Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 03108...Greece


ప్రాక్టీషనర్ 03108...గ్రీస్  మార్కెటింగ్ మరియు కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ తోపాటు బయో కెమిస్ట్రీలో వీరు  గ్రాడ్యుయేషన్ చేసారు. స్వామికి అనుంగు భక్తురాలు కాననే భావన వీరికి ఉన్నప్పటికీ ఆమె తల్లి బాబా సాహిత్యము చదువుతూ ఉండడం మరియు ఇంట్లో ఎప్పుడూ విభూతి ఉండడంతో చిన్నతనం నుండి స్వామి ఫోల్డు లోనే ఉన్నారు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న దుకాణంలో ఉన్న పెద్ద కిటికీని కవర్ చేస్తూ సత్య సాయి బాబా వారి నిలువెత్తు పటం ఉంది. స్వామి మానవాళి కోసం చేస్తున్న వివిధ బృహత్తరమైన మానవతా ప్రాజెక్టుల పట్ల అభిమానం ఉంది .

ప్రాక్టీషనర్ యొక్క 4 ఏళ్ల కుమార్తెకు తన శరీరం అంతటా దురద దద్దుర్లు ఏర్పడినప్పుడు ఆమె విభూతి యొక్క శక్తిని ప్రత్యక్షంగా అనుభవించారు. తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లే ముందు ఆమె ప్రభావిత ప్రాంతాలపై కొంత విభూతిని రాయగా ఆమెను  చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ దురద, దద్దుర్ట్లు  వెంటనే మాయమయ్యాయి. ఇది పెన్సిల్ రాతను తుడిపివేసే ఎరాజరు లాగా పనిచేసి నిమిషాల వ్యవధిలోనే చర్మం మొత్తం సాధారణం అయింది.

ఈ సంఘటనతో జీవితం మరియు ప్రకృతి యొక్క అద్భుతాలను కేవలం సైన్స్ అనే భూతద్దం ద్వారా బహిర్గతం చేయలేమని  ప్రారంభంలోనే ప్రాక్టీషనర్ గ్రహించారు. బాల్యంలో ఈ ప్రాక్టీషనర్ హోమియోపతిక్ మరియు రికీ చికిత్సలు తీసుకున్నారు. రెండు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. పెద్దయ్యాక తన కుటుంబానికి మరియు తనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ పద్ధతులను కోరుకుంటూ ఉండేవారు. 20 సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడు తన చిన్న పిల్లలకు ఎప్పుడు జలుబు లేదా జ్వరం వచ్చినా వారికి అందించడానికి వైబ్రియానిక్స్ రెమిడీ ఇచ్చారు. ఇది ఒక మాయా మంత్రదండం వలె నిరూపించబడి ఆమెకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. 2014లో ఇదే స్నేహితుడు డాక్టర్ అగర్వాల్ త్వరలో గ్రీస్ లో ఒక సెమినార్ నిర్వహించ బోతున్నారని తెలిపారు. ఇదే వైబ్రియానిక్స్ తో ప్రయాణానికి ఆరంభం, ఇది ఆమె తన జీవితంలో అంతర్భాగంగా నిలిచిన వైబ్రియానిక్స్ యొక్క విలువైన బహుమతిగా భావించారు.

వైబ్రియానిక్స్ అభ్యసించే అవకాశాలు ఆమెకు చాలా ఊహించని విధంగా లభించేవి. ఆమె ఎటువంటి కారణం లేకుండా కొన్ని సార్లు  అపరిచితులతో వైబ్రియానిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాక వారు ఆమె నుండి చికిత్స తీసుకోవడానికి  సిద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్య పోయేవారు. ఒకసారి ఆమె ఒక మార్కెట్ వీధిలో ఆరోగ్యంగా కనిపిస్తున్న చేపల వ్యాపారిని చూసి వైబ్రియానిక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించారు. థైరాయిడ్ శస్త్ర చికిత్స తర్వాత ప్రాణాంతకమైన ఆమె పరిస్థితి గురించి అలాగే తనకు ఏర్పడిన భయం మరియు అభద్రతా భావమునకు సంబంధించి ఆ విక్రేత చికిత్సను అభ్యర్థించారు. మరుసటివారం ప్రాక్టీషనరు ఆమెకు ఈ రెమిడీ ఇచ్చారు: NM6 Calming + NM12 Combination 12 + NM25 Shock + NM95 Rescue Plus + NM110 Essiac + BR2 Blood Sugar + BR3 Depression + BR4 Fear + SR308 Pituitary Gland + SR521 Pineal Gland ప్రతీవారం ఆమెను కలుసుకోవడం కొనసాగిస్తూ తదుపరి రెండున్నర నెలల పాటు వీధి మార్కెట్లో అవసరమైనప్పుడు ఆమెకు రీఫిల్ బాటిల్ ను అందజేయ సాగారు. ఈ సమయంలో రోగి తన భయాన్ని మరియు అభద్రతా భావాన్ని పూర్తిగా అధిగమించారు.

రెండు సంవత్సరాలుగా టిన్నిటస్ తో బాధపడుతున్న 53 ఏళ్లు ఎలక్ట్రీషియన్ మరియు అటువంటి అనేకమంది రోగుల విషయంలో ప్రాక్టీషనర్  విజయం సాధించారు. కళ్ళు తిరగడంతో ఎక్కువ గంటలు నిలబడలేక పోవడం ఎలక్ట్రిక్ డ్రిల్ యొక్క శబ్దము వలన అతని సమస్య తీవ్రం కావడంతో అతను పూర్తి సమయం పని చేయలేక పోయేవారు. ఆమె అతనికి CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…TDS. ఇచ్చారు. ఆరు నెలల తర్వాత రోగిని కలుసుకొన్నప్పుడు ఒక బాటిల్ తోనే ఆరు వారాల పాటు వాడి తాను పూర్తిగా కోలుకున్నట్లు అతడు చెప్పగా విని ఎంతో ఆనందించారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే అతను చెప్పిన ప్రకారం చికిత్స ప్రారంభించిన తర్వాత వెర్టిగో వ్యాధి లక్షణాలు చాలా ఎక్కువై నప్పటికీ (బహుశా పుల్లౌట్ కావచ్చు) రెమిడీ కొనసాగించారు. ఆమె CC10.1 Emergencies  యొక్క అధిక ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా చూసి ఎల్లప్పుడు దాన్ని తన వెంట తీసుకుని వెళుతూ ఉంటారు. మానసిక స్థితి పరంగా చికిత్సలో అడ్డంకులు ఉన్నవారికి బ్యాచ్ రెమిడీలు(Bach remedies)  అద్భుతంగా పనిచేస్తాయని, అలాగే 24/7 మానసిక వత్తిడితో బాధ పడేవారికి  NM6 Calming  చాలా ప్రయోజనకరంగా ఉంటుందని  ఆమె కనుగొన్నారు.

ఆమె అనేక సంవత్సరాలుగా వైబ్రియానిక్స్ సాధనలో అభివృద్ధి చెందారు. ప్రారంభంలో తప్పులు చేస్తున్నానేమో అని భయంతో ఉండేవారు కానీ కాలాంతరంలో తాను దేవుడు(నిజమైన వైద్యుడు) మరియు రోగికి మధ్య మధ్యవర్తి మాత్రమే అనే ధృఢమైన విశ్వాసానికి దారితీసింది. ఆమె రెమిడీ లు ఇస్తున్నప్పుడు తరచుగా స్వామితో మాట్లాడుతూ ఉంటారు, ఆమె అభిప్రాయం ప్రకారం రాంగ్ రెమిడీ  అనేది లేదని మన తర్కానికి అతీతంగా సరియయిన రెమిడీ తనంతట తానే మన చేతులలోనికి వస్తుందని చెప్పారు. సరియైన విధానం ఏమిటంటే మన చెవులతో కాక హృదయంతో రోగులు చెప్పేది వినాలని ఆమె పేర్కొంటున్నారు. రోగులకు చికిత్స చేయడం మరియు వారి కథలను వినడం ద్వారా ఆమె వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కోవడానికి, మరియు మన జాతీయత, మతము, హోదా, మొదలైన వాటికి అతీతంగా మనమందరము కనెక్ట్ అయి ఉన్నాము అని గ్రహించడంలో సహాయపడింది. వాస్తవానికి ఇది యాధృచ్ఛికమే అయినప్పటికి చాలా తరచుగా ఆమె చేత రోగికి అందించబడిన రెమిడీ తాను స్వయంగా తీసుకున్నట్లు భావన స్పురింప జేసింది.

ఒక ప్రాక్టీషనరుగా ఆమె దేవుడు మరియు రోగుల పట్ల తనకున్న నిబద్ధతను చాలా బాధ్యతా యుతమైనదిగా పరిగణిస్తున్నారు. రోగులకు సేవతో పాటు ఆమె వైబ్రియానిక్స్ వార్తాలేఖలను గ్రీకు భాషలోకి అనువదించడంలో పాల్గొంటున్నారు. వార్తాలేఖలు జ్ఞానం యొక్క అక్షయ పాత్రలు వంటివి కనుక వాటిని అందరూ చదవాలని ఆమె కోరుతున్నారు. వైబ్రియానిక్స్ అధ్యయనము మానవ శరీరం యొక్క సంక్లిష్టత అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది కనుక వైబ్రియానిక్స్ హ్యాండ్ బుక్కులు 1 మరియు 2 అలాగే సోహం సిరీస్ యొక్క 7 పుస్తకాలు ప్రాక్టీషనర్లు అందరూ తప్పక చదవవలసి ఉందని ఆమె తెలుపుతున్నారు. ఒక మంచి ప్రాక్టీషనర్ గా ఉండడం అనేది నిరంతరం అధ్యయనం మరియు పరిశోధన అవసరమయ్యే ఒక నిరంతర ప్రక్రియ అని వీరి అభిప్రాయం.

మనలో ప్రతీ ఒక్కరూ మన ప్రతిభకు అనుగుణంగా సమాజానికి తోడ్పడాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. వైబ్రియానిక్స్ సేవ తనకు స్వామి నుండి బహుమతిగా వచ్చిన మార్గం అని, స్వామి తనను ఒక పరికరంగా ఎంచుకున్నందుకు ఆమె కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు.

పచుకున్న కేసులు