అభ్యాసకురాలి వివరాలు 11964...India
1978 లో నేషనల్ డిఫెన్స్ అకాడమి (దేశ రక్షణ అకాడమి) నుండి విజయవంతంగా ఉత్తీర్ణుడైన నన్ను, సాయి భక్తులైన నా తల్లి తండ్రులు బాబాకి కృతజ్ఞ్యతలు తెలపడం కొరకు షిర్డీ మరియు పర్తి తీసుకువెళ్ళారు. తదుపరి, 34 సంవత్సరాలు భారత సైన్యంలో పని చేసేటప్పుడు ఉండే కఠినమైన జీవన సరళి విధానాన్ని తట్టుకోవడానికి స్వామి దీవెనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నేను పదాతి దళంలో ఉండడంతో చాలా హత్యలు మరియు రక్తపాతం చూసాను. అటువంటి సమయాలలో స్వామి యొక్క దీవెనలు నన్ను రక్షించాయని నేను భావిస్తున్నాను. స్వామి యొక్క మార్గదర్శకత్వం నాకు ఎటువంటి భయంకరమైన అందోళన వచ్చినా దేశరక్షణ కోసం నిలబడేందుకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. స్వామి కృప వల్ల నాకు రాష్ట్రపతి ద్వారా విశిష్ట సేవా మెడల్ ఇవ్వబడింది. శత్రువు కెదురుగా అత్యుత్తమ ప్రదర్శనకు ఉత్తర మరియు దక్షిణ ఆర్మీ కమాండర్ల నుంచి ప్రశంసలు బిరుదులు కూడా అందుకున్నాను.
2012 లో, 54 సంవత్సరాల వయస్సులో సైన్యం నుండి రిటైర్ (కల్నల్ హోదాలో) అయ్యాక , నాకు చాలా లాభదాయకమైన ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి. నేను వాటిని తిరస్కరించి, స్వామి సేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను సాయి సమితి సభ్యుడవడంతో ఢిల్లీ NCR ప్రాంతంలో ఉన్న సత్యసాయి సేవ సంస్థ నిర్వహించిన కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొన్నాను. కాని నేను చేసిన సేవ యాంత్రిక పద్ధతిలో ఉన్నట్లు నేను భావించాను. ఆ రీతిలో సేవ చేయడం వల్ల నాలో ఆధ్యాత్మిక పురోగతి కనపడలేదు. 2014 జనవరి ఒకటో తేదిన, నేను సాయి వైబ్రియానిక్స్ గురించి విని, ఈ చికిత్సా విధానంలో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. 2014 లో JVP కోర్సు పూర్తి చేసి అభ్యాసం ప్రారంభించిన తర్వాత, నా జీవితంలో అనేక మార్పులు ఏర్పడ్డాయి. నాలో ఆధ్యాత్మిక పురోగతి ప్రారంభమైంది. సాయి వైబ్రియానిక్స్ యొక్క మహిమను నేను త్వరలోనే గుర్తించగలిగాను.
2014 డిసంబర్లో నాలుగు రోజుల కఠిన శిక్షణ తర్వాత డా.అగ్గర్వాల్ నుండి SRHVP యంత్రాన్ని మరియు కార్డులను పొందాను. ఆపై నన్ను ప్రక్షాళన ప్రక్రియను (క్లీన్సింగ్ విధానము) తీసుకోమన్నారు.ఈ అద్భుతమైన ప్రక్రియ, నా జీవితం యొక్క ప్రయోజనం ఏమిటో నేను తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్నిచ్చింది. అదే సమయంలో పేషంట్లను ఒక స్థిరమైన ప్రవాహంలో పంపించి, నాకీ మహాత్తమరమైన సేవనందిoచే అవకాశాన్ని స్వామి ఇచ్చారు. స్వామి యొక్క అనంతమైన ప్రేమకు ఇదొక నిదర్శనం. ప్రక్షాళన ప్రక్రియ సమయంలో నా అనుభవాలు:
2014 డిసెంబర్ 11న NM25 Shock…TDS తీసుకోవడంతో నా ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించాను. ఆరవ రోజున తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తల నొప్పి మరియు టేకికార్డియా( గుండె వేగంగా కొట్టుకోవడం) సమస్యలతో భాధపడ్డాను. నా గుండె కొట్టుకునే వేగం 130 bpm కంటే ఎక్కువగా పెరిగింది మరియు నా రక్తపోటు 200/120 కు పెరిగింది. నేను NM25 తీసుకోవడం ఆపి విభూతి తీసుకుని, 36 గంటలు వరకు పడుకునే ఉన్నాను. మూడవ రోజున నాకు 90% వరకు నయమైంది. దీని తర్వాత నేను NM85 Headache-BP + BR5 Heart + SM11 Blood Pressure + SM15 Circulation...QDS తీసుకుని, ఇతర మందులను (రక్తపోటు కోసం గత పదిహేనేళ్ళగా వాడుతున్న అల్లోపతిక్ మందుతో సహా) ఆపేశాను. ఒక వారంలో నాకు 100% నయమైoది NM25Shock ఒకసారి తీసుకోవడంతో మళ్లీ ప్రారంభించి మూడు సార్లకు పెంచాను (OD to TDS).
2015 జనవరిలో నేను తిరిగి పర్తికి వెళ్ళినప్పుడు డా.అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ గారిని కలిసే అవకాశం వచ్చింది. వారు ప్రక్షాళనను కొనసాగించడానికి NM83 Grief…TDS తీసుకోమని నాకు సలహా ఇచ్చారు. ఇది తీసుకున్న మూడు రోజుల తర్వాత నా కళ్ళు భారంగా ఉన్నట్లు అనిపించడంతో, నేను పగలంతా కూడా నిద్రించే వాడిని. ఆపై రెండు రోజులవరకు నేను ఎక్కువగా నిద్రపోయాను కాని ప్రతిసారి మరింత చైతన్యవంతంగా మేల్కొనే వాడిని.
ఫెబ్రవరి మొదటి వారానికి నాకు చాలా ఆరోగ్యకరంగా అనిపిoచింది కాని ఇదే సమయంలో ఒక పాత గాయం తిరిగి వచ్చింది. 1990లో బాస్కట్ బాల్ ఆడుతుండగా లoబార్ భాగంలో (నడ్డి భాగం) ఒక చిన్న డిస్క్ ప్రోలాప్స్( డిస్కు జారుట) జరిగింది. అల్లోపతి మందులు, యోగా, అక్యుప్రేషర్ మరియు ఆక్యుపంక్చర్ ద్వారా ఈ సమస్యనుండి నేను పూర్తిగా కోలుకున్నాను. ఇన్నిసంవత్సరాల తర్వాత హటాత్తుగా ఎడం కాల్లో సయాటికా నొప్పి మొదలై, కాలు కదపడానికి వీలుపడలేదు. దీనితోపాటు వీపు నొప్పి కూడా మొదలైంది. MRI స్కాన్ చేయించడంతో లoబార్ ప్రాంతంలో డిస్కులన్ని ముందుకు వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ నన్ను పెయిన్ కిల్లర్లు మరియు నరాల విశ్రాంతికారిణులు (నెర్వ్ రిలాక్సంట్) తీసుకోమని సలహా ఇచ్చారు కాని నేను ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్న భాగంపై విభూతి రాసి, ఈ క్రింద వ్రాసియున్న వైబ్రో మందులు తీసుకోవడంతో, నాకు రెండు నెలల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయింది:
NM3 Bone Irregularity + NM6 Calming + NM21 KBS + NM24 Rheumatism & Arthritis + NM40 Knees + NM54 Spasm + NM113 Inflammation + OM16 Knees + OM30 Connective Tissue + SM33 Pain + SM36 Skeletal + SR271 Arnica + SR421 Bach Flower Cerato + SR479 Cartilage + SR500 Intervertebral Discs + SR510 Muscles + SR517 Parathyroid + SR540 Vertebrae...TDS
అదే సమయంలో నేను NM72 Cleansing…TDS తీసుకొని నా ప్రక్షాళన నియమావళి కొనసాగించాను.
స్వామి దయవల్ల ఈ రోజువరకు నేను ఆరోగ్యంగా ఉంటూ నా వైబ్రియానిక్స్ సేవను కొనసాగిస్తున్నాను. వైబ్రో చికిత్సను తీసుకోవడం వలన దీని యొక్క మహిమను పూర్తిగా గ్రహించగలిగాను. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఎక్కువగా విరామం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలో వైబ్రియానిక్స్ కి సంబoదించిన అనేక పుస్తకాలను ( సోహం సీరీస్ అఫ్ నేట్యురల్ హీలింగ్, అన్ని సంపుటాలు) చదివే అవకాశం నాకు లభించింది. స్వామి దయవల్ల వచ్చే అనేక పేషంట్లకు నేను నా సేవను అందించ కలుగుతున్నాను. కొత్త కేసులకు చికిత్సను అందించడంతో వైబ్రియానిక్స్ లో ప్రావీణ్యత మరింత పెరిగుతోంది.
ఒక సంవత్సరంగా చేస్తున్న ఈ వైబ్రియానిక్స్ సేవ ద్వారా నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ప్రతిరోజు, ఉదయం ఒక్క గంట మరియు సాయంకాలం ఒక్క గంట చప్పున, మా ఇంటిలోనే పేషంట్లకు చికిత్సనిస్తున్నాను. మా ఇరుగు పొరుగులో ఉన్న కొన్ని కుటుంబాలు కేవలం వైబ్రియానిక్స్ చికిత్సను మాత్రమే తీసుకుంటున్నారు. వారానికి రెండు సార్లు ఒక అర్బన్ స్లంలో (పట్టణ మురికివాడలో) నా సేవను అందిస్తున్నాను.
స్వామి కృప వలన వైబ్రియానిక్స్ నా జీవితానికి ఒక కొత్త ప్రయోజనాన్ని ఇచ్చింది. ఈ సేవ నిస్వార్థ ప్రేమతో చేయబడే ఒక అత్యుత్తమమైన సేవ. డా.అగ్గర్వాల్ ప్రోత్సాహoతో నేను SVP కోర్సు పూర్తి చేయగానే నా భార్య వైబ్రియానిక్స్లో నాకొక అసిస్టెంట్గా చేరడం జరిగింది. ఇప్పుడు మేమిద్దరము ఒక జట్టుగా మా సేవను అందిస్తున్నాము.
ఈ ఉత్తమమైన సేవను కొనసాగించడానికి మమ్మల్ను స్వామి యొక్క దివ్య ప్రేమతో నిండియున్న స్వచ్చమైన సాధనాలుగా తీర్చి దిద్ధమని స్వామిని ప్రార్థిస్తున్నాము.
పంచుకుంటున్న కేసులు