చికిత్సా నిపుణుల వివరాలు 03524...USA
చికిత్సా నిపుణుడు 03526…USA చిన్ననాటి నుండి ప్రత్యామ్నాయ వైద్యాలపై ఆశక్తి ఉన్న ఈ చికిత్సా నిపుణుడు తన పద్దెనిమిదో ఏట హోమియోపతి చికిత్సా విధానములో నైపుణ్యాన్ని పొందారు. అంతేకాకుండా, వీరు ఆక్యుప్రెషర్ మరియు మాగ్నెటో థెరపీ వంటి వైద్యాలను కూడా నేర్చుకొవడం జరిగింది. ప్రశాంతి నిలయంలో విద్యార్థిగా సత్యసాయి హాస్టల్ లో హోమియోపతి వైద్య సేవను అందించే భాగ్యం వీరికి కలిగింది. USA కు వెళ్లి స్థిరపడ్డ తర్వాత, 2015 వరకు వీరు హోమియోపతి చికిత్స ను అందించటం కేవలం తమ కుటుంబసభ్యులు మరియు మిత్రులకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. సాయి వైబ్రియానిక్స్ గురించి వీరు మొట్టమొదటి సారిగా డా. అగ్గర్వాల్ మరియు శ్రీమతి.అగ్గర్వాల్ వారి యొక్క సోల్ జుర్న్స్ భేటీ లో వినటం జరిగింది. వెంటనే దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకొని 2015 మే లో AVP శిక్షణను పూర్తిచేయడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత, VP స్థాయికి చేరుకున్న వీరు, SVP శిక్షణ పొందేందుకు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. వైబ్రియానిక్స్ లో పాటించబడే స్పష్టమైన మార్గదర్శకాలు మరియు మందులను తయారు చేయటంలో ఉన్న సౌలభ్యత మరియు విజయవంతమైన ఫలితాలు లభించడం వంటి గుణములను మరియు ప్రయోజనాలను అనుభవం ద్వారా గ్రహించిన వీరు పూర్తిగా హోమియోపతి నుండి వైబ్రియానిక్స్ కు మారిపోవటం జరిగింది.
చికిత్సా నిపుణుడు వైబ్రో చికిత్స తీసుకొనే సంభావ్యత ఉన్న వ్యక్తులతో సంభాషించే సమయంలో, తన అంతరాత్మ అందిస్తున్న మార్గనిర్ధేశాన్ని శ్రద్ధగా విని పాటిస్తారు. అంతర్వాణి ప్రేరణ కలిగించినప్పుడు, వీరు ఇతరులకు ఈ చికిత్సా విధానం గురించి చెప్పి నిర్ణయాన్ని వాళ్ళకే విడిచి పెడతారు. రోగులను తన వద్దకు పంపుతున్నది భగవంతుడే అని పూర్తిగా విశ్వసిస్తున్న వీరు, రోగుల సంక్షేమాన్ని కూడా భగవంతుడికే వదిలిపెట్టి, ఎటువంటి రోగ సమస్యలకైనా ఉదాహరణకు అనేక రకములైన అలెర్జీలు, ఆటిజం, పార్కిన్సన్స్ వ్యాధి (అవయవాల వణుకు రోగం) మరియు ఆటో-ఇమ్మ్యూన్ వ్యాధులకు చికిత్సను నిస్సంకోచంగా అందిస్తున్నారు.
అణచిపెట్టిన కోపం, ఆగ్రహం, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు చింత వంటి భావోద్వేగ సమస్యలకు, CC15.1 Mental & Emotional tonic ద్వారా లభిస్తున్న అద్భుతమైన ఫలితాలను చూసి చికిత్సా నిపుణుడు ఎంతో ఆశ్చర్య పడుతున్నారు. అంతేకాకుండా వీరు CC4.4 Constipation ద్వారా కూడా అనేక అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు.
గత కొన్ని నెలలుగా వైబ్రో చికిత్సను అందిస్తున్న అనుభవంతో వీరు, రోగులకు శీఘ్ర ఉపశమనం కలిగేందుకు రెండు ప్రధాన లక్షణాలుండాలని గుర్తించారు: వైబ్రియానిక్స్ పై విశ్వాసం మరియు మందులను తీసుకోవడంలో క్రమశిక్షణ పాటిచటం. ఈ రెండు లక్షణాలు లోపించినప్పుడు సఫలితాలు లభించే అవకాశం తగ్గిపోతుంది. వైబ్రియానిక్స్ గురించిన వివరాలను తెలుసుకొనుటకు, www.vibrionics.org వెబ్సైట్లో ఇవ్వబడిన వీడియోను మరియు రోగ చరిత్రలను చూడమని వీరు రోగులను ప్రోత్సాహిస్తున్నారు. వెబ్సైట్లో ఉన్న వివరాలు మరియు చికిత్సా నిపుణుడు స్వయంగా రోగులతో పాలుపంచుకొనే విజయవంతమైన రోగ చరిత్రల ద్వారా రోగులకు మరింత స్ఫూర్తి కలిగి, మందులను తీసుకోవడంలో క్రమశిక్షణను పాటిస్తున్నారు. సహనం యొక్క ఆవశ్యకతను గుర్తించిన వీరు, వ్యాధి నుండి ఉపశమనం కలిగే వరకు విశ్వాసం మరియు క్రమశిక్షణతో మందులను తీసుకోమని రోగులకు సలహా ఇస్తున్నారు.
స్వామి ప్రసాదించిన చికిత్సా విధానం ద్వారా సేవను అందించే అవకాశం ఇవ్వబడటం ఒక గొప్ప విశేషంగా వీరు భావిస్తున్నారు. ఈ సేవను తన కర్తవ్యంగా భావిస్తున్న వీరు, వ్యాధులను నయంచేసే కర్త భగవంతుడు మాత్రమేనని పూర్తిగా విశ్వసిస్తున్నారు. భగవంతుడి చేతిలో ఒక శ్రేష్ఠతరమైన సాధనంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఈ చికిత్సా నిపుణుడి యొక్క నిస్వార్థ సేవ రోగులను ఎంతగానో కదిలిస్తోంది.
పంచుకుంటున్న రోగ చరిత్రలు