ప్రాక్టీషనర్ల వివరాలు 11595...India
ప్రాక్టీషనర్ 11595…ఇండియా ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీర్ అయిన ఈమె 8 ఏళ్లుగా తన కుటుంబానికి సంబంధించిన సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజరుగా పని చేస్తూ ఉన్నారు. సాయి భక్తుల కుటుంబంలో జన్మించడం తన భాగ్యంగా భావిస్తున్నారు. ఆరు సంవత్సరాల వయస్సు నుండి బాలవికాస్ తరగతులకు(సాయి అధ్యాత్మిక విద్య) హాజరు కావడమే కాక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. తర్వాత వీటిని నిర్వహించడానికి ఆమె తల్లికి సహాయ పడుతూ ఉండేవారు. ఇవన్నీ తన ఆత్మవిశ్వాసం మరియు బహిరంగంగా మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో సహాయం చేసాయని ఆమె భావిస్తున్నారు.
తన చిన్న కుమార్తె తరుచుగా వచ్చే అలెర్జీలు, అనారోగ్యాలనుండి ప్రకృతి వైద్యంతో పూర్తిగా కోలుకున్న తర్వాత తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచే సహజ మార్గాలపై ఈ ప్రాక్టీషనర్ ఆసక్తి చూపడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య సమాచారాన్ని అన్వేషించడం మరియు ఇంటి నివారణల విషయంలో అధ్యయనం మరియు ప్రయోగాలు చేయడం మరియు ఈ జ్ఞానాన్ని కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయసాగారు. 2017 సెప్టెంబర్ లో సాయి వైబ్రియానిక్స్ గురించి ఆమె తన ధ్యానమండలి సభ్యుల ద్వారా తెలుసుకొని ఈ వైద్య వ్యవస్థకు ఆకర్షితురాలై తక్షణమే కనెక్ట్ అవడమే కాక స్వామియే తనను ఈ దిశగా నడిపిస్తున్నారని గ్రహించారు. పర్యవసానంగా 2018 ఫిబ్రవరిలో AVP మరియు 2018 అక్టోబర్ లో VP అయ్యారు.
వీరు తన ఇంటి నుండే వైబ్రియానిక్స్ సేవ కొనసాగిస్తూ ఇప్పటి వరకు 300 మందికి పైగా రోగులకు చికిత్స చేశారు. ప్రారంభంలో దగ్గరి కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అత్యుత్తమ ఫలితాలను చూశారు. ఆమె భర్త రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ జాయింట్ల వద్ద తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. బహుశా బ్యాడ్మింటన్ గాయం కారణంగా కీళ్ల మధ్య అంతరము ఉన్నట్లు X రే రిపోర్టు వెల్లడించింది. ఈ సమస్యకు శాశ్వత నివారణ లేదని నొప్పి నివారణ మందులతో మాత్రమే బాధను తగ్గించుకోవడమే పరిష్కారమని వైద్యుడు తెలిపారు. ఇది ఆర్థరైటిస్గా అనిపించడంతో ఇతర కీళ్లకు వ్యాపించే అవకాశం కూడా ఉంది. 2018న ఫిబ్రవరి 22న అతనికి క్రింద రెమిడి ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.7 Fractures...6TD. అభివృద్ధి క్రమంగా కనిపించి 2019 మార్చి నాటికి అతను పూర్తిగా నొప్పి లేకుండా ఉన్నారు. కీళ్లపై పక్షిఈక తో సమానమైన భారము కూడా విపరీతమైన నొప్పిని కలిగింప చేయునట్టి బాధనుండి ఉపశమనం కలగడం ఒక గొప్ప అద్భుతం అని భర్త చెప్పారు. అతను ఎన్నో సంవత్సరాలు అనుభవించిన బాధ వైబ్రియానిక్స్ తో మాత్రమే పూర్తిగా కనుమరుగయ్యిందని తెలిపారు. ప్రాక్టీషనరు యొక్క 81 ఏళ్ల మామ గారు కూడా అనేక సంవత్సరాలుగా బాధించే బాధాకరమైన తిమ్మిరి నుండి పూర్తిగా ఉపశమనం పొందారు. అతను కింద పడినప్పుడు 8వ, 9వ వ పక్కటెముకలు విరిగినప్పుడు వైబ్రియానిక్స్ రెమిడీ CC10.1 Emergencies + CC20.5 Spine + CC20.7 Fractures ని అతను హాస్పిటల్ లో చేరిన 5 నిమిషాల తరువాత ఇవ్వడం ప్రారంభించారు. ఆసుపత్రిలో పక్కటెముకల పై సున్నపు పట్టీ వేయడం సాధ్యం కానందున అతనికి కేవలం నొప్పి నివారణ మందులు మాత్రమే ఇచ్చారు. వైద్యులు అతనికి 3 వారాలపాటు భరింపరాని నొప్పి ఉంటుందని తెలిపారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అతను మూడవ రోజే నడవడం ప్రారంభించారు. మూడు వారాల తర్వాత అతని పురోగతి చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆరు వారాల తరువాత అతను సాధారణంగా తీసుకునే X రే రిపోర్టు రోగికి పూర్తిగా నయమైనట్లు చూపించింది. ఈ ప్రాక్టీషనరు కొన్ని ప్రత్యేకమైన కోంబోల కలయిక ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందారు. అలసట నుండి వేగంగా ఉపశమనం కోసం CC9.1 Recuperation + CC12.1 Adult tonic. ఉపయోగిస్తారు. ఆమె ప్రారంభంలో తన ధ్యాన గురువు కోసము దీనిని తయారు చేశారు. దీనిని తీసుకున్న వెంటనే అతను తన ఎడమ చేతితో ఏనుగును కూడా ఎత్తగలనని భావించారు. అన్ని రకాల తలనొప్పులకు CC4.10 Indigestion + CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic అనే రెమిడీ చాలా ప్రభావంతంగా ఉందని నిరూపించబడింది. గొంతులో దీర్ఘకాలిక బొంగురు కోసం కోసం CC18.5 Neuralgia + CC19.7 Throat chronic చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేరువేరు కోంబోలు ప్రయత్నించి కూడా ఆమె పెద్దగా విజయం సాధించని సందర్భంలో కేవలం CC10.1 Emergencies ఒక్కటి మాత్రమే ఆశించిన ఫలితాన్ని అందించింది. కనుక కొరియర్ లో రెమిడీ పంపించే సందర్భంలో ఆమె CC10.1 Emergencies ను ప్రత్యేక సీసాలో పంపిస్తూ ఉంటారు. దీనివలన అదనపు ప్రయోజనం ఏమిటంటే ఇతర కుటుంబ సభ్యులు అవసరమైతే దానిని ఉపయోగించవచ్చు.
రోగితో సంప్రదింపులు జరిపే టప్పుడు స్వామితో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం అని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. అందువలన రోగితో సరైన సంభాషణ, సరైన రెమిడీలు ఎంచుకోవడం, మరియు స్వామి నుండి స్వచ్ఛమైన ప్రేమ ప్రాక్టీషనర్ ద్వారా రోగికి ప్రవహిస్తుందని వీరి భావన. అనేక సందర్భాలలో రోగులు ప్రాక్టీషనరుతో మాట్లాడిన తర్వాత వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందారు మరియు కొన్ని సందర్భాల్లో వారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కొత్తగా AVP ఐన ప్రారంభంలో ఆమె కష్టమైన కేసుల విషయంలో రోగుల బాధలకు తీవ్రంగా ప్రతిస్పందించేవారు. కానీ ఇప్పుడు ఆమె వాటిని స్వామికి అప్పగించడం నేర్చుకున్నారు. రోగి యొక్క చరిత్రను రికార్డు చేసే టప్పుడు ఆమె వివరాల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. ఇది కేసును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి తద్వారా ఫాలో అప్ చేయడం సులభతరం అవుతుంది. కొత్త రోగుల విషయంలో కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండానూ అనంతరం అప్పుడప్పుడూ వారితో మాట్లాడుతూ ఉంటారు. అందువలన రోగులు క్రమానుగతంగా ప్రాక్టీషనరు తమను బాగా చూసుకుంటున్నారని వారికి సంతోషాన్ని కలిగించడమే కాకుండా వారి పురోగతిని పర్యవేక్షించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.
ఈ ప్రాక్టీషనర్ తన రోగులకు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించడానికి సమయాన్ని వెచ్చిస్తారు. చాలా మంది రోగులు తగినంత నీరు తాగడం లేదని గమనించారు. ఇది వారి సమస్యను పరిష్కరించడంలో చాలా జప్యాన్ని కలిగిస్తుందని వీరి భావన. అదేవిధంగా తాజా పండ్లు, కూరగాయలు మరియు రోజువారీ వ్యాయామంతో పాటు కొన్ని నిమిషాలు ధ్యానం రోగి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ప్రాక్టీషనర్లు కూడా రోగులకు ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలవడానికి తమ శారీరక, మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆమె అభిప్రాయం. ఇటీవలే ఆమె ఇద్దరు AVP ల యొక్క మార్గదర్శకత్వాన్ని/మెంటరింగ్ ను చేపట్టారు. ఇది తనను అప్రమత్తంగా ఉండటానికి ప్రాక్టీషనరుగా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని ఆమె భావిస్తున్నారు.
వైబ్రియానిక్స్ ద్వారా ఆమెకు లభిస్తున్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే ఆమె తన సేవ చేస్తున్న ప్రతీ సందర్భంలో స్వామితో కనెక్ట్ అయి ఉంటున్నారు. రోజు గాయత్రీ జపించేటప్పుడు ఆమె తన 108cc బాక్స్ ను తన వద్దనే ఉంచుకుంటారు, తద్వారా శక్తివంతమైన ప్రకంపనలు రెమిడీలకు ఆపాదింప బడతాయని వీరి భావన. వైబ్రియానిక్స్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి స్వామి తనకు అందించిన శక్తివంతమైన సాధనం అని ఆమె భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవడం, రెమిడీలను ఇవ్వడం లోనే కాకుండా రోగులకు జీవన శైలిలో మార్పులను సూచించడం, మరియు స్వచ్ఛమైన ప్రేమతో రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వైబ్రియానిక్స్ భవిష్యత్తు ఔషధం ఔతుందని వీరు ప్రగాఢంగా విశ్వశిస్తున్నారు.
భాగస్వామ్యం వహించిన కేసులు