాడ్కాస్టింగ్) చేయడం వలన అద్భుతంగా నయమైన రెండు రోగ చరితాలను ప్రాక్టీషనర్ పంచుకుంటున్నారు.

1. SVP శిక్షణ వర్క్ షాప్ సమయమున తమ దూరపు బంధువు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లు తన భార్య ద్వారా తెలుసుకొన్నారు. అతను తన రక్త నాళములో ఏర్పడిన గడ్డ వలన స్టెంట్ చికిత్స తీసుకొని ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో అతనికి వెంటిలేటర్ అమర్చారు. అభ్యాసకుడు  తాను శిక్షణ తీసుకొంటున్న సమయంలో రేమేడీలను రెండు రోజుల పాటు, ఆ తరువాత తన ఇంటినుంచే మరికొన్ని రోజుల పాటు ప్రసారణ చేసారు. రోగి యొక్క ఆరోగ్యం కుదుటపడి తనని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. అతని బంధువులు అతని మీద ఆశ వదులుకొన్నారు, కానీ రోగి కోలుకోవడంతో ఇది కేవలం విబ్రియోనిక్స్ వలన సాధ్యమైన ఒక అద్భుత లీలగా వారు భావించారు.

2. ఈ మధ్యనే ప్రసారణ టీం ఈ అభ్యాసకుడికి మెదడులో కణితితో బాధ పడుతున్న ఒక 12 ఏళ్ల బాలుడి ప్రసారణ బాధ్యతను అప్పగించారు. ఇతను కొద్ది రోజులుగా ICU లో ఉన్నాడు మరియు ఆ కణితి ఇతని మెదడంతా వ్యాపించింది. తనకు వణుకు మరియు వాంతులు వచ్చే భావన ఉండేదని తల్లి చెప్పారు. తాను తన యొక్క పేరు కూడా చెప్పలేక పోయేవాడు మరియు తన కుటుంబాన్ని గుర్తు పట్టలేక పోయేవాడు. కేవలం వైద్యులు అడిగిన కొన్ని వాటికీ స్పందన చూపించేవాడు. ఈ అభ్యాసకుడు నిరంతరం ప్రసారణ చేయగా మరుసటి రోజుకే ఆ బాలుడు మాట్లాడగల్గాడు. అతను సాధారణ గదికి మార్చబడి రెండు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డాడు. ప్రసారణ కొనసాగించబడింది మరియు ఆ బాలుని ఆరోగ్యం చాల మెరుగు పడింది. ఒక రోజు ఆ బాలుని తల్లి, ఆ బాలుడు గింజలతో కార్డుపైన తయారు చేసినస్వామి చిత్రాన్ని, అందులో అభ్యాసకునికి ధన్యవాదములు తెలుపుతున్న సందేశాన్ని తీసుకొచ్చి అభ్యాసకునికి ఇచ్చారు. ఇది చాల అరుదైనది, ఉహించనిది మరియు ఈ అభ్యాసకునికి ఎంతో అపురూపమైనది ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞతా భావంతో ఒక బాలుడు సమర్పించిన అద్భుత కానుక ఇది.

రెమెడీలు తయారు చేసేటప్పుడు ఈ అభ్యాసకుడు ఎల్లపుడూ సాయి గాయత్రిని పఠిస్తారు. ఒక చేత్తో రెమెడీని ఉంచుకొని వీరు ధ్యాననిమగ్నులై ఒక హవర్ గ్లాసును ఉహించుకొని దాని పై భాగమున స్వామి ఉన్నట్లు మరియు తన స్వస్థతా తరంగములను శక్తిని క్రిందనున్న పిల్స్ పై ప్రసరిస్తున్నట్లు ఉహించుకొంటారు. రోగులందరిని నయం చేసేది కేవలం స్వామి మాత్రమే అని వీరు భావిస్తారు అందువలన స్వామికి శరణాగతి అవ్వడం ద్వారా వారి యొక్క వినమ్ర పనిముట్టుగా మారడానికి వీరు ప్రయత్నిస్తారు. విబ్రియోనిక్స్ సేవ తన యొక్క వ్యక్తిత్వంలో మరింత వినమ్రత, ప్రేమ, సంరక్షణ, దయ, విశ్వాసం, జాగరూకత, క్రమ శిక్షణ, మరియు స్వామి పై భక్తి తీసుకొచ్చిందని వీరు నమ్ముతారు.

వీరు విబ్రియోనిక్స్ సేవ ఉన్నతిని, సత్ఫలితాన్ని అందించే ఒక సమర్ధవంతమైన ఆధ్యాత్మిక సేవని గుర్తించారు. విబ్రియోనిక్స్ వైద్యం వలన రోగములు, బాధల నుండి విముక్తి పొంది చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తులను గుర్తు తెచ్చుకొన్నపుడు వీరు ఏంటో సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. ఈయన దృష్టిలో వృత్తిపరమైన లేదా సంపాదనపరంగా సాధించే అభివృద్ధికన్నా ఇది ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.

పంచుకుంటున్న రోగ చరితలు: