అభ్యాసకురాలి వివరాలు 11571...India
అభ్యాసకురాలు 11571...ఇండియా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈమె 2015 ఏప్రిల్ నుండి వైబ్రియానిక్స్ అభ్యసించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఈ క్రింద వ్రాసియున్న సమస్యలకు ఈ చికిత్సను ఇచ్చింది: జలుబు, ధీర్గకాలిక దగ్గు, ఋతుచక్రం (నెలసరి) క్రమ పద్ధతిలో అవ్వకపోవడం, గర్భిని స్త్రీకు చర్మంపై దురద, స్పాండిలైటిస్, బలహీన కంటి కండరాలు, జుట్టు సమస్యలు మరియు అజీర్ణం వంటివి. వైబ్రియానిక్స్ అందించే ప్రయోజనాలను తెలుసుకుని ఈమె ఒక గర్భినియై ఉండికూడా ఈ చికిత్సా విధానంలో ఉత్సాహంగా శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమెకు ఒక అమ్మాయి జన్మించింది. తన అనుభవాలని ఈ విధంగా వివరిస్తోంది:
"నేను గర్భినిగా ఉన్నప్పుడు మూడో నెల చివరిలో, ఒక రోజు విపరీతమైన కడుపు నొప్పి మరియు వాంతులతో భాధపడ్డాను. మరుసటి రోజు నేను డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళిన సమయంలో కూడా కడుపులో నొప్పి తగ్గలేదు. డాక్టర్ అజీర్ణానికి మరియు నొప్పికి విడివిడిగా ఇంజక్షన్లు ఇచ్చారు. డాక్టర్ కడుపులో నొప్పి తగ్గక పోతే, ఒక అల్ట్రా సౌండ్ పరీక్ష చేయించుకోమన్నారు. ఆపై రెండు రోజుల వరకు నొప్పి లేదు. కాని ఆ తర్వాత తీవ్రమైన నొప్పి మొదలయింది. దీనివల్ల నాకు చాలా వేదన కలిగింది. గత వారం రోజులుగా నాకు మలబద్ధకo సమస్య కూడా మొదలవడంతో నా భాద మరింత ఎక్కువైంది. మా అమ్మగారు అభ్యాసకుడు11476...ఇండియా నుండి మలబద్ధకం సమస్యకు వైబ్రో మందును తీసుకు వచ్చింది. ఈ మందుతో పాటు మూడు లీటర్ల గోరువెచ్చని నీరు తాగడంతో నా సమస్య వారం రోజులలో పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత నేను ఇంకెప్పుడూ మలబద్ధకం సమస్యను ఎదుర్కొనలేదు. ఈ విధంగా స్వామి నన్ను వైబ్రియానిక్స్ సేవకు పరిచయం చేసారు. నేను ఈ మహత్తరమైన చికిత్సా విధానంపై శిక్షణ పొందాలని నిర్ణయించుకుని, దరఖాస్తు పత్రాన్ని సమర్పించాను.
ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిన AVP కోర్సు పూర్తయ్యాక, నేను ఈ క్రింద వ్రాసిన కాంబోలను తీసుకోవడం ప్రారంభించాను
#1. CC4.10 Indigestion + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
ఇది తీసుకున్నాక నాకు మానసికంగాను మరియు భౌతికంగాను చాలా తేలికగా అనిపించింది. అదే సమయంలో చాలా మత్తుగా అనిపించి రోజంతా నిద్రిస్తూనే ఉండేదాన్ని. కేవలం ఆహారం తీసుకోవడానికి మాత్రమే మేలుకొనే దాన్ని. కొన్ని రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి చేరుకున్నాను.
ఎనిమిదో నెలలో శరీరమంతా దురద కారణంగా నాకు నిద్ర పట్టేది కాదు. ఈ సమస్యకు నేను ఈ క్రింద వ్రాసిన కాంబోలను తీసుకున్నాను
#2. CC21.1 Skin tonic + CC22.2 Skin infections + CC22.3 Skin allergies + CC21.6 Eczema...TDS మౌఖికంగా మరియు చర్మంపై రాయడానికి కొబ్బరి నూనెలో
ఒక వారం తర్వాత నాకీ సమస్యనుండి పూర్తిగా ఉపశమనం కలిగి శాంతియుతంగా నిద్రపో గలిగేదాన్ని. గర్భం యొక్క 38 వ వారంలో డాక్టర్ నాకు సిసేరియన్ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటి నుండి నేను ఈ క్రింద వ్రాసిన కాంబోను ప్రారంభించాను
#3. CC10.1 Emergencies…TDS
నేను #1, #2 మరియు #3 ప్రసవం అయిన నెల రోజుల వరకు కొనసాగించాను. 2015 జూలై 2న స్వామి నాకు ఒక అందమైన ఆడ బిడ్డను ప్రసాదించారు. వైబ్రో చికిత్స, ఆపరేషన్ నుండి త్వరగా కోలుకుని బిడ్డని చూసుకునేందుకు నాకెంతో సహాయపడింది. ఒక వారం తర్వాత సాధారణ ప్రసవం జరిగినంత తేలికకగా నాకు అనిపించింది. ఇదే సాయి వైబ్రియానిక్స్ యొక్క మహిమ. స్వామి దీవెనలు ఎల్లపుడు నాతో ఉన్నాయని నాకెంతో ఆనందంగా ఉంది.
నేను గర్భినిగా ఉన్నప్పుడు నా బరువు ఎక్కువగా పెరగక పోయినప్పటికి, నా బిడ్డ యొక్క పెరుగుదల సాధారణంగా కొనసాగింది. ఇది వైబ్రో తీసుకోవడం వల్లే సాధ్యమైంది.