ప్రాక్టీషనర్ వివరాలు 02864...USA
స్వీయ అనుభవం
నేను భారతదేశంలో పుట్టి, పెరిగేను. 1993లో అమెరికా వచ్చాను. ఇప్పుడు అర్బనా-చాంపైన్, ఇలినాయిస్ లో నాభర్త, ఇద్దరు కుమారులతో వుంటున్నాను. నేను సైకాలజీలో, బిజినెస్ మేనేజ్మెంట్ లో కూడా రెండు బ్యాచిలర్ డిగ్రీలు చేసితిని. నేను రేడియోలాజికల్ సైన్స్ లో సర్టిఫికేట్ కోర్స్ చేసి, మేము గత ఏడాది బఫెలో, న్యూయార్క్ కు మారే వరకు రేడియాలజికల్ టెక్నీషియన్ గా పనిచేసితిని.
మా బఫెలో సాయి సెంటర్లో, 2012 లో ఒక సాయిభక్తుడు చెప్పగా ‘సాయి వైబ్రియోనిక్స్’ గురించి మొదటగా నేను విన్నాను. ఆవేసవిలో నేను నడుమునొప్పితో బాధపడుతూ, ప్రాక్టీషనర్ ద్వారా మెయిల్ లో రెమెడీని పొంది, మందు మిశ్రమం మాత్రలు సేవించగా, వెంటనే తగ్గింది. అది చూచి నాభర్త వైబ్రియోనిక్స్ వాడిరి. కొన్నిరోజుల్లోనే మా వెన్ను సమస్యలన్నీ అద్భుతంగా తగ్గినవి. అప్పుడు నేను స్వామిని నాకీ సేవ చేసే అవకాశం అదృష్టం రావడం స్వామి సంకల్పమైతే ఆ అవకాశాన్ని ఇవ్వమని ప్రార్ధించాను. కొన్నినెలల తరువాత తొలిసారిగా అమెరికాలోయీ శిక్షణ ఇవ్వబోతున్నట్లు విన్నాను. మళ్ళీ నేను అదే స్వామి సంకల్పమైతే, అందులో పాల్గొనేటట్లు చేయమని స్వామిని ప్రార్థించాను. నా కోరిక ప్రకారం నేను 2012 అక్టోబరులో విజయవంతంగా JVP శిక్షణ పూర్తిచేసి, నేను గత 2సం.లుగా మందుమిశ్రమాలను సాదారణ కంబోలను ఉపయోగించి రెమెడీలను సిద్దం చేస్తున్నాను.
భగవాన్ అపారకృపవల్ల నడుమునొప్పి, మోకాలినొప్పి, మోకాలి శస్త్రచికిత్స తర్వాత, జ్వరం, పొట్టలో పుండ్లు, ఆమ్లత్వం, ఒత్తిడి, తామర, నిద్ర సమస్యలు, నిర్విరామ కాలునొప్పి, క్యాన్సర్ లకు చికిత్స విజయవంతంగా చేసాను. మొక్కలకి, జంతువులకి కూడా తగిన చికిత్స చేసాను.
అమెరికా,కెనడా ప్రాంతాలలో ఆపరేషన్స్ సమన్వయకర్త గా పని కూడా నాకు స్వామి యిచ్చేరు. నా ఉద్యోగబాధ్యతల్లో భాగంగా వైద్యులనుండి నెలవారీ నివేదికలను సేకరించి డా. అగర్వాల్ కు సమర్పించడం, వైద్యుల మందు మిశ్రమాలను మంచిస్థితిలోవుంచి, సీసాలు తాజాగా ఎండిపోకుండా వుంచుటవంటి ఆచరణాత్మక సలహాలను, చిట్కాలతో సహా వైద్యులకు నెలసరి రిమైండర్లను నేను పంపిస్తాను. నేను మందుమాత్రలు, సీసాలు మున్నగు ఇతర అవసరాలు వైద్యులకు సరఫరా చేస్తాను. ఇతర ప్రాక్టిషనర్స్ విధినిర్వహణకు తోడ్పడుట నా అదృష్టం. ఈబాధ్యత నన్ను బిజీగావుంచి, నాలో ఆత్మబలం కలిగిస్తూ, బాబా ప్రేమద్వారా మానవాళికి మంచి చేయగల అద్భుత అవకాశమిస్తోంది.
స్వామి ఆశీర్వాదంతో, నేను జనవరి 2014 లో భారతదేశానికి వెళ్లి మొదటి ఇంటర్నేషనల్ విబ్రియోనిక్స్ సమావేశానికి హాజరయ్యాను. సమావేశం తరువాత, నేను SVP కోర్సు పూర్తి చేసి, ప్రసారాల ద్వారా నా కుటుంబానికి, ఇతరులకు సహాయపడుతున్నాను.
చికిత్సా ప్రసారాలు రోగికి, వారి ఇంటిలో మరియు SRHVP యంత్రం చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగంగా ఉంటాయన్న సంగతి నేను గమనించాను. నా ఉద్దేశంలో SRHVP యంత్రం స్వామి మానవాళికి ప్రసాదించిన ఒక అధ్బుతమైన బహుమతి మరియు దీవెన. అందువలన దానిని ఖాళీగా ఉంచరాదు. స్వామికృపవల్ల SRHVP నిత్యం పనిచేస్తుంటుంది. నేను ఆ మెషీన్ లో SM5 Peace & Love Alignment ఎల్లపుడూ వుంచుతాను. ఇది కష్టసమయాల్లో మాకన్నివేళలా సహాయం చేసింది. మా పిల్లలను కొత్త హైస్కూల్ కు తగ్గట్లు సరిదిద్దింది మరియు మాకాన్ని విధాలా ఉపయోగపడింది.
సేవకు ప్రతిబింబాలు
దైవాన్ని ప్రేమించే అత్యుత్తమమార్గo అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం, ఆని స్వామి బోధించారు. సేవ మనహృదయాన్ని, దృక్పధాన్ని విస్తృతం చేసి, ఆనందంతో నింపుతుంది, ఐక్యతను ప్రోత్సహించి, ఆత్మసత్యాన్ని ప్రకటిస్తుంది. వ్యక్తిలో దుర్గుణాలను నిర్మూలిస్తుంది. దైవంలో ఐక్యతకు ధ్యానం, యోగ, భజన, నామస్మరణ మున్నగు వేరేమార్గాలున్నాయి. వైబ్రియోనిక్స్ వైద్య సేవ ద్వారా మనం పరుల మంచిని కొరడమే కాకుండా, ఏ విధమైన వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా నిస్స్వార్ధసేవలందిస్తున్నాము. విబ్రియోనిక్స్ నివారణలద్వారా ప్రాక్టిషనర్స్ గా స్వామి ప్రేమ, దీవెనల పవిత్రస్పందనలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాము.