ప్రాక్టీషనర్ల అనుభవాలు 11608...India
ప్రాక్టీషనర్ 11608… ఇండియా వీరు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. 2014 వరకు ఎనిమిది సంవత్సరాల పాటు కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం పశ్చిమ బెంగాల్‌లోని
ఒక పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. 2023లో తిరిగి కేంద్రీయ విద్యాలయంలో అదే ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేశారు. కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్ భాషలపై ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉంది. .
సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఆమె బాలవికాస్ తరగతులకు హాజరయ్యేవారు. ఏదో ఒక రోజు పుట్టపర్తిని సందర్శించగలననే కల ఆమెకు ఉండేది. 1997లో స్వామి ఆమె కోరికను నెరవేర్చడంతో ప్రశాంతి నిలయంలో స్వామి దర్శన భాగ్యాన్ని పొందగలిగారు. సాయి సమితిలో చురుకైన సభ్యురాలిగా ఉంటూ సేవా కార్యక్రమాలు, భజన గానం, వేద పఠనంలో పాల్గొంటూ ఉంటారు. యువజన సమన్వయకర్తగా, బాలవికాస్ గురువుగా సేవలందించారు. 2017 నుంచి జిల్లా వేదము మరియు ఆధ్యాత్మిక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2018లో గురుపూర్ణిమ వేడుకల సందర్భంగా పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో ఆమెకు ఒక వైబ్రో ప్రాక్టీషనర్ పరిచయమయ్యారు. ఆయన అప్పుడే AVP శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆమె అడగడంతో, ఆయన తన వద్ద ఉన్న 108CC బాక్స్‌ను, పుస్తకాన్ని చూపించారు. సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు, ఆమెలో ఏదో తెలియని స్పందన కలిగింది. వైబ్రో ప్రాక్టీషనర్‌గా మారి సేవ చేయాలనే కోరిక ఆమె హృదయంలో తక్షణమే బలంగా కలిగింది. ఆమె మార్చి 2019లో AVP గా శిక్షణ పూర్తి చేసుకుని, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే, జూన్ 2019 లో VP గా అర్హత సాధించారు.
ఆమె వద్దకు చికిత్స కోసం వచ్చిన మొదటి రోగి నాలుగు నెలలుగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్న రెండు వారాల్లోనే ఆమెకు నొప్పి నుంచి ఉపశమనం లభించింది. ఆనందంతో ఆ రోగి ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నప్పుడు, ఆమె ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఈ అనుభవాన్ని ఆమె ఒక అద్భుతమైన స్వామి లీలగా భావిస్తారు.
ఆమె తనకు ఎదురైన కొన్ని ఆసక్తికరమైన కేసుల వివరాలను పంచుకోవాలనుకుంటున్నారు. 52 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళకు గత 10 సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంది. ఆమెకు ఎడమ వైపు రొమ్మును శస్త్రచికిత్స ద్వారా తొలగించారు (మాస్టెక్టమీ). అకస్మాత్తుగా ఆమె కుడి రొమ్ములో నొప్పి రావడంతో పాటు, చనుమొన నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. ఆమె వెంటనే తన వైద్యుడిని సంప్రదించడానికి ముంబై వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. అదే సమయంలో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్‌కు కూడా ఫోన్ చేశారు. రోగి నివసించే ప్రదేశం తన ఇంటి నుంచి గంటకు పైగా దూరంలో ఉన్నప్పటికీ, చికిత్సను వెంటనే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ ప్రాక్టీషనర్ తన భర్తతో కలిసి రోగి ఇంటికి వెళ్లారు. ఆమెకు CC8.3 Breast disorders + CC10.1 Emergencies. రెమిడీ ని ఇచ్చారు. రెండు రోజుల తర్వాత నొప్పి తగ్గిపోయింది. ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు, వైద్యుడు అంతా బాగానే ఉందని చెప్పడంతో ఆమె ఎంతో ఉపశమనం పొందారు.
ఈ ప్రాక్టీషనర్ నిద్ర లేమికి CC15.6 Sleep disorders రెమెడీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని గమనించారు. సెప్టెంబర్ 2020లో, 36 సంవత్సరాల వయస్సు గల ఒక పురుషుడికి ఆమె చికిత్స అందించారు. గత ఆరు నెలలుగా వైద్యులు సూచించిన నిద్రమాత్రలు తీసుకుంటున్నప్పటికీ, గత రెండు వారాలుగా ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఆమె ఆయనకు CC15.6 Sleep disorders…OD పడుకోవడానికి 20 నిమిషాల ముందు తీసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లోనే ఆయనకు నిద్ర మెరుగుపడింది. ఒక నెల తర్వాత, తన సమస్య 100% నయమైందని ఆయన తెలియజేశారు.
మరొక కేసు విషయంలో 2019 ఏప్రిల్ లో 18 సంవత్సరాల యువతి గత ఏడు నెలలుగా జిడ్డు చర్మం, మొటిమలు, అధిక సంఖ్యలో బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతూ ప్రాక్టీషనర్‌ను సంప్రదించింది. ప్రాక్టీషనర్ ఆమెకు CC21.2 Skin infections రెమెడీ ఇచ్చారు. రెండు నుంచి మూడు వారాల్లోనే తన చర్మ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆ యువతి తెలిపింది. రెండు నెలలలోపే ఆమెకు ఆ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి.
45 ఏళ్ల కూరగాయల వ్యాపారి మూడు నెలలుగా మోకాళ్ల నొప్పి, వాపుతో బాధపడుతున్నారు. రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కాళ్లు మడిచి, నేలపై కూర్చోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. మే 2019లో అతనికి CC12.4 Autoimmune diseases + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue అనే రెమెడీని నోటిద్వారా తీసుకోవడానికి, అలాగే నీటిలో కలిపి బాహ్యంగా పూయడానికి ఇచ్చారు. మూడు వారాల్లోనే అతనికి వ్యాధి లక్షణాల నుంచి గణనీయమైన ఉపశమనం లభించింది. ఆరు నెలలు పూర్తికాకముందే అతను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఐదు సంవత్సరాల తర్వాత కూడా అతను సంతోషంగా కాళ్లు మడిచి కూర్చోగలుగుతున్నారు.
2019 జూలై లో, ఆమె ఒక పెంపుడు కుందేలుకు చికిత్స చేసారు. పురుగుల సంక్రమణ కారణంగా ఆ కుందేలు బలహీనంగా ఉండి, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో పాటు, గుంపులుగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఆమె CC1.1 Animal tonic + CC4.6 Diarrhoea…6TD అనే రెమెడీని ఇచ్చారు. ఒక వారంలో కుందేలు 50% మెరుగుపడింది. రెండు వారాల్లో అది తిరిగి సాధారణ స్థితికి వచ్చింది.
గత ఐదు సంవత్సరాల్లో ఆమె 560 మంది రోగులకు చికిత్స అందించారు. ఇప్పుడు ఒక అనారోగ్యానికి మూలకారణాన్ని గుర్తించగలిగేంత అనుభవం తనకు వచ్చిందని ఆమె భావిస్తున్నారు. ఆమె వైబ్రో ప్రాంతీయ సమన్వయకర్తగా సేవలందిస్తూ, డేటాబేస్‌ను నవీకరించడంలో నిర్వాహక బృందానికి సహాయం చేస్తున్నారు. అలాగే, ప్రాక్టీషనర్లు తమ నెలవారీ నివేదికలను అప్‌లోడ్ చేయడంలో సహకరిస్తున్నారు. పుట్టపర్తిని తరచుగా సందర్శించే సమయంలో, ఆమె SVIRT కార్యాలయంలో రోగులకు సేవలందించడానికి ఇష్టపడుతున్నారు. స్థానిక వైబ్రో ప్రాక్టీషనర్లతో కలిసి పనిచేయడంలో ఆనందాన్ని పొందుతున్నారు.
వైబ్రియోనిక్స్ సాధన ద్వారా, సేవను సంపూర్ణ శరణాగతి భావంతో చేయడం, అంతిమంగా అన్నీ ఆయనే చేస్తున్నాడని గుర్తుంచుకోవడం ఆమె నేర్చుకున్నారు. అన్ని రకాల వ్యక్తులతో మెలగడం ద్వారా ప్రతి ఒక్కరినీ ప్రేమతో చూడటం, ప్రేమతో సేవ చేయడం నేర్చుకున్నారు. నిస్వార్థ సేవే భగవంతుడిని చేరుకోవడానికి ఉత్తమమైన మార్గమని ఆమె విశ్వసిన్నారు.
పంచుకున్న కేసులు :