Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 03594 & 03521...USA


ప్రాక్టీషనర్లు 03594 & 03521…USA ఇద్దరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు, భర్త IT మేనేజర్‌గానూ, మరియు భార్య ట్యాక్స్ స్పెషలిస్ట్‌ గానూ  పనిచేస్తున్నారు. భర్త ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందింప బడ్డ  కుటుంబంలో పెరిగారు. వారు క్రమం తప్పకుండా పొరుగువారి ఇంటిలో సాయి భజనలకు హాజరయ్యేవారు. ఇతను చెన్నైలో చదువుతున్నప్పుడు అనేక సందర్భాలలో స్వామివారి దర్శనంతో ఆశీర్వదించబడ్డారు. భార్య తన వివాహం తర్వాత మాత్రమే స్వామి గురించి తెలుసుకున్నారు, మధురమైన సాయి భజనలతో మంత్రముగ్ధురాలయ్యేవారు. ఐతే ఆమెకు 2004 లో వారి ప్రధమ పుత్రిక జననం తరువాత ఆమెను స్వామి ఆశీర్వాదం కోసం తీసుకు వెళ్ళినపుడు మాత్రమే ఆమెకు స్వామి ప్రధమ దర్శనం లభించింది. 2000 సంవత్సరం నుండి వారు నివసిస్తున్న న్యూయార్క్‌కు తిరిగి వచ్చిన తరువాత, వారు భజనలకు హాజరు కావడం ప్రారంభించారు, క్రమంగా నెలకు ఒకసారి వారి స్వంత ఇంటిలో భజనకు ఆతిథ్యమివ్వడానికి అవకాశం ఏర్పడింది. 2008 లో వారు స్థానిక సాయి సెంటర్ యొక్క వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు: నిరాశ్రయులైన వారికి షెల్టర్‌లలో మరియు వంటశాలలలో వంట చేయడం మరియు వడ్డించడం, క్రిస్మస్ సమయంలో సంరక్షణ వస్తు సామగ్రి కిట్లను సిద్ధం చేయడం మరియు తమ స్థానిక ఫుడ్ బ్యాంక్‌లో పంపిణీ చేయడానికి వీలుగా వివిధ వస్తువులను ప్యాకింగ్ చేయడం చేసేవారు. భార్య ఈ సెంటరుకు ప్రధమంలో సేవా సమన్వయ కర్త, ఆ తరువాత అధ్యాత్మిక సమన్వయకర్త అయ్యారు.   

2010 లో పదిరోజుల పాటు అమెరికా నుండి పర్తికి నిర్వహించిన తీర్ధయాత్ర వారి జీవితాలలో ఒక మలుపుగా మారింది. ఈ పర్యటన కోసం వారి సాధనలో భాగంగా, వారు స్వామివారి అనేక ఉపన్యాసాలను తీవ్రంగా అధ్యయనం చేశారు. ఇది ఇతరులతో పాటు తమలోనూ దైవత్వాన్ని చూడటం మరియు గుర్తించడం గురించి వారి అవగాహనను విస్తృత పరిచింది. మరియు ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి సాధనలో సేవ యొక్క ప్రాధమిక లక్ష్యము స్వీయ-పరివర్తన అని నేర్చుకున్నారు. పుట్టపర్తి వార్షిక సందర్శనల ద్వారా ఈ పరిణామం వీరిలో చోటు చేసుకుంది.

2014 లో వారాంతపు సత్సంగ సమయంలో, ఒక అల్లోపతి వైద్యుడు సాయి వైబ్రియోనిక్స్ స్వామిచే ఆశీర్వదించబడిన ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా పేర్కొన్నారు. ఇది వారిలో ఆసక్తి మరియు ఉత్సుకతని పెంచింది, కాబట్టి వారు వెబ్‌సైట్ ద్వారా, వార్తాలేఖలను చదవడం మరియు సోల్‌జర్న్స్ వీడియోలను చూడటం ద్వారా అధ్యయనం చేసారు. ఈ కోర్సులో చేరడానికి ముందస్తు వైద్య అనుభవం అవసరం లేదని వీరు గ్రహించి అందరికీ ఉచిత వైద్యసేవ అందించే స్వామి మిషన్ లో పాల్గొనడానికి ఇది చక్కని  అవకాశమని వారు భావించారు. వారిద్దరూ మార్చి 2015 లో AVP లుగా శిక్షణ పొందారు మరియు సెప్టెంబర్ 2016 లో SVP లు అయ్యారు.

వారు అభ్యాసం ప్రారంభించిన మొదటి వారంలో, మూడు నెలలుగా మెడమీద నొప్పితో బాధపడుతున్న ఒక అల్లోపతి వైద్యుడికి CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine. ఇవ్వబడింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఫోన్ చేసి, మునుపటి రాత్రి కేవలం ఒక డోస్ తీసుకున్న తర్వాత, ఉదయం నిద్రలేచిన తరువాత 100% నొప్పి లేకుండా ఉందని తన తలను కూడా హాయిగా కదిలించగలుగుతున్నట్లు చెప్పారు. ఇది ఈ ప్రాక్టీషనర్ల జంటకు ఎంతో ఆనందాన్ని అందించడమే కాక వారి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప జేసిన ఈ ఘటన ఒక అద్భుతమైన లీలకు తక్కువేమీ కాదు. మూడు నెలల తర్వాత కూడా రోగి వ్యాధి  పునరావృతం కాకుండా బాగానే ఉన్నారు. మరొక విశేషమైన కేసు విషయంలో, వారి సాయి కేంద్రానికి చెందిన 55-ఏళ్ల-మహిళ శ్లేష్మం మరియు దగ్గుకు నెలరోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆమె అల్లోపతి ఔషధం తీసుకోవడానికి ఇష్టపడలేదు కనుక ఆమెకు CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic. ఇవ్వబడ్డాయి. మరునాటికల్లా దగ్గు పూర్తిగా మాయమైందని రోగి తెలిపారు! 

ఈ ప్రాక్టీషనర్లు CC15.1 Mental & Emotional tonic ప్రత్యేకంగా ఈ ఒకటి మాత్రమే ఇచ్చినా లేదా ఇతర రెమెడీలతో కలిపి ఇచ్చినా, ముఖ్యంగా టీనేజర్‌లకు చికిత్స చేసేటప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుందని గుర్తించారు. ఇది సానుకూల మనస్సును మరియు భావోద్వేగ శ్రేయస్సును అందిస్తుందని, తద్వారా రెమిడీలో చేర్చబడిన ఇతర వైబ్రేషన్‌ల శోషణను మెరుగుపరుస్తుందని గ్రహించారు. వారు CC17.2 Cleansing అనేది శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలు లేదా టాక్సిన్‌లను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని తద్వారా చికిత్స వేగవంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది కానీ, పుల్ అవుట్ అయ్యే అవకాశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గమనించారు. ఈ జంట ఈ రెమిడీని తమకు తామే తరుచుగా ఉపయోగించుకొని చక్కని ఫలితాన్ని పొందారు. నిస్వార్ధంగా సేవ చేస్తూ ఫలితము మీద దృష్టి లేకుండా ఉండడానికి రెమిడీలు తయారుచేసే సందర్భంలోనే వారు స్వామిని ప్రార్ధిస్తూ ఫలితాన్ని వారికే సమర్పిస్తారు. రోగ నిర్ధారణ విషయంలో వారు 108CC పుస్తకంలోని సూచికను మరియు ఇతర కేసు చరిత్రల నుండి సేకరించిన సమాచారం ఉపయోగించుకున్నప్పటికీ, వారు తమ హృదయంలో ఉన్న స్వామితో అనుసంధానింపబడడం పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ప్రతీ రోగి ప్రత్యేకమైన వారే, సహాయం కోరి వచ్చిన కేసు విషయంలో ఇతర రెమిడీలు చేర్చడానికి వారు తరచుగా మార్గనిర్దేశం చేయబడుతూనే ఉంటారు. 

వారు సేవా అవకాశాలను వెదకడంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. భారతదేశానికి ప్రయాణించేటప్పుడు, వారు వైబ్రో గురించి అవగాహన కల్పిస్తూ తమ కుటుంబ సభ్యులు మరియు పొరుగువారికి చికిత్స చేస్తూ ఉంటారు. కోవిడ్ వ్యాప్తి పెరగడంతో వారు రోగనిరోధక లేదా ఇమ్యూనిటీ బూస్టర్ (IB) సీసాలను రోగులతో పాటు వైద్య నిపుణులకు నివారణ కోసం అందుబాటులో ఉంచేవారు. వైబ్రియానిక్స్ అడ్మిన్ సేవ విషయంలో కూడా వీరు ఇద్దరూ చాలా చురుకుగా ఉంటారు. 2017 నుండి వారు కొత్త AVP లకు మెంటరింగ్ నిర్వహిస్తున్నారు మరియు బ్రాడ్కాస్టింగ్ ప్రసార సేవలో పాల్గొంటున్నారు. భార్య 2016 డిసెంబర్ నుండి 2018 మే వరకు కేస్ హిస్టరీస్ రాసే బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత అడ్మిషన్ల విభాగంలో ఆమెకు ప్రముఖ పాత్ర ఇవ్వబడింది. ఆమె భర్త డేటాబేస్ అప్‌డేట్‌ చేయడానికి సహాయం చేస్తున్నారు.

వైబ్రియోనిక్స్ విధానం ఆరోగ్యము విషయంలో సంపూర్ణమైన విధానం యొక్క ప్రాముఖ్యత మరియు శక్తి గురించి వారిద్దరికీ అవగాహన కల్పించింది. వ్యాధి యొక్క బాహ్య లక్షణాలు ఆ వ్యాధికి గల సరియైన కారణాన్ని ప్రతిబింబించవని సరియయిన చికిత్స జరగాలంటే అంతర్లీన కారణాన్ని తెలుసుకోవలసి ఉంటుందని, దీనికి కేవలం రెమిడీలను సూచించడమే కాకుండా రోగితో ఆంతరంగికంగా కనెక్ట్ అవడం ద్వారా వారి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడం అవసరం అని వీరి భావన. ఈ సేవ వారి జీవితాలకు ఒకఅర్ధాన్ని, ఒక  ప్రయోజనాన్ని అందించింది. తమ రోగులతో ప్రేమ మరియు కరుణను పంచుకోవడానికి తమను సాధనంగా మలచి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి వారు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది అత్యంత సంతృప్తితో హృదయాన్ని విశాలం చేసుకునేందుకు వ్యక్తిగత పరివర్తనా ప్రయాణం. వారి ప్రార్థనా పరిధి కేవలం వారి రోగులనే కాక వారికి తారస పడిన కష్టాల్లో ఉన్నవారు ఎవరినైనా చేరుకునేందుకు విస్తృత మైంది. సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లుగా ఈ జంట ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు.  

భాగస్వామ్యం వహించిన కేసులు :