చికిత్సా నిపుణుల వివరాలు 11966...India
ప్రాక్టీషనర్ 11966...ఇండియా నేను 2014 ఏప్రియల్ నుండి వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఢిల్లీ ప్రాంతంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. నేను గురుగావ్ లో జరిగే మెడికల్ క్యాంపులో ఒక రోగిగా వైబ్రియానిక్స్ కి పరిచయం చేయబడ్డాను. ఆ సమయంలో నేను డిప్రెషన్ తో బాధపడుతున్నాను. ఒక అభ్యాసకుని నుండి చికిత్స తీసుకున్నాను.
పూర్తిగా నయం అయింది. అప్పుడు నేను ఈ కోర్సు తీసుకొని ఈ సేవ చేయడం ప్రారంభించాను.
నేను గురుగాంవ్ లో వివిధ ప్రదేశాల్లో వారం విడిచి వారం ఆదివారాల్లో వైద్య శిబిరం నిర్వహించే ముగ్గురు అభ్యాసకుల బృందంలో ఒకడిని. మేము స్వామి దయతో గ్రామాలకు వెళ్ళి వైబ్రియానిక్స్ నివారణలు రోగులకు ఇస్తూ వుంటాము.
ప్రారంభంలో, అనారోగ్యాలకు సరి అయిన నివారణ ఎంపిక చేసుకోవడంలో నేను చాలా నెర్వస్ అవుతూ ఉండేవాణ్ణి. కానీ మా సీనియర్ ప్రాక్టీషనర్లు 11483 & 02859 నుండి సరైన మార్గదర్శకత్వం లో ఇది సులభతరం చేయబడింది. ప్రతీసారి ఎవరైనా రోగికి నివారణ ఇచ్చినప్పుడు నేను స్వామికి ఒక అడుగు దగ్గరగా వెళుతున్నట్లుగా భావిస్తుంటాను. ఈ సేవ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి.
నేను చేసిన చికిత్సకు సంబంధించిన ఒక ఉదాహరణ: రెండు సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయికి దీర్ఘకాలిక మలబద్ధకం కేసు చికిత్స చేశాను. అతనికి 1 వ సంవత్సరం నుంచి మలబద్ధకం ఏర్పడింది. అతనికి అల్లోపతి మందులు ఇవ్వబడ్డాయి గాని సమస్య పునరావృతం అవుతూనే ఉంది. నేను అతనికి క్రింది నివారణ ఇచ్చాను.
CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion...TDS
ఈ నివారణ 200ml నీటిలో తయారు చేసి ఇచ్చాను. 5 ml మోతాదు చొప్పున బాబు తీసుకున్నాడు. మూడు రోజుల్లో అతని మలబద్ధకం పోయింది. అతను ఈ నివారణను మరో రెండు వారాలు తీసుకున్నాడు. దాని తరువాత, సౌకర్యం కోసం మోతాదు OD కి తగ్గించబడింది.