Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 03524...USA


చికిత్సానిపుణురాలు 03524…USA  1980లో మొట్టమొదటి సారి డా.భగవంతం ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి విన్నప్పటినుండి  ఉత్సాహభరితమైన సాయి భక్తురాలుగా జీవిస్తోంది.  ప్రతి సంవత్సరం ప్రశాంతి నిలయాన్ని సందర్శించే ఈమె, సాయి గ్రామ సేవా కార్యకలాపాల్లో, సాయి సేవా దళ వాలంటీర్లతో పాటు తన సేవలను అందచేస్తోంది. ఈ సేవలో భాగంగా ఆంద్రప్రదేశం మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ (ఒక రకమైన పరీక్ష) మరియు రోగనిర్ధారణ చేయబడే వైద్య శిబిరాల్లో ఈమె పాల్గొనటం జరిగింది. 

సాయి వైబ్రియానిక్స్ గురించి తన స్నేహితురాలు ద్వారా తెలుసుకున్నప్పటి నుండి ఈమెకు ఈ ఉన్నతమైన సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆశక్తి కలిగింది. 2015 మేలో AVP (సహాయక చికిత్సా నిపుణులు) శిక్షణ పూర్తి చేసిన ఈమె విజయవంతమైన ఫలితాలతో తన సేవను అందిస్తోంది. GBS (గ్విల్లాయిన్ బార్ సిండ్రోమ్), రుబిన్స్టెయిన్-తయబై సిండ్రోమ్, స్ట్రోక్ వ్యాధి, సి.ఓ.పి.డి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బులు, తీవ్ర నడుము నొప్పి, పెద్దగడ్డలు(ట్యూమర్లు) వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సహాయపడే అవకాశం ఇచ్చినందుకు స్వామికి తన కృతజ్ఞతలను తెలుపుకుంటోంది. స్వామి యొక్క సాధనంగా జీవించడం, తన సౌభాగ్యంగా భావిస్తున్న ఈమె, రోగుల అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తూ రోగులకు అన్ని వేళలా   సహాయపడేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

ఈ చికిత్సా విధానంలో ఆధ్యాత్మికం యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ ఈమె వైబ్రో మందులను తయారు చేసే సమయంలో సాయి గాయత్రి మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు. అంతే కాకుండా, మందును తీసుకునే ముందుగా గోలీల సీసాను కదలిస్తూ తమ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించమని రోగులకు ఈమె సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈమె వైబ్రో మందులను పూర్తి నమ్మకంతో తీసుకోవాలని మరియు మందును తీసుకొనే సమయంలో " నా శరీరం, మనస్సు మరియు ఆత్మ, ఆరోగ్యమైన స్థితికి చేరుకున్నాయి, ధన్యవాదాలు ప్రభు!" అని స్థిరముగా చెప్పుకోమని రోగులను ప్రోత్సాహిస్తోంది. అవసరమైనప్పుడు ఈమె రోగులను సీనియర్ చికిత్సా నిపుణుల వద్దకు బ్రాడ్ కాస్టింగ్ కొరకు పంపించడం ద్వారా వారికి సహాయం అందిస్తోంది.

ఒక రోగికి చికిత్సను అందించే సమయంలో, ఈమె ఒక త్రికోణాన్ని కల్పన చేసుకుని, భగవంతుడుని త్రికోణం ఒక్క తల (ఎపెక్స్) వైపు ఉన్నట్లుగా ఊహించుకొని మరియు త్రికోణం యొక్క అడుగు భాగానికి చెరో వైపు తాను  మరియు రోగి ఉన్నట్లుగా ఊహించుకునేది. కొందరు రోగులు కొద్ది గంటల్లో లేక ఒక రోజులో ఉపశమనం కలిగినట్లుగా తెలియచేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న రోగులకు వైబ్రియానిక్స్ ద్వారా శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ స్థాయిలలో ఆరోగ్య స్థితి లభిస్తోంది. కొందరికి ధ్యానంలో ఏకాగ్రత మెరుగుపడటం మరి కొందరికి సంతృప్తి కలగడం వంటి అనుభవాలు కలిగినట్లు తెలిపారు.

ఈమె తరచుగా ఉపయోగించే మిశ్రమాలు:

#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + 55 ఏళ్ళు మించిన మహిళలకు, CC20.6 Osteoporosis కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కొరకు 

#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities భావోద్వేగ సమస్యలకు

పైన ఇవ్వబడిన రెండు మిశ్రమాలు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన పరిహారాలని ఈమె నమ్మకం. ఈమెకు వెల్నెస్ కిట్ లో ఉండేటువంటి మూవ్ వెల్ మిశ్రమం ద్వారా కూడా అనేక అద్భుతమైన ఫలితాలు లభించడం జరుగుతోంది. ఒక సందర్భంలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ, పెయిన్ కిల్లర్ ను తీసుకొనుటకు నెమ్మదిగా మెట్లు దిగి వచ్చి ఈమె వద్ద మూవ్ వెల్ మిశ్రమము కలపబడిన గోలీలను కూడా తీసుకోవటం జరిగింది. ఈ మహిళ ముందుగా వైబ్రో గోలీలలను తీసుకొని ఆపై పావు గంట తర్వాత పెయిన్ కిల్లర్ ను తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే పావు గంటకు ముందుగానే నొప్పి నుండి ఉపశమనం కలగటం చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మరొక సందర్భంలో, నొప్పి కారణంగా కారు వద్దకు నడిచి వెళ్ళడానికి ఇబ్బందిపడుతున్న ఒక మహిళను చూసిన చికిత్సా నిపుణురాలు ఆమెకు మూవ్ వెల్ మందును ఇవ్వటం జరిగింది. ఈ మందును చేతిలో పట్టుకొనియున్న ఆ మహిళ కారులో విశ్రాంతి తీసుకుంటుండగా, ఆమెకు నొప్పి మాయమయింది. ఇది ఖచ్చితంగా దైవం చేసిన అద్భుతమని ఆమె భావించింది.

సాయి వైబ్రియానిక్స్ సేవను ఎంతో శ్రద్ధతో చేస్తున్న ఈమె, తద్వారా ఎంతో ఆత్మానందాన్ని మరియు సంతృప్తిని పొందుతున్నట్లుగా భావిస్తున్నారు. సేవను అందించే సమయంలో సాయి గాయత్రి మంత్రాన్ని వందల సార్లు ఉచ్ఛరించటం ద్వారా ఈమె యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి మెరుగుపడేందుకు సహాయకరంగా ఉంటోంది. దివ్య ప్రేమతో ఇతరులకు సేవను అందించి తద్వారా ఆత్మ పరివర్తన కలిగేందుకు ఒక సువర్ణావకాశాన్ని ఇచ్చిన భగవాన్ బాబా వారికి మనస్ఫూర్తిగా తమ కృతజ్ఞతలను తెలుపుకుంటోంది.

పంచుకుంటున్న రోగ చరిత్రలు