Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 03547...USA


ప్రాక్టీషనర్  03547....USA, అమెరికా లోని న్యూ జెర్సీ కి చెందిన ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ వాణిజ్య మరియు మిశ్రమ భవనాల రూపకల్పన పై పనిచేస్తున్నారు. 12 ఏళ్ల చిన్న వయసులోనే బాలవికాస్ కార్యక్రమాల ద్వారా స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. సంగీత ఉపాధ్యాయులైన వీరి యొక్క బాలవికాస్ గురువు వీరిని సేవా కార్యక్రమాలకు తీసుకువెళ్లడం, మానవతా విలువల కథ, ఇతివృత్తాలతో కూడిన నాటకాలలో పాల్గొనేటట్లు చేయడం మరియు స్వామి జీవితంలోని సంఘటనలను కదా కథనం ద్వారా వివరించడం ద్వారా స్వామి పట్ల అతని భక్తిని పెంపొందించడంలో అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ సమయంలో వీరికి సలహాదారుగా ఉన్న వ్యక్తి భగవాన్ బాబా వారి చిరకాల భక్తులు కావడంతో వీరి వృత్తిపరమైన జీవితాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాక్టీషనర్ తన సమితిలో నారాయణ సేవతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇతను తన జీవితంలో అడుగడుగునా స్వామి యొక్క అదృశ్య మార్గదర్శక హస్తాన్ని గుర్తించసాగారు. యూఎస్ఏ కి వెళ్లిన తర్వాత అతను తన స్థానిక సాయి సెంటర్లో సూప్ కిచెన్ సేవలో పాల్గొంటూ అధ్యయన మండలులను కూడా సమన్వయం చేసేవారు.

2016 మార్చిలో యూఎస్ కెనడా కోఆర్డినేటర్  యొక్క సోల్జర్న్స్ ఇంటర్నెట్ ఎపిసోడ్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి మొదటిసారి విన్నారు. ఆ తర్వాత శ్రీమతి మరియు శ్రీ అగర్వాల్ గారి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు వైబ్రియానిక్స్ భవిష్యత్ ఔషధం అన్న స్వామి మాటలు వీరిలో లోతుగా ప్రతిధ్వనించాయి. అంతేగాక క్యాన్సర్ మరియు అల్జీమీర్స్ వంటి నయం చేయలేని పరిస్థితులతో బాధపడుతున్న రోగుల్లో మెరుగుదలను చూసినప్పుడు, అంతేకాక తన కుటుంబ సభ్యుల విషయంలోనే 53 సంవత్సరాల వయసులో ఉన్న అతని తల్లి పార్కిన్సన్స్ వ్యాధితో ఏడు సంవత్సరాలుగా బాధపడుతు ఈ మందుల ద్వారా తగ్గటంతో ప్రాక్టీషనర్ కావాలనే ప్రేరణ రేకెత్తింది. అతను 2016 జూలైలో AVP అయ్యారు మరియు 2022 జులైలో SVP అయ్యారు. ప్రస్తుతం అతను వైబ్రియానిక్స్ అడ్మిషన్స్ టీం, బ్రాడ్కాస్టింగ్ టీం, నెట్వర్క్ టీం మరియు AVP ల e కోర్స్ టీచర్లతో కూడా పనిచేస్తున్నారు.

తన మూడవ త్రైమాసికంలో గర్భధారణ మధుమేహాన్ని అభివృద్ధి చేసిన 38 ఏళ్ల గర్భిణీ స్త్రీ యొక్క అద్భుతమైన కేసును ప్రాక్టీషనర్ వివరిస్తున్నారు. ఆమె నూచల్ ట్రాన్స్లుఎన్సీ (NT)అనే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నారు. ఇది శిశువు మెడ వెనక ఉన్న ద్రవము మొత్తాన్ని కొలుస్తుంది. ఆమె విషయంలో NT రీడింగ్ 6.5mm అయితే ఇది గర్భధారణ దశలో సాధారణ 3.5mm కంటే ఎక్కువ. అధికంగా ఉన్న ద్రవం పిండములో మెదడును దెబ్బతీసే అవకాశాన్ని సూచిస్తుంది, కాబట్టి ఆమె చాలా ఆందోళన చెందింది 2019 మే 2న ప్రాక్టీషనర్ ఆమెకు CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities ఇచ్చారు. రెండు వారాల తర్వాత చేసిన ఎమ్మారై స్కానింగ్ లో ద్రవంస్థాయి సాధారణీకరించబడిందని నిర్ధారణ అయింది, ఆమె రెమెడీ తీసుకోవడం కొనసాగించారు, మరియు పూర్తి కాలం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించారు.

కోవిడ్ ప్రబలంగా ఉన్న రోజులలో IB తీసుకుంటున్నరోగులు నాలుగు నుండి ఐదు రోజుల్లో వైరస్ నుండి కోలుకోవడం గమనించి స్వామి వాణి “ నేను ఇక్కడే ఉండగా భయమెందుకు” అనే మాటలు అతని మనసులో నిరంతరం ప్రతిధ్వనించేవి. కోవిడ్ రీకూపరేషన్ రెమెడీతో రోగులు వారి శ్వాసకోశ, రక్త ప్రసరణ మరియు జీర్ణవ్యవస్థలకు కలిగే నష్టాల నుండి కోలుకోవడం చూసి వారు స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలిపేవారు.

అతను ప్రమాదవశాత్తు ఐవీ ఆకుల మొక్క యొక్క సంపర్కానికి గురైనప్పుడు వాటి ఆకులను బ్రాడ్కాస్టింగ్ చేయడం ద్వారా అతని లక్షణాలు రెండు మూడు రోజుల్లో అదృశ్యమైనట్టు కనుగొన్నారు. వాల్యూం 13 సంచిక 5 సంపుటి 6 లో చూడండి. బ్లడ్ నోసోడ్ ద్వారా థైరాయిడ్ పనితీరులో వచ్చిన అద్భుతమైన మెరుగుదల గురించి తన స్వీయ అనుభవాన్ని ఉటంకిస్తున్నారు. 2014లో అతనికి హైపోథైరాయిడిజం ఉన్నట్టు నిర్ధారణ అయింది, అల్లోపతి వైద్యం ఏమాత్రం సహాయం చేయలేదు. ఆగస్టు 4న ప్రాక్టీషనర్ బ్లడ్ నోసోడ్ తీసుకోవడం ప్రారంభించారు. 2021 డిసెంబర్లో వార్షిక తనిఖీ లో అతనిTSH 7.55 mU/l (సాధారణ స్థాయి: 0.5 నుండి 4.5) మరియు D విటమిన్ స్థాయి 24 ng/ml (సాధారణ స్థాయి : 30+), 2022 డిసెంబర్లో ల్యాబ్ పరీక్షలు అతని TSH స్థాయి 5.5 కి చేరినట్లు చూపాయి, అంతేకాక బ్లడ్ నోసోడ్ D విటమిన్ ను ఎక్కువగా గ్రహించేందుకు సహాయ పడడంతో అతని విటమిన్ డి స్థాయి 40 కి పెరిగింది.

ప్రాక్టీషనర్ ఇష్టపడే కొన్ని కాంబోలు CC2.3 Tumours & Growths + CC4.8 Gastroenteritis దీర్ఘ కాలిక ఉబ్బరం సమస్యలకు CC4.2 Liver & Gallbladder tonic + CC15.2 Psychiatric disorders అధిక కోపం, ప్రవర్తన సమస్యల కోసం మరియు మానసిక రుగ్మతలకు, మరియు CC8.1 Female tonic + CC8.8 Menses irregular అణచి వేయబడిన లేదా క్రమ రహిత ఋతు చక్రాలకు సంభంధించిన సమస్యలకు

NM12 Combination-12 (12 టిస్యూ సాల్ట్ ల కలయిక) అన్నీ రకాల అనారోగ్య సమస్యలకు అద్భుతంగా పని చేస్తుందని వీరు తెలుసు కున్నారు. కణాలలో అకర్బన లవణాల లోపము అనేది వ్యాధికి కారణమవుతుందని ఈ రెమిడి ఆ లోటును భర్తీ చేయడానికి వైద్య ప్రక్రియలో సహాయపడుతుందని అతను నమ్ముతున్నారు. 108CC లలో జాబితా చేయబడిన 18 టానిక్కులలో 11 టానిక్ లు NM 12 కలిగి ఉంటాయని మిగతా 7 వ్యక్తిగత కణజాల లవణాలు వివిధ స్థాయిలో అనగా కొన్నింట్లో 12 లో గరిష్టంగా 7 వరకు కలిగి ఉంటాయని వీరు గమనించారు. సాధారణంగా కణజాల లవణాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ప్రత్యేకించి NM 12 కి సంబంధించి నంత వరకు సోహం సిరీస్ వాల్యూమ్ 2 సెక్షన్ 3 నుండి SVP లు ఈ రెమెడీ యొక్క లాభాల గురించి మరింత తెలుసుకోవాలని ఆయన సిఫారసు చేస్తున్నారు.

  నీటితో మొదటి మోతాదు ఇచ్చినప్పటి నుండి రెండు నుండి మూడు రోజుల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకు కొనసాగించితే అది వైద్య ప్రక్రియను వేగిర పరుస్తుందని వీరు కనుగొన్నారు. డయాబెటిక్ రోగులకు అల్లోపతి డోస్ పెంపుతో రక్తంలో చక్కెర స్థాయి తగ్గనప్పుడు పైన పేర్కొన్న రీతిలో వైబ్రియానిక్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. రెమిడీలను సిద్ధం చేస్తున్నప్పుడు స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని జపించడానికి లేదా వినడానికి వీరు ఇష్టపడతారు, ఎందుకంటే ఇది పేషంటు స్థితిలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుంది. వీరు ప్రాక్టీషనర్లకు అందించే మరో చిట్కా ఏమిటంటే వైబ్రేషన్లు మరింత ప్రభావంతంగా పనిచేయడానికి  రెమిడీ బాటిల్ను ఓపెన్ చేసే ముందు కొన్నిసార్లు షేక్ చేయాలి.  

గత కొన్ని సంవత్సరాలుగా రోగ చరిత్రలు మరియు ఫాలో అప్ కేసులు రికార్డ్ చేయడానికి ప్రాక్టీషనర్ తన విధానాలను మెరుగుపరిచారు. రోగి యొక్క పురోగతిని అనుసరించడానికి ప్రాక్టీషనర్ వ్యక్తిగత శ్రద్ధ కనబరిచినప్పుడు రోగి తన శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారనే భరోసా కలిగి ఉంటాడు. ప్రతీ వార్తా లేఖను క్షుణ్ణంగా చదవడం తన వైబ్రో అభ్యాసానికి చాలా విలువైనదిగా అతను నమ్ముతున్నారు. అలాగే సోహం సిరీస్ పుస్తకాల యొక్క వివరణాత్మక అధ్యయనం అతనికి సబ్జెక్టుపై అవగాహన మరింత పెంచుకోవడంలో సహాయపడింది. చక్రాలచే నియంత్రింపబడే శక్తి క్షేత్రాలు ద్వారా మానవ శరీరం ఎలా స్వస్థత పొందుతుంది అనే దానిపై అతను విస్మయానికి లోనౌతూ ఇట్టి సంపూర్ణ వైద్యం యొక్క ఈ ప్రత్యేకమైన వ్యవస్థను తనకు పరిచయం చేసినందుకు స్వామికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

పంచుకున్న కేసుల సందర్భాలు :