Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కే. అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లారా,

సుమారు 18 నెలల అనిశ్చితి మరియు గందరగోళ పరిస్థితి అనంతరం, చివరికి ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఒక విధమైన సాధారణ స్థితి నెలకొన్నట్లు అనిపిస్తున్నది. కోవిడ్ మూడవ తరంగం గురించి అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోభావస్థితి ఆశాజనకంగానే ఉండడము, అంతేకాక భారతదేశం మరియు ఇతర దేశాలు మహమ్మారి యొక్క రెండవ తరంగం నుండి క్రమంగా కోలుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రపంచమంతటా, జనబాహుళ్యం మాస్ గా టీకాలు వేయించుకుంటున్నారు; ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరియు భద్రతా మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త మరియు వైవిధ్యమైన ఉత్పరివర్తనలు కనిపించడం మరియు వైరస్ అంచనాలకు అందకుండా మరియు అనూహ్యంగా ఉండటంతో, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు శాస్త్రీయ సమాజం కోవిడ్ -19 తో వ్యవహరించడంలో చేస్తున్న మహోన్నత త్యాగాలకు మరియు వారి అవిరళ కృషికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

“ప్రపంచం అనే ఒక భారీ ఆసుపత్రిలో, మానవత్వం రోగగ్రస్తమై మంచం మీద ఉంది. కొందరు అసూయ అనే బాధతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, కొందరు అహంకారంతో విర్రవీగుతున్నారు, కొందరు ద్వేషం అనే ముసుగులో నిద్ర పోతుండగా, కొందరు స్వార్ధంతో అంధులుగా మారారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం లేదా ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ గురు పూర్ణిమ దినోత్సవం రోజున, మీ వ్యాధులను నిర్ధారించి, నివారణలు సూచించిన వైద్యులకు మరియు మిమ్మల్ని తిరిగి ఆరోగ్యవంతులను చేసిన నర్సులకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.”… గురు పూర్ణిమ సందేశం 1961 జూలై 27.  http://www.sssbpt.info/ssspeaks/volume02/sss02-14.pdf.

జూలై ఆరంభం సహజంగా ప్రశాంతి నిలయంలో దైవ సన్నిధిలో మనం గురు పూర్ణిమను జరుపుకున్న పూర్వపు ఆనందకరమైన రోజులను జ్ఞప్తికి తెస్తుంది. ఈ పండుగ మన విషయంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, అదేమిటంటే భగవాన్ తన భౌతిక రూపంలో ఉన్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు అందించిన కేక్‌ను కత్తిరించడం మన అదృష్టం. ఈ విలువైన క్షణాలను గుర్తుచేసుకోవడం ద్వారా మన ప్రభువు మనపై కురిపించిన ప్రేమకు మరియు సాయి వైబ్రియోనిక్సుకు  వారు అందించిన  అనంతమైన ఆశీర్వాదాలకు కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సమీపిస్తున్న సందర్భంలో స్వామి చెప్పిన విషయం, ‘‘ఎక్కడైతే స్వామి పని నిస్వార్థ సేవ రూపంలో జరగబడుతున్నదో, ఎక్కడైతే స్వామి నామం పఠించబడుచున్నదో, లేదా స్వచ్ఛమైన నిస్వార్ధ ప్రేమ మరియు భక్తితో గానం చెయ్యబడుతున్నదో అక్కడ స్వామి ఉంటారు” అన్నది తప్పక గుర్తుంచుకోవాలి. అలాగే మనలో అంతర్లీనంగా ఉన్న గురువును మేల్కొలపడం కోసం ప్రతీ రోజు, ప్రతీ  క్షణంలో గురు పూర్ణిమను జరుపుకునే విధంగా మన జీవితాలను గడపాలని, అలా మనల్ని మనం మలుచుకోవాలని స్వామి కోరారు.  

1974 జులై లో తమ గురు పూర్ణిమ సందేశంలో భగవాన్ బాబా “మీరు కారు నడుపుతున్నప్పుడు, కారే మీ దేవుడు. మీరు మార్కెట్లో వ్యాపారం చేస్తున్నప్పుడు, మార్కెట్ మీ దేవుడు. భారత్ (భారతదేశం) సంస్కృతి ప్రకారం, మనం చేయవలసిన పనికి మొదట నమస్కారం చేస్తాము. మనము ఏదైనా పని చేయటానికి ముందు, ఆ పనిని దేవుడిగా పరిగణించాలి.”

మన అభ్యాసకులు తమ రోగులకు ఈ స్ఫూర్తితోనే సేవ చేస్తున్నారని నివేదించడం నాకు సంతోషంగా ఉంది. ప్రారంభంలో, లాక్డౌన్ పరిమితుల కారణంగా, మన ‘స్ప్రెడ్ ది వర్డ్ క్యాంపెయిన్’ మందగమనాన్ని చూశాము. ఐతే మన ప్రాక్టీషనర్ల అంకిత భావం ఎంత గొప్పది అంటే ఈ మహమ్మారి కారణంగా వ్యక్తిగత నష్టాలు ఉన్నప్పటికీ, వారు ఇమ్యునిటీ బూస్టర్ (ఐబి) ని ఎంతో దూర ప్రాంతాలకు కూడా  పంపిణీ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. నేను వారి ప్రయత్నాలను మరియు భక్తిని వినయ పూర్వకంగా మీముందు నివేదిస్తున్నాను.  ఈ నాటి వరకూ  ఇమ్యునిటీ బూస్టర్ (ఐబి) లబ్ధిదారుల సంఖ్య 433,148 గా ఉంది.

మహమ్మారి యొక్క రెండవ తరంగం యొక్క గరిష్ట స్థాయి సందర్భంలో మే నెలలో IB రెమిడీ మొత్తం డిమాండ్లో గణనీయమైన పెరుగుదల (12%) ఉంది. ఈ రోజు వరకు మనం చూసిన అత్యధిక పెరుగుదల ఇదే. ఇదే సమయంలో, లాక్డౌన్ ప్రయాణ పరిమితుల కారణంగా ప్రాక్టీషనర్లతో కనెక్ట్ అయ్యే ఇబ్బందులు అధిగమించి ప్రజలు వారిని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో మన వెబ్‌సైట్ (www.vibrionics.org) లో IB కోసం ఆన్‌లైన్ అభ్యర్థన ఫారమ్‌ను పోస్ట్ చేసామ. మన పరిశోధనా బృందం నిరంతరం పరివర్తన చెందుతున్న వైరస్ ను నిశితంగా గమనిస్తూ మరోసారి ఐబిని సవరించింది, ఈ సంచికలోని ‘అదనంగా’ విభాగంలో వివరాలను చూడండి.   

ఆన్‌లైన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నందున, 2021 జూన్ 13 న భారతదేశంలో ప్రాంతీయ సమన్వయకర్తల నాల్గవ ద్విముఖ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలు చర్చించబడి ప్రారంభించబడ్డాయని తెలియజేయడం ఆనందంగా ఉంది. కాన్ఫరెన్స్ గురించి మరిన్ని వివరాలను ‘అదనంగా’ విభాగంలో చూడవచ్చు.  

IASVP లో సభ్యులు కావడానికి అర్హతగల ప్రాక్టీషనర్లకు సహాయపడటానికి మా ప్రయత్నాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ  సందర్భంగా కేరళ రాష్ట్రం నుండి 17 మంది VP లకు IASVP సభ్యులు కావడానికి సహాయం చేసిన ప్రాక్టీషనర్11956 కు ప్రత్యేక అభినందనలు. భారతదేశంలోని కొందరి ప్రాక్టీషనర్ల IASVP గుర్తింపు కార్డు చెల్లుబాటు గడువు ముగిసిందని తెలియజేయాలని అనుకుంటున్నాను. వారు ప్రాక్టీషనర్ల వెబ్సైట్ లో ఉన్న ప్రవర్తనా నియమావళిని చదివి ధృవీకరిస్తూ లాగిన్ అవ్వమని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. మీ IASVP సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి మీకు ఏమైనా సహాయం అవసరమైతే, దయచేసి [email protected]. లో IASVP సెక్రటరీని సంప్రదించ వలసిందిగా విజ్ఞప్తి.  

ముగింపులో, మీకుగుర్తు చేయదలిచిన విషయం ఏమిటంటే  ఈ విపత్కర పరిస్థితిలో మనం ఆధారపడగల ఏకైక అంశం దేవునిపై మనకున్న అచంచలమైన విశ్వాసం మరియు ఇతరులకు సేవ చేయడానికి అంకితభావం గల వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లుగా స్వామి  మిషన్‌లో మన వంతు పాత్ర పోషించాలనే మనకున్న భక్తి మాత్రమే. మీకు మరియు మీ ప్రియమైనవారికి ఆనందకరమైన గురు పూర్ణిమను ఆకాంక్షిస్తూ మీ హృదయంలో దైవిక కాంతిరేఖలు దేదీప్య మానంగా ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాను. ఈ పర్వదినం  సందర్భంగా, మనమందరం మన లోపల ఊన్న గురువు నుండి మార్గదర్శకత్వం తీసుకుందాం. “అత్యంత ప్రాధాన్యత గల అంశం  ఏమిటంటే, మీ అంతరాత్మను  దివ్య తేజో పుంజముగా , గురువుగా భావించడం. మీ అన్తః కరణమే గురువుగా ఈ సత్యాన్ని వెల్లడిస్తుంది. ఈ ప్రార్థనా పూర్వక ధోరణి మీ అంతర్గత ప్రేరణలను అంతర్గత తెలివితేటలను పూర్తిగా వెల్లడిస్తుంది.”… గురు పూర్ణిమ ఉపన్యాసంవైద్యులకు కృతజ్ఞతతో ఉండండి1961 జూలై 27.

సాయికి ప్రేమపూర్వక సేవలో మీ

జిత్ కె అగర్వాల్

హెర్పెస్ జోస్టర్ (సర్పి) 02493...Syria

45 ఏళ్ల మహిళకు పొత్తికడుపుపై ​​ఎర్రటి దద్దుర్లు వచ్చాయి, అవి కొన్ని రోజుల తర్వాత భరించలేని బాధాకరంగా మారాయి. దద్దుర్లు ఉన్న ప్రాంతంలో దురద మరియు మండుతున్న అనుభూతి ఉండి ఈ ప్రాంతం తాకడానికి కూడా ఇబ్బందిగా ఉంది. 2018 ఏప్రిల్ మధ్యలో ఇది హెర్పెస్ జోస్టర్‌(సర్పి) గా వైద్యుని చేత గుర్తించబడింది. ఆమె ఒక నెల పాటు అల్లోపతి మందులు తీసుకున్నారు కానీ నొప్పిలో ఏమాత్రం ఉపశమనం కలగక పోగా తీవ్రం కావడంతో  ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఆమె ముందుకు వచ్చారు. ఒకసారి ప్రాక్టీషనరు చేసిన వైబ్రియోనిక్స్ ఉపన్యాసానికి ఆమె హాజరయ్యే అవకాశం కలిగింది. వెంటనే ఆమె 2018 మే 18 న వారిని సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది.   

CC15.1 Mental & Emotional tonic + CC21.8 Herpes…TDS 

రెండు వారాల్లో, నొప్పిలో గణనీయమైన మెరుగుదల కలగడంతో వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనకరమైన ప్రభావంతో ఆమె స్పూర్తి పొంది అల్లోపతి మందులు తీసుకోవడం మానేసారు. మరో రెండు వారాల తరువాత, నొప్పిలో 75% ఉపశమనం ఏర్పడింది. సెప్టెంబర్ 20 నాటికి, ఆమె పరిస్థితి పూర్తిగా సాధారణమైంది. నవంబర్ చివరలో నివారణను ఆపే ముందు మోతాదును BD కి మరియు మరో నెల తరువాత OD కి తగ్గించారు. ఆమె అప్పటి నుండి బాగానే ఉంది మరియు వైబ్రియోనిక్స్ పై మరిన్ని ఉపన్యాసాలకు హాజరుకావడం ప్రారంభించారు. చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఆమె ప్రాక్టీషనరును సంప్రదించసాగారు. 

సంపాదకుని వ్యాఖ్య సర్పి యొక్క మంట చాలా బాధకారంగా ఉండి బలహీన పరుస్తుంది. అంతేకాకుండా  దద్దుర్లు తగ్గిన తరువాత కూడా చాలా నెలలు కొనసాగుతుంది. 

పెరిన్నియల్ అలెర్జిక్ రినిటిస్ (శాశ్వత నాసా సంబంధిత శ్లేష్మ శోధ) 02858...Syria

54 ఏళ్ల మహిళా నేత్ర వైద్యురాలు 16 సంవత్సరాలుగా నాసా అవరోధము, నాసిక నుండి గొంతులోనికి ద్రవం చేరడం, మరియు ముఖం మీద ముఖ్యంగా ముక్కు మరియు కళ్ళ చుట్టూ వాపుతో బాధపడుతున్నారు. లక్షణాలు ఏడాది పొడవునా నిరంతరం పునరావృతమవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు, ఆమె అనేక అల్లోపతి మందులను ప్రయత్నించారు, కాని అవి రెండు వారాల పాటు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించాయి. వైబ్రియోనిక్స్ ఎలా పనిచేస్తుందో ప్రాక్టీషనరు ఆమెకు వివరించినప్పుడు, ఆమె ఈ చికిత్స తీసుకోవటానికి ఆసక్తిగా చూపగా 2013 జనవరి 18 న ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC12.1 Adult tonic + CC19.2 Respiratory allergies…TDS 

ఒక నెల తరువాత, మొత్తం మీద 40% ఉపశమనం కలిగినట్లు ఆమె భావించారు. తరువాతి మూడు నెలల్లో, ఆమె వ్యాధి లక్షణాల విషయంలో క్రమంగా మెరుగుదల ఉంటూ మే 15 నాటికి 90% ఉపశమనము ఉన్నట్లు తెలిపారు. మోతాదు BD కి తగ్గించబడింది, 2013 జులై 15 నాటికి ఆమెకు పూర్తిగా నయమైంది. ఐతే ఆమె రెమిడీ పూర్తిగా ఆపివేసే ముందు 6 నెలల పాటు OD నిర్వహణ మోతాదు తీసుకోవలసిందిగా సూచించబడింది. రోగి ప్రాక్టీషనరుతో ఒక సంవత్సరానికి పైగా సన్నిహితంగా ఉన్నమీదట వ్యాధి లక్షణాల పునరావృతం కాలేదని తెలిసింది.

పోలిసిస్టిక్ ఒవెరియన్ డీసీజ్ PCOD 02858...Syria

44 సంవత్సరాల మహిళ  గత 3 నెలలుగా క్రమ రహితమైన నెలసరి బహిష్టు, అధిక రక్తస్రావము, గడ్డము మరియు ముఖం మీద వెంట్రుకలు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు అండాశయాలలో తిత్తులతో పాటు PCOD సమస్య ఉన్నట్లు గుర్తించ బడింది. గైనకాలజిస్ట్ ఆమెను హార్మోన్ చికిత్స చేయించుకోవలసిందిగా సూచించారు. ఆలోపతి మందుల దుష్ప్రభావాల గూర్చి తెలిసిఉండడం మూలాన ఆ మందులు వాడడం లేదా శస్త్ర చికిత్స చేయించుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె తన స్నేహితురాలు ఆందోళన, భయం నిమిత్తం వైబ్రియానిక్స్ చికిత్స తీసుకొని విజయవంతంగా తగ్గించుకోగలగడం గురించి తెలుసుకున్నారు. అందుచేత వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు 2017 ఆగస్ట్ 30 వ తేదీన, క్రింది రెమిడీ ఇవ్వబడింది.    

CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent...TDS  

వైబ్రో రెమిడీ తీసుకున్న తరువాత మొదటి నెలసరి బహిష్టు సరియైన సమయనికే వచ్చింది కానీ రక్తస్రావం కాస్త ఎక్కువగానే ఉంది. రెండవ నెలసరి సమయానికి రావడమే కాక రక్తస్రావం సాధారణ స్థితికి చేరుకుంది. అల్ట్రాసోనిక్ పరీక్షలో ఆమె అండాశయాలలో తిత్తులు పూర్తిగా అదృశ్యమైనట్లు నిరూపణ అయ్యింది. మోతాదు అక్టోబర్ 30 వరకు TDS గా కొనసాగించి అనంతరం క్రమంగా తగ్గిస్తూ డిసెంబర్ 11 నాటికి ఆపివేయడం జరిగింది. రెండు నెలల తరువాత ఆమె తనకు అంతా సాధారణ స్థితిలోనే ఉందని గడ్డము మరియు ముఖంలో వెంట్రుకలు పూర్తిగా అదృశ్యమయ్యాయని తెలిపారు. సంవత్సరం తరువాత కూడా వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు. 

 

అరటి, తేనె పట్ల ఆహార అసహనం 12051...India

22 ఏళ్ల మహిళకు గత 12 ఏళ్లుగా అరటి, తేనె పదార్ధాల పట్ల ఆహార అసహనంతో బాధపడుతున్నారు. ఆమె ఈ రెండింటినీ తిన్నప్పుడల్లా, ఆమెకు కడుపులో అసౌకర్యం కలిగి అనంతరం 3 నుండి 4 గంటల వరకు ఉండే తీవ్రమైన కడుపు నొప్పి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు వస్తువులు పదేళ్లపాటు ఆమె ఆహారంలో భాగం కాలేదు, కాని 2020 మే 3 , ఆమె వీటిలో కొద్ది మొత్తాన్ని తినడం జరగడంతో ఆమె పొత్తికడుపులో తట్టుకోలేని నొప్పి ఏర్పడింది. అదే రోజు ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా SRHVP మిషను ద్వారా 200 C వద్ద రెండు ఆహార పదార్థాలను పోటెన్టైజ్ చేసి ఆమెకు ఇవ్వడం జరిగింది: 

Banana & honey potentised…TDS 

రెండు వారాల తరువాత, ఆమె అరటి మిల్క్ షేక్ తయారుచేసి సేవించగా ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తూ, సాధారణ లక్షణాలు ఏవీ రాలేదు. ఇది ఆమెను ప్రోత్సహించి అదే రోజు తేనె కూడా సేవించేలా చేయగా ఆమె సాధారణముగానే ఉన్నారు. తన చిన్ననాటి సమస్య కేవలం రెండు వారాల్లోనే పరిష్కరించబడినందుకు ఆమె చాలా సంతోషించారు. మోతాదు OD కి తగ్గించబడి ఒక నెల తరువాత రెమిడీ తీసుకోవడం ఆగిపోయింది. ఇది జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ ఆమె అరటి మరియు తేనెను రుచిని ఆస్వాదిస్తూనే ఉన్నారు.

ఆందోళన రుగ్మత, వెన్నునొప్పి 03553...Canada

33 ఏళ్ల మహిళ వివాహం అయిన మూడు నెలల తర్వాత దుర్వ్యసనాల పాలైన భర్త నుండి విడాకులు తీసుకున్న కారణంగా ఆరు సంవత్సరాలుగా తీవ్ర ఆందోళన కలిగి ఉన్నారు. కారణం లేకుండా తరచుగా ఏడవడం, నిద్రా భంగం, ఏకాగ్రత లేకపోవడం మరియు కొన్నిసార్లు హృదయ స్పందన వేగం పెరగడం వంటి లక్షణాలు కలిగి ఉన్నారు. ఆమె ఎటువంటి మందులు తీసుకోలేదు కానీ ఆందోళన కోసం కొన్ని శ్వాస వ్యాయామాలు చేస్తున్నారు. అడపాదడపా ఆమెకు స్వల్ప వెన్నునొప్పి ఏర్పడి, కుడి పాదం వరకు ప్రసరించి మెలి తిప్పిన బాధ కలిగేది. ఐతే ఈ బాధకు కారణం ఐదేళ్ల క్రితం చేయించుకున్న సిజేరియన్ డెలివరీ కావచ్చని ఆమె భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఒక నెల పాటు మంచానికి కట్టుబడి ఉండవలసి వచ్చింది. ఆమె గత 10 నెలలుగా OTC పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు కానీ ఈ రెండూ స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయి. 2019 అక్టోబర్ 8 న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

ఆందోళన కోసం :

#1. CC15.1 Mental & Emotional tonic...TDS నీటిలో …OD బెడ్ రూమ్ లో స్ప్రే చేయడం కోసం

వెన్ను నొప్పి కోసం :

#2. CC18.5 Neuralgia + CC20.5 Spine...TDS  

ఆమె నొప్పి నివారణ మందులను ఆపివేసారు కాని ఫిజియోథెరపీతో కొనసాగించారు. రెండు నెలల తరువాత డిసెంబర్ 10 న, ఆమె నడుము నొప్పి  విషయంలో 30% మెరుగుదల ఉన్నట్లు తెలిపారు, ఎందుకంటే ఆమె ముందు కంటే మెరుగ్గా నడవగలుగుతున్నారు. ఆమె ఆరోగ్య బీమా గడువు ముగియడంతో, ఆమె ఫిజియోథెరపీని ఆపివేసారు. ఆందోళన మునుపటి కంటే ఇప్పుడు తక్కువ ఉండడమే కాకుండా ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నట్లు అనిపించ సాగింది. 2019 నవంబర్ లో ప్రాక్టీషనర్ SVP స్థాయికి పదోన్నతి పొందారు, ఆరు నెలలు వరకు SRHVP మిషన్ మాత్రమే ఉపయోయాగించాలనే నియమం ఉండడం మూలాన ప్రాక్టీషనరు  # 1 మరియు # 2 లను భర్తీ చేయడానికి ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:   

ఆందోళన కోసం:

#3. NM6 Calming + NM69 CB8 + BR2 Blood Sugar + BR3 Depression + BR4 Fear + BR5 Heart + BR7 Stress...TDS and in water…OD to spray in her bedroom 

వెన్ను నొప్పి కోసం:

#4. NM38 Back Pain + NM97 Sciatica + OM18 Sacral & lumbar + OM31 Spine: Lumbar-Sacral...TDS     2020 ఫిబ్రవరి 27 నాటికి, రెండు సమస్యలలో 80% మెరుగుదల కనిపించి మే 4 నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి. మోతాదు OD కి తగ్గించి క్రమంగా జూన్ 4 నాటికి పూర్తిగా ఆపివేయబడ్డాయి. తరువాతి ఆరు నెలల వరకు ఆమెకు CC12.1 Adult tonic మరియు CC17.2 Cleansing ఒకదాని తరువాత ఒకటి ప్రత్యామ్నాయ నెలలలో ఇవ్వబడ్డాయి. ఒక సంవత్సరం క్రితం రెమిడీలు ఆపివేయ బడ్డాయి కానీ ఆమె చక్కని ఆరోగ్యంతో జీవితం కొనసాగిస్తూ సాయి వైబ్రియోనిక్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

108CC బాక్స్ ఉపయోగిస్తూ ఉన్నట్లైతే #3 : CC3.1 Heart tonic + CC15.1 Mental & Emotional tonic ; #4 : CC20.1 SMJ tonic + CC20.5 Spine ఇవ్వండి.

క్రిష్టల్ మెత్ (మాదక ద్రవ్యం) వ్యసనము 03591...Indonesia

33 ఏళ్ల వ్యక్తి గత రెండేళ్లుగా ప్రతీ రోజూ క్రిస్టల్ మెత్ (మెథాంఫేటమిన్ అనే ఉద్దీపన కోసం వాడే మాదక ద్రవ్యం) ధూమపానానికి  బానిసయ్యారు. అతను తనకు తానే గదిలో వంటరిగా ఉంటూ భార్య మరియు కొడుకుతో దూరంగా ఉండడంతో 2020 సెప్టెంబరులో వారు అతనిని విడిచిపెట్టారు. అందువల్ల అతను తన వ్యసనాన్ని వదులుకోవాలని నిర్ణయించుకొని మాదకద్రవ్యాల వాడకం మానివేసారు. మూడు రోజుల్లో, ఉపసంహరణ లక్షణాలు తీవ్రమై చంచలత్వము, నిద్రలేమి, అలసట మరియు ఆ మత్తుమందు కోసం మరియు ఆహారం కోసం కోరిక తీవ్రంగా పెరిగిపోయింది. అతను వెంటనే 2020 సెప్టెంబర్ 29 న ప్రాక్టీషనరు సహాయం కోరగా క్రింది రెమిడీ ఇచ్చారు:  

#1. CC10.1 Emergencies + CC15.3 Addictions…TDS 

అతను వేరే చికిత్స ఏదీ తీసుకోలేదు. ఒక రోజు తరువాత తను ఎంతో శక్తివంతం అయినట్లు, అలసట 50% తగ్గినట్లు ఆనందంగా తెలియజేసారు. మాదక ద్రవ్యం కోసం కోరిక 75% తగ్గింది. ఒక వారం తరువాత అనగా అక్టోబర్ 7 నాటికి, చంచలత్వం, నిద్రలేమి మరియు అలసట పూర్తిగా అదృశ్య మయ్యాయి అలాగే మాదకద్రవ్యాల కోరిక కూడా 90% తగ్గింది. అయినప్పటికీ, ఆహారం విషయంలో తృష్ణ లో ఎటువంటి మార్పు లేదు. మరో మూడు వారాల తరువాత అక్టోబర్ 30 నాటికి అతను ఇకపై ఔషధం కోసం ఆరాటపడలేదు. ఐతే తిండి మీద ధ్యాస తగ్గక పోవడం వలన అధికంగా తింటూ తను బరువు పెరిగి పోతానేమో అని  ఆందోళన చెందుతున్నారు. అందుచేత  అతనికి క్రింది రెమిడీ కూడా ఇవ్వబడింది:

#2. CC15.4 Eating disordes…TDS                         

అంతేకాకుండా, ప్రాక్టీషనరు రోగికి వ్యాయామ దినచర్యను మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించమని సలహా ఇచ్చారు.  డిసెంబర్ 1 న రోగి ఆహారం కోసం తనతృష్ణ 50% తగ్గిందని, చాలా కాలం తరువాత తనకు ఎంతో కులాసాగా ఉన్నట్లు అనిపించిందని తెలిపారు. అతను సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉండటానికి సానుకూల ధృక్పధం గల వ్యక్తులతో తనను తాను సామీప్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు మరింత ప్రశాంతంగా, శక్తివంతంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతున్నారు. 

2021 జనవరి 4 న, #1 BD కి తగ్గించబడింది మరియు తరువాత ఐదు నెలల వ్యవధిలో క్రమంగా 3TW కి తగ్గించబడింది. ఫిబ్రవరి 24 నాటికి అతి ఆహారం విషయంలో అతని కోరిక అంతరించిపోయింది. # 2 BD కి తగ్గించబడింది. మార్చిలో కూడా రోగి # 2 ను ఇదే మోతాదులో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే # 2 అదనపు బరువు తగ్గడానికి అతనికి సహాయపడసాగింది. జూన్ 1 న అతను దీనిని 3TW కి తగ్గించారు. మాదక ద్రవ్య వినియోగం మెదడులో కొన్ని మార్పులకు కారణమై ఇది ఆపిన తర్వాత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం దాని ప్రభావం ఉంటుంది కనుక అతను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, 2021 జూన్ 14 వరకూ # 1 మరియు # 23TW గా కొనసాగిస్తూనే ఉన్నారు. యాదృచ్ఛికంగా, అతను ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం సాయి బాబాను ప్రార్థిస్తున్నారు.  

మధుమేహము (డయాబెటిస్) 03566...USA

2012 సంవత్సరంలో, ఈ 26 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా విపరీతమైన అలసట, తరచుగా మూత్రవిసర్జన, చేతి వేళ్లు మరియు కాలి వేళ్ళలో జలదరింపు అనుభూతిని పొందారు. వైద్యుడు వెంటనే రక్త పరీక్ష సూచించి డయాబెటిస్ HbA1c* 7.5 స్థాయితో ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె తండ్రి మరియు తాత ఇద్దరికీ డయాబెటిస్ ఉన్నందున ఇది వంశపారంపర్యంగా ఏర్పడింది. అంతేకాక ఆమె అధికంగా జంక్ ఫుడ్ మరియు స్వీట్లు తింటూ అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నారు. ఆమె 160 సెం.మీ (5 అడుగులు 3 అంగుళాలు) ఎత్తుకు 77 కిలోలతో (170 పౌండ్లు) అధిక బరువు కలిగి ఉన్నారు. డాక్టర్ మెట్‌ఫార్మిన్ 1000 mg BD గా సూచించారు. అలాగే, ఆమె జిమ్‌లో చేరి ఎక్సర్ సైజులు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం కూడా ప్రారంభించారు. ఫలితంగా ఆమె రెండేళ్లలో 23 కిలోల (50 పౌండ్లు) తగ్గించుకో గలిగారు. ఆమె HbA1c స్థాయి 2017 నాటికి 7.0 కి పడిపోయింది, డాక్టర్ మెట్‌ఫార్మిన్ మోతాదును OD కి తగ్గించారు. ఆమె 2019 ఆగష్టు 12 న ప్రాక్టీషనరును సందర్శించినప్పుడు, ఆమె మెట్‌ఫార్మిన్ OD ని కొనసాగిస్తున్నారు. మరియు HbA1c స్థాయి 7.0 వద్ద స్థిరంగా ఉంది. మెట్‌ఫార్మిన్ యొక్క దుష్ప్రభావాల వలన గుండెల్లో మంట మరియు మలబద్దకం ఉన్నట్లు కూడా ఆమె తెలిపారు. ఆమెకు ఈ క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి.   

డయబెటిస్ కు :

#1. CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

గుండెలో మంట మరియు మలబద్ధకానికి :

#2. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC10.1 Emergencies...TDS 

ఆమె సరళమైన వ్యాయామాలను చేస్తూ కఠినమైన ఆహార నియమాలను అనుసరించడం కొనసాగించారు. HbA1c 6.5 కి రావడానికి నాలుగు నెలలు పట్టింది, కాబట్టి వైద్యుడు మెట్‌ఫార్మిన్‌ 500 mg OD కి తగ్గించారు. మలబద్ధకం మరియు గుండెల్లో మంటలో 60% ఉపశమనం కలిగింది. 2020 ఏప్రిల్ 15 నాటికి మరో నాలుగు నెలల్లో, HbA1c స్థాయి 5.5 వద్ద సాధారణమై మెట్‌ఫార్మిన్ యొక్క దుష్ప్రభావాల నుండి ఆమె పూర్తిగా కోలుకున్నారు. # 1 మరియు # 2 యొక్క మోతాదు వరుసగా BD మరియు OD కి తగ్గించబడింది. మెట్‌ఫార్మిన్‌ను 250 mg OD కి తగ్గించమని డాక్టర్ ఆమెకు సలహా ఇచ్చారు, కానీ ఆమె దానిని తిరస్కరిస్తూ దానిని తీసుకోవడం పూర్తిగా ఆపివేసారు. మరో రెండు వారాల్లో, # 2 యొక్క అవసరం లేదని భావించి నిలిపివేసారు. 2020 నవంబర్ లో, # 1 యొక్క మోతాదును OW కి తగ్గించారు, కాని తరువాత 2TW మోతాదు వద్ద కొనసాగించడం ఆమెకు మరింత సౌకర్యవంతంగా అనిపించి దానిని 2021 ఏప్రిల్ నాటికి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె రక్తంలో చక్కెర శాతం సాధారణమైంది; ఆమె దానిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.  

*HbA1c అనేది 2-3 నెలల కాలంలో రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తెలిపే సగటు: సాధారణ స్థాయి 0 నుండి 5.9%; ప్రి డయబెటిస్ స్థాయి 6.0 నుండి 6.4%; డయబెటిస్ స్థాయి 6.4% కంటే ఎక్కువ.  

వెజినైటీస్ (యోని రుగ్మత) 11629...India

40 ఏళ్ల మహిళ 10 సంవత్సరాలుగా యోనిలో వాపు, దురద మరియు బొబ్బలతో బాధపడుతున్నారు (వెజినైటిస్ అని నిర్ధారణ చేయబడింది). ఆమెకు గత 6 సంవత్సరాలుగా మంట, పొడిగా పొలుసులగా ఉండే మచ్చలు, చీలమండలు, చేతులు మరియు మొండెము దిగువ భాగంలో చిన్న గడ్డలు కూడా ఉన్నాయి. ఆమె ఏడు సంవత్సరాలుగా అల్లోపతి మరియు రెండు సంవత్సరాలు హోమియోపతి మందులు వాడినా ప్రయోజనం కలుగలేదు; తాత్కాలిక ఉపశమనం తరువాత లక్షణాలు త్వరలోనే తిరిగి ఏర్పడతాయి. ఆమె రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోలేదు, పగటిపూట సాధారణ స్థాయిలో తన రోజువారీ పనులను కూడా చేసుకోలేక పోయారు. ఇటువంటి నిరాశావాహ స్థితిలో ఈ సమస్య పరిష్కారం కోసం ఆమె 2020 ఆగష్టు 31 న, ప్రాక్టీషనరును సందర్శించగా క్రింది రెమిడీ ఇచ్చారు:   

CC8.5 Vagina & Cervix + CC21.6 Eczema + CC21.7 Fungus…TDS 

అక్టోబర్ 9 న ఆమె తన వెజినైటిస్ వ్యాధి విషయంలో దాదాపు 60% మరియు చర్మము ఇతర ప్రాంతాలలో 30% ఉపశమనం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. మరొక నెల తరువాత ఈ రెండు సమస్యల విషయంలో మెరుగుదల వరుసగా 90% మరియు 50% ఏర్పడ్డాయి. డిసెంబర్ చివరి వారం నాటికి, ఆమె అన్ని వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా విముక్తి పొందారు. మోతాదు OD కి తగ్గించబడింది, ఇలా ఆమె 2021 మార్చి వరకూ నివారణా మోతాదుగా కొనసాగించారు సమస్యలు పునరావృతం కాలేదు.  

సంపాదకుని సూచన: వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి రెమిడీ యొక్క బాహ్య అనువర్తనం సిఫారసు చేయబడుచున్నది.   

ఆకలి మరియు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం 11616...India

తన 11 ఏళ్ల కుమార్తెకు గత ఐదు ఏళ్లుగా ఆకలి తక్కువ ఉండడం పట్ల తల్లి ఆందోళన చెందసాగారు. వారు సమష్టి కుటుంబంలో నివసిస్తు ఉండగా పాప వయసు సోదరీ సోదరులు అందరూ బాగానే తింటూ ఉండేవారు. తన పాపను సరిగ్గా తినేలా చేయడానికి ఎన్నో  వ్యూహాలను ప్రయత్నించినప్పటికీ అవి విజయవంతం కాలేదు. అంతేకాక గత రెండేళ్లుగా, ఈ పాప పాఠశాలలో నేర్చుకున్న వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా చాలా కష్టపడుతోంది. 2019 ఆగష్టు 5 న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది.  

CC4.1 Digestion tonic + CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic…BD నీటిలో

ఆమె పాఠశాల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని BD మోతాదు ప్రామాణిక TDS కన్నా చాలా ఆచరణాత్మకంగా అనిపించింది. మూడు నెలల తరువాత, అమ్మాయి ఆకలి మరియు జ్ఞాపకశక్తి 50 నుండి 60% వరకు మెరుగుపడింది. మరో రెండు నెలల్లో పాప తన తల్లి సంతృప్తి మేరకు చక్కగా తినడమూ మరియు ఆమె జ్ఞాపకశక్తి సమస్య కూడా అదృశ్య మవడం జరిగింది. నెల తరువాత అనగా  2020 ఫిబ్రవరి 15న, ప్రాక్టీషనరు మోతాదును OD కి తగ్గించారు. ఆమె మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నందున, రెమిడీ 2020 నవంబర్‌లో ఆపివేసారు. ఏప్రిల్ 2021 నాటికి, అమ్మాయి బాగానే ఉంది.  

జుట్టు రాలడం 03578...France

70 ఏళ్ల మహిళకు గత ఆరు నెలలుగా గణనీయమైన మొత్తంలో జుట్టు రాలిపోతోంది. శారీరక మరియు మానసిక ఒత్తిడి దీనికి కారణమని తేలింది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె తన ఇల్లు వరదలకు గురి కావడం మరియు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులతో వివాదాలు రావడం వంటి చాలా ఒత్తిడితో కూడిన సంఘటనలకు ఆమె గురయ్యారు. ఆమె ప్రాక్టీషనర్‌ను సందర్శించే నాటికి, ఆమె 20 ఏళ్లుగా తీసుకుంటున్న డయాబెటిస్ మందు మినహా మరే మందులు తీసుకోవడంలేదు. 2019 మార్చి 30 న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:    

CC11.1 Hair tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS  

ఒక వారంలో, ఆమె మునుపటి కంటే తక్కువ జుట్టు ఊడుతున్నట్లు ఆమె గమనించారు. ఇది 20% మెరుగుదల. మరో 8 వారాల తరువాత, ఆమె జుట్టు రాలడం ఆగిపోయింది, కాబట్టి మోతాదు OD కి తగ్గించబడింది. ఐతే ఈ ఫలితంతో ఆమె పూర్తిగా సంతృప్తి చెందడంతో ఆమె స్వయంగా రెమిడీ నిలిపివేసారు. 2021 ఏప్రిల్ నాటికి రెండేళ్ల తర్వాత కూడా, జుట్టు రాలడం లేకుండా ఆమె బాగానే ఉన్నారు. 

శిశువు లో భయం 01001...Uruguay

రెండేళ్ల అమ్మాయికి 2019 సెప్టెంబర్ నుండి ప్రతీ విషయానికి భయపడడం ప్రారంభమైంది. ఆమె కుక్కను చూసినప్పుడు లేదా బెల్ రింగ్ విన్నప్పుడు లేదా త్వరగా కదిలేది ఏదైనా చూసినప్పుడు (ఉదా. మరొక పిల్లవాడు పరిగెత్తడం లేదా పిల్లి దుమకడం), ఆమెలో వణుకు ప్రారంభమై తల్లిని వెళ్లనివకుండా గట్టిగా కౌగిలించుకుని అరగంట సేపు తట్టుకోలేని విధంగా కేకలు వేస్తుంది. ఆమె పుట్టినప్పటి నుండి (సి-సెక్షన్ ద్వారా) ఆమె ఇట్టి నాడీ స్వభావం కలిగి ఉంది. ఆమె శారీరకంగా ఆరోగ్యంగా ఉంది కానీ ఈ భయానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. 2019 డిసెంబర్ 3 న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

NM6 Calming + NM25 Shock + BR4 Fear + SM1 Removal of Entities + SM9 Lack of Confidence…TDS 

ఒక వారంలో, భయం తాలూకు ఇబ్బందులు మరియు వాటి తీవ్రత సగం వరకు తగ్గడంతో పాప మెరుగ్గా ఉంది. ఆ తర్వాత ఆమెలో నిరంతరం అభివృద్ధి కలుగుతూ మరో రెండు వారాల తరువాత భయం దాదాపుగా పోయింది. 2020 జనవరి 2 న, ఒక్కసారి కూడా పాప భయపడలేదని మరియు పాప నమ్మకంగా సంతోషంగా ఉన్నట్లు తల్లి తెలియజేసారు. మోతాదును రెండు వారాలపాటు OD కి తగ్గించారు ఆ తరువాత 2020 ఫిబ్రవరి 8 న రెమిడీ నిలిపివేసే నాటికి క్రమంగా తగ్గించారు. ఇప్పటికి ఒక సంవత్సరానికి పైగా పాపలో మునుపటి లక్షణాలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంది.   

108 CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC15.1 Mental & Emotional tonic. ఇవ్వండి

కోవిడ్ -19 02726...USA

51 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ 8 నుండి స్వల్ప జ్వరం , చలి, శరీర నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మరియు అలసట కలిగాయి, వాటి నివారణకు ఔషధాలను తీసుకొనడంతో కొంత ఉపశమనం కలిగింది. అతనికి డిసెంబర్ 12 న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింప బడింది. ఒక వారం తరువాత కూడా లక్షణాలు కొనసాగడంతో, అతని భార్య ఆందోళన చెంది 2020 డిసెంబర్ 19 న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది ప్రామాణిక IB రెమిడీ అందించారు:    

CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD మరియు కుటుంబ సభ్యులందరికీ TDS 

నాలుగు రోజుల్లో, జ్వరం తగ్గిపోయింది మరియు ఇతర లక్షణాలు 30% మెరుగుపడ్డాయి. మరో మూడు రోజుల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 60% మరియు శరీర నొప్పిలో 90% మెరుగుదల కలిగింది. డిసెంబర్‌ 29 నాటికి అతనికి కాస్త అలసట తప్ప మిగతా అన్నీ విషయాలలో సాధారణ స్థితి అనుభూతి చెందారు. మోతాదు TDS కి తగ్గించబడింది. 2021 జనవరి మొదటి వారం నాటికి అతను పూర్తిగా కోలుకున్నారు. మోతాదును కుటుంబ సభ్యులందరితో సహా ముందస్తు నివారణ స్థాయి OD కి తీసుకువచ్చారు. 2021 మార్చి 29 నాటికి, వారందరికీ సాధారణ స్థాయి కొనసాగుతోంది.

 

ప్రాక్టీషనర్ల వివరాలు 02493 & 02858...Syria

సిరియాలో సాయి వైబ్రియోనిక్స్ సేవలో చురుకుగా పాల్గొంటున్న ముగ్గురు వైద్య సహోదరులను వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల బృందంగా   ప్రొఫైల్ చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ చిన్న సమూహం యొక్క నాయకుడు 17 సంవత్సరాలుగా వైబ్రియోనిక్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఇటీవలే అతను స్వామి ఫోల్డు లోనికి తీసుకువచ్చిన దంపతుల జంట, రోగుల భారాన్ని వహించడంలో గణనీయమైన భాధ్యత తీసుకున్నారు.

ప్రాక్టీషనర్  02493…సిరియా ఇప్పటి వరకూ 12 సార్లు స్వామిని సందర్శించిన ఈ దంతవైద్యుడు, మొట్టమొదట 2003 లో తన మొదటి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి అతను అరబిక్ ప్రపంచంలో స్వామి సందేశాన్ని మరియు బోధలను ప్రచారం చేస్తున్నారు. అతను తన ఉపన్యాసాలు, పుస్తకాలు, సభలు, ధ్యాన శిబిరాలు, వైద్య శిబిరాలు మరియు అనేక ఇతర కార్యకలాపాల ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు, నిజం చెప్పాలంటే అక్షరాలా ప్రపంచంలోని ఒక చీకటి ప్రాంతంలో కాంతి  రేఖల కోసం పోరాడుతూనే ఉన్నారు. అంకిత భావంతో పనిచేసే ఈ ప్రాక్టీషనరు మరియు అతని సాయి బృందం దార్ అల్ సలాం (శాంతి నివాసం) అనే ఒక చక్కటి సాయి సెంటర్‌ను స్థాపించి ఇక్కడ వారు రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అల్పాదాయ ఆర్ధిక వనరులు కలిగిన వారికి అవసరమైన కిరాణా సామగ్రి మరియు దుస్తులను పంపిణీ చేస్తారు, పర్యావరణ పరంగా అవసరమైన సూచనలు కూడా అందిస్తారు. దయ మరియు ప్రేమాభిమానాలతో మతపరమైన వ్యత్యాసాలను పట్టించుకోకుండా, వివక్ష లేకుండా మానవ విలువలను బోధిస్తారు.

అతను సేవాదళ్ గా పనిచేస్తున్న పుట్టపర్తి జనరల్ హాస్పిటల్‌లోని వైద్యులలో ఒకరి నుండి వైబ్రియోనిక్స్ గురించి మొదటి సారి తెలుసుకున్నారు. 2004 లో తన తదుపరి ప్రశాంతి నిలయం సందర్శనలో వైబ్రో శిక్షణ పొందారు. అప్పటినుండి అతను సమస్యల సుడిగుండముగా ఉండే సిరియా!లో స్థిరంగా మరియు ధైర్యంగా సేవలను అందిస్తున్నారు. తను అన్ని స్థాయిలలో స్వామి నుండి పొందుతున్న అపార కరుణ మరియు వైబ్రియానిక్స్ సాధనంగా పొందుతున్న ఆనందం మరియు ప్రగాఢ సంతృప్తి గురించి తెలుపుతూ ఉంటారు. వైబ్రియోనిక్స్ అభ్యసించడం మరియు తనను తాను స్వామికి ఉపకరణంగా భావించి తాను అంతర్లీనంగా పొందుతున్న ప్రేమను ప్రసరింప జేయడం గురించి తెలియజేస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తముగా ఉన్న దివ్యప్రేమ సాధకుల సమాజంతో కలిసి పనిచేసే ఒక సభ్యుడిగా ఉంటూ ఆ దివ్యశక్తి చేత అందరూ బలోపేతం అవుతూ వృద్ధి చెందాలని భావిస్తున్నారు. 

స్వామి యొక్క అపార అనుగ్రహంతో పునీతమైన హృదయంతో వారు ఇలా వాస్తున్నారు."ప్రాక్టీషనర్లుగా మనము పూర్తి విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, ఒక స్పర్శతో, ఒక మాటతో లేదా ప్రేమమయ వీక్షణతో రోగులకు స్వస్థత చేకూర్చగలమని నేను పూర్తిగా నమ్ముతున్నాను." రోగులకు చికిత్స చేసేటప్పుడు, ఈ ప్రాక్టీషనరు వ్యాధికి గల కారణాన్ని అంచనా వేసే సమగ్ర విధానాన్నిపాటిస్తూ అవసరం మేరకు కౌన్సిలింగ్ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ఒక చక్కని ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. 32 ఏళ్ల మహిళ తన భర్తతో సమస్యల కారణంగా ఏర్పడిన ఆందోళన వలన ఎనిమిది నెలలుగా కడుపు నొప్పి మరియు విరేచనాలతో బాధపడుతున్నారు. ఐబిఎస్ అని నిర్ధారణ అవడంతో ఆమెకు ఫైబర్ సప్లిమెంట్స్ సూచించబడ్డాయి కానీ ఇవి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుందనే ఆమె భయాలను తొలగిస్తూ ఈ వైద్య ప్రక్రియలో తన భర్తపట్ల ఉన్న వ్యతిరేక భావం తొలగించుకొని అతనిని అంగీకరించడం ద్వారా ఆమె ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ప్రాక్టీషనరు ఆమెకు వివరించి చెప్పారు. అలాగే ఆమె తీసుకునే కాఫీలో ఉన్న కెఫిన్ ప్రేగుల చలనాన్ని ప్రేరేపిస్తున్నందున తను కాఫీ తీసుకోవడం 2-3 కప్పుల నుండి రోజుకు ఒకకప్పుకు తగ్గించాలని ఆమెకు సూచించారు. CC4.6 Diarrhoea + CC15.1 Mental & Emotional tonic, తో ఆమె 6 వారాల్లో వ్యాధి నుండి ఉపశమనం పొందారు. ఆమె అభ్యాసకుడిని కలిసినప్పుడల్లా సమస్యలనుండి ఉపశమనం మరియు జీవితానికి కొత్త అర్ధం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. 

తమ సాయి సెంటరు వారు ఉంటున్న ప్రాంతంలో శాంతి, ప్రేమ మరియు అహింసను వ్యాప్తి చేయడానికి ఒక బృహత్తరమైన సాయి వైబ్రియోనిక్స్ వైద్య సాధనంగా రూపుదిద్దుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక పెద్ద సాయుధ సైనిక బృందం నగరంపై దాడి చేసి 35 మంది డెనిజెన్లను అరెస్టు చేయాలని భావించినప్పుడు ఒక భయానక ఘటన తటస్థించింది. సాయుధ బలగం వారి కేంద్రానికి చేరుకున్నప్పుడు, అతను "స్వామి మా కేంద్రాన్ని అపారమైన వైబ్రో మెషీన్‌గా ఉపయోగించుకుంటున్నారు నేను కూడా దీనిలో ఒక అంతర్భాగమే” అని భావించారు. ఒక గంటలోపు ఎవరూ గాయపడకుండా సమస్య పరిష్కరించబడింది. మొత్తం సైనిక బృందం అనుకోకుండా ఉపసంహరింపబడింది!

చివరిగా ప్రాక్టీషనర్ ఈ ప్రేరణాత్మక భావనతో ముగిస్తున్నారు. "వైబ్రియోనిక్స్ సేవ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించడానికి మరియు అనుభవించడానికి, ప్రతి ఒక్కరితో ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి మరియు ప్రతిదీ ఆ దైవ సంకల్పమే అని ధృఢంగా విశ్వసించడానికి నాలో పరివర్తన కలిగించి హృదయాన్ని విస్తరింప జేసింది. " ప్రేమపూర్వక సేవ ఇవ్వడం ద్వారానే స్వీకరించ గలుగుతుందని, నిజానికి ఇచ్చేదీ స్వీకరించేది ఒకటే అనే అద్బుతమైన సత్యాన్ని వీరు గ్రహించారు.     .

పంచుకున్న కేసులు :

ప్రాక్టీషనర్స్ 02858…సిరియా  ఒక ENT స్పెషలిస్ట్ మరియు అతని ఫార్మసిస్ట్ భార్య, 2003 లో ప్రాక్టీషనర్02493.ద్వారా మొదట స్వామి గురించి తెలుసుకున్నారు. ప్రతి వేసవిలో భారతదేశం నుండి తిరిగి వచ్చే తమ దేశపు చిన్న బృందమును కలవడానికి వారి పర్యటన వివరాలను వినడానికి, స్వామి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు స్వామి దర్శనం యొక్క వీడియోలను చూడడానికి అలా తమ ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి  ఎంత అసహనంతో ఎదురుచూస్తూ ఉండేదో వారికి ఇప్పటికీ వారి స్మృతులలో పదిలంగా ఉన్నాయి. ఈ తీర్థయాత్రల గురించి వారు చెప్పే ప్రతీ విషయమూ వీరిలో ఎంత ఆసక్తి నింపేదో వీరి శ్రీమతి గుర్తుచేసుకుంటున్నారు. నిజంగా స్వామి కథల ద్వారా వీరు అమృతాన్నే గ్రోలేవారు. చివరగా వీరి బృందానికి 2012 లో ప్రశాంతినిలయాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఆర్థిక పరిమితులు ఉన్నందున కొద్దిమంది మాత్రమే ఈ యాత్ర చేయగలిగారు. స్వామి ఇటీవలే తమ దేహ పరిసమాప్తి చేసినప్పటికీ, ఆశ్రమంలో ఉన్నప్పుడు, వారి ఉనికి "శాశ్వత శాంతి, ప్రేమ మరియు ఆనందం రూపంలో వ్యక్తమవుతూ ఆ ప్రదేశం అంతా కంపిసృన్నట్లు వీరు అనుభూతి పొందారు."

ఒకసారి ఈ బృందం యొక్క నాయకుడు వీరిని డాక్టర్ అగర్వాల్ గారిని కలవడానికి తీసుకు వెళ్ళగా అంతర్యుద్ధం తో అస్థవ్యస్థంగా ఉన్న సిరియా నుండి అటువంటి సమయంలో వచ్చిన ఈ ఆరోగ్య నిపుణులను ఆనందంగా ఆదరించారు. వారికి వైబ్రియోనిక్స్ నేర్చుకునే అవకాశం లభించింది. భర్త వెంటనే కోర్సులో పేరు నమోదు చేసుకున్నారు. ఐతే ఇది ఒక అరుదైన అవకాశం అయినప్పటికీ ఇద్దరు చిన్న కుమార్తెలకు సంరక్షణ అవసరం మరియు మరొక బిడ్డ కడుపులో ఉండడం కారణాల చేత భార్య కొంత సంకోచించారు. వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనాలను ఆమె అప్పటికే అనుభవించి ఉండడం కారణము చేత "వచ్చే వేసవిలో నేను కోర్సు చేస్తాను” అని అగర్వాల్ గారికి చెప్పారు. డాక్టర్ అగర్వాల్ తన “ప్రస్తుత సమయం యొక్క గణ్యత “ద పవర్ ఆఫ్ నౌ ” గురించి   ఉటంకిస్తూ, భవిష్యత్తులో ఆమె ఎలా రాగలదని భావిస్తున్నారో ఖచ్చితంగా చెప్పవలసిందిగా అడిగారు. సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా వారు ఈ సందేహం వ్యక్తం చేసారు. ఒక సంవత్సర కాలం ఆమె తన నెల వారీ బహిష్టు ముందు 7-10 రోజులు అసహనం, ఆతృత, విచారము, నీరు చేరడం, రొమ్ములో నొప్పి, తలపోటు వంటి వాటితో బాధపడ్డారు. నొప్పి నివారణలు మరియు వేదనా నివారణలు ఎక్కువగా వాడడం వలన వాటికి బానిస అవుతాననే భయంతో వీటిని ఆపివేసి చివరికి తన ఆత్మ సంతృప్తి మేరకు కోర్సు తీసుకున్నారు. సహజమైన మార్గాలతో వైద్యం చేయాలన్న ఆమె చిరకాల స్వప్నం చివరకు నెరవేరిందని గ్రహించినప్పుడు అపారమైన కృతజ్ఞతతో నిండిపోయారు.  

ఈ ప్రాక్టీషనర్ జంట తమ  రోగులకు అల్లోపతి మందులతో పాటు సానుకూల ఆలోచన మరియు భావోద్వేగ సంరక్షణతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో  వైబ్రియోనిక్స్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. చికిత్స అనేది శరీరము, మనస్సు మరియు ఆత్మ అనే మూడు స్థాయిలలో ఉంటుందని వారు కనుగొన్నారు. ఇది వారి జీవితంలో ఒక ప్రకాశవంతమైన కొత్త అధ్యాయాన్ని తెరిచి, వైబ్రియోనిక్స్ ద్వారా స్వామి మరియు వారి మిషన్‌తో నిరంతర సాన్నిహిత్యాన్ని అనుభవించేలా చేసింది.

సిరియాకు తిరిగివచ్చిన ఈ జంట తమ సాయి సెంటర్‌లో ఒక బృందంగా పనిచేస్తూ సంక్షోభం నెలకొన్న ఈ విపత్కర సమయంలో చాలా మంది రోగులకు చికిత్సను మరియు వారి సహాయ సహకారాలను అందించారు. ఈ సరళమైన మరియు పూర్తి ఉచితముగా చేసే  చికిత్సను ఎంతో మంది ప్రజలు, ముఖ్యంగా యుద్ధకాల పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఎంతో మెచ్చుకుని బహిరంగంగా తమ  కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి సంప్రదాయ ఔషధం వారి రోగులలో చాలా మంది విషయంలో విఫలమైంది. ఈ జంట వారి కుమార్తెలు చాలా చిన్నవయస్సులో ఉన్నప్పటి నుండి కూడా తలనొప్పి, కడుపు నొప్పి, జలుబు లేదా జ్వరం యొక్క ఏదైనా సంకేతాన్ని చూపించిన వెంటనే వారికి నీటిలో రెమిడీలు ఇవ్వగానే వారు అరగంటలో ఉపశమనం పొందేవారు. మానసిక రుగ్మతలతో ముఖ్యంగా సమకాలీన సిరియన్ సమాజంలో తరుచూ వేధింపులకు గురి అయ్యే మహిళల విషయంలో CC15.1 Mental & Emotional tonic లేదా CC15.2 Psychiatric disorders తో అద్భుత విజయాలను సాధించారు.

ఈ సందర్భంగా వారు మనతో కొన్ని కేసులను భాగస్వామ్యం చేస్తున్నారు.33 ఏళ్ల యువతి సంవత్సర కాలంగా ప్రి మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా చికాకు, ఆందోళన, నీరు చేరుట(ఒడెమా), ఛాతీలో నొప్పి, తలపోటు వంటివి ఆమె నెలసరికి 7-10 రోజుల ముందు నుండి కలుగుతూ ఉండడంతో ఎంతో బాధపడుతున్నారు. అలోపతి నొప్పి నివారణలు, ఆందోళన నివారణలు 6 నెలల పాటు కొనసాగించి వాటికి అలవాటు పడడం జరుగుతుందేమో అనే భయంతో ఆపివేయడం జరిగింది. ఆమెకు CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic, తో చికిత్స ప్రారంభించిన మొదటి పీరియడ్ లోనే 70-80% ఉపశమనం పొందారు. ఆమె పూర్తి నివారణ కోసం 6 నెలలు చికిత్స కొనసాగించారు. మరొక కేసు విషయంలో 35 ఏళ్ల మహిళ  54 సంవత్సరాల వ్యక్తిని వివాహం చేసుకొని ఒక సంవత్సర  కాలంగా వేచి చూసి తనకి ఇక పిల్లలు పుట్టరేమో అని  భయపడుతూ ఉండేవారు. CC8.1 Female tonic + CC15.1 Mental & Emotional tonic వాడిన కొద్ది రోజులకే ఆమెకు ఉపశమనం కలగడంతో పాటు నెల లోపే గర్భం దాల్చింది.

ఈ ప్రాక్టీషనర్లు సాధారణంగా రోగుల చికిత్సకోసం తమని సంప్రదించినప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి యొక్క ప్రయోజనాలను చర్చిస్తారు. 40 ఏళ్ల వ్యక్తికి మూడేళ్లుగా తీవ్రమైన మలబద్ధకం ఉంది. అతను ప్రతి 3 నుండి 4 రోజులకు అసంపూర్తి మల విసర్జన తో పాటు కడుపు నొప్పి మరియు ఉబ్బరం కూడా కలిగి ఉన్నారు. పరిమిత ఉపశమనం కలిగించే భేదిమందులపై ఆధారపడటానికి అతను ఏమాత్రం ఇష్టపడలేదు. సమతుల్య ఆహారం, సమయానికి భోజనం తినడం, తగినంత నీరు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రాక్టీషనర్లు అతనితో చర్చించారు. CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic, తీసుకున్న రెండు రోజుల తరువాత మలవిసర్జన సమయంలో నొప్పి తక్కువ ఉండడం, ఒక వారం తరువాత ఎటువంటి నొప్పి లేకుండా మల విసర్జన చేయ గలగడం ఏర్పడింది. మోతాదును 6 నెలలలో క్రమంగా OW కి తగ్గించడంతో అతను పూర్తిగా కోలుకున్నాడు. సంవత్సరం తరువాత అతనిని సంప్రదించినపుడు, రోగపునరావృతం లేకుండా చక్కగా ఉన్నాడు.

రోగులకు హృదయపూర్వకంగా సహాయం చేయాలనే ఆకాంక్షతో వైబ్రియానిక్స్ తో పనిచేసేటప్పుడు స్వామికి శరణాగతి చేయడం ద్వారా సానుకూల ఆలోచనల శక్తిని అనుభవిస్తున్నట్లు ఈ ప్రాక్టీషనర్లు కనుగొన్నారు. రోగుల వ్యధలను జాగ్రత్తగా వినడం అనే విధానం నేర్చుకోవడం ద్వారా వారు చికిత్స చేసే ప్రక్రియలో ఆశ మరియు సహాయాన్ని పునరుద్ధరించే ప్రోత్సాహకరమైన పదాలను రోగులకు అందించ గలిగారు. స్వామి మిషన్ లో పాల్గొనడం వారిని ప్రజలకు దగ్గర చేసి మరింత కరుణ మరియు అవగాహన కలిగించింది. చివరిగా ఈ జంట స్వామికి వారి హృదయాలను పరిశుద్ధ పరుచు కోవడానికి, తద్వారా వారి ఆత్మను అధ్యాత్మిక ప్రయాణంలో స్థిరంగా ముందుకు తీసుకు వెళ్లడానికి సహాయ పడినందుకు స్వామికి మరియు వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.   

 పంచుకున్న కేసులు :

 

ప్రాక్టీషనర్ల వివరాలు 02786...Russia

ప్రాక్టీషనర్స్  02786…రష్యా  ఈ జంట దాదాపు 12 సంవత్సరాలుగా రష్యాలో వైబ్రియోనిక్స్ సేవ చేస్తోంది. టెక్స్‌టైల్ ఇంజనీర్ అయిన భర్త, డిజైన్ జనరల్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి, పదవీ విరమణ అనంతరం పత్తి మిల్లుకు సాంకేతిక డైరెక్టర్‌గా చాలా సంవత్సరాలు పనిచేశారు. శిక్షణ ద్వారా మ్యాథ్స్ టీచర్ అయిన భార్య తన సబ్జెక్టు విషయంలో పెద్దగా పని చేయలేదు గానీ బదులుగా చెస్(చదరంగం) బోధనను కొనసాగించారు.  

ఈ జంటను 2002 వేసవిలో వారి స్నేహితులు స్వామికి పరిచయం చేశారు. అదే సంవత్సరం డాక్టర్ ఫణి బండ వ్రాసిన పుస్తకం 'విజన్ ఆఫ్ ది డివైన్' మరియు హోవార్డ్ మర్ఫెట్ యొక్క 'సాయి బాబా, మ్యాన్ ఆఫ్ మిరకిల్స్' పుస్తకం చదివిన తరువాత వారు క్రిస్మస్ సందర్భంగా పుట్టపర్తిని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రతీ శీతాకాల సెలవుల్లో, ఆశ్రమానికి వారి వార్షిక సందర్శనలకు నాంది అయ్యింది. 2009 లో, భర్త పెన్షనర్ అయిన తరువాత, వారు ప్రశాంతి నిలయంలో నివసించాలనే వారి కలను సాకారం చేసుకొనడానికి భారతదేశానికి మకాం మార్చారు.  

ఆశ్రమంలో, ఈ జంట కొంతమంది రష్యన్ ప్రాక్టీషనర్లను కలుసుకొనగా వారు సాయి వైబ్రియానిక్స్ అభ్యసించడానికి వీరిని ప్రోత్సహించారు, చివరికి ఇది వారి జీవితాన్నే అర్ధవంతం చేసింది. జూలై 2009 లో వారు ప్రాక్టీషనర్లు కావడానికి శిక్షణ పొందారు. ఈ సేవ  పట్ల వారి అంకితభావం ఎంత గొప్పది అంటే, కేవలం ఏడు నెలల్లో వీరు ఎస్వీపీలుగా పదోన్నతి పొందారు. వారు మిషనరీ ఉత్సాహంతో ఈ వైబ్రియోనిక్స్ సేవలో నిమగ్నమై ఐదేళ్ళలో, ఆశ్రమం లోపల మరియు పుట్టపర్తిలో మూడు వేల మంది రోగులకు చికిత్స చేశారు. వారు వైబ్రియానిక్స్ చికిత్స కోసం హ్యాండ్‌బుక్‌లను చాలా వివరంగా అధ్యయనం చేశారు, వారి సూచనలు తరువాత వైబ్రియోనిక్స్ 2016 లో పుస్తకంలో పొందుపరచబడినవి. ఈ జంట 2014 లో రష్యాకు వెళ్లి తిరిగి వెనక్కి రాలేదు. వారి వైబ్రియానిక్స్ సేవ కూడా పరిమిత మయ్యింది, అంతేకాక, ప్రస్తుత మహమ్మారి కారణంగా ఇది మరింత తగ్గింది. 1986 లో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్లో ప్రమాదం తరువాత రేడియోధార్మిక వర్షం కారణంగా వారు నివసించే నగరం అధిక స్థాయిలో రేడియేషన్ కలిగి ఉంది. అందువల్ల, చాలా మంది స్థానికులపై వైబ్రియానిక్స్ కంపనాలు పనిచేయవని వీరు కనుగొన్నారు. అయినప్పటికీ, కొద్దిమందిలో వైబ్రియానిక్స్ కంపనాలు పనిచేస్తూ ఉండడంతో ఈ రోగులు క్రమం తప్పకుండా చికిత్స కోసం వస్తుంటారు. వారు రష్యాలో అనేక ప్రాంతాలలో ఉన్న రోగులకోసం రెమిడీలు పంపుతూ ఉండడమే కాక భారతదేశంలోని వారి రోగులకు ఇండియా సందర్శించే రష్యన్ భక్తుల ద్వారా రెమిడీలు పంపుతూ మంచి ఫలితాలు పొందుతున్నారు.

మనతో పంచుకోవడానికి వారికి అనేక ఆసక్తికరకమైన కేసులు ఉన్నాయి. ఒక సందర్భంలో, చర్మముపై అలెర్జీ ఉన్న ఒక యువ అధిక బరువు గల స్త్రీకి CC21.3 Skin allergies ఇవ్వబడ్డాయి, దీనికి ఆమె సోరియాసిస్ రూపంలో పుల్లౌట్ అనుభవించింది. ఇది ఆమెకు చిన్నతనంలో ఏర్పడిన వ్యాధి. రెమిడీ NM41 Psoriasis కు మార్చబడింది, ఇది సోరియాసిస్ మరియు అలెర్జీ రెండింటినీ నివారించడమే కాక ఆసక్తికరంగా ఆరు నెలల తరువాత, ఆమె తన అదనపు బరువును కూడా తగ్గించ గలిగింది! మరొక సందర్భంలో, కారు ప్రమాదంలో కుక్క మరణించడం ప్రత్యక్షంగా చూసిన ఎనిమిదేళ్ల అమ్మాయిలో కొన్ని నెలల క్రితం నాడీ సంకోచము(టిక్స్) అభివృద్ధి అయ్యింది. ఐతే ఈ నాడీ సంకోచాలు యుక్తవయసులో కూడా కొనసాగుతాయి కనుక, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia, తో ఆమె ఒక నెలలోనే ఆరోగ్యంగా అయ్యింది.

కణితులకు సంబంధించి క్రింది రెమిడీలు అద్భుతంగా పనిచేస్తాయని ప్రాక్టీషనర్లు తెలుసుకున్నారు: #1. NM108 Visc Alb (M&F) 8X + NM110 Essiac 3X + SR576 Tumours...TDS and #2. NM110 Essiac 10MM...OW. 38 ఏళ్ల వ్యక్తికి 10 సెంటీమీటర్ల థైరాయిడ్ గ్రంధి కారణంగా అన్నవాహిక నొక్కుకొనిపోయి లాలజలాన్ని మ్రింగడం కూడా కష్టం అయ్యేది. CC12.4 Autoimmune diseases + #1 మరియు #2 తీసుకున్న నెల రోజుల లోపే ఈ గ్రంధి మాయమయ్యి అతనికి ఎంతో ఉపశమనం కలిగింది. మరొకకేసులో 79 ఏళ్ల మహిళకు ప్రేగుల వద్ద కణితి ఉంది. ఒక ప్రక్కకు తిరిగినప్పుడు ఒక ముద్ద లాగా అనిపిస్తూ అది క్రమంగా పెరిగి పిడికిలి పరిమాణానికి మారింది. ఆమెకు NM111 Portal Clearance + CC4.4 Constipation + #1 మరియు  #2. ఇవ్వబడింది. చాలా నెలల వరకూ ప్రాక్టీషనర్లు రోగిని చూడడం తటస్థించలేదు, ఐతే ఒకరోజు ఆమెకు చిన్నతనం నుండి ఉన్న క్షయ (TB) వ్యాధి నిమిత్తం చికిత్స కోసం వచ్చింది. గ్రంధి గురించి విచారణ చేయగా అది చాలాకాలం క్రితమే తగ్గిపోయిందని ఆమె చెప్పారు. ఆమెకు CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic ఇవ్వబడింది కానీ నెల తరువాత పుల్లౌట్ కారణంగా భయపడి మానివేసింది. కొంతకాలం తరువాత ఆమెకు తీవ్రమైన జలుబు, దగ్గు ఏర్పడగా నివారణ కోసం తను 50 సంవత్సరాలుగా మందులు వాడుతున్న TB హాస్పిటల్ కు వెళ్లింది. వైద్య పరీక్షలు మరియు ఫ్లూరోగ్రఫీ తరువాత డాక్టర్లు అత్యంత సంభ్రమ ఆశ్చర్యలతో ఆమెకు తీవ్రమైన బ్రాంఖైటిస్ మాత్రమే ఉందని ఆమెకు క్షయ పూర్తిగా తగ్గిపోయిందని కనుక రిజిస్టర్ నుండి ఆమె పేరును తొలగిస్తున్నట్లు తెలిపారు.  

వయోజనుడైన ఒక తండ్రి ఈ ప్రాక్టీషనర్ల చేత తన వ్యాధికి విజయవంతంగా చికిత్స పొందిన అనంతరం కొన్ని నెలల క్రితం స్ట్రోక్ కారణంగా ఒక చెవిలో వినికిడి శక్తి కోల్పోయిన తన కుమారుని తీసుకురాగా CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.4 Paralysis ఇచ్చారు. కొన్ని నెలల తరువాత తన కొడుకుకు వినికిడి తిరిగి వచ్చిందని తల్లి  ప్రాక్టీషనర్లకు తెలిపింది. ఒక రోజు కారు నడుపుతున్నప్పుడు, అతను ఇంజిన్ శబ్దాన్ని వినగలుగుతూ దానిలో ఏదో సమస్య ఉందని గుర్తించాడు. ఇది అతనిని కలవరపెట్టింది కానీ అంతలోనే అతను మళ్ళీ తను ఆ చెవితో శబ్దాలను వినగలుగుతున్నానని గుర్తించి ఆశ్చర్య పోయాడు. అప్పటి నుండి, అతను దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించి మరుసటి సంవత్సరం తన తల్లితో బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. ప్రశాంతి నిలయం నుండి బయలుదేరిన సమయంలో, అతను ప్రాక్టీషనర్లతో "సజీవమైన దేవుణ్ణి చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది!" అని తెలిపాడు. రోగికి చెవిలో రక్తం గడ్డకట్టి వినికిడి లోపానికి గురిచేసిందని ప్రాక్టీషనర్లు విశ్వసిస్తూ వారు అతనికి సూచించిన రెమిడీలలో ఉన్న SR271 Arnica దానిని కరిగించి వేసి ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేసారు.   

ప్రాక్టీషనర్లు 108 సిసి బాక్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఒక సాధారణమైన కొంబో CC3.6 Pulse irregular    గుండె శస్త్రచికిత్స నుండి ఒక మనిషిని రక్షించింది. వంధ్యత్వంతో బాధపడుతున్న మహిళలు తగిన రెమిడీలు పొందిన తరువాత సురక్షితంగా గర్భవతి అయ్యి మాతృత్వం యొక్క ఆనందాన్ని పొందారు. వారి అనుభవంలో CC15.3 Addictions ఖచ్చితంగా మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గిస్తుందని తెలుసుకున్నారు.

కోవిడ్ -19 బాధిత రోగుల కోసం, ఈ జంట రోగుల ఫోటోలను విట్నెస్ గా ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మొట్టమొదటి రోగి భారతదేశానికి చెందిన ఒక మహిళ, కోవిడ్ లాంటి లక్షణాలు 39.5C (103.1F ) ఉష్ణోగ్రత, దగ్గు మరియు తీవ్రమైన గొంతుమంటతో బాధ పడుతున్నారు. రెమిడీ తీసుకున్న మరుసటి రోజు నుండి జ్వరం తగ్గడం ప్రారంభమై అదేరోజు, సాధారణీకరించబడింది. గొంతు మరియు దగ్గు కొద్ది రోజుల్లోనే నయమయ్యాయి. ఇటువంటి లక్షణాలతోనే ఇరాన్ నుండి 12 మంది రోగులు వివిధ రకాల వ్యాధి తీవ్రతలు మరియు లక్షణాలతో చికిత్స కోరగా బ్రాడ్ కాస్టింగ్ ప్రసారం ప్రారంభమైన వెంటనే, ప్రతీ రోగి మెరుగుపడ్డాడు. ఇదే సమయంలో కోవిడ్ -19 తో పాటు వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రాక్టీషనర్లు కనుగొన్నారు. ముందస్తు నివారణకోసం 124 మందికి రెమిడీలు పోస్ట్ చేయబడగా వారిలో ఎవరికీ అనారోగ్యం లేకుండా కోలుకున్నారు.  

కృతజ్ఞతతో కూడిన రోగుల ముఖాలను చూసినప్పుడు, అది వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రాక్టీషనర్లు పేర్కొంటున్నారు. ఏ రోజైనా ఎవరికైనా 'మంచి' చేయని రోజుగా గడిచినట్లయితే, అది ఫలించని రోజని వారు భావిస్తారు. ఇంత గొప్ప సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వీరు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

ప్రశ్నలు జవాబులు

Q1. నోసోడ్ ఎంతకాలం ఇవ్వాలి? దీనిని ఇతర రెమిడీ లతో కలిపి ఇవ్వవచ్చా?  

A  నోసోడ్ ఇతర వైబ్రియోనిక్స్ నివారణకు భిన్నమైనది కాదు కనుక దీనిని తీసుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు;

పుల్లౌట్, మోతాదు, వ్యవధి మరియు మోతాదు తగ్గించడం విషయంలో ఇతర రెమిడీలకు వాడే అదే ప్రోటోకాల్‌ను అనుసరించండి.

వాల్యూమ్ 6 ఇష్యూ 3 లో, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే, ఇతర రెమిడీ తో పాటు నోసోడ్ ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు, కోవిడ్ కాలంలో, IB రెమిడీ ప్రతీ రోజూ తీసుకుంటారు లేదా తీవ్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు (ఉదా., నోసోడ్‌ తీసుకుంటున్న వ్యక్తి గాయపడినప్పుడు) ప్రత్యేక సందర్భం తలెత్తుతుంది, అప్పుడు రోగికి తక్షణ చికిత్స అవసరం. ఐతే ఈ రెండు రెమిడీల మధ్య కనీసం 20 నిమిషాల వ్యవధి ఉంచడం మంచిది.  

_____________________________________________________________________________________

Q2. ఒక ఆరోగ్య నిపుణుడు IB ముందస్తుగా తీసుకుంటూ కూడా కోవిడ్-19 కు పొజిటివ్ గా నిర్ధారింప బడ్డారు. IB కోవిడ్ రాకుండా చేయగలదని మనం ఎలా విశ్వసించగలము? 

A. IB ఖచ్చితంగా సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది, అయితే కోవిడ్ సోకినట్లయితే, సాధారణంగా లక్షణాల తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే IB యొక్క మోతాదు పెరిగినప్పుడు వేగంగా ఉపశమనం కలుగుతుంది. టీకాతో సహా ఏ ఔషధం 100% ప్రభావవంతంగా ఉండదని గుర్తుంచుకోవాలి.    

_____________________________________________________________________________________

Q3. కొందరు మధుమేహ వ్యాధి గ్రస్తులు షుగర్ పిల్స్ తీసుకోవడానికి ఇష్టపడరు కనుక వారికి నేను జిలిటాల్ గ్లోబ్యూల్స్ ను (సాధారణంగా కొంతమంది హోమియో పతి నిపుణులు వాడేవి) మన వైబ్రియానిక్స్ సాధారణ (సైజ్ 30) గోళీల బదులు ఉపయోగించ వచ్చా? 

A. జిలిటోల్ సాధారణంగా టాబ్లెట్లుగా కుదించబడుతుంది, ఇది కంపనాలను సరిగ్గా గ్రహించదు. మన వైబ్రియానిక్స్ పిల్స్ మాదిరిగా చిన్నవి మరియు మృదువైన జిలిటోల్ గ్లోబుల్స్ ను మీరు కనుగొనగలిగితే, ఇవి ఆమోదయోగ్యమైనవిగా భావించవచ్చు.  అయినప్పటికీ, ప్రతీ గోళి కేవలం అతి తక్కువ చక్కెర పరిమాణం కలిగి ఉంటుంది కనుక మీ రోగి మూడు గోళీలను 100 మి.లీ నీటికి జోడిస్తే, ఇది ఐదు రోజుల వరకూ సేవించ వచ్చు, అనగా రోజుకు ఒక గోళి కన్నా తక్కువే కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ చక్కెర మాత్రలు వాడటంలో మాకు ఎటువంటి సమస్య కనిపించడం లేదు. మానవ శరీరంలో ఉన్నదానితో పోలిస్తే ఈ చక్కెర పరిమాణం చాలా తక్కువ కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఖచ్చితంగా సురక్షితం. అయినప్పటికీ, మీరు లేదా మీ రోగులు ఇంకా ఆందోళన చెందుతుంటే, మీరు రెమిడీని నేరుగా నీటిలో లేదా విభూతిలో ఎంచుకోవచ్చు.

_____________________________________________________________________________________

Q4. రెమిడీ తీసుకోవడానికి ముందు వెనుక 20 నిమిషాల వ్యవధిలో మంచి నీటిని తీసుకోవచ్చని మనకు తెలుసు ఐతే ఆ సమయంలో రాగిపాత్రలో నిలువ ఉంచిన నీటిని  తీసుకోవచ్చా? అలాగే ఆ సమయంలో విభూతిని తీసుకోవచ్చా? 

A. అవును, మీరు ఈ నీటిని తీసుకోవచ్చు ఎందుకంటే అందులో ఉండే రాగి అయాన్లు రెమిడీలోని ప్రకంపనములకు అంతరాయం కలిగించవు మరియు శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వెండి పాత్రలో నిలువ ఉంచిన నీటికి కూడా ఇది వర్తిస్తుంది. విభూతి తటస్థంగా ఉండగలిగే పదార్ధం కనుక ఈ 20 నిమిషాల వ్యవధిలో ఇది కూడా అనుమతించబడుతుంది. వాస్తవానికి, రెమిడీ లు  తయారుచేసే మాధ్యమాలలో విభూతి కూడా ఒకటి.  

_____________________________________________________________________________________

Q5. మానసిక రోగి లేదా తీవ్ర మనో వ్యాధితో ఉన్న వ్యక్తితో మాట్లాడిన తరువాత నేను తరుచుగా వేదనకు గురి అవుతున్నాను. నా పేషంటు నుండి ప్రతికూల శక్తిని తీసుకుంటున్నానేమో అని తరుచుగా సందేహ పడుతున్నాను. దీనిని ఎలా పరిష్కరించు కోవాలి?

A. రోగితో మాట్లాడిన తరువాత, అతని అనారోగ్యం గురించి తలచి బాధపడడం అనేది మీలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. ఇది రెండు విధాలుగా హానికరం. ఇది మీ విశ్వాసాన్ని లోపింప జేసి రోగియొక్క  వైద్య ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మంచి ఆలోచనలనలకు మాత్రమే ఆస్కారం ఇవ్వాలి. నిరంతర ప్రార్థనలు మరియు దేవునిపై ధ్యానం ద్వారా, ప్రతికూల శక్తుల నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. వైద్య ప్రక్రియ ప్రారంభించే ముందు, హృదయపూర్వక ప్రార్థన చేయడం చాలా ముఖ్యం, కాబట్టి మీరు దేవునికి పూర్తిగా శరణాగతి చేసి స్వామి మాత్రమే వైద్యం చేస్తున్నారని మీరు స్వామి శక్తిని గ్రహించే ఒక ఛానల్ మాత్రమే అని భావించి నప్పుడు స్వామి శక్తి మీ ద్వారా రోగికి ప్రవహిస్తుంది.   

_____________________________________________________________________________________

Q6. నేను క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి చికిత్స చేసినప్పుడల్లా, నేను అపనమ్మకంతో రోగి మెరుగుపడకపోవచ్చునేమోనని భయపడుతున్నాను మరియు అలాంటి ఆలోచనలు నా మనస్సులో సుడులు తిరుగుతూ ఉంటున్నాయి. దీనిని ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలియడం లేదు.  

A. రోగికి చికిత్స చేయడానికి ఒక సాధనంగా పనిచేయడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చి ఈ రోగిని మీ వద్దకు పంపించాడని గుర్తుంచుకోండి. కనుక మీరు నేర్చుకున్నదాని ప్రకారం మీ సామర్థ్యం మేరకు లేదా మీ సీనియర్లు మీకు ఇచ్చిన సలహా ప్రకారం, ప్రిస్క్రిప్షన్‌ను సిద్ధం చేయడం మీ కర్తవ్యం. ఆ తరువాత రెమిడీని ప్రేమతో ఇస్తూ మానసికంగా దైవాన్ని ఇలా ప్రార్థించండి “నా పని పూర్తి చేసాను, ఇప్పుడు మీరు దయచేసి స్వాధీనం చేసుకోండి.” ఫలితంపై దృష్టి పెట్టకపోవడం రోగి యొక్క అనారోగ్యానికి బంధితులము కాకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది అంతేకాక రోగికి అతని ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కావలసిన ఏ సలహాలైనా దేవుడు మీ ద్వారా అందించడానికి వీలు కల్పిస్తుంది. 

దివ్య వైద్యుని దివ్య వాణి

ఆహారం తిన్న తరువాత, మీరు తినడానికి ముందు కూర్చున్నంత తేలికగా లేవగలగాలి. ఇది ఆహారం తినడానికి సాత్విక మార్గం. మీరు ఆహారం కోసం కూర్చునే ముందు చాలా చురుకుగా మరియు తేలికగా ఉంటారు. కానీ ఆహారం తిన్న తర్వాత, కనీసం పైకి లేవడానికి కూడా మీకు కష్టమవుతుంది ఎందుకంటే కడుపులో అధికంగా ఆహారం లోడ్ కావడం వలన, ఇది బద్ధకానికి (తామసిక ప్రవృత్తి)దారి తీస్తుంది. మీకు ఇంకా మరి కొంచెం ఎక్కువ తినవచ్చని అనిపించినప్పుడే తినడం మానేయండి

...సత్యసాయిబాబా, “పరిపూర్ణ జ్ఞానం నుండి అపరిమితమైన ఆనందం లభిస్తుంది” స్వామి వాణి 1996 సెప్టెంబర్ 1                                         http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf

 

సేవను ప్రేమ, జ్ఞానము మరియు శ్రద్ధతో అందించినప్పుడు, అది వ్యక్తులను దైవత్వానికి దగ్గరగా మరియు ప్రేమపాత్రులుగా చేస్తుంది, ఎందుకంటే అది దేవుని దయను తనలోకి ఇమిడ్చుకుంటుంది.   

… సత్యసాయిబాబా, “వైద్య వృత్తి” దివ్య వాణి, సెప్టెంబర్ 1980                                                   http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు *

  • యు.ఎస్. : విర్ట్చువల్ AVP వర్క్ షాప్** వారానికి రెండు సెషన్లు 2021 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు, తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు సుశాన్,  వెబ్సైట్ [email protected]
  • ఇండియా పుట్టపర్తి : విర్ట్చువల్ AVP వర్క్ షాప్, ప్రస్తుతం నడుస్తున్న వారపు సెషన్లు జూన్ 2 నుండి జులై 16 వరకు పుట్టపర్తి లో ప్రాక్టికల్ శిక్షణ వర్క్ షాప్ (గురుపూర్ణిమ అనంతరం) 26-27 జూలై 2021** తో పూర్తి అవుతాయి. సంప్రదించ వలసిన వారు లలిత, వెబ్సైట్  [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: విర్ట్చువల్ AVP వర్క్ షాప్, 2021 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ** తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: విర్ట్చువల్ SVP వర్క్ షాప్ 2022 జనవరి ** తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు, వెబ్సైట్  [email protected]

*అన్ని AVP మరియు SVP వర్క్‌షాప్‌లు ప్రవేశ ప్రక్రియ మరియు ఇ-కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే. రిఫ్రెషర్ సెమినార్లు ఇప్పటికే ఉన్న ప్రాక్టీషనర్ల కోసం.  

**మార్పులు ఉండవచ్చు

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు                       

మీ ముక్కు మరియు గొంతును జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం!

చక్కని వాసన మరియు పరిమళ భరితమైన వాసన గల సువాసనలను మాత్రమే ముక్కు ద్వారా గ్రహించాలి. దుర్వాసన పీల్చినప్పుడు వ్యాధికి దారి తీస్తుంది. మీరు దుర్వాసన గల గాలిని పీల్చుకుంటే, వ్యాధిని కలిగింప చేసే సూక్ష్మక్రిములను లోనికి  తీసుకునే అవకాశం ఉందిమీరు మాటలు, వినికిడి, దృష్టి, ఆలోచన మరియు చర్యల దుర్విషయాలతో సంబంధం ఉన్న చెడును  వదిలించుకున్నప్పుడు (ఐదు జ్ఞానేంద్రియాల దుర్వినియోగం) మీరు పరమాత్మగా మారగలుగుతారు ”… సత్య సాయి బాబా1

1. ముక్కు మరియు గొంతు - నిర్మాణము, మరియు నిర్వహణ

ముక్కు అనేది ఒక చక్కని సురక్షిత అవయవం, ఇది మనుగడ కోసం ఊపిరి పీల్చుకోవడానికి, రుచి మరియు వాసన తెలుసు కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. దీనికి రెండు బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయి, ముక్కుదూలం లేదా సెప్టం వీటిని విభజించి దానికి ఆకారాన్ని ఇస్తుంది; నాసికా కుహరాలు (ఫోసే) శ్లేష్మ పొర మరియు గాలిని వడపోసే చిన్న వెంట్రుకలతో కూడిన (సిలియా) ముక్కు యొక్క రెండు వైపులామూడేసి చొప్పున ఉండే ఆరు టర్బినేట్లు (అస్థి చీలికలు) గాలిని వెచ్చగా మరియు తేమగా ఉంచడానికి మరియు దుమ్ము మరియు పుప్పొడిని ఫిల్టర్ చేయడానికి, మరియు నాలుగు జతల సైనసెస్ (గాలి నిండిన కుహరాలు), ఇందులో రెండు శిశువు పుట్టినప్పటి నుండి ముక్కు మరియు బుగ్గల మూలము చుట్టూ ఉండేవి, మరొకటి నుదిటి భాగంలో ఏడు సంవత్సరాల వయస్సు నుండి అభివృద్ధి చెందుతు ఉంటుంది, మరొకటి యుక్త వయసు నుండి ముక్కు వెనుక భాగంలో ఉంటుంది. నాసికా మార్గాన్ని తేమగా ఉంచడానికి సైనసెస్ శ్లేష్మమును ఉత్పత్తి చేస్తాయి, మరియు మన స్వరం యొక్క ధ్వని మరియు ప్రతిధ్వని స్థాయిని నిర్ణయించే బాధ్యత కలిగి ఉంటాయి. ఇవి మెదడు మరియు కళ్ళను రక్షించడానికి మరియు ఊపిరితిత్తులలోని నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి ఒక గాలి మెత్త(ఎయిర్ కుషన్)లాగా పనిచేస్తాయి.  

( ఫారింక్స్) : గాలి, ద్రవ మరియు ఘనపదార్థాలు లోపలికి వెళ్లడానికి ఒక మార్గం గానూ మరియు మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇది ముందు భాగంలో స్వరపేటిక (వాయిస్ బాక్స్) ను కలిగి ఉంటుంది, దాని స్వర తంతువులు శ్వాసనాళం (విండ్ పైప్) లోకి తెరువబడి ఉంటాయి. ఎపిగ్లాటిస్ (స్వర తంతువుల పైన మృదు కణజాలం) ఆహారం మరియు ఇతర పదార్ధాలు ఊపిరితిత్తులలోకి పోకుండా నిరోధిస్తుంది; సంక్రమణ లేదా ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి గొంతుకు ఇరువైపులా టాన్సిల్స్ మరియు అడెనాయిడ్లు (శోషరస కణజాలం) 2,3 ఉంటాయి. చెవి, ముక్కు మరియు గొంతు ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో భాగంగా ఉండి ఒక పరస్పర అనుసంధాన యూనిట్‌గా పనిచేస్తాయి. వైరస్లు మరియు బ్యాక్టీరియా ఈ మూడింటి మధ్య తేలికగా కదలగలిగే అవకాశం ఉండడంతో ఒకదానిలో ఏర్పడే సమస్య మరొక దానిలో కొత్త సమస్యను సృష్టిస్తుంది.  

2.  ఊర్ధ్వ శ్వాస మార్గ సంక్రమణం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) (URI)

URI అనేది సైనస్ లు, నాసిక, గొంతు ఊర్ధ్వ పార్శ్వములను గురిచేస్తూ ఉంటుంది. సాధారణంగా   శీతాకాలంలో వైరస్ లేదా బ్యాక్టీరియా నాసిక లేదా గొంతు ద్వారా శరీరంలోనికి ప్రవేశించి నప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది అంటు వ్యాధి కనుక ఒకరి నుండి ఒకరికి స్పర్శ, తుమ్ములు, దగ్గు ద్వారా వ్యాప్తి చెందుతుంది. జన బాహుళ్యం గల ప్రదేశాలు అనగా తరగతి గదులు, కార్యాలయాలు, ఇల్లు, వాహనాలు ఎక్కువ ప్రమాద భరిత మైనవి. తరుచూ చేతులు కడుగుకోవడం, దగ్గే టప్పుడు,తుమ్మే టప్పుడు ఏదైనా వస్త్రాన్ని అడ్డంగా ఉంచుకోవడం ద్వారా వ్యాప్తిని కొంత వరకూ అరికట్టవచ్చు. దీని సాధారణ లక్షణాలు ముక్కులో అవరోధము, గొంతులో మంట, దగ్గు, జ్వరము, ముక్కు కారడం, తుమ్ములు, ముఖ భాగంలో నొప్పి లేదా వత్తిడి, వంటి నొప్పులు, దురద లేదా కంటి వెంట నీరు కారడం, వంటివి. అతి సాధారణ శ్వాస మార్గ సంక్రమణలు జలుబు మరియు దగ్గు(మరిన్ని వివరాలు కోసం సంచిక 9 సంపుటి 6, మరియు సంచిక 10 సంపుటి 2 లలో వరుసగా ఉన్న “సాధారణ జలుబు”, “దగ్గు”అనే వ్యాసాలు చదవండి). URI అనేది తనంతట తానే తగ్గిపోయే అవకాశం కలిగినది. సాధారణంగా 7-10 రోజులు ఉంటుంది. కొన్ని సందర్భాలలో మూడు వారాల వరకూ ఉంటుంది, ఐతే అధిక జ్వరము, తీవ్ర శ్వాసా అవరోదము, లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు వైద్య చికిత్స అవసరము.5,6

2.1 సైనసైటీస్, సైనసెస్ యొక్క వాపు కారణంగా ఏర్పడుతుంది. ఎక్కువగా వైరస్ కారణంగా వ్యాప్తి అవుతున్నప్పటికీ ఇది ఒక వారంలో స్థిరపడకపోతే బాక్టీరియా కారణంగా ఏర్పడినట్టిదిగా భావించ వచ్చు. చాలా అరుదుగా ఫంగల్ ద్వారా ఏర్పడినట్టిదిగా ఉంటుంది. దీని లక్షణాలు నాసికా అవరోధం, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుండి మందపాటి రంగు లేని స్రావము ఉత్పత్తి, ముక్కు కారడం, వాసన గ్రహించే శక్తి తగ్గడం మరియు కళ్ళు, బుగ్గలు లేదా నుదిటి చుట్టూ నొప్పి లేదా వత్తిడి ఉంటాయి. తీవ్రమైన సైనసిటిస్ సాధారణంగా జలుబు కారణంగాను, మరియు దీర్ఘకాలిక సైనసిటిస్ ఇతర నాసికా రుగ్మతలతో (క్రింద ఉన్న #3 చూడండి), అనగా అలెర్జీ సంబంధిత శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, HIV/AIDS వంటి రోగనిరోధక వ్యవస్థ రుగ్మత లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది.7-10

2.2 లారింగైటిస్: లారింగైటిస్ అనేది స్వర తంతువుల యొక్క వాపు ప్రధానంగా అధికంగా మాట్లాడడం ద్వారా ఏర్పడుతుంది. అలెర్జీ, యాసిడ్ రిఫ్లక్స్, వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం కావచ్చు. దీని లక్షణాలు కఠిన స్వరం లేదా మాట్లాడే శక్తి కోల్పోవడం, గొంతులో దురద లేదా మంట, ఆగకుండా కొనసాగే దగ్గు (అంటు వ్యాధిలా సోకే దగ్గు వివరాల కోసం సంచిక 10 సంపుటి 2 ని చూడండి)11,12

2.3 ఫారిం గైటీస్, సాధారణంగా గొంతు మంట అని పిలువబడే ఫారింగైటిస్, ఫారింక్స్ యొక్క వాపు వలన కలుగుతుంది. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ లేదా సాధారణ బ్యాక్టీరియా సంక్రమణ (స్ట్రెప్ త్రోట్) వంటి వైరల్ ఇన్ఫెక్షన్ వలన కలుగుతుంది. గొంతులో నొప్పి, పొడిబారడం, దురదతో పాటు ఇతర లక్షణాలు గ్రంథులవాపు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారటం, దగ్గు మరియు మింగడం లేదా మాట్లాడటం కష్టం కావడం. అలెర్జీ, యాసిడ్ రిఫ్లక్స్, స్వరమును శ్రుతి మించి వాడకం లేదా ఎక్కువసేపు నోరు తెరిచి నిద్రపోవడం కూడా గొంతు నొప్పికి కారణం కావచ్చు.12-17

2.4 టాన్సి లైటిస్, అనేది పిల్లల్లో సాధారణంగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధి18,19, ఫారింగైటీస్ మాదిరిగానే లక్షణాలు కలిగి టాన్సిల్స్ లోవాపు కలిగి ఉంటుంది.   కొన్నిసార్లు, అడెనాయిడ్లు కూడా వాపుకు గురవుతాయి. కొంతమంది పిల్లలలో రోగనిరోధక కారకాల 'ఎ' టైపు స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియా20 A సమూహం వల్ల పునరావృతమవుతున్న టాన్సిల్ సంక్రమణకు దారితీస్తాయని ఒక అధ్యయనం గుర్తించింది. అరుదుగా వచ్చే బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్ క్విన్సీ లేదా దవడ వాపు  (గొంతులో గడ్డలు)కు, టాన్సిల్స్ తీవ్రమైన వాపుకు, గొంతు, లేదా ప్రక్కనే ఉండే భాగాల వాపు మరియు జ్వరమును కలిగిస్తుంది.21

2.5 ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) మరియు కోవిడ్ -19: ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) మరియు కోవిడ్ -19 రెండూ శ్వాసకోశ అంటు వ్యాధులు. ఇవి ఎగువ మరియు దిగువ శ్వాసకోశ మరియు ఇతర శరీర వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.5,22,23

3. నాసికా రుగ్మతలు

3.1 అలెర్జిక్ రినిటిస్ (హేఫీవర్):  దీనిలో నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయి - తరచుగా ముక్కు కారటం (రినోరోహియా), నాసికా అవరోధం, నాసికా దురద మరియు తుమ్ములు. కొందరికి తలనొప్పి, ముక్కు మరియు గొంతులో శ్లేష్మం లేదా గొంతు నొప్పి కూడా ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణాలు అలెర్జీని కలిగించే దుమ్ములో ఉండే సూక్ష్మ క్రిములు (డస్ట్ మైట్స్), నాచు (ఫంగస్), పెంపుడు జంతువులలో ఉండే కారకాలు (చర్మ కణాలలో కనిపించే ప్రోటీన్, జంతువుల యొక్క లాలాజలం లేదా మూత్రం) ఇంకా చెట్లు మరియు మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే పుప్పొడి వంటి అలెర్జీ కారకాలు ప్రధాన కారణం.24-26

3.2 అదనపు శ్లేష్మం (పోస్ట్ నాసల్ డ్రిప్): గొంతు వెనుక భాగంలో ఏర్పడి అసౌకర్యం కలిగిస్తూ ఉంటుంది. ముక్కు, గొంతు మరియు సైనసెస్ నిరంతరం శ్లేష్మం ఉత్పత్తి చేస్తూ వాయుమార్గాలు తడి ఆరిపోకుండా ఉండటానికి సహాయపడతాయి. ఐతే కొందరిలో గొంతు నొప్పి, దగ్గు, వికారం లేదా దుర్వాసన ఉండవచ్చు. వాస్తవానికి ఈ పోస్ట్ నాసల్ డ్రిప్ సూక్ష్మ క్రిములు లేదా అలెర్జీ కారకాలను ఎక్కువ శ్లేష్మం ఉత్పతి చేయడం ద్వారా బయటకు పంపి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పనిచేసే చక్కని యంత్రాంగము.27

3.3 నాసికా తిత్తులు (నాసల్ పాలిప్స్) ఇవి మృదువైన, నొప్పిలేని, క్యాన్సర్ కాని పెరుగుదలలు. ఇవి శ్వాస మార్గంలో నాసిక గోడలపై లేదా సైనస్ లపై కన్నీటి చుక్కలు లేదా ద్రాక్ష వంటి ఆకారంలో ఉంటాయి. చిన్న పాలిప్స్ ఏ విధమైన లక్షణములు లేనివిగా ఉంటాయి. పెద్దవి నాసికా మార్గములో అవరోధంగా ఉంటూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన యొక్క భావన నుండి దూరం చేయడం మరియు తరచుగా అంటువ్యాధులకు దారితీస్తాయి. పాలిప్స్ సాధారణంగా దీర్ఘకాలిక మంట లేదా సైనసిటిస్ వల్ల సంభవిస్తాయి కాని కొన్నిసందర్భాలలో ఉబ్బసం, అలెర్జీ, కొన్ని ఔషధములు పడక పోవడం, లేదా కొన్ని రోగనిరోధక రుగ్మత వల్ల సంభవిస్తాయి.28

3.4 స్థాన భ్రంశం చెందిన ముక్కు దూలం: సెప్టం ఒక వైపుకు స్థానభ్రంశం అయినప్పుడు, ఒకటి లేదా రెండు నాసికా రంధ్రాలలో చికిత్సకు స్పందించని రద్దీ లేదా శ్వాసావరోధము, ఒక-వైపు మాత్రమే ఉండే నాసికా నొప్పి, పునరావృతమయ్యే సైనస్ ఇన్ఫెక్షన్ మరియు నిద్రించే సమయంలో ధ్వనించే శ్వాస వంటి ఇబ్బందులు ఉండవచ్చు. కొన్నిసార్లు ముక్కు పొడిబారడం వలన ముక్కు రంద్రాల నుండి రక్తం స్రవించ వచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, ఇది శ్వాసను ప్రభావితం చేస్తుంది, అలాగే తలనొప్పికి లేదా ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.29,30

3.5 నాసికలో రక్త స్రావం (ఎపిస్టాక్సిస్) అనేది మన ముక్కు లోపలి భాగంలో కణజాలం నుండి రక్తం కోల్పోవడం. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు 50 ఏళ్లు పైబడిన పెద్దవారిలో అధిక బిపి, అథెరోస్క్లెరోసిస్ లేదా రక్తం గడ్డకట్టే రుగ్మత వంటి వైద్య పరిస్థితులతో, ముక్కులో రక్తస్రావం చాలా సాధారణం. గాలి పొడిబారీ ఉండడం, నాసికా స్ప్రేలను తరచుగా ఉపయోగించడం, ముక్కులోకి బలంగా పీల్చుకోవడం, లేదా ముక్కును చాలా గట్టిగా రుద్దడం లేదా బలవంతంగా ఛీదడం, ముక్కులోకి ఏదైనా ఒక  వస్తువును చొప్పించడం, ఆటల సమయంలో ముక్కుకు దెబ్బ తగలడం, ముఖంపై ఏర్పడిన పాత లేదా ఇటీవలి గాయాలు, అధిక ఎత్తుగల ప్రదేశాలకు వెళ్ళడం, అలెర్జీ, లేదా ఇన్ఫెక్షన్ ల వల్ల “పూర్వ రక్తస్రావం” (ఆంటీరియర్)సంభవించవచ్చు. ఇది సాధారణంగా గృహ చిట్కాలతో తగ్గింప చేసుకోవచ్చు. అలాగే “పరాంత భాగ రక్త స్రావం” (పోస్టీరియర్) అనేది ముక్కు వెనుక లేదా అంతర భాగాలలో సంభవిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి స్థితిలో 20 నిమిషాల తర్వాత కూడా ముక్కులో రక్తస్రావం ఆగిపోనప్పుడు వైద్య సంరక్షణ అవసరం.31-34

ముక్కులో రక్త స్రావాన్ని నియంత్రించే దశలు (లింక్33 లోని చిత్ర మాలికను చూడండి)

  • నిటారుగా కూర్చొనుట మీ ముక్కు యొక్క సిరల్లో రక్తపోటును తగ్గించడానికి నిటారుగా కూర్చోండి, మరియు రక్తాన్ని మింగకుండా ఉండటానికి తల ముందుకు వంచకుండా చూసుకోండి.   
  • మృదువుగా ముక్కును చీదండి ముక్కులో ఎక్కడైనా గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మీ ముక్కును సున్నితంగా చీదండి. తాత్కాలిక చర్యగా, ముక్కు యొక్క రక్తస్రావం అవుతున్న వైపు ఒక నాసికా డీకంజెస్టెంట్‌ను పిచికారీ చేయవచ్చు, సెలైన్ ఆధారిత నాసికా జెల్ ను రాయవచ్చు, లేదా నాసికా స్ప్రే లేదా సెలైన్ వాటర్ లేదా సాదా నీటిలో నానబెట్టిన దూది ఉండలను  కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ తో వేయవచ్చు.
  • నాసిక పై మృదువుగా ఉన్న భాగాన్ని నొక్కి ఉంచండి 5-10 నిమిషాలు బొటనవేలు మరియు చూపుడు వేలు ఉపయోగించి ముక్కు యొక్క సున్నిత భాగాన్ని మృదువుగా నొక్కి ఉంచండి. నోటి ద్వారానే శ్వాసను తీసుకోండి. రక్తస్రావం మందగించడానికి ముక్కు యొక్క దూలము పై ఐస్ ప్యాక్ ఉంచండి.
  • రక్త స్రావం ఆగక పోతే,31-35 రక్తస్రావం ఆగకపోయినా, రక్తం వేగంగా లేదా అనియంత్రితంగా వస్తున్నా, లేదా తరుచుగా సంభవిస్తున్నా, వీటితో పాటు అదనంగా అధిక బిపి, తేలికపాటి తలనొప్పి, ఛాతీ నొప్పి లేదా వేగవంతమైన హృదయ స్పందన రేటు వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటే తక్షణ వైద్య సహాయం తీసుకోండి.31-35

4. ఆరోగ్యకరమైన నాసిక మరియు గొంతుకోసము చిట్కాలు

  • మీ నాసికను ఎప్పటికీ ఆర్ద్రంగా ఉంచండి  సాదా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి లేదా నువ్వుల నూనె లేదా శాలైన్ నాసల్ ఉపయోగించడం  ద్వారా ముక్కును తేమగా ఉంచండి; గాయములు కాకుండానూ మరియు ముక్కులో వేళ్ళు పెట్టుకొని రక్తస్రావం కాకుండా నివారించడానికి పిల్లల వేలుగోళ్లను కత్తిరించండి. ముక్కును చీదాలనుకుంటే సున్నితంగా బ్లో చేయండి కానీ ఎప్పటికీ బలవంతం చేయకండి.31,36 సైనసిటిస్, పోస్ట్ నాసల్ డ్రిప్ మరియు ఇతర నాసికా రుగ్మతలను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి మీ నాసికా భాగాలను ప్రతీరోజూ నీటితో శుభ్రం చేయండి; శ్వాస మార్గంలో అవరోధాలను తొలగించడానికి ఆవిరిని పీల్చుకోండి, అయితే ఇది సున్నితంగా చెయ్యాలి కానీ అతిగా చేయకూడదు ఎందుకంటే ఇది ముక్కు లోని మ్యూకస్ లైనింగ్‌ను దెబ్బతీస్తుంది.37
  • ముక్కు ద్వారానే ఎల్లప్పుడూ శ్వాస తీసుకోండి: నాసికా శ్వాసను అడ్డుకునే ఏదైనా సమస్యకు సాధ్యమైనంత త్వరగా స్పందించండి.(సరైన శ్వాసక్రియ వివరాల కోసం సంచిక 10 సంపుటి 5 ని చూడండి). నోటి ద్వారా శ్వాస తీసుకోవడం తప్పనిసరి పరిస్థితిలో చాలా స్వల్ప వ్యవధికి మాత్రమే పరిమితం చెయ్యాలి, ఎందుకంటే శరీరం దీనిని దాడిగా భావించి రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపి దానిని బలహీనపరుస్తుంది. 38,39 ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ముక్కు, గొంతు మరియు సైనస్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.  
  • గొంతుకు విశ్రాంతి నివ్వండి: మీ గొంతును తరచుగా విశ్రాంతి తీసుకోనివ్వాలి మరియు లారింగైటిస్‌ను నివారించడానికి తగినంత వెచ్చని ద్రవాలు త్రాగాలి; మనము నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్వర తంతువులు బాగా తెరుచుకొని శ్వాస చక్కగా తీసుకోవడానికి చక్కని వాయుమార్గాన్ని ఏర్పరుస్తాయి. మీ గొంతును అనర్గళంగా మాట్లాడటానికి వీలుగా తర్ఫీదు చెయ్యాలి అంతేగానీ  గుసగుసలాడకండి, ఎందుకంటే ఇది సాధారణ ప్రసంగం కంటే స్వరపేటికకు ప్రమాదం తెచ్చి పెడుతుంది. చాలా బిగ్గరగా లేదా చాలా మృదువుగా మాట్లాడటం మీ గొంతుపై వత్తిడిని పెంచుతుంది.40-42
  • నిరోధించండి: దుమ్ము మరియు అలెర్జీ కారకాలకు గురికాకుండా ఉండండి, ముఖ్యంగా అలెర్జీ రినిటిస్ నివారించడానికి పుప్పొడి ఎక్కువగా ఉండే కాలాలలో (తెల్లవారుజాము మరియు సంధ్యా సమయంలో, ముఖ్యంగా వసంత ఋతువు మరియు వేసవి ప్రారంభంలో) దూరంగా ఉండాలి.43
  • పాటు మొత్తంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిద్ర / విశ్రాంతి, వ్యాయామం, ఆహారం మరియు నీరు తీసుకోవడం గురించి ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించండి (మునుపటి వార్తాలేఖలలో ఆరోగ్య చిట్కాలను చూడండి).

 సూచనలు మరియు లింకులు

1.    Divine Discourse on “Sanctify the body”, 20 May 1990,  http://www.sssbpt.info/ssspeaks/volume23/sss23-10.pdf

2.   Nose and throat anatomy: https://www.stanfordchildrens.org/en/topic/default?id=anatomyandphysiologyofthenoseandthroat-90-P02027

3.    About nose: https://health.clevelandclinic.org/7-surprising-facts-nose/

4.    ENT interconnection: https://www.bergerhenryent.com/the-interconnected-world-of-the-ear-nose-throat/

5.    URIs: https://www.medicalnewstoday.com/articles/32388

6.    URI: https://www.medicinenet.com/upper_respiratory_infection/article.htm

7.    Chronic sinusitis: https://www.mayoclinic.org/diseases-conditions/chronic-sinusitis/symptoms-causes/syc-20351661

8.    https://my.clevelandclinic.org/health/diseases/17701-sinusitis

9.    Sinusitis viral/bacterial: https://health.clevelandclinic.org/killer-sinus-infection-how-to-tell-if-yours-is-viral-or-bacterial

10.  https://www.medicinenet.com/sinusitis/article.htm

11.  Laryngitis: https://www.mayoclinic.org/diseases-conditions/laryngitis/symptoms-causes/syc-20374262

12.  Pharyngitis: https://www.medicalnewstoday.com/articles/324144

13.  https://www.health.harvard.edu/diseases-and-conditions/sore-throat-pharyngitis-a-to-z

14.  https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/pharyngitis

15.  https://my.clevelandclinic.org/health/symptoms/8274-sore-throat-pharyngitis

16.  https://www.mayoclinic.org/diseases-conditions/sore-throat/symptoms-causes/syc-20351635

17.  https://www.everydayhealth.com/sore-throat/

18.  Tonsilitis: https://my.clevelandclinic.org/health/diseases/21146-tonsilitis

19.  https://medlineplus.gov/tonsilitis.html

20.  Study on tonsillitis in children: https://www.niaid.nih.gov/news-events/recurrent-tonsilitis

21.  Quinsy: https://teachmesurgery.com/ent/throat/tonsilitis/

22.  Covid-19 & RIs: https://www.webmd.com/lung/coronavirus

23.  Covid-19 is multi-systemic: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7371790

24.  Four cardinal symptoms of Rhinitis: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2846743/

25.  Allergic rhinitis/Hay fever: https://my.clevelandclinic.org/health/diseases/8622-allergic-rhinitis-hay-fever

26.  https://www.mayoclinic.org/diseases-conditions/hay-fever/symptoms-causes/syc-20373039

27.  Postnasal drip: https://www.medicalnewstoday.com/articles/319636

28.  Nasal polyps: https://www.mayoclinic.org/diseases-conditions/nasal-polyps/symptoms-causes/syc-20351888

29.  Deviated Nasal Septum: https://www.mayoclinic.org/diseases-conditions/deviated-septum/symptoms-causes/syc-20351710

30.  https://my.clevelandclinic.org/health/diseases/16924-deviated-septum

31.  Nosebleed: https://my.clevelandclinic.org/health/diseases/13464-nosebleed-epistaxis;

32.  Effectively prevent and manage nosebleed: https://www.medanta.org/patient-education-blog/are-nosebleeds-a-sign-of-cancer/

33.  Pictorial steps to stop nosebleed: https://www.nationaljewish.org/conditions/health-information/health-infographics/12-nose-bleed-tips

34.  https://newsnetwork.mayoclinic.org/discussion/home-remedies-4-steps-to-stop-a-nosebleed/

35.  Nosebleed Dos & Donts: https://www.med.umich.edu/pdf/Nosebleed-Dos-and-Donts.pdf

36.  Relieve dry nose: https://breathefreely.com/how-to-relieve-a-dry-nose/

37.  Nasal Irrigation: https://www.health.haravard.edu/diseases-and-conditions/what_to_do_about_sinusitis

38.  Nasal breathing best: https://health.clevelandclinic.org/breathe-mouth-nose/

39.  Complications of mouth breathing: https://www.healthline.com/health/mouth-breathing

40.  Rest your voice: https://www.healthline.com/health/home-remedies-for-laryngitis

41.  Silence helps: https://health.harvard.edu/a_to_z/vocal-cord-disorders-a-to-z

42.  Take care of your voice: https://www.nidcd.nih.gov/health/taking-care-your-voice

43.  Avoid exposure: https://www.healthline.com/health/allergic-rhinitis

_________________________________________________________________________________________

2. కోవిడ్-19 రెమిడీ పై అప్డేట్ (నిజ వ్యాసము సంచిక 11 సంపుటి 2 లో ప్రచురింప బడింది, రెమిడీ విషయంలో గత అప్డేట్ సంచిక 0 సంపుటి 3 లో 2021 జూన్ 9 ప్రచురింపబడి, మెయిల్ ద్వారా పంపబడింది.)

కోవిడ్ -19 యొక్క డెల్టా వేరియంట్‌ విషయంలో ప్రపంచమంతా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో, డెల్టా ప్లస్ అని పిలువబడే మరొక వేరియంట్ తో అనేక కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ సరికొత్త వేరియంట్‌ పై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూ ఉండగానే ప్రాథమిక అధ్యయనాలు గతంలో కనిపించిన సాధారణ లక్షణాలైన పొడి దగ్గు, జ్వరం, అలసట, నొప్పులు, చర్మముపై దద్దుర్లు, కాలి మరియు చేతి వేళ్ల రంగు పాలిపోవడం, గొంతు నొప్పి, కండ్లకలక, రుచి కోల్పోవడం మరియు వాసన కోల్పోవడం, విరేచనాలు మరియు తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మాట్లాడే శక్తి కోల్పోవడం, వీటితో పాటు డెల్టా ప్లస్ రోగులలో వికారం, కీళ్ల నొప్పులు మరియు వినికిడి కోల్పోవడం వంటివి కూడా కనబడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మన రెండు రకాలైన IB కాంబోలు సవరించబడ్డాయి, పూర్తి చికిత్స ప్రోటోకాల్ కు సంబంధించి తుది నివేదిక క్రింద ఇవ్వబడింది:  

A. ఇమ్యూనిటీ బూస్టర్ (IB)ముందస్తు కోసం మరియు చికిత్స కోసం:

108CC బాక్సు మాత్రమే ఉన్నవారి కోసంCC3.2 Bleeding disorders + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC5.2 Deafness + CC7.2 Partial Vision + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC21.11 Wounds & Abrasions

108CC box లేకుండా SRHVP బాక్సు ఉన్నవారి కోసంNM6 Calming + NM25 Shock + NM80 Gastro + BR4 Fear + SM18 Digestion + SM20 Eyes + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM39 Tension + SM40 Throat + SR268 Anacardium 30C + SR272 Arsen Alb 30C + SR278 Cactus 30C + SR279 Cadmium Sulph 30C + SR291 Gelsemium 30C + SR298 Lachesis 30C + SR301 Mercurius 30C + SR304 Oxygen 200C + SR318 Thuja 200C + SR383 Cuprem Met 30C + SR408 Secale Corn 6X + SR458 Brain Whole + SR463 Cranial Nerves + SR566 Fungi-Pathogenic

మోతాదు: ముందస్తు కోసం: BD ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి నిద్రపోయే ముందు. కోవిడ్ -19 టీకా తీసుకున్న వారికి, కోవిడ్ నుండి కోలుకున్న వారికి, మరియు కోవిడ్ లేని దేశంలో నివసిస్తున్నవారికి ఉదయం మేల్కొనగానే OD ఇవ్వండి.

చికిత్స కోసం: ప్రతి గంటకు ఒక మోతాదు చొప్పున 6 గంటల వరకు అనంతరం 6TD ఆ తరువాత, మెరుగుదలను బట్టి క్రమంగా QDS - TDS - BD - OD కి తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి కోవిడ్ అనంతర సమస్యలు ఉన్నవారికి అదే మోతాదును అనుసరించండి.

కోవిడ్ -19 లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారికి, అసలు పరీక్ష చేయించు కోని వారికి 6TD వద్ద ప్రారంభించి పైన చెప్పినట్లుగానే తగ్గించండి.  

హెచ్చరిక :రోగి తీసుకుంటున్న ఆలోపతి చికిత్స కొనసాగించ మనాలి, ఎట్టి పరిస్థి తులలో ఆపమని చెప్పకూడదు.   

B. కోవిడ్ నుండి కోలుకున్న సందర్భంలో: ఒక రోగి కోలుకున్న తరువాత శక్తి లేనట్లు భావించినా, శారీరకంగా మానసికంగా అలసిపోయినట్లు అనిపించినా, ఏదైనా ఇతర సమస్య ఏర్పడినా, రోగి తిరిగి ఆరోగ్యంగా బలంగా అయ్యే వరకూ క్రింది రెమిడీ ఇవ్వండి:

108 CC బాక్సు ఉన్న వారికి: CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC20.1 SMJ tonic + CC21.11 Wounds & Abrasions

108CC box లేకుండా SRHVP బాక్సు ఉన్నవారి కోసం: NM2 Blood + NM6 Calming + NM7 CB7 + BR3 Depression + SM18 Digestion + SM26 Immunity + SM31 Lung & Chest + SR269 Antim Tart 30C + SR272 Arsen Alb 30C + SR298 Lachesis 30C + SR318 Thuja 200C + SR351 Kali Carb 30C + SR389 Kali Bic 6X + SR408 Secale Corn 6X + SR566 Fungi-Pathogenic

మోతాదు : TDS మెరుగుదల తరువాత క్రమంగా తగ్గించాలి, ఐతే IB ని OD గా ఉదయం లేవగానే ఈ రెండింటికి 20 నిమిషాలు విరామం ఉండేటట్లు కొనసాగించాలి.    

C. టీకా యొక్క దుష్ప్రభావాలను తొలగించ డానికి:

SRHVP బాక్సు ఉన్న వారికి: SR318 Thuja 30C.  

108 CC బాక్సు ఉన్న వారికి: CC9.4 Children’s diseases

మోతాదు: రాత్రిపూట OD, టీకా వేయడానికి రెండు రోజుల ముందు నుండి మరియు టీకాలు వేసిన రోజు నుండి 10 రోజులు వరకు వేసుకోవాలి. IB కూడా ఉదయం మేల్కొనగానే OD గా కొనసాగించాలి.  

ఒకవేళ రోగిలో ఏవైనా దుష్ప్రభావాలు ఏర్పడితే (లక్షణాలు: చేతిలో విపరీతమైన నొప్పి, అలసట, తలనొప్పి, నొప్పులు, వికారం లేదా వాంతులు), సాధారణంగా టీకా తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ఇలా అనిపిస్తుంది, పైన సూచించిన విధంగా రికూపరేషన్  కాంబో తీసుకోవాలి.  

D. ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను పెంచడానికి, ఐతే ఇతర చికిత్సలు అన్నీ కొనసాగించాలి:

SRHVP బాక్సు ఉన్న వారికి: SR304 Oxygen 200C నీటిలో

108 CC బాక్సు ఉన్న వారికి: CC19.1 Chest tonic నీటిలో

మోతాదు: ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఆక్సిజన్ స్థాయి 90 కి చేరుకునే వరకు, తరువాత ప్రతి గంటకు ఒకటి చొప్పున అవసరమైనంత వరకు.

_________________________________________________________________________________________

3. భారత దేశ ప్రాంతీయ సమన్వయ కర్తల (RCs) వర్చువల్ సమావేశము – 2021జూన్ 13  

రెండు నెలలకు ఒకసారి జరిగే RC ల నాల్గవ వర్చువల్ కాన్ఫరెన్స్ 2021 జూన్ 13 న జరిగింది. ఆర్‌సిల యొక్క ప్రాధమిక బాధ్యత

సాయి వైబ్రియోనిక్స్ లో పాలనా బాధ్యతల కోసం ఒక బలమైన భూమిక ఏర్పాటు చేయడం, అదే సమయంలో వైబ్రియోనిక్స్ పెరుగుదలకు ఇతోదికంగా కృషి చేయడం. RC ల బృందం ప్రాక్టీషనర్లు మరియు వైబ్రియానిక్స్ సంస్థ యొక్క IASVP విభాగానికి మధ్య సంధానకర్త గా పనిచేస్తుంది. గత ఆరు నెలల్లో, ప్రశాంతి నిలయమునకు వచ్చే వివిధ రాష్ట్రాల సేవకులకు IB ల పంపిణీ, IASVP  సభ్యత్వ నమోదు, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం మరియు 'స్ప్రెడ్ ది వర్డ్ క్యాంపెయిన్' ప్రారంభించడం వంటి అనేక పరిపాలనా బాధ్యతలను గూర్చి ఈ సమావేశాలు చర్చించడం, అమలు చేయడం, సమీక్షించడం వంటివి నిర్వహిస్తూ వచ్చాయి. సంబంధిత విభాగాల నుండి అందుకున్న విలువైన అభిప్రాయములు వివిధ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడ్డాయి. ప్రాక్టీషనర్ల డేటాబేస్ సమాచారాన్ని ప్రామాణీకరించడానికి దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది రోగులు తమ ప్రాంతాలలో ప్రాక్టీషనర్లను సంప్రదించాల్సిన అభ్యర్థనలకు శీఘ్ర ప్రతిస్పందన ఇవ్వడానికి మన ప్రాక్టీషనర్స్ ఇన్ఫో విభాగానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ RC ల సమావేశాలు ప్రాక్టీషనర్లను ఒకచోట చేర్చడానికీ, వారిలో ఒక అవినాభావ సంబంధాన్ని నెలకొల్పడానికి సహాయపడతాయి. ఈ RC కాన్ఫరెన్సులు చేసిన సానుకూల సహకారం ఇప్పటికే రిఫ్రెషర్ వర్క్‌షాప్‌లలో క్రమంగా పెరుగుతున్న హాజరైన వారి సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది.

_________________________________________________________________________________________

 4. కర్నాటక వర్చువల్ సెమినార్ల మొదటి వార్షికోత్సవం -  2021 జూన్ 6           

కర్ణాటకలో ఒక సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న నెలవారీ వర్చువల్ సమావేశాల వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రాక్టీషనర్లు 2021 జూన్ 6 న ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 90 మంది పాల్గొన్నారు. ఇది ఇటీవల నిర్వహింప బడుతున్న ఏ వైబ్రియోనిక్స్ వర్చువల్ మీట్‌ తో చూసినా అత్యధిక హాజరు. దీనిలో కర్ణాటక వెలుపల నుండి చాలా మందితో పాటు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించబడిన కొంతమంది సీనియర్ ప్రాక్టీషనర్లు కూడా పాల్గొన్నారు. కర్ణాటక ప్రాంతీయ సమన్వయకర్త (RC) మునుపటి సంవత్సరంలో, AVP మాన్యువల్ మరియు 108 సిసి పుస్తకంలోని 21 వర్గాలను అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాటి కారణాలు, ఆహారం మరియు జీవనశైలి మార్పులకు ప్రాధాన్యతనిస్తూ సవివరంగా చర్చించారు. ముగ్గురు ప్రాక్టీషనర్లు ఈ వర్చువల్ సమావేశాల నుండి తాము ఎంతో ప్రయోజనం పొందామని తమ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం పొందారు, కాగా ఇది ఇతర అభ్యాసకుల ఆలోచనలు మరియు వారి మనో భావాలను ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది. డాక్టర్ అగర్వాల్ వైబ్రియోనిక్స్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు స్వామితో తనకు గల కొన్ని వ్యక్తిగత అనుభవాలను వివరించారు. విజయవంతమైన చికిత్సకు ప్రేమే ఆధారం అని నొక్కి వక్కాణిస్తూ ప్రాక్టీషనర్లు స్వామితో కనెక్ట్ అవ్వాలని మరియు తల నుండి కాకుండా హృదయం నుండి పని చేయాలని ప్రాక్టీషనర్లకు సలహా ఇచ్చారు.

ప్రాక్టీషనర్ల సందేహాలు తొలగింపచేయడంతో పాటు వారికి అందించిన 1-2 టేక్-హోమ్ పాయింట్లు ఇక్కడ చేర్చబడ్డాయి. 

  • ఇమ్యునిటీ బూస్టర్ IB చాలా ముఖ్యమైనది కనుక, ఉదయాన్నే నోటిలో ఇతర ప్రకంపనలు ఏవీ ఉండవు కనుక, ఉదయాన్నే మొదట తీసుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు ఆ సమయంలో మరచిపోవటం కూడా ఉండదు.
  • CC17.2 Cleansing ఒక బలమైన పుల్లౌట్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది కనుక రోగి మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఈ కాంబో ఇచ్చే ముందు రోగికి ఏదైనా నిర్దిష్ట రుగ్మతకు మొదట చికిత్స చేసి ఉండాలని సిఫార్సు చేయబడింది.
  • చర్మమునకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు, వ్యాధి లక్షణాలు ఉధృత మయ్యే కారణం దృష్ట్యా (మొదటి రకం పుల్లౌట్) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక మోతాదు ఇచ్చి వేచి చూడాలి, ఆపై రోగి నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మోతాదును నెమ్మదిగా పెంచుకోవాలి.                                                               

నిరంతర అభ్యసన ప్రక్రియలో భాగంగా, ఇది చాలా విజ్ఞాన ప్రదమైన సమావేశము. ప్రాక్టీషనర్లు అందరూ దీనిద్వారా ఎంతో ప్రేరణ పొంది ఇటువంటి సెషన్లు మరిన్ని మరిన్ని జరగాలని అభ్యర్థించారు. ఆన్‌లైన్ సెషన్‌లు ప్రాక్టీషనర్లను వైబ్రియోనిక్స్ తో అనుసంధానించడమే కాకుండా, ఒకరినొకరు తెలుసుకోవటానికి మరియు ఒక కుటుంబంలాగా పని చేయడానికి వారికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇటువంటి సమావేశాలలో చర్చించిన అనేక కార్యకలాపాలను చిన్న సమూహాలకు చేరవేసి తద్వారా వైబ్రియానిక్స్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయడంలో బాబా అందించిన అపారమైన అనుగ్రహానికి కర్ణాటక ఆర్.సి కృతజ్ఞతలు తెలిపారు

_________________________________________________________________________________________

5. జ్ఞాపకార్ధం

శ్రీమతి అపర్ణా చౌదరి 00036 79 సంవత్సరాల వయస్సులో, 2021 ఫిబ్రవరి 23 న స్వామిలో లీనమయ్యారు. ఆమె తన చివరి క్షణాల వరకు స్వామితో అనుసంధానంలో ఉంటూ పూర్తి జ్ఞానంలో ఉన్నారు. 1994లో వైబ్రియానిక్స్ ప్రారంభమయిన నాటినుండి ఆమె దీనిలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె పుట్టపర్తి మరియు చుట్టుపక్కల గ్రామాలలో తన రోగులకు రెండు దశాబ్దాలుగా వినయంతో సేవ చేసారు. భక్తి మరియు సేవతో తన జీవితాన్ని గడిపిన వీరు  వైబ్రియానిక్స్ కు చేసిన సేవలను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తింప బడతాయి. “ముద్రలు (వేలు భంగిమలు) ద్వారా భగవంతునితో అనుసంధానం” (హ్యాండ్‌బుక్ ఆన్ యూనియన్ విత్ గాడ్) అనే పుస్తకంద్వారా ఆమె అందరిచేత గుర్తుంచుకోబడతారు.

శ్రీ మనీష్ గుప్త 10462 పెద్దప్రేగు క్యాన్సర్‌కు గురై 2021 జూన్ 8 న తుది శ్వాశ విడిచారు. 47 సంవత్సరాల తక్కువ వయస్సులో చాలా విలువైన సహోద్యోగిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడ్డాము. 90 వ దశకంలో స్వామి ఫోల్డ్ లోనికి వచ్చినప్పటి నుండి వీరు ప్రశాంతి సేవలో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఉండేవారు, వీరు నిష్ణాతుడైన భజన గాయకుడు కూడా. 2009 లో రాజస్థాన్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నప్పుడు వైబ్రియోనిక్స్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అభిరుచి మరియు ఆసక్తితో కేటాయించిన ఏపనిని ఐనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వీరు 2018 లో ప్రాంతీయ సమన్వయకర్త అయ్యారు. 2019 ఆగష్టు లో తన జట్టులో కొత్త శక్తిని చొప్పించడానికి రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. అంకితభావం, చిత్తశుద్ధి మరియు కష్టపడి పనిచేసే తత్వం గల ఈ సాయి భక్తుడు ఎల్లప్పుడూ తన కట్టుబాట్లకు ఉల్లంఘించక ధృఢంగా నిలిచే వారు. మన హృదయపూర్వక ప్రార్థనలు అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలకు ఈ సమయంలో బాసటగా నిలవాలని ఆకాంక్ష.