Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 00123...India


ప్రాక్టీషనర్ 00123…ఇండియా కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన వీరు ఒక విశ్రాంత వ్యాపారవేత్త. వివాహం అయిన వెంటనే అతని అత్తగారు కన్నుమూశారు. భార్యతో కలిసి 1969 సెప్టెంబరులో తన స్వస్థలమైన హైదరాబాదుకు వెళ్లారు. ఆ సమయంలో స్వామి తమ  నివాసం ఐన శివంను సందర్శించడం జరిగింది. వీరి భార్య స్వామి దర్శనం కోసం వెళ్ళగా స్వామి ఆమెను ఇంటర్వ్యూ కోసం పిలిచిన భాగ్యం లభించింది. అక్కడ స్వామి తాము యువకులుగా ఉన్నప్పటి ఫోటోను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ జంట ఆ ఫోటో ను ఫ్రేమ్ కట్టించి తమ దేవుడి గదిలో ఇతర ఆరాధ్య దైవాల దేవతల చిత్రాల మధ్య ఉంచి పూజించడం ప్రారంభించారు. 21 సంవత్సరాల తర్వాత 1990 లో ఈ చిత్రం నుండి విభూతి రావడం ప్రారంభమై ఆరు నెలలు ఇదే విధంగా కొనసాగింది. ఈ అద్భుతం ఈ దంపతులను స్థానిక సాయి సేవా కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రేరేపించింది. స్వామి ఇప్పుడు వారిని తమ ఫోల్డు లోనికి  తీసుకున్నారని ఒక భక్తుడు వారికి చెప్పినప్పుడు వారు ప్రతీ సంవత్సరం పుట్టపర్తికి సేవ కోసం వెళ్ళడం ప్రారంభించారు .     

  1994లో ఒక కుటుంబ స్నేహితుడి ద్వారా వీరు అప్పటిలో శైశవ దశలో ఉన్న ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఔషధ రహిత వైద్య వ్యవస్థ వైబ్రియానిక్స్ ఉందని తెలుసుకున్నారు. అతను వెంటనే దీనిని నేర్చుకునే అవకాశాన్ని అన్వేషించడం ప్రారంభించారు. ఢిల్లీలో శిక్షణ సమావేశాలకు హాజరై ప్రాక్టీషనరుగా సాధించి SRHVP మిషను పొందారు. ప్రారంభంలో అతని కుటుంబం స్నేహితులు మరియు సాయి భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు కానీ వ్యాపార వత్తిడి కారణంగా అతను తన వైబ్రియానిక్స్ సేవను ఇతరులకు విస్తరించ లేకపోయారు. 2010లో అతను తన పెద్ద కుమారుడు నడుపుతున్న 400 మందికి పైగా పనివాళ్లు పనిచేస్తున్న రెండు స్టీల్ ఫ్యాక్టరీల నిర్వహణకు సహాయం చేయడానికి హైదరాబాద్ కు వెళ్ళారు. అతను ఈ ఉద్యోగులతో తన వైబ్రియానిక్స్ సేవ కొనసాగించారు. క్రమంగా ఈ విషయం ఇతరులకు కూడా తెలిసి రోగుల ప్రవాహాన్ని పొందడం ప్రారంభం అయింది. కానీ SRHVP మిషనుతో పెద్ద సంఖ్యలో రోగులకు చికిత్స చేయడానికి చాలా సమయం తీసుకుంటోంది. తరుచుగా పుట్టపర్తి సందర్శిస్తున్న సందర్భంలో 2011లో పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు వీరు 108CC బాక్స్ గురించి తెలుసుకొని దానిని వెంట తెచ్చుకున్నారు. ఇది తన రోగులకు మెరుగైన సేవ చేయడానికి వీలు కల్పించింది. అదనంగా వీరు స్థానిక ప్రాక్టీషనర్10831 తో తరుచూ సమీప్యంగా ఉండడంతో చాలా వరకూ పేషంట్ల వర్క్ లోడ్ అతను స్వీకరించారు. 2014లో పుట్టపర్తిలో జరిగిన 1వ అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సుకు హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నారు. కార్యకలాపాల ముగింపులో వీరు ఎంతో ప్రేరణ చెంది తన పూర్తి సమయం వైబ్రియానిక్స్ సేవలోనే నిమగ్నం కావడానికి తన వ్యాపారం నుండి పూర్తిగా విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని వీరు భావిస్తున్నారు.    

ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకూ 30 వేలకు పైగా రోగులకు అన్ని రకాల వ్యాధుల కోసం చికిత్స చేయగా అందులో 95% విజయవంతమైన రేటును నమోదు చేయడం స్వామి కురిపించిన ప్రత్యేక అనుగ్రహానికి చిహ్నంగా వీరు భావిస్తున్నారు. మిగిలిన 5% మంది రోగులు సూచనలను సరిగ్గా పాటించక పోవడమే కారణమని వీరు అభిప్రాయపడుతున్నారు. వీరు నెలకు సగటున 350 మంది రోగులను చూస్తారు. వీరు తమ శ్రీమతితో కలసి నిత్యమూ 500 మందితో కూడిన భగవద్గీత ఉపన్యాసాలకు హాజరవుతారు. ఇది వీరికి వైబ్రో చికిత్స చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నది. అతను రోగులతో సంప్రదింపులు జరుపుతూ ప్రిస్క్రిప్షన్ వ్రాస్తూఉంటే వీరి శ్రీమతి రోగులకు సలహాలు సూచనలతో పాటు రెమిడీలు వాటిని తీసుకోవలసిన విధి విధానాలను వివరిస్తారు.  

 ప్రాక్టీషనర్ తరచూ 3 కాంబో లను ఉపయోగిస్తారు.  ఇవి వీరు ఇచ్చే 70% రెమిడీలను కవర్ చేస్తాయి. వీటిలో ప్రతీ ఒక్కదానికి వీరు బ్యాకప్ కోంబో గా పిలిచే క్రింది రెమిడీని జత చేస్తారు. బ్యాక్ అప్ కోంబో : CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + SM2 Divine Protection.

1. డైజెస్టివ్ లేదా జీర్ణ వ్యవస్థ కాంబో అజీర్ణం, ఆమ్లత్వం, అపానవాయువు, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన వాటికి: CC4.4 Constipation + CC4.5 Ulcers + CC4.10 Indigestion

2. శ్వాసకోశ కోంబో జలుబు, దగ్గు, గొంతు సమస్యలు, ఛాతి ఇన్ఫెక్షన్ మరియు జ్వరము మొదలైనవాటికి: CC9.2 Infections acute + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic

3. ఎముకల కండరాల కాంబో మోకాలి సమస్యలు, వెన్ను నొప్పి, శరీరమంతటా నొప్పి, కీళ్ళు మరియు కండరాలు పని చేయకపోవడం మొదలైన వాటికి: CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine

మిగిలిన 30% రెమిడీలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వీరు ఇస్తూ ఉంటారు. రోగులను కలవడం ఆచరణాత్మకం కానప్పుడు అతను సంతోషంగా వారికి కొరియర్ ద్వారా రెమిడీలు పంపుతారు. మానసిక సమస్యలతో బాధ పడే వారికి వీరు  తరచూ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా చికిత్స చేస్తారు.  

ప్రాక్టీషనర్ ఒక ఆసక్తికరమైన కేసును మనతో పంచుకుంటున్నారు. 70 ఏళ్ల మహిళ  ముఖ అర్ధభాగ చైతన్య హీనతతో  పాటు హైబీపీ, ఆందోళన, భయం మరియు నిరాశతో బాధ అనుభవిస్తూ అప్పటికే అల్లోపతి మరియు వైద్య చికిత్స తీసుకుంటున్నా కూడా     రెండు రోజులుగా నిద్రలో కూడా నిరంతరం దగ్గడం ప్రారంభమై ఆమెను అత్యంత బాధకు గురి చేసింది. ప్రాక్టీషనరుకు కొత్తదనం వలన కొంత భయానికి గురిఅయినా CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.4 Eating disorders + CC21.11 Wounds & Abrasions + Backup combo, ను కేవలం ఒక్క గ్లాసు నీటిలో తయారుచేయగా మంత్రం వేసినట్లు దగ్గు వెంటనే ఆగిపోయింది. మరొక ఎక్యూట్ కేసులో 34 ఏళ్ల మహిళకు తన బొటనవేలిపై మచ్చ ఏర్పడింది. CC10.1 Emergencies + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.5 Dry Sores + Backup combo, ను రెండు వారాలు ఇవ్వగానే ఈ గడ్డ అదృశ్యమైంది. మరొక కేసు విషయంలో చర్మ క్యాన్సర్ తో మూడేళ్లుగా బాధపడుతున్న 50 ఏళ్ల వ్యక్తి  కేవలం మూడు నెలల్లోనే క్యాన్సర్ నుండి పూర్తిగా నయమయ్యారు.  

వీరు ఇతర ప్రాక్టీషనర్ లతో కలిసి పనిచేస్తూ క్రమానుగతంగా ప్రాక్టీషనర్లతో ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహిస్తారు. వ్యక్తిగత సాధనగా ప్రాక్టీషనర్ పౌరాణిక గ్రంథాలను మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఈ జ్ఞానాన్ని ఇతర సహృదయులైన వ్యక్తులతో పంచుకుంటారు. వీరు సుప్రభాతంతో తన దినచర్యను ప్రారంభించి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతీరోజూ  ఉదయాన్నే కొంతదూరం నడుస్తారు. ఈ దంపతులిద్దరూ అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ వైబ్రియానిక్స్ తో తగ్గిపోయాయి. తమ మలి వయస్సులో మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసిన స్వామిపట్ల వారి హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ అభ్యాసం వీరికి మానవత్వానికి సేవలను అందించడం ద్వారా సంతృప్తికరంగా జీవితాన్ని గడుపుతున్న అనుభూతిని అందిస్తోంది.    

భాగస్వామ్యం వహించిన కేసులు