Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అభ్యాసకుల వివరాలు 01620...France


ప్రాక్టీషనర్ 1620…ఫ్రాన్స్  ఒకప్పుడు ప్రసిద్ధ దంత విభాగపు అధిపతి గా ఉన్నవీరు ప్రస్తుతం ఫ్రాన్సు దేశపు కోఆర్డినేటర్ గానూ అలాగే అక్కడ ఉన్న ముగ్గురు వైబ్రియోనిక్స్ శిక్షకులలో ఒకరుగాను ఉంటున్నారు

1990 నుండే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తురాలిగా ఉన్న వీరు 2000 సంవత్సరంలో మాత్రమే వారి మిత్రులద్వారా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్లు లేని పూర్తీ ఉచితంగా వైద్యం అందించబడే వైబ్రియోపతి అనే విభాగము గురించి తెలుసుకున్నారు.వీరు తన మిత్రులను బాబా ఆశ్రమంలో నడపబడుతున్న వైబ్రియో క్లినిక్ కు తీసుకు వెళ్ళమని కోరగా అదృష్ట వశాత్తు స్వామి సంకల్ప వశాన ఆ సమయంలో వైబ్రియోనిక్స్ శిక్షణా తరగతులు నిర్వహింప బడుతూ  ఉంటే వాటిలో పాల్గొనే అవకాశము చిక్కింది.ఈమెకు ఆంగ్ల పరిజ్ఞానము అంతంతమాత్రమే ఐనా వీరియొక్క అంకితభావము,పట్టుదలను చూసి డాక్టర్ అగ్గర్వాల్ సార్ వీరిని ఈ శిక్షణా తరగతులలో చేర్చుకున్నారు

 ప్రతిరోజూ సాయంత్రం వేళ వీరి స్నేహితురాళ్ళు వీరికి ఆరోజు శిక్షణలో చెప్పిన అంశాలను  విడమరచి చెప్పేవారు. సహజంగా ప్రతిభావంతురాలాయిన ఈమె తాను విన్నదానిని చక్కగా నోట్స్ తయారు చేసుకొని తన జ్ఞానాన్ని కూడా జోడించి సాయి వైబ్రియోనిక్స్ కు అన్వయించే వారు. త్వరలోనే కోర్స్ పూర్తి  చేసుకొని ప్రాక్టీసు ప్రారంభించాడానికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకొన్నారు. ఫ్రాన్స్ రాగానే ఆంగ్లము నేర్పబడే సంస్థ లో చేరి పట్టుదలతో ఆంగ్లం నేర్చుకొని సాయి వైబ్రియోనిక్స్ ఇంగ్లీష్ పుస్తకం చదవడం పూర్తి  చేసారు.అంతేకాక వీరి స్నేహితుల సహకారముతో ఈ పుస్తకాన్ని ఫ్రెంచ్ భాషలోనికి తర్జుమా చేయడానికి కూడా పూనుకున్నారు.       

ఫ్రాన్సులో వైబ్రియో ప్రాక్టీషనర్ గా  వీరి యొక్క ప్రారంభపు రోజులు పూలబాట మాత్రము కాదని చెప్పవచ్చు. వీరికి సహకారము అందించడానికి దగ్గరలో వేరే ప్రాక్టీ షనర్ లు లేరు. కేసులకు సంబంధించిన సమాచారము తెలుసుకొనడానికి నూతనంగా వస్తున్న మార్పులు తెలుసుకొనడానికి వార్తాలేఖలు లేవు,వెబ్సైట్లు లేవు. రెమిడి ల వల్ల లభిస్తున్న సానుకూల ఫలితాల స్పూర్తితో వంటరిగానే మొక్కవోని దీక్షతో వీరు తన వై బ్రో దీక్షను కొనసాగించారు. 

 స్వామి లీలలు ఈ ప్రాక్టీషనర్ కు కొత్తేమీ కాదు. 2013 లో ఈమెకు రొమ్ముపై క్యాన్సర్ అని నిర్ధారణ చేసి శస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపి చేయించుకోమని చెప్పారు. తీవ్ర మైన ప్రార్ధనల ద్వారా స్వామికి శరణాగతి చేసి ఆమె అలోపతి మరియు హోమియో పతి మందులు రెండూ కలిపి తీసుకోవాలని నిశ్చయించుకున్నారు.రేడియేషన్ చికిత్స ద్వారా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్ లకు లోను కావడానికి బదులు ఆమె చక్కగా కోలుకోవడమే కాక ఎంతో మానసిక ప్రశాంతతను అనుభవించారు. ఆపరేషన్ చేయించుకోవలసిన సమయం అసన్నమయినప్పుడు  ఆమెకు కేటాయించబడిన 108 గదిని చూసి ఎంతో ఆనంద పడ్డారు .

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత మెయిన్ టేనేన్స్ డోసేజ్ ప్రారంభించడము  అంతేకాక అతిత్వరలో ఆమె కోలుకో గలిగినందుకు స్వామికి ఎంతో కృతజ్ఞత తెలుపు తున్నారు. ఈ కృతజ్ఞతను  జీవితాంతము  పేషంట్ లకు సేవచేయడానికి వినియోగించాలని నిర్ణఇంచు కున్నారు.  ఈ బాధాకరమైన జీవితం వీరిలో వ్యక్తిగతముగాను, ఇతరుల బాధలను అర్ధము చేసుకొనడానికి ఒక ప్రాక్టీషనర్ గానూ ఎంతో పరివర్తన తీసుకు వచ్చింది. తనకు తానే ఒక సజీవ ఉదాహరణగా ఉంటూ పేషంట్ల యొక్క బాధలు అర్ధం చేసుకొనడానికి ముఖ్యంగా కేన్సర్ వంటి భయంకర వ్యాధుల బారిన పడ్డ పేషంట్ల నమ్మకమును విశ్వాసాన్ని కలిగించేవారు.

 2010  లో మొదటి వార్తాలేఖ ప్రచురితమైన దగ్గరి నుండి ఇప్పటివరకు అన్ని వార్తలేఖలను ఫ్రెంచ్ భాషలోనికి తర్జుమా చేసారు., వీరు ఈ సేవను తన జ్ఞానాన్ని పెంపొందించే దానిగాను ఈ వార్తాలేఖల లో రాయబడిన ప్రాక్టీ షనర్ ల అనుభవాలు తన విశ్వాసాన్ని పెంపొందిన్చేవిగాను ఉంటున్నట్లు తెలియ జేస్తున్నారు. ఈ వైబ్రియో రెమిడి ల ద్వారా పేషంట్లకు స్వస్థత చేకూరు తున్న తీరు తన హృదయాన్ని కదిలించి వేస్తున్నట్లు వీరు  తెలుపుతున్నారు.  

  2014, డిసెంబర్ లో ప్రాక్టీషనర్ డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ గారి అధ్వర్యంలో నిర్వహింపబడిన వైబ్రియోనిక్స్ ట్రైనర్ వర్క్ షాప్ ను విజయవంతంగా పూర్తి చేసారు. ఫ్రాన్సులో మరో ఇద్దరు ట్రైనర్ లతో కలసి ప్రణాళికలు సిద్ధం చేయడం AVP శిక్షణా శిబిరాలు నిర్వహించడంలో వీరు తమ జ్ఞానాన్ని ,అనుభవాన్ని పెంచుకుంటూ  ఈ సాయి వై బ్రియోనిక్స్ యొక్క విస్తృత పరిధికి కావలసిన ప్రేమవారధులను అందిస్తున్నారు. శిక్షకులందరూ కూడా కొత్త ప్రాక్టీషనర్ లకు బోధించడం,శిక్షణ నివడం,సర్టిఫికేట్ లు ఇవ్వడం,ఈ సేవ తమ కెంతో ఆనందాన్ని కలిగిస్తోందని,ఇది తమ భాగ్యమని తెలుపుచున్నారు.

ఫ్రాన్సులో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న వీరు ఈ అద్భుత చికిత్సా విధానాన్ని,దివ్య ప్రేమను అందరికీ పంచాలనే ఆకాంక్ష తో పనిచేస్తున్నారు. మధ్యలో మానివేసిన ప్రాక్టీషనర్ ల కోసం ప్రోత్సాహకరంగా శిక్షణాశిబిరాలు,ఇతరత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి నిరంతరము నేర్చుకోవడానికి,ఇతర ప్రాక్టీషనర్ లతో సంబంధ బాంధవ్యాలు నెరపడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. దీనివల్ల ఎందరో తిరిగి ప్రధాన స్రవంతిలో చేరి తమ సేవా సాధన ను కొనసాగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

హృదయ సంభంద మైన బాంధవ్యాన్ని నెలకొల్పడం ద్వారా సాయి వైబ్రియోనిక్స్ తన హృదయాన్ని విశాలం చేసిందనే అభిప్రాయం వీరు వెలిబుచ్చుతున్నారు. నిరాశావహ దృక్పధంలో నూ,బాధలలోను ఉన్నవారి ఇబ్బందులను  వాత్సల్యంతోనూ ,ప్రేమతోనూ  వినడం ,అనునయించడం వలన వారిలో ఆశావహమైన దృక్పధాన్ని కలిగించ గలుగుతున్నానని, కనీసం టెలిఫోన్ ద్వారా మాట్లాడిన సందర్భంలో కూడా ఇటువంటి వారు అశాంతి నుండి ప్రశాంతికి మరలిన సందర్భాలున్నాయని వీరు పేర్కొంటున్నారు.  

వీరి వైబ్రియోనిక్స్ సేవ కేవలం వైద్యానికే పరిమితం కాకుండా పేషంట్ల కు ఆరోగ్యకరమైన ఆహార విధానాలు,జీవన విధానము వంటివి పేషంట్లకు చెపుతూ వారు  త్వరగా కోలుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు.  ఇంకా వీరు తమ చికిత్సా విధానములో ‘‘ స్వయం పరిశీలన వైద్యానికి మొదటి మెట్టు ‘’ అని భావిస్తూ తమ పేషంట్లతో ‘ నేనెవరిని,నేను జబ్బుతో ఉన్నట్లు ఎందుకు భావిస్తున్నాను,ఈ జబ్బుకు కారణ మేమిటి?’’ అని ప్రశ్నించు కొనేలా ప్రోత్సహిస్తారు. ఇలా తన సేవ ద్వారా పేషంట్లు తమ బాధలనుండి కోలుకొని ఆరోగ్య ఆనందాలను  పొందగలిగితే   వీరు స్వామికి సాయి వైబ్రియోనిక్స్ కు కృతజ్ఞతలను తెలుపుకుంటారు.