Practitioner Profile 01480...France
ప్రాక్టీషనర్ 01480…ఫ్రాన్స్ ఈ దంపతులు గత 20 సంవత్సరాలుగా వైబ్రియోనిక్స్ ప్రాక్టీసు చేస్తున్నారు. భర్త ఎన్నో సంవత్సరాలు ఆరోగ్య శాఖ లో పనిచేసి అలోపతి మందుల వలన కలిగే హానికరమైన ఫలితాలను ఆకళింపు చేసుకున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని ప్రత్యామ్నాయ చికిత్సా పద్దతుల పైన వీరి అన్వేషణ ఫలించి వైబ్రియోనిక్స్ లో వీరి చేరికను సుగమం చేసినది . ఈ దంపతుల మధ్య ఉన్న పరస్పర అవగాహన నిస్వార్ధ సేవ పట్ల వీరి అభిరుచి పుట్టపరి వెళ్లి భగవాన్ బాబాను దర్శించి ఆ తర్వాత డాక్టర్ అగ్గర్వాల్ గారి శిక్షణలో వైబ్రియోనిక్స్ చికిత్సా నిపుణులుగా మారడానికి దోహదపడింది
సాయి వైబ్రియోనిక్స్ అంతటి లోనూ దాని యొక్క సేవా విభాగమే అత్యంతమౌలికమైనది ఈ దంపతులు గుర్తించారు. ఇద్దరూ కూడా తమ పేషంట్ల జీవితాలలో ఆరోగ్యాన్ని,ఆనందాన్ని నింపాలనే ఆశయం గలవారే. వీరి దృష్టిలో ప్రధాన లేదా ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న చికిత్సా విధానాలు పేషంట్లను భయపెట్టేవిగాను ఇంకా చెప్పాలంటే అనేక కష్ట నష్టాలకు గురి చేసేవిగాను ఉన్నాయనీ అదే వైబ్రియోనిక్స్ విషయంలో చూసినట్లయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణము,బేషరతుగా ఉండే ప్రేమకు ఇది నిలయం .పేషంట్ల లో భౌతిక,మానసిక భావోద్వేగ,ఆధ్యాత్మిక పరమైన మార్పు తెచ్చి దీర్ఘకాలికమైన ప్రయోజన కారక మైన చికిత్సను ఇది అందిస్తుంది .
వీరు మొట్టమొదటి సారి ఒక థైరాయిడ్ సమస్య తో వచ్చిన పేషంటుకు చికిత్స నందించి స్వస్థత చేకూర్చిన అనుభవం ఎల్లప్పుడూ ఆనందంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరి వద్దకు వచ్చిన పేషంటు వారి అలోపతి డాక్టర్ సూచన మేరకు లెవో థైరాక్జిన్ (Levothyroxine) మందును వాడుతున్నారు. నాలుగు నెలల వైబ్రో చికిత్స తరువాత థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోవడమే కాక అలోపతి మందులనుండి పూర్తి విముక్తి లభించింది.
వైబ్రియోనిక్స్ సేవ వల్ల ఈ దంపతులలో ఒక ఉన్నతమైన అంతర్ద్రుష్టి,అవగాహన, ఇంకా వీరి అంతః చేతనలో ఎంతో పరివర్తన కలిగిందని చెపుతున్నారు. మనసు ద్వారా కాక హృదయము ద్వారా పని చెయ్యడం వీరికి అలవాటయ్యింది. వీరు ప్రాక్టీషనర్ 01620…ఫ్రాన్స్ తోకలసి శిక్షణ ఇచ్చే బృందము గా ఏర్పడి ఫ్రాన్స్ లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది వీరు క్రొత్తవారితోనూ ,సమవయస్కులతోను తమ అనుభవాలు పంచుకోవడానికి ఎంతో దోహద పడుతోంది. వీరు 108CC బాక్స్ తోనే కాక SRHVP ద్వారా రెమిడి లను బ్రాడ్ కాస్ట్ చేసి ఇవ్వడం ద్వారా అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.
వైబ్రియోనిక్స్ సేవ వీరికి ఫలితాన్ని ఆశించకుండా అంతా స్వామి సంకల్పానికి వదిలి జాగ్రత్తగా సేవ చేయడం నేర్పించింది. కొత్తగా వైబ్రియోనిక్స్ లో ప్రవేశించే వారికి వీరిచ్చేసందేశం ఏమిటంటే ‘’ ఆందోళన వద్దు ,భయం అసలే వద్దు,పూర్తి విశ్వాసం తో మున్ముందుకు సాగండి,ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి’’ !